
183 మంది ఖైదీలను విడిచిపెట్టిన ఇజ్రాయెల్
డెయిర్ అల్–బలాహ్: కాల్పుల విరమణ ఒప్పందం మేరకు శనివారం హమాస్ మిలిటెంట్లు మరో ముగ్గురు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేశారు. ప్రతిగా ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న 183 మంది పాలస్తీనియన్లను వదిలేసింది. వందలాదిమంది సాయుధ హమాస్ శ్రేణులు ఎలి షరాబీ(52), బెన్ అమి(56), ఒర్ లెవీ(34) అనే బందీలను వేదికపైకి తీసుకువచ్చాయి. అనంతరం వారిని రెడ్‌క్రాస్‌కు అప్పగించాయి.
ఎంతో బలహీన స్థితిలో ఉన్న వారిని మాట్లాడాలంటూ బలవంత పెడుతున్నట్లుగా ఉన్న దృశ్యాలు మీడియాలో రావడంపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒప్పందం షరతులను హమాస్ ఉల్లంఘిస్తోందని, మధ్యవర్తులకు ఈ విషయమై అభ్యంతర వ్యక్తం చేస్తామని తెలిపింది. 2023 అక్టోబర్ 7న హమాస్ శ్రేణులు అపహరించుకుపోయిన సుమారు 250 మంది పై ముగ్గురు కూడా ఉన్నారు. జనవరి 19న కుదిరిన ఒప్పందం అనంతరం హమాస్ 18 మంది బందీలకు విముక్తి కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment