ఖాన్ యూనిస్: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందం సజావుగా సాగుతోంది. హమాస్ శ్రేణులు 2023 అక్టోబర్ 7న అపహరించుకు వెళ్లిన వారిలో మరో ముగ్గురిని శనివారం విడుదల చేశాయి.
అమెరికన్–ఇజ్రాయెలీ కీత్ సీగెల్(65), యర్డెన్ బిబాస్(34)లను దక్షిణ గాజాలోని ఖాన్‌యూనిస్‌లో, ఫ్రెంచి–ఇజ్రాయెలీ ఒఫెర్ కల్డెరోన్(54)ను గాజా సిటీలో రెడ్ క్రాస్ బృందాలకు అప్పగించాయి. బదులుగా ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న 183 మంది పాలస్తీనియన్లను విడుదల చేసింది. మరో వైపు ..తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న, 50 మంది చిన్నారులతోపాటు వారి 61 మంది సంరక్షకులను రఫా క్రాసింగ్ పాయింట్ మీదుగా ఈజిప్టుకు వెళ్లేందుకు ఇజ్రాయెల్ అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment