Underground
-
ఆగర్భ శ్రీమంతుల భూగర్భ స్వర్గాలు
వర్తమాన ప్రపంచం శాంతిధామంగా ఏమీ లేదు. ఇప్పటికే చాలా దేశాలు యుద్ధాలు, అంతర్యుద్ధాలు, ఘర్షణలతో రావణకాష్ఠంలా రగులుకుంటున్నాయి. అణ్వాయుధాలను అమ్ములపొదిలో దాచుకున్న ధూర్తదేశాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగించడానికైనా వెనుకాడబోమని అడపా దడపా హెచ్చరికలు చేస్తూ, మిగిలిన దేశాలకు దడ పుట్టిస్తున్నాయి. ఈ పరిస్థితులు మరింతగా ముదిరితే, మూడో ప్రపంచయుద్ధం ముంచుకొచ్చినా రావచ్చు. యుద్ధంలో ఏ దేశమైనా తెగబడి అణ్వాయుధాలను ప్రయోగిస్తే, జరగరాని అనర్థాలు జరగవచ్చు. అణ్వాయుధ దాడులు జరిగిన చోట సామాన్యులు బతికి బట్టకట్టే అవకాశాలు కల్ల! అయితే, అణ్వాయుధాల దాడులు జరిగినా, క్షేమంగా బతికి బట్టకట్టడానికి వీలుగా ఆగర్భ శ్రీమంతులు ముందస్తుగా భూగర్భ స్వర్గాలను నిర్మించుకుంటున్నారు.గడచిన శతాబ్దం స్వల్ప వ్యవధిలోనే రెండు ప్రపంచ యుద్ధాలను చవి చూసింది. ఈ రెండు యుద్ధాలు గడచిన శతాబ్ది పూర్వార్ధంలోనే జరిగాయి. రెండు యుద్ధాలు ముగిసిన తర్వాత కూడా వివిధ దేశాల మధ్య అనేక యుద్ధాలు, కొన్ని దేశాల్లో అంతర్యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా ముంచుకు రావచ్చనే ముందుచూపుతో కొందరు ఆగర్భ శ్రీమంతులు ఇప్పటికే భూగర్భ దుర్గాలను నిర్మించుకున్నారు. మరికొందరు శ్రీమంతులు అదే పనిలో ఉన్నారు. బయటి నుంచి చూస్తే, అవి మామూలు నేలమాళిగల్లాగానే కనిపిస్తాయి. లోపలికి అడుగుపెడితే తెలుస్తుంది, వాటి అసలు సంగతి. అవి మామూలు నేలమాళిగలు కావు, కట్టుదిట్టమైన భూగర్భ దుర్గాలు. అణ్వాయుధాలకు కూడా చెక్కుచెదరవు. భూకంపాల వంటి పెను విపత్తులు సంభవించినా, అవి తట్టుకోగలవు. వాటి లోపల ఉన్న వారికి ఎలాంటి ముప్పు ఉండదు. ప్రళయం వచ్చి, ప్రపంచం అంతమైపోయినంత పని జరిగినా, వాటిలో ఉండేవారు నిక్షేపంగా, క్షేమంగా ఉండగలరు. ఈ భూగర్భ దుర్గాల లోపలి సౌకర్యాలను, విలాసాలను పరిశీలిస్తే, ఇవి భూగర్భ దుర్గాలు మాత్రమే కాదు, భూగర్భ స్వర్గాలు అనక తప్పదు.ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి భూగర్భ స్వర్గాలు ఎన్ని ఉన్నాయో కచ్చితమైన లెక్క ఏదీ లేదు. కొందరు సంపన్నులు బాహాటంగా ఇలాంటివి నిర్మించుకుంటుంటే, మరికొందరు అత్యంత గోప్యంగా రహస్య ప్రదేశాలలో నిర్మించుకుంటున్నారు. పలు దేశాలు అత్యవసర పరిస్థితుల్లో అణ్వాయుధాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో కొన్ని బహిరంగ నిర్మాణాలనే కట్టుదిట్టం చేశాయి. ఉదాహరణకు ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్లోని భూగర్భ మెట్రో మార్గంలో ఉన్న మెట్రో స్టేషన్లన్నింటినీ అణ్వాయుధ దాడులను తట్టుకునేలా నిర్మించారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికన్ ప్రభుత్వం రాజధాని వాషింగ్టన్ డీసీ పరిసరాల్లో అణ్వాయు«ధ దాడులను తట్టుకునే భూగృహ స్థావరాలను నిర్మించింది. దేశంలోని అత్యున్నత వ్యక్తులకు రక్షణ కల్పించేందుకు వీటిని నిర్మించింది. అమెరికాలోని జంట భవంతులపై 2001 సెప్టెంబర్ 11న ఉగ్రవాద దాడి తర్వాత ‘కంటిన్యూయిటీ ఆఫ్ గవర్నమెంట్’ (ప్రభుత్వ కొనసాగింపు) పథకం కింద ఇలాంటి మరిన్ని భూగృహ స్థావరాల నిర్మాణానికి నిధుల కేటాయింపులు ప్రారంభించింది. ప్రమాదాలు ఎదురైనప్పుడు పౌరుల సంగతి పట్టించుకోకుండా, ప్రభుత్వం తనను తాను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తోందని విమర్శిస్తూ, గారెట్ గ్రాఫ్ అనే జర్నలిస్టు ‘రేవెన్ రాక్: ది స్టోరీ ఆఫ్ యూఎస్ గవర్నమెంట్స్ సీక్రెట్ ప్లాన్ టు సేవ్ ఇట్సెల్ఫ్– వైల్ ది రెస్ట్ ఆఫ్ అజ్ డై’ అనే పేరుతో పుస్తకం రాశాడు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని రేవెన్ రాక్ మౌంటెయిన్ కాంప్లెక్స్‌లో అమెరికా ప్రభుత్వం ‘కంటిన్యూయిటీ ఆఫ్ గవర్నమెంట్’ పథకం కింద ఇలాంటి భూగృహ స్థావరాలను నిర్మించింది. ఇవి జనాలకు తెలిసిన స్థావరాలు. ఇలాంటి రహస్య భూగృహ స్థావరాలు కూడా ఉండి ఉండవచ్చనే అనుమానాలు కూడా జనాల్లో ఉన్నాయి. అణ్వాయుధ యుద్ధాలు సంభవిస్తే, ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను గాలికొదిలేస్తాయనే ఎరుక కలిగిన అపర కుబేరులు కొందరు ముందు జాగ్రత్తగా ప్రళయ భీకర పరిస్థితుల్లోనూ చెక్కు చెదరకుండా, బతికి బయటపడటానికి వీలుగా భూగర్భ స్వర్గాలను సొంత ఖర్చులతో నిర్మించుకుంటున్నారు. వీటి కోసం వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి భూగర్భ స్వర్గాలను నిర్మించుకున్న ఆగర్భ శ్రీమంతుల కథా కమామిషూ ఒకసారి చూద్దాం..బిల్ గేట్స్ ఇళ్లన్నింటిలోనూ భూగృహాలుమైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన వాషింగ్టన్ మెడీనా ప్రాంతంలోని 66,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించుకున్న భవంతిలో నివాసం ఉంటున్నారు. ఈ ఇంటితో పాటు ఆయనకు దాదాపు అరడజనుకు పైగా విలాసవంతమైన భవంతులు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెల్ మార్, రాంకో శాంటా ఫే, ఇండియన్ వెల్స్ ప్రాంతాల్లోను; ఫ్లోరిడాలోని హోబ్ సౌండ్, వెల్లింగ్టన్ ప్రాంతాల్లోను; మోంటానా బిగ్స్కై ప్రాంతంలోను బిల్ గేట్స్‌కు సొంత భవంతులు ఉన్నాయి. ఈ భవంతులు అన్నింటిలోనూ సమస్త సౌకర్యాలతో అత్యంత విలాసవంతమైన సురక్షిత భూగృహాలు ఉన్నాయి. అణ్వాయుధ దాడులు జరిగినా, బయటి ప్రపంచంలో మహమ్మారులు వ్యాపించినా, భూకంపాలు, సునామీలు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తులు తలెత్తినా చెక్కుచెదరని విధంగా వీటిని నిర్మించుకున్నారు. ఎలాన్ మస్క్ సైబర్ హౌస్ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, ‘టెస్లా’, ‘స్పేస్ ఎక్స్’ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తన కోసం అత్యంత సురక్షితమైన ‘సైబర్ హౌస్’ నిర్మించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సైబర్ హౌస్‌ను ఎప్పుడు ఎక్కడ నిర్మించ నున్నారనే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. అయితే, ఎలాన్ మస్క్ ఆలోచనలకు అనుగుణంగా రష్యన్ డిజైనర్ లెక్స్ విజెవ్స్కీ సైబర్ హౌస్ నమూనాకు రూపకల్పన చేశారు. అత్యంత దృఢమైన, స్వయం సమృద్ధి కలిగిన బహుళ అంతస్తుల భూగృహంగా దీనిని డిజైన్ చేశారు. అణ్వాయుధ దాడులకు చెక్కు చెదరకుండా ఉండటం ఒక్కటే దీని విశేషం కాదు, వైరస్లు, బ్యాక్టీరియాలు వంటి సూక్ష్మజీవుల నుంచి కూడా పూర్తి రక్షణ కల్పించేలా తీర్చిదిద్దారు. విద్యుదుత్పాదన కోసం సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్ వంటి వసతులతో పాటు, మంచినీటి సరఫరా కోసం వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, ఎలాంటి ఆయుధాలకైనా చెక్కుచెదరని ఎయిర్‌లాక్ డోర్స్, మెటల్ రోల్ షట్టర్స్ తదితర వసతులతో సైబర్ హౌస్‌ను నిర్మించనున్నారు. సైబర్ హౌస్ డిజైన్ మూడేళ్ల కిందటే పూర్తయినా, దీని వాస్తవ నిర్మాణం ఇంకా కార్యరూపం దాల్చాల్సి ఉంది.హవాయి దీవిలో జూకర్బర్గ్ భూగృహం‘ఫేస్బుక్’ అధినేత మార్క్ జూకర్బర్గ్ హవాయి దీవుల్లోని ఒకటైన కావాయి దీవిలో 1400 ఎకరాల స్థలాన్ని 100 మిలియన్ డాలర్లకు (రూ.843 కోట్లు) కొనుగోలు చేశారు. ఇందులోని ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత సురక్షితమైన భూగర్భ స్థావరాన్ని నిర్మించుకుంటున్నారు. ఈ నిర్మాణాన్ని అత్యంత రహస్యంగా చేపట్టినా, నిర్మాణంలో ఉన్న భూగృహం ఫొటోలు మీడియాకు చిక్కాయి. ఈ స్థలంలోనే నిర్మిస్తున్న రెండు వేర్వేరు భవంతుల నుంచి ఈ భూ గృహానికి చేరుకోవడానికి సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహార సరఫరాకు అంతరాయం లేనివిధంగా ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు, నిరంతర మంచినీటి సరఫరా కోసం వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, కీబోర్డు ద్వారా పనిచేసే సౌండ్‌ప్రూఫ్ తలుపులు, ద్వారాలు, హైస్పీడ్ ఎలివేటర్లు, మెకానికల్ రూమ్, స్విమింగ్ పూల్, జిమ్, సినిమా థియేటర్ వంటి విలాసవంతమైన సౌకర్యాలతో దీని నిర్మాణం సాగిస్తున్నట్లు సమాచారం. అన్ని రకాల ప్రమాదాల నుంచి రక్షణ కల్పించగల ఈ భూగృహ నిర్మాణానికి 270 మిలియన్ డాలర్లు (రూ.2,278 కోట్లు) ఖర్చు కాగలదని అంచనా.జెఫ్ బెజోస్ ఇళ్లలో భూగృహాలు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఇప్పటికే ఫ్లోరిడా పరిధిలోని ఇండియన్ క్రీక్ దీవిలో మూడు భవంతులను నిర్మించుకున్నారు. ఈ మూడింటిలోనూ ఆయన సురక్షితమైన భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. వీటి కోసం బెజోస్ 237 మిలియన్ డాలర్లు (రూ.1,999 కోట్లు) ఖర్చు చేశారు. ఇదే దీవిలో ఇవాంకా ట్రంప్, ట్రాన్స్‌ఫార్మర్‌కో వ్యవస్థాపకుడు, సియర్స్ మాజీ సీఈవో అమెరికన్ అపర కుబేరుల్లో ఒకరైన ఎడ్డీ లాంపెర్ట్, అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు టామ్ బ్రాడీ, గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ ష్మీడ్, ఏకాన్ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు కార్ల్ ఏకాన్ తదితరులు సైతం ఇండియన్ క్రీక్ దీవిలో జెఫ్ బెజోస్ తరహాలోనే భూగర్భ స్థావరాలతో కూడిన ఇళ్లను నిర్మించుకున్నారు.భూగృహ నిర్మాణరంగంలో కంపెనీల పోటాపోటీభూగృహ నిర్మాణరంగంలో పలు కంపెనీలు పోటాపోటీగా నిర్మాణాలు సాగిస్తున్నాయి. అణ్వాయుధ దాడులు, ప్రకృతి విపత్తులు సహా ఎలాంటి ముప్పునైనా తట్టుకుని నిలిచే భూగర్భ గృహాల నిర్మాణానికి కొత్త కొత్త నమూనాలకు రూపకల్పన చేస్తూ, అమిత సంపన్నులను తమ వైపుకు ఆకట్టుకుంటున్నాయి. న్యూక్లియర్ బంకర్ కంపెనీ, ఓపిడమ్ బంకర్స్, అట్లాస్ సేఫ్ సెల్లార్, సీబీఆర్ఎన్ షెల్టర్స్, స్పార్టమ్ సర్వైవల్ సిస్టమ్స్, యూఎస్ఏ బంకర్ కంపెనీ, రైజింగ్ ఎస్ బంకర్స్ వంటి కంపెనీలు కట్టుదిట్టమైన భూగర్భ నిర్మాణాలకు ప్రసిద్ధి పొందాయి. ఇవి భారీ ఎత్తున దేశ దేశాల్లో నిర్మాణాలను సాగిస్తున్నాయి. రైజింగ్ ఎస్ బంకర్స్ ఇటీవలి కాలంలో దాదాపు పది బంకర్లను న్యూజీలండ్‌లో ఏర్పాటు చేసింది. మిగిలిన కంపెనీలు కూడా ఇందుకు దీటుగా దేశ దేశాల్లో భూగర్భ స్థావరాల నిర్మాణాలను సాగిస్తున్నాయి. యుద్ధాలు, విపత్తులపై భయాందోళనలు ఉన్న సంపన్నులు కోట్లాది డాలర్లు వెచ్చిస్తూ వీటి ద్వారా తమ కోసం ప్రత్యేకమైన స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.ఆ దేశంలో ఇంటింటా భూగృహంప్రపంచవ్యాప్తంగా భూగృహాల సంఖ్యలో స్విట్జర్లండ్ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఆ దేశంలో దాదాపు ప్రతి ఇంటా సురక్షితమైన భూగృహం ఉంటుంది. ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం నిర్మించిన పబ్లిక్ బంకర్లు, నివాస భవనాల్లోని ప్రైవేటు బంకర్లు సహా స్విట్జర్లండ్లో 3.70 లక్షలకు పైగా బంకర్లు ఉన్నట్లు అంచనా. అనుకోకుండా దేశంపై అణ్వాయుధ దాడులు జరిగితే, దేశ పౌరుల్లో ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించడానికి వీలుగా స్విట్జర్లండ్ ప్రభుత్వం ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసుకుంది. స్విట్జర్లండ్‌లోని ప్రతి భూగర్భ స్థావరం అత్యంత కట్టుదిట్టమైన రక్షణ కల్పిస్తుంది. దాదాపు ఏడువందల మీటర్ల దూరంలో 12 మెగాటన్నుల అణుబాంబులు పేలినా చెక్కుచెదరని రీతిలో వీటిని నిర్మించడం విశేషం. సురక్షితమైన బంకర్ల నిర్మాణంలో స్విట్జర్లండ్కు దాదాపు ఆరు దశాబ్దాలకు పైబడిన చరిత్ర ఉంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో– 1963 నుంచి స్విట్జర్లండ్ ప్రభుత్వం అణ్వాయుధ దాడులను తట్టుకునే భూగర్భ స్థావరాల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, విరివిగా నిర్మాణాలను చేపట్టింది. అణ్వాయుధ దాడుల పట్ల మరే దేశంలోనూ లేని సంసిద్ధతను కేవలం స్విట్జర్లండ్లో మాత్రమే చూడవచ్చు. విపత్కర పరిస్థితుల్లో పౌరుల ప్రాణాలకు కూడా భరోసా కల్పించే ఏకైక దేశం స్విట్జర్లండ్ మాత్రమేనని చెప్పుకోవచ్చు.భూగర్భ స్వర్గాల నిర్మాతఅమెరికన్ వ్యాపారవేత్త ల్యారీ హాల్ భూగర్భ స్వర్గాల నిర్మాణంలో ప్రసిద్ధుడు. భవన నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న ల్యారీ హాల్, సంపన్నుల కోసం అణ్వాయుధాలను తట్టుకునే భూగృహాలను కొన్నేళ్లుగా నిర్మిస్తున్నారు. ఆయన తన కోసం కాన్సస్ ప్రాంతంలో స్వయంగా భూగర్భ స్వర్గాన్ని నిర్మించుకున్నారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కాన్సస్ ప్రాంతంలో అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూగర్భ క్షిపణి స్థావరాన్ని ల్యారీ హాల్ 2008లో 20 మిలియన్ డాలర్లకు (రూ.168.75 కోట్లు) కొనుగోలు చేశారు. తర్వాత దీనిని తన అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకున్నారు. బయటి నుంచి చూస్తే, గుమ్మటంలా కనిపించే ఈ భూగృహంలో నేలకు దిగువన పదిహేను అంతస్తుల భవంతిని నిర్మించారు. ఇందులో హైస్పీడ్ ఎలివేటర్లు, నిత్యావసర సరుకులతో కూడిన జనరల్ స్టోర్, సినిమా థియేటర్, పిల్లలు చదువుకోవడానికి తరగతి గది, లైబ్రరీ, స్విమింగ్ పూల్, జిమ్, స్పా, వంట గదులు, భోజనశాలలు, కూరగాయలను పండించుకోవడానికి తగిన పొలం, చేపలు, రొయ్యల పెంపకానికి ఒక కొలను వంటి సమస్త సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడం విశేషం. విలాసవంతమైన సురక్షిత భూగృహాలను నిర్మించడంలో ల్యారీ హాల్ నైపుణ్యం తెలుసుకున్న సంపన్నులు చాలామంది ఆయన ద్వారానే తమ కోసం ప్రత్యేక భూగృహాలను ఇప్పటికే నిర్మించుకున్నారు. ఇంకొందరు నిర్మించుకుంటున్నారు.సంపన్నుల చూపు.. న్యూజీలండ్ వైపుప్రపంచంలోని అమిత సంపన్నుల్లోని చాలామంది భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు న్యూజీలండ్ను ఎంపిక చేసుకుంటున్నారు. అమెరికన్ వ్యాపారవేత్త, పేపాల్ వ్యవస్థాపకుడు పీటర్ థీల్ న్యూజీలండ్ దక్షిణ ప్రాంతంలోని దీవిలో 73,700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భూగర్భ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికి స్థలాన్ని కూడా ఎంపిక చేసుకున్నారు. దీనివల్ల దీవిలోని పరిసరాల సౌందర్యం దెబ్బతింటుందనే కారణంగా న్యూజీలండ్ ప్రభుత్వం 2022లో పీటర్ థీల్కు అనుమతి నిరాకరించింది. న్యూజీలండ్‌లో భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్, ఓపెన్ ఏఐ అధినేత శామ్ ఆల్ట్‌మన్ వంటి వారు సైతం న్యూజీలండ్‌లో భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వీరే కాకుండా, అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, హాలీవుడ్ గాయని జూలియో ఇగ్లేసీయస్ సహా పలువురు సంపన్నులు న్యూజీలండ్‌లో భూగర్భ స్థావరాల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు. -
సమాధుల కింద హెజ్బొల్లా టన్నెల్.. ఐడీఎఫ్ వీడియో విడుదల
లెబనాన్‌లో హెజ్బొల్లా గ్రూప్ సభ్యులు ఉపయోగించే పలు భూగర్భ సొరంగాలను ఇజ్రాయెల్ సైన్యం బయటపెట్టింది. ఆ సొరంగాలు స్మశానవాటిక కింద ఉండటం గమనార్హం. సుమారు కిలోమీటరు పొడవున్న సొరంగంలో.. కమాండ్, కంట్రోల్ రూమ్‌లు, స్లీపింగ్ క్వార్టర్లు, డజన్ల కొద్దీ ఆయుధాలు, గన్స్, రాకెట్లు, ఇతర సైనిక సామగ్రిని చూపించే వీడియోను ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ‘ఎక్స్’ వేదికగా విడుదల చేసింది.‘హెజ్బొల్లాకు మానవ జీవితం అంటే లెక్క లేదు. చనిపోయినా, బతికినా పట్టించుకోదు’ అని ఐడీఎఫ్ పేర్కొంది.ఈ సొరంగంలోకి 4,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పంపింగ్ చేసి సీల్ చేసినట్లు సమాచారం. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పట్టణాలపై హమాస్ దాడి చేసిన తర్వాత గాజాలో యుద్ధం చెలరేగినప్పటి నుంచి ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతుగల హెజ్బొల్లా గ్రూప్ లెబనీస్ సరిహద్దులో దాడులు చేసుకుంటున్నాయి. సెప్టెంబరులో లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ సైన్యం ప్రవేశించటం ప్రారంభించినప్పటి నుంచి ఐడీఎఫ్ పలు సొరంగాలను కనుగొంది. అందులో ఒకటి 25 మీటర్ల పొడవుతో ఇజ్రాయెల్ వైపు ఉండటం గమనార్హం.⭕️ Operational update from Lebanon: Multiple underground terrorist tunnels have been dismantled by our troops, including a tunnel that was strategically located under a cemetery. Hezbollah doesn’t value human life—dead or alive. pic.twitter.com/77Ry4bQk0V— Israel Defense Forces (@IDF) November 10, 2024గత నెలలో లెబనీస్ పౌరుడికి ఇంటి క్రింద హెజ్బొల్లా సభ్యులు వాడినట్లు ఆరోపింస్తూ.. ఇజ్రాయెల్ ఆర్మీ ఓ సొరంగం వీడియోను విడుదల చేసింది. అయితే.. ఆ సోరంగం గాజాలో హమాస్ సభ్యులు నిర్మించినటువంటిది కాదని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లోని ఆ సొరగంలో ఇనుప తలుపులు, వర్కింగ్ రూంలు, ఏకే-47 రైఫిల్స్, ఒక పడకగది, ఒక బాత్రూం, జనరేటర్ల నిల్వ గది, నీటి ట్యాంకుల దృష్యాలు వీడియోలో కనిపించాయి.చదవండి: సిరియాలో ఇజ్రాయెల్ దాడులు.. హెజ్బొల్లా కమాండర్ హతం -
ఇరాన్ భూగర్భ అణుపరీక్షలు?
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను ఇరాన్ మరింత పరాకాష్టకు తీసుకెళ్తోందా? అందులో భాగంగా తాజాగా అణు పరీక్షలు నిర్వహించిందా? అక్టోబర్ 5న శనివారం రాత్రి ఇరాన్, ఇజ్రాయెల్ భూభాగాల్లో దాదాపుగా ఒకే సమయంలో సంభవించిన భూకంపం ఈ అనుమానాలకు తావిస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:45 ప్రాంతంలో ఇరాన్‌లోని అరదాన్ నగర సమీపంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. అక్కడికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు అమెరికా భూ¿ౌతిక సర్వే విభాగం ధ్రువీకరించింది. తర్వాత కొద్ది నిమిషాలకే ఇజ్రాయెల్‌లోనూ ప్రకంపనలు కన్పించాయి.యి. ఇది భూకంపం కాదని, కచి్చతంగా భూగర్భ అణు పరీక్షల పర్యవసానమేనని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. భూకంపం సంభవించింది అణు ప్లాంట్‌కు అతి సమీపంలోనే అంటూ వస్తున్న వార్తలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. భూ కంప కేంద్రం ఉపరితలానికి కేవలం 10 కి.మీ. లోపల ఉండటం చూస్తుంటే భూగర్భ అణు పరీక్షలు జరిగి ఉంటాయని అంటున్నారు. -
ఈ భూగర్భ వాణిజ్య కేంద్రం గురించి మీరెప్పుడైనా విన్నారా!?
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ వాణిజ్యకేంద్రం. అమెరికాలోని కాన్సస్ నగరంలో మిస్సోరీ నదీ తీరానికి ఉత్తర ప్రాంతంలో ఉంది. నేలకు 150 అడుగుల లోతున 5.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భూగర్భ వాణిజ్య సముదాయంలో నిరంతరం వెయ్యిమందికి పైగా కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు.ఈ ప్రాంతంలో 27 కోట్ల ఏళ్ల నాటి సున్నపురాతి నిల్వలు బయటపడటంతో, ఇక్కడి సున్నపురాతినంతా తవ్వి తీసి, సొరంగ మార్గాలను ఏర్పాటు చేసి ఈ భూగర్భ వాణిజ్య సముదాయాన్ని నిర్మించారు.హంట్ మిడ్వెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్మించిన ఈ వాణిజ్య సముదాయంలో ఎన్నో సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. పలు ఈ–కామర్స్ సంస్థలు, ఆహార ఉత్పత్తుల సంస్థలతో పాటు కార్ల తయారీ సంస్థ ‘ఫోర్డ్’ కూడా ఇక్కడి నుంచి కొన్ని కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రైవేటు సంస్థలతో పాటు అమెరికన్ ప్రభుత్వం కూడా ఇక్కడ కొన్ని కార్యాలయాలను నిర్వహిస్తోంది.ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యాలయాల్లో ఒక పోస్టాఫీసు, ఆర్కైవ్స్ కార్యాలయం, రికార్డు స్టోరేజీ కార్యాలయం ఉన్నాయి. పేరుకు ఇది వాణిజ్య సముదాయమే అయినా, విస్తీర్ణం దృష్ట్యా, వసతుల దృష్ట్యా ఇది నగరాన్ని తలపిస్తుంది. ఇందులో సరుకుల రవాణాకు వీలుగా 3.4 కిలోమీటర్ల రైలుమార్గం, సరుకులతో పాటు మనుషుల రవాణాకు వీలుగా 17 కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉండటం విశేషం. బయటి వాతావరణం ఎలా ఉన్నా, ఇందులోని వాతావరణం మాత్రం ఏడాది పొడవునా 19–21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండేలా ఏసీలు నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు, కార్మికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.ఇవి చదవండి: అవును! అతను.. విమానాల్లో లోకం చుట్టిన వీరుడు..! -
‘ఫోస్ డీయోన్’.. ఈ బావిలోకి దిగితే తిరిగి రావడం కష్టమే..!
సృష్టి రహస్యాల్లో.. ప్రకృతి ఒడిసిపట్టిన అందాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాంటి సోయగానికి మానవనిర్మాణం జతకలిస్తే ఇదిగో ఇలానే.. అద్భుతం అనిపిస్తుంది. ‘ఫోస్ డీయోన్’.. ఇదో భూగర్భం జలాశయం. చూడటానికి పెద్ద బావిలా కనిపిస్తుంది. కానీ నిరంతర ఊట లాంటిది ఇది. ఫ్రాన్స్‌కు ఈశాన్యంలో ఉన్న టోనెరే నగరం నడిబొడ్డునున్న ఈ నీటి కొలను.. 18వ శతాబ్దంలో బయటపడిందట. ఆ వెంటనే ‘షెవాలీర్ డి ఇయాన్’ అనే రాయబారి దీన్ని అందమైన కట్టడంగా మార్పించాడు. గుండ్రటి పెద్ద నుయ్యి.. లోపలికి బయటికి కొన్ని మెట్లు.. అర్ధచంద్రాకారంలో ఇల్లు మాదిరి పెంకులతో చూరు కట్టించాడు. ఒకవైపు ఆ ప్రహరీకి ఆనుకుని పెద్దపెద్ద బిల్డింగ్స్ ఉంటే.. మరోవైపు ఆ జలాశయానికి తోవ ఉంటుంది. నీటిధారకు అనువుగా ఎత్తుపల్లాలతో నిర్మించిన ఈ నిర్మాణం.. స్వచ్ఛమైన నీళ్ల మధ్య ఆకుపచ్చని నాచుమొక్కలతో.. పరిసరాల ప్రతిబింబాలతో.. ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే ఈ పురాతనమైన నుయ్యి.. పైకి కనిపించినంత రమ్యమైనది మాత్రం కాదు. దీని లోతెంతో.. మూలమేంటో.. నేటికీ తెలియదు. తెలుసుకునే ప్రయత్నాలలో చాలామంది ప్రాణాలనే కోల్పోయారు. ఈ బావి నుంచి ప్రతి సెకనుకు 311 లీటర్ల నీరు బయటికి వస్తుంది. అయితే కాలానికి తగ్గట్టుగా దీని వేగం.. పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. దీనిలోపల పెద్దపెద్ద గుహలు, సున్నపురాయితో ఏర్పడిన సన్నటి సందులు, మలుపులు ఉంటాయి. అయితే ఫ్రెంచ్ ఇతిహాసాలు.. ఈ జలాశయం గురించి చాలా కథలను వినిపిస్తాయి. మధ్యయుగంలో మనుషులు.. ఈ నీటిని ఉపయోగించుకునే జీవనం కొనసాగించారట. 7వ శతాబ్దంలో ఈ కొలనును కాకాట్రైస్ అనే పాములాంటి జీవి ఆక్రమించుకుని.. మనుషుల్ని దరిదాపుల్లో తిరగనిచ్చేది కాదట. ఈ జీవి డ్రాగన్స్‌లా రెండు కాళ్లతో.. సగం కోడిపుంజులా.. సగం బల్లిలా కనిపిస్తుందట. ‘సెయింట్ జీన్ డి రీమ్’ అనే సన్యాసి.. అప్పట్లో ఈ కాకాట్రైస్ను చంపి.. ఈ బావిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడట. ఈ ఫోస్ డీయోన్లో పొంగుతున్న నీరు.. ఎక్కడినుంచి వస్తుందో తేలలేదు. ఎంత ప్రత్యేక శిక్షణపొందిన డైవర్ అయినా సరే.. ఈ బావిలోకి దిగితే తిరిగి రావడం కష్టమే. మొదటిసారి 1974లో ఇద్దరు డైవర్స్.. దీని లోతును, జన్మస్థానాన్ని కనిపెట్టడానికి లోపలికి వెళ్లారు. కానీ తిరిగి రాలేదు. 1996లో మరొక డైవర్ అదే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో చాలా ఏళ్లపాటు దీనిలో ఈతకు అనుమతుల్లేకుండా పోయాయి. ఇక 2019లో డైవర్ పియరీ–ఎరిక్ డిజైనే.. దీనిలో 1,214 అడుగుల (370 మీటర్లు) మార్గాలను అన్వేషించారు. అదృష్టవశాత్తు అతను సజీవంగా తిరిగి వచ్చాడు కానీ.. దీని మూలాన్ని మాత్రం గుర్తించలేకపోయాడు. అయితే అతడికి ఆ బావిలో ఎలాంటి పాములు, చేపలు, అతీంద్రియశక్తులు కనిపించలేదట. కానీ లోపల మార్గం మాత్రం.. ఎంతటి తెలివైన వారినైనా తికమక పెట్టేలానే ఉందట. ఏది ఏమైనా ఈ జలాశయం ఎక్కడ పుట్టింది.. దీని లోతెంత? ఇందులో నిరంతరం నీరు ఎలా ఊరుతోంది? వంటి సందేహాలు తేలకపోవడంతో ఇది.. మిస్టీరియస్‌గానే మిగిలిపోయాయి. — సంహిత నిమ్మన ఇవి చదవండి: 'ఖైమర్ అప్సర'గా భారత దౌత్యవేత్త! -
జోరుగా బోర్ల తవ్వకం
కౌటాల: సాగు, తాగునీటి అవసరాల కోసం రైతులు, ఇతరులు ఇష్టారాజ్యంగా బోర్లు వేస్తున్నారు. భూగర్భంలో నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకోకుండా వందల ఫీట్ల లోతు వరకు తవ్వుతున్నారు. ఇలా డ్రిల్లింగ్ చేసిన వాటిలో 70శాతానికి పైగా విఫలమవుతున్నాయి. ఈ క్రమంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అవగాహన కల్పించాలి్సన అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అవసరానికి మించి.. నీటి లభ్యత, వాడకంపై అవగాహన లేని కొంతమంది రైతులు పంటలకు అవసరానికి మించి నీరందిస్తున్నారు. దీంతో నీటి కొరత ఏర్పడుతుండడంతో బోర్లు తవ్వాలని ఆరాటపడుతున్నారు. బోరు వేసేందుకు నిపుణులైన జియాలజిస్టులను సంప్రదించకుండా బాబాలు, గురువులను ఆశ్రయిస్తున్నా రు. టెంకాయ, తంగెడు పుల్లలతో అశాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ అప్పుల పాలవుతున్నారు. బోరులో నీళ్లు రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయి అవస్థలు పడుతున్నారు. బోర్వెల్ యజమానులు ఎలాంటి అనుమతులు లేకుండా ఒక్కో బోరుబావిని దాదాపు 200 మీటర్ల లోతు వరకు తీస్తున్నారు. అందుకు రూ. 50వేల నుంచి రూ. 60 వేల వరకు డబ్బులు తీసుకుంటున్నారు. పరీక్షలకు స్వస్తి.. భూగర్భ జలాల లభ్యతపై ప్రతీ మండలంలో అధికారులు ఏటా పరీక్షలు నిర్వహించాలి. ఆయా ప్రాంతాలను బట్టి, అంతకు ముందు నమోదైన వర్షపాతంపై ఆధారపడి భూగర్భ జలమట్టం మారుతుంది. నీటి లభ్యత పరీక్షల అనంతరం, అధికారులు తక్కువ నీళ్లున్న గ్రామాల జాబితాను విడుదల చేయాల్సి ఉంటుంది. తక్కువ ఉన్న జీపీల్లో కొత్త బోరుబావుల తవ్వకాన్ని నిషేధించాల్సి ఉంది. కానీ కొన్నేళ్లుగా అసలు ఈ పరీక్షలే నిర్వహించడం లేదు. నిబంధనల ప్రకారం బోర్లు, బావులు తవ్వాలంటే రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరి. మీ సేవ ద్వారా చలానా తీసి రెవెన్యూ అధికారులు, రక్షిత మంచినీటి శాఖ అధికారుల ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. నీటి లభ్యత వంద గజాల దూరంలో ఉంటేనే అనుమతి ఇస్తారు. అనుమతి లేకుండా బోర్లు వేస్తే రూ. లక్ష జరిమానాతో పాటు వాహనాన్ని సీజ్ చేసే అవకాశం ఉంది. అనుమతులు తీసుకోకుండానే.. భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్పా బోరుబావులు తవ్వకూడదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి బోరు లారీలు వచ్చి మండలాల్లోని ఆయా గ్రామాల్లో జోరుగా అనుమతి లేకుండా బోర్లు వేస్తున్నారు. కానీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో బోర్లు వేసే యజమానులు ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. అధికారులు స్పందించి అనుమతుల్లేని బోరు తవ్వకాలు నియత్రించి రాబోయే తరాలకు నీటి కరువు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. -
Iceland volcano: భూగర్భంలో భుగభుగలు
అనగనగా ఒక చిన్న పల్లెపట్టు. అంతా సజావుగా సాగిపోతున్న వేళ. ఉన్నట్టుండి ఎటు చూస్తే అటు భూమిపై పగుళ్లు. చూస్తుండగానే అందులోంచి ఫౌంటేన్‌లా విరజిమ్ముతూ లావా ప్రవాహాలు. బిక్కచచి్చపోయి కకావికలమవుతున్న జనం. ఏదో హాలీవుడ్ సినిమాలా ఉంది కదూ! ఐస్లాండ్లో పశ్చిమ రెగ్జానెస్ ద్వీపకల్పంలోని గ్రెంతావిక్ అనే బుల్లి బెస్త గ్రామం, దాని పరిసర ప్రాంతాలు ఇప్పుడు అచ్చం అలాంటి భయానక పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. అక్కడ భూగర్భంలో 800 ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న అపారమైన లావా రాశి కొన్నాళ్లుగా ఒళ్లు విరుచుకుంటోంది. భారీ ప్రవాహంగా మారి భయపెడుతోంది...! ఐస్లాండ్ అగ్నిపర్వతాలకు పెట్టింది పేరు. అక్కడి రెగ్జానెస్ ద్వీపకల్పమైతే అందమైన అగ్నిపర్వతాలకు నిలయం. పెద్ద టూరిస్టు స్పాట్ కూడా. గత 800 ఏళ్లలో ఈ ప్రాంతంలో ఒక్క అగ్నిపర్వతం కూడా బద్దలవలేదు. అలాంటిది గతేడాది నుంచి ఇక్కడ పరిస్థితులు మారుతున్నాయి. కొద్ది రోజులుగా భయానక స్థాయికి చేరాయి. ముఖ్యంగా గ్రెంతావిక్, పరిసర ప్రాంతాల్లో గత నెల రోజుల్లోపే ఏకంగా మూడుసార్లు అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. లావా ప్రవాహాలు ఉవ్వెత్తున ఎగజిమ్మి భయభ్రాంతులను చేశాయి. దాంతో ఆ ప్రాంతాలవారిని ఖాళీ చేయించాల్సి వచి్చంది. ఇదంతా టీజర్ మాత్రమేనని అసలు ముప్పు ముందుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. గ్రెంతావిక్ కింద భూగర్భంలో మాగ్మా (శిలాద్రవం) పూర్తిగా కరిగి అపార లావా ప్రవహంగా మారిందని తేల్చారు! దాని పరిమాణం రికార్డు స్థాయిలో ఏకంగా 65 లక్షల క్యూబిక్ మీటర్లని లెక్కగట్టారు! అంతేకాదు, ఈ లావా భూగర్భంలో ఏకంగా సెకనుకు 7,400 క్యుబిక్ మీటర్ల వేగంతో ప్రవహిస్తోందట. ఇది డాన్యుబ్ వంటి భారీ నదుల ప్రవాహ వేగం కంటే కూడా చాలా ఎక్కువ. 2021–23 మధ్య ఇక్కడ భూగర్భంలో నమోదైన లావా ప్రవాహ రేటు కంటే ఇది 100 రెట్లు ఎక్కువని అధ్యయన సారథి యూనివర్సిటీ ఆఫ్ ఐస్లాండ్లోని నోర్డిక్ వోల్కెనోలాజికల్ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్ ఫ్రెస్టెనిన్ సిగ్మండ్సన్ లెక్కగట్టారు. ఈ లావా ప్రవాహం ఉజ్జాయింపుగా 15 కిలోమీటర్ల పొడవు, నాలుగు కిలోమీటర్ల ఎత్తు, కేవలం కొన్ని మీటర్ల వెడల్పున్నట్టు తేల్చారు. ఈ గణాంకాలు, హెచ్చరికలతో కూడిన అధ్యయనం జర్నల్‌సైన్స్‌లో గురువారం ప్రచురితమైంది. అందుకు కేవలం కొన్ని గంటల ముందే ఆ ప్రాంతమంతటా అగ్నిపర్వతం బద్దలవడంతో పాటు భూగర్భం నుంచి కూడా లావా ఎగజిమ్మిన ఉదంతాలు నమోదయ్యాయి! ఇలా జరగడం గత రెండు నెలల్లో మూడోసారి. గతేడాది డిసెంబర్ 18 నుంచి ఈ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు లావా ఎగజిమ్మింది. మళ్లీ ఈ ఏడాది జనవరి 14న కూడా రెండుసార్లు లావా పెల్లుబికింది. దాంతో ప్రభుత్వం హుటాహుటిన రంగంలోకి దిగింది. ఈ ద్వీపకల్పమంతటా ఎమర్జెన్సీ ప్రకటించింది. భవిష్యత్తుపై ఆందోళన తాజా పరిస్థితుల నేపథ్యంలో రెగ్జానెస్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కొద్ది రోజులుగా గ్రెంతావిక్తో పాటు ఇక్కడి పలు ఆవాస ప్రాంతాల్లో భూగర్భంపై ఒత్తిడి తీవ్రతరమవుతున్న సూచనలు ప్రస్ఫుటమవుతున్నాయి. భూమిలోంచి లావా ప్రవాహాలు ఎగజిమ్ముతుండటమే గాక ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద పగుళ్లు కనిపిస్తున్నాయి. భారీ సంఖ్యలో భూ ప్రకంపనలూ నమోదవుతున్నాయి. ఒక పెద్ద క్రీడా మైదానంలో సగానికి పైగా భారీ పగులు ఏర్పడటం వణికిస్తోంది. ప్రస్తుతానికైతే మొత్తం ద్వీపకల్పం భవిష్యత్తుపైనే నీలినీడలు కమ్ముకున్నాయని ప్రొఫెసర్ సిగ్మండ్సన్ ఆవేదనగా చెబుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ లావా ప్రవాహం మరింతగా పెరిగేలా ఉందని కూడా ఆయన హెచ్చరించారు. అగ్నిపర్వతాల పుట్టిల్లు ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో చురుకైన అగ్నిపర్వతాలు ఉన్న దేశంగా ఐస్లాండ్కు పేరుంది. అందుకే దాన్ని లాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని చమత్కరిస్తుంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30కి పైగా అగ్నిపర్వతాలు చురుగ్గా ఉన్నాయి. ఇవి భారీ పర్యాటక ఆకర్షణలు కూడా. వీటిని చూసేందుకు ఏటా విదేశీయులు వస్తుంటారు. ఐస్లాండ్ మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ప్రాంతంలో ఉండటమే అక్కడ ఇన్ని అగ్నిపర్వాతల పుట్టుకకు ప్రధాన కారణమన్నది సైంటిస్టుల అభిప్రాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ టైంలోనే అతిపెద్ద అండర్‌గ్రౌండ్ ఎయిర్‌పోర్టు..కానీ ఇప్పుడది..
అమెరికా–సోవియట్ రష్యాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం ప్రబలంగా ఉన్న రోజుల్లో ఉభయ శిబిరాలకు పరస్పర ‘అణు’మానాలు ఉండేవి. అందువల్ల ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండేవారు. తమ తమ భూభాగాల్లోని రహస్య ప్రదేశాల్లో అణుబాంబులు మీదపడ్డా చెక్కుచెదరని బంకర్లు నిర్మించుకున్నారు. అప్పట్లో సోవియట్ రష్యా అణుబాంబులను తట్టుకునే భూగర్భ విమానస్థావరాన్ని నిర్మించుకుంది. క్రొయేషియా సరిహద్దుల్లో ప్లజెసెవికా కొండ నడిబొడ్డున నిర్మించిన ఈ జెల్జావా భూగర్భ విమానస్థావరం ప్రపంచంలోని భూగర్భ విమానస్థావరాల్లోనే అతిపెద్దది. అయితే, మూడు దశాబ్దాలుగా ఇది నిరుపయోగంగా పడి ఉంది. సెర్బో–క్రొయేషియన్ యుద్ధం 1992లో మొదలైనప్పటి నుంచి దీని వినియోగం నిలిచిపోయింది. ఇది కేవలం భూగర్భ విమానస్థావరం మాత్రమే కాదు, ఇందులో అనేక సౌకర్యాలు ఉన్నాయి. సోవియట్ పాలకులు 1960లోనే దీనిని 600 కోట్ల డాలర్ల (సుమారు రూ.50 వేల కోట్లు) ఖర్చుతో నిర్మించుకున్నారు. ఏకంగా 20 కిలోటన్నుల అణువిస్ఫోటాన్ని తట్టుకునేంత శక్తిమంతంగా దీనిని రూపొందించారు. ఇందులో విద్యుదుత్పాదన కేంద్రం, మంచినీటి వడబోత కేంద్రం, గాలి వెలుతురు సోకేందుకు అనువైన నడవలు, వెయ్యిమంది సైనికాధికారులు, సైనిక సిబ్బంది కోసం డార్మిటరీలు, యంత్రాల సాయంతో తెరుచుకునే వంద టన్నుల కాంక్రీటు ద్వారాలు ఉన్నాయి. సైనికులకు అవసరమైన ఆహార పదార్థాలు, ఆయుధాలు నిల్వచేసుకునేందుకు కట్టుదిట్టమైన గిడ్డంగులు ఉన్నాయి. క్రొయేషియా ప్రభుత్వం దీనిని మ్యూజియంగా మార్చింది. ఏటా దాదాపు 1.50 లక్షల మంది పర్యాటకులు ఈ మ్యూజియంను సందర్శిస్తుంటారు. (చదవండి: అద్భుతమైన డెవిల్స్ బ్రిడ్జ్! ఆ నిర్మాణం ఓ అంతుచిక్కని మిస్టరీ!) -
30 గంటల్లో కార్ పార్క్.. కాస్తా భారీ భూగర్భ ఆసుపత్రిగా: ఫోటోలు వైరల్
world's largest underground hospital in 30 hours ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas War) మధ్య యుద్ధం రోజురోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తోంది. ఏడో రోజుకు చేరిన ఈ యుద్ధంలో ఇప్పటికే ఇరువైపులా 2,800 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్‌ను అణిచి వేసేందుకు ఇజ్రాయెల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు హైఫాలోని కార్ పార్కింగ్ స్థలాన్ని ప్రపంచంలోని అతిపెద్ద అండర్ గ్రౌండ్ ఆసుపత్రి సిద్దమైపోయింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత రాంబమ్ హెల్త్ కేర్ క్యాంపస్ (RHCC) పార్కింగ్ స్థలంలో తాత్కాలిక అత్యవసర అండర్‌గ్రౌండ్ ఆసుపత్రి సిద్దం చేశారు. అదీ కేవలం 30 గంటల్లో భారీ భూగర్భ ఆసుపత్రిగా మార్చారు. 1,300 పడకలతో, ఆక్సిజన్, వైద్య , శానిటరీ సామాగ్రి కోసం ఫిట్టింగ్‌లతో పూర్తి చేశారు. షవర్లు, సింక్లు, నీటి సరఫరాతో మరుగుదొడ్లు , మురుగు నీటి కనెక్షన్లు, 1,300 పడకలు క్లీన్ షీట్లు , దుప్పట్లతో అన్ని సిద్దంగా ఉన్నాయి. క్యూబికల్ల మధ్య ఉండే కేబుల్స్ ఆక్సిజన్ సరఫరాను లోపలికి పంపేలా, లేదా లోపలి మానవ స్రావాలను బయటకు పంపేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా క్లాస్ట్రోఫోబియా ఉన్నవారిలో ఆందోళన తగ్గించాలనే లక్ష్యంతో హాస్పిటల్ సిబ్బంది గోడలను పూల పోస్టర్లతో అలంకరించడం ద్వారా ఆ ప్రాంతాన్ని సజీవంగా మార్చడానికి ప్రయత్నించడం గమనార్హం. ఈ స్థలం చాలా అందంగా ఉండకపోవచ్చు, కానీ చాలా సురక్షిత మైందని డిప్యూటీ చీఫ్ ఆఫ్ నర్సు అయినట్ పెరెక్స్ అన్నారు. మూడు అంతస్తుల్లో, ప్రతి అంతస్తు 20వేల చదరపు మీటర్లకు పైగా ఉంటుందనీ, సాధారణ రోజుల్లో ఇది పార్కింగ్ స్థలం కానీ అత్యవసర పరిస్థితుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ ఆసుపత్రిగా మారిపోతుందని రాంబమ్ హాస్పిటల్ సీఈవో, డైరెక్టర్ జనరల్ మైఖేల్ హాల్బెర్తాల్ చెప్పారు. వాస్తవానికి 2006లో హిజ్బుల్లాతో జరిగిన సెకండ్ లెబనాన్ వార్ సందర్బంగా ద్వంద్వ-వినియోగ ఆలోచనతో ఇది ముందుకొచ్చింది. ఆ సమయంలో ఆసుపత్రి చుట్టూ 400 రాకెట్ల వర్షం కురిసిందని అనస్థటిస్ట్ ఫిలిప్ అబెకాసిస్ గుర్తు చేసుకున్నారు. యుద్ధం తిరిగి వస్తే , దురదృష్టవశాత్తు యుద్ధం తిరిగి వస్తుందని తెలుసు. అపుడు ఈ పార్కింగ్‌ను అండర్‌గ్రౌండ్ హాస్పిటల్‌గా ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచన వచ్చిందన్నారు. దాని ఫలితమే ఇది అని వెల్లడించారు. -
యువతలో అనాసక్తి .. సింగరేణిలో ఈ గనుల్లోనే గైర్హాజరీలు ఎక్కువ
చిన్నచిన్న అనారోగ్య కారణాలు సాకుగా చూపుతూ విధులకు డుమ్మా. వీరిలోనూ ఉన్నత విద్యావంతులే అధికం.. ఒక్క వకీల్పల్లిగనిలోనే 60 మంది దాకా గైర్హాజరుతో ఉద్యోగాలు కోల్పోవద్దంటున్న అధికారులు గోదావరిఖని: సింగరేణి భూగర్భగనుల్లో పనిచేసేందుకు యువత ఎక్కువగా మక్కువ చూపడం లేదు. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందినవారే గైర్హాజరు అవుతున్న వారిలో అధికంగా ఉన్నారు. బీటెక్, ఎంటెక్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ లాంటి ఉన్నత చదువులు చదివి ప్రస్తుతం వచ్చిన ఉద్యోగాన్ని నామోషిగా భావించేవారు కొందరయితే, ఇక్కడ వర్క్ కల్చర్ ఇష్టం లేక, సిగరేణి ఆఫీసుల్లో అవకాశం రాక, లైట్ జాబ్‌ల కోసం పరుగులు తీసేవారు మరికొందరు. మూడు షిఫ్ట్‌ల విధానానికి ఇష్టపడినవారు ఇంకొందరు. సింగరేణిలో చేరిన కొద్దిరోజులకే విధులకు డుమ్మా కొట్టేవారి సంఖ్యా క్రమక్రమంగా పెరుగుతోంది. పలువురు కుటుంబసభ్యులు,తల్లిదండ్రుల అనారోగ్య కారణాలు సాకుగా చూపుతూ గైర్హాజరవుతున్నారు. ఒక్క వకీల్‌పల్లిగనిలో గైర్హాజరు అయిన వారు 60 మంది దాకా ఉన్నారు. ఆర్జీ–1 ఏరియా జీడీకే–11గనిలో ఓ యువ కార్మికుడు 2022 ఏప్రిల్‌లో ఉద్యోగంలో చేరాడు. 15 నెలల్లో 19రోజులు మాత్రమే డ్యూటీ చేశాడు. గైర్హాజర్ కౌన్సెలింగ్‌కు హాజరై తన తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేక డ్యూటీకి రావడం లేదని కారణంగా చెప్పాడు. దీంతో గైర్హాజర్ కార్మికుల జాబితాలో ఆయన చేరాడు. జీడీకే–11గనిలో బదిలీ వర్కర్‌గా 2015లో సింగరేణి విధుల్లో చేరాడు. ఐదేళ్ల నుంచి కనీసం వంద మస్టర్లు చేయలేదు. దీంతో ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసే పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగోలేకే తాను డ్యూటీకి రావడం లేదని చెబుతున్నాడు. ‘ఆర్జీ–2 ఏరియా వకీల్‌పల్లిగనిలో పనిచేస్తున్న యువ కార్మికుడు 2015లో కారుణ్య నియామకం ద్వారా సంస్థలో చేరాడు. డిగ్రీ పూర్తి చేసిన యువకుడికి సంబంధించి గడిచిన 8 ఏళ్లలో వంద మçస్టర్లు మాత్రమే నమోదయ్యాయి. తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లే డ్యూటీకి రాలేకపోతున్నానని అంటున్నాడు. ..ఆర్జీ–2 లో వకీల్‌పల్లిగనికి చెందిన ఒకరు 2018లో ఉద్యోగంలో చేరారు. కనీసం అతను 60 డ్యూటీలు కూడా చేయలేదు. దీంతో సింగరేణి యాజమాన్యం గైర్హాజర్ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని నోటీసు జారీ చేసింది. ఇటీవల గనిలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు హాజరయ్యాడు. కారుణ్య నియామకాలు ఇలా సింగరేణిలో పనిచేసే కార్మికుడు మెడికల్ ఇన్వాలిడేషన్ (అనారోగ్య కారణం)తో విధుల నుంచి తప్పుకుంటే వారి స్థానంలో కొడుకుకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం ఇస్తున్నారు. తెలంగాణ వచ్చాక 2015 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, ఇప్పటివరకు 11,541మంది యువత ఉద్యోగాల్లో చేరారు. విధుల్లో చేరిన నాటి నుంచి మూడేళ్ల పాటు పనిచేస్తే వారి ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి. అయితే సింగరేణిలో 12 ఏరియాల్లో గత మూడేళ్లలో కనీసం 100 మస్టర్లు కూడా చేయని కార్మికులు 1377 మంది ఉన్నారు. పూర్తిస్థాయి యాంత్రీకరణ ఉన్నా.. పదేళ్ల కిందట అయితే భూగర్భగనిలోకి దిగి పైకి ఎక్కడమే ఎంతో శ్రమగా ఉండేది. తట్టాచెమ్మస్ పూర్తిగా కనుమరుగైపోయింది. సెమీ మెకనైజ్డ్, ప్రస్తుతం పూర్తిస్థాయి యాంత్రీకరణ కొనసాగుతోంది. మ్యాన్రైడిండ్, చైర్‌కార్, చైర్లిఫ్ట్లాంటి విధానం ద్వారా భూగర్భగనిలోని పనిస్థలాల వద్దకు కార్మికులను తీసుకెళ్లి, తిరిగి తీసుకొస్తున్నారు. దీంతో కార్మికులకు నడక శ్రమ చాలా తగ్గింది. అయినా చాలామంది యువ కార్మికులు ఆఫీస్ కార్యాలయాలు, ఓసీపీలు, గనిపైన ఉన్న లైట్‌జాబ్ కోసం పైరవీలు చేస్తున్నారు. ఏటా వంద మస్టర్లు తప్పనిసరి సంస్థలో బదిలీ వర్కర్లుగా ఉద్యోగంలో చేరిన కార్మికులకు ఏటా భూగర్భ గనుల్లో అయితే 190 మస్టర్లు, సర్ఫేజ్లో అయితే 240 మస్టర్లు ఉండాలి. అవి ఉంటేనే వారి ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి. ఏటా వంద మస్టర్ల చొప్పున మూడేళ్ల పాటు 300 మస్టర్లుంటే ఉద్యోగానికి గ్యారెంటీ. లేనిపక్షంలో యాజమాన్యం నిబంధనల ప్రకారం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తుంది. వాస్తవ కారణాలు ఉంటే సంస్థ సహకరిస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఏర్పడింది. సింగరేణిలో చేరిన యువత చిన్నకారణాలతో విధులకు గైర్హాజరవుతూ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు. ఏవైనా వాస్తవ కారణాలుంటే సంస్థ కూడా సహకరిస్తుంది. సంస్థలో యువకార్మికులు పెరుగుతున్న క్రమంలో సంస్థ మరింత లాభాల బాటలో పయనించాలి. కారణాలేవైనా సంస్థ ఉద్యోగం పోగొట్టుకుని ఉద్యోగితో పాటు కుటుంబం వీధిన పడటం సరికాదు. –బలరాం, డైరెక్టర్(పా), సింగరేణి -
తీరంలో కరెంట్ తీగలుండవ్.!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు 972 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది. తుపానులు వచ్చినప్పుడు ఈ తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో ఎక్కువగా నష్టపోయేది విద్యుత్ వ్యవస్థ. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, తెగిన వైర్లను యధాస్థితికి తెచ్చేందుకు వారాలు పడుతుంది. అంత వరకు ఆ ప్రాంతాల ప్రజలు చీకటిలోనే గడపాలి. ఆ సమయంలో పాములు వంటి విషకీటకాల బారిన పడి జనం ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ బాధల నుంచి విముక్తి కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ జె.పద్మాజనార్దన రెడ్డి తెలిపారు. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ద్వారా తీరం వెంబడి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ‘సాక్షి ప్రతినిధి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. భూగర్భ లైన్లు సాధారణంగా దెబ్బతినవని, విద్యుత్ పునరుద్ధరణ కూడా వేగంగా జరుగుతుందని వివరించారు. జాతీయ రోజువారీ విద్యుత్ సరఫరా సగటులో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, 24 గంటల్లో 23.56 గంటలకు తగ్గకుండా విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు, అభివృద్ధిపై ఆయన అందించిన వివరాలు ఆయన మాటల్లోనే.. తీర ప్రాంతంలో ప్రత్యేక గ్రిడ్ తుపాన్లు, గాలుల వల్ల విద్యుత్ వ్యవస్థకు కలిగే నష్టాన్ని తగ్గించడానికి తీర ప్రాంతంలో గ్రిడ్‌కు రూపకల్పన చేస్తున్నాం. అంటే దగ్గర్లో ఉన్న 132 కేవీ సబ్స్టేషన్లను డబుల్ సర్క్యూట్ ద్వారా అనుసంధానం చేస్తాం. దీనినే రింగ్ మెయిన్ అంటారు. దీనివల్ల ఒక సబ్ స్టేషన్ దెబ్బతింటే మరో సబ్ స్టేషన్ నుంచి సంబంధిత ప్రాంతాలకు వెంటనే విద్యుత్ అందించొచ్చు. రైతులకు ఉచితంగా స్మార్ట్ మీటర్లు, రక్షణ పరికరాలు వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లతో పాటు రక్షణ పరికరాలు కూడా ఉచితంగా అందజేస్తాం. డిసెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటున్నాం. ఖర్చుంతా ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు ఒక్క పైసా కూడా చెల్లించనవసరం లేదు. ఈ మీటర్లకు విదేశాల్లో స్థిరపడ్డవారు కొందరు మినహా మిగతా రైతులంతా రాతపూర్వకంగా అంగీకారం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూస్తున్నాం. గతంలో వ్యవసాయానికి రాత్రి వేళ విద్యుత్ సరఫరా వల్ల పొలాల్లో రైతులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడేవారు. దీనిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పగటి పూటే 9 గంటలు నిరంతర విద్యుత్ అందిస్తోంది. పైగా, స్మార్ట్ మీటర్లు, రక్షణ పరికరాల ఏర్పాటు వల్ల రైతులకు ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు కొత్త వ్యవసాయ సర్వీసులను దరఖాస్తు చేసిన నెల లోపే ఇస్తున్నాం. ఇప్పటివరకు 80 వేల కొత్త సర్వీసులు ఇచ్చాం. ప్రజల చేతిలో బిల్లు నియంత్రణ విద్యుత్ బిల్లుల విషయంలో విద్యుత్ శాఖ పొరపాట్లు లేవు. విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించిన టారిఫ్ ప్రకారమే చార్జీలు ఉన్నాయి. ప్రజలు విద్యుత్ ఎక్కువగా వాడుతున్నారు. ఈ వేసవిలో గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రవ్యాప్తంగా రోజుకి 263 మిలియన్ యూనిట్లు సరఫరా చేశాం. ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే విద్యుత్ బిల్లు తగ్గించొచ్చు. కెపాసిటర్లు, బ్రేకర్లు నాణ్యమైనవి అమర్చుకోవాలి. ఇంటి లోపల, బయట వాడే బ్రేకర్లు వేర్వేరుగా ఉంటాయి. మాగ్నెటిక్ బ్రేకర్లు వేగంగా, ఖచ్చితత్వంతో పనిచేస్తాయి. ప్రీపెయిడ్ మీటర్లతో ఎవరికి వారు బిల్లును నియంత్రించుకోవచ్చు. అవసరాన్నిబట్టి రీచార్జ్ చేసుకోవచ్చు. వారం వారం విద్యుత్ వినియోగం తెలుసుకోవచ్చు. ముందుగా ప్రభుత్వ, హెచ్‌టీ సర్వీసులకు ప్రీపెయిడ్ మీటర్లు అందిస్తాం. సరికొత్త సబ్స్టేషన్లు విద్యుత్ సబ్ స్టేషన్లకు స్థలాలు దొరకడంలేదు. దీంతో కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కంటైనర్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రెండింటిని అందుబాటులోకి తెచ్చాం. మరో రెండు విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని పెడుతున్న పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో, కనకదుర్గ గుడి దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. పవర్ ట్రాన్స్ఫార్మర్లు (పీటీఆర్)లు ఒక్కటి కూడా పాడవకుండా, ఒక్క రోజు కూడా లోడ్ రిలీఫ్ ఇవ్వకుండా ఈ వేసవిని సమర్ధంగా ఎదుర్కొన్నాం. 30 ఏళ్లు పైబడిన లైన్లు, కండక్టర్లు, బ్రేకర్లను మారుస్తున్నాం. దీనివల్ల సాంకేతిక నష్టాలు తగ్గుతాయి. -
భూమిలో 285 అడుగుల లోతులో 'నగరం'.. 20 వేల మందిదాక..
ఇదొక పురాతన అధోలోక నగరం. ప్రస్తుత తుర్కియాలోని కపడోసియ ప్రాంతంలో ఉంది. భూమి లోపల 285 అడుగుల లోతున పదకొండు అంతస్తుల్లో ఉన్న ఈ నగరాన్ని తొలి పర్షియన్ సామ్రాజ్యానికి చెందిన పాలకులు నిర్మించి ఉంటారని చరిత్రకారులు, పురాతత్త్వ శాస్త్రవేత్తల అంచనా. దీనిని క్రీస్తుపూర్వం 550 ప్రాంతంలో నిర్మించి ఉంటారని వారు భావిస్తున్నారు. ఇందులో ఇరవైవేల మంది నివాసం ఉండేందుకు తగిన ఏర్పాట్లు ఉన్నాయి. నూనె గానుగలు, మద్యం పీపాలను భద్రపరచుకునే గదులు, తిండి గింజలు భద్రపరచుకునే గదులు, ప్రార్థన మందిరాలు వంటివీ ఉన్నాయి. దీని లోపలికి గాలి, వెలుతురు ప్రసరించేందుకు వీలుగా 180 అడుగుల పొడవైన మార్గం ఉండటం విశేషం. తొలిసారిగా దీనిని విహార యాత్రకు వచ్చిన ఒక కుటుంబం 1963లో గుర్తించడంతో ఈ నగరం గురించి ఆధునిక ప్రపంచానికి తెలిసింది. తుర్కియాలో దీనికి ‘డెరింకుయు’ అని పేరు పెట్టారు. అంటే నేలమాళిగ నగరం అని అర్థం. (చదవండి: టీచరే బడిదొంగ... ఇరవై ఏళ్లుగా డుమ్మా!) -
భూగర్భంలో వింత శబ్దాలు... భయాందోళనలో గ్రామం
ముంబై: మహారాష్ట్రాలోని లాతూర్ జిల్లాలో ఓ గ్రామంలోని భూగర్భంలో వింతవింత శబ్ధాలు గ్రామం అంతటా వస్తున్నాయి. దీంతో ఆ గ్రామంలోని నివాసితులు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. హసోరి గ్రామంలో ఈ భూగర్భ శబ్ధాలు వస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. ఈ వింత శబ్ధాలకు గల కారణాల గురించి అధ్యయనం చేయమంటూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం నుంచి నిపుణలను అభ్యర్థించినట్లు చెప్పారు. హసోరి గ్రామం కిల్లారి నుంచి 28 కి.మీటర్ల దూరంలో ఉంది. వాస్తవానికి ఈ ప్రాంతంలో 1993లో ఘోరమైన భూకంపం సంభవించింది. దీంతో ఆ ప్రాంతంలో దాదాపు 9700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఎటువంటి భూకంపాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఆ గ్రామంలో ఈ వింత శబ్దాలు సెప్టెంబర్ 6నుంచి భగర్భం నుంచి బిగ్గరగా వినిపిస్తున్నాయని, గ్రామస్తులంతా భయాందోళనలకు గురవుతున్నారని అధికారులు చెప్పారు. లాతూర్ జిల్లా కలెక్టర్ పృథ్వీరాజ్ఈ గ్రామాన్ని సందర్శించి ప్రజలకు భయందోళనలకు గురవ్వద్దని విజ్ఞప్తి చేశారు. అంతేగాదు మహారాష్ట్రాలోని నాందేడ్‌లోని స్వామి రామానంద్ తీర్థ మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణుల బృందం ఆ గ్రామాన్ని సందర్శించనుందని అధికారులు తెలిపారు. (చదవండి: సెల్ఫీ ఆనందంలో సెల్‌నే విసిరి ఆ తర్వాత...) -
బంకర్లలోకి పుతిన్ కుటుంబం?!
మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం ముదిరి అణుయుద్ధంగా మారుతుందన్న భయం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లో ఉందని రష్యాకు చెందిన రాజకీయ శాస్త్ర అధ్యాపకుడు ప్రొఫెసర్ వాలెరీ సోలేవే అభిప్రాయపడ్డారు. అందుకే పుతిన్ తన కుటుంబ సభ్యులను సైబీరియాలోని భూగర్భ నగరానికి రహస్యంగా పంపించారని చెప్పారు. ఆల్టై పర్వతాల వద్ద ఉన్న ఈ నగరంలో న్యూక్లియర్ బంకర్లున్నాయన్నారు. పుతిన్ మానసిక, శారీరక రుగ్మతలతో బాధపడుతున్నారని ఆయన ఆరోపించారు. గతంలో సైతం పుతిన్‌పై వాలెరీ పలు అభియోగాలు చేశారు. వీటికిగాను ఆయన్ను పోలీసులు పలుమార్లు విచారించారు. ఆయన ఇంటిని సోదా చేసి పలు ఎలక్ట్రానిక్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికీ వాలెరీపై కేసు నడుస్తూనే ఉంది. మాస్కో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంస్థలో వాలెరీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. పుతిన్ అనారోగ్యాలను ప్రజలనుంచి దాస్తున్నారని ఆయన పలుమార్లు విమర్శించారు. అంతేకాకుండా రక్షణ మంత్రి సెర్గే షోగుతో కలిసి పుతిన్ క్షుద్రపూజలు కూడా చేశారన్నారు. అయితే వాలెరీ అంచనాలను, అభిప్రాయాలను పలువురు కట్టుకథలుగా కొట్టిపారేస్తున్నారు. (చదవండి: రష్యాపై ఆంక్షలు.. అమెరికాకు గట్టి షాక్!.. తప్పుబట్టిన అమెరికన్ దేశం) -
వైఎస్సార్ జిల్లాలో బయటపడ్డ భూ గృహం
కడప కల్చరల్: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప నగర సమీపంలో భూ గృహం వెలుగు చూసింది. ఓ యూట్యూబర్ ముందుగా దానిని గమనించి కథనాలు ప్రసారం చేయడంతో అది వెలుగులోకి వచ్చింది. నగరానికి దాదాపు 25 కి.మీ దూరంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతం, పైగా శ్మశానం కావడంతో అటువైపు ఎవరూ వెళ్లరు. అయితే యూట్యూబర్ వెలుగులోకి తేవడంతో దానిపై ఎవరికి వారు కథనాలు, ఊహాగానాలను ప్రచారం చేస్తున్నారు. రాజుల కాలం నాటి కారాగారమని, ఖైదీలను అక్కడ చిత్రహింసలు పెట్టేవారని, సమీపంలో బుగ్గవంక ప్రాజెక్టు ఉండటంతో ఆ గృహం నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన సంపు అయి ఉండొచ్చని ప్రచారాలు సాగాయి. నవాబులు లేదా బ్రిటీషు కాలం నాటి రాచభవనాల వరండాలను పోలి ఉందని మరికొందరంటున్నారు. సైనికులు తలదాచుకునే బంకర్ అయి ఉండొచ్చని చరిత్రకారులు, పురావస్తుశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. సైనిక పటాలాలకు అనుకూలంగా రైల్వే ట్రాక్ సమీపంలో నిర్మించుకుంటారని కూడా వారు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో వెళ్లి పరిశీలిస్తామని పురావస్తు శాఖ అధికారులు చెప్పారు. -
బ్యాంకు మాజీ ఉన్నతాధికారి కృషి.. పైపులైన్ల పంట!
వ్యవసాయంపై ఉన్న మమకారం ఆయనను తిరిగి సొంతూరికి తీసుకొచ్చింది. పదెకరాల నల్లరేగడి భూమిని సాగు చేసుకుంటూ తమ ఊళ్లో విశ్రాంత జీవితం గడుపుదామని ఆయన నిర్ణయించుకొని ఉండకపోతే.. సాగు నీరు లేక అల్లాడుతున్న ఆ ఊరు పొలాల్లో హంద్రీ నీవా కాలువ నీరు జల జలా పారేదే కాదు. రాజకీయాలకు అతీతంగా రైతులను కూడగట్టి పట్టుదలతో ఆయన సాధించిన వరుస విజయాల గురించి విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరమూ వచ్చేది కాదు! ఆయన పేరు సూగూరు వెంకటేశ్వరరెడ్డి. రైతు బిడ్డ. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లెపల్లి ఆయన స్వగ్రామం. వ్యవసాయంలో బీఎస్సీ పట్టా తీసుకున్న ఆయన భారతీయ స్టేట్ బ్యాంక్‌లో వ్యవసాయ క్షేత్ర అధికారిగా ఉద్యోగంలో చేరారు. 35 ఏళ్ల తర్వాత 2018లో ఏజీఎంగా ఉద్యోగ విరమణ చేసి.. సొంతూళ్లో సేద్యం చేస్తూ వ్యవసాయానికి జవసత్వాలు చేకూర్చుతున్నారు. ? ఉమ్మడిగా భూగర్భ పైపులైన్లు మల్లెపల్లి గ్రామానికి 2.5 కి. మీ. దూరం నుంచి హంద్రీ నీవా – సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) కాలువ వెళ్తుంది. వర్షాలు కురిస్తే కాలువలో ఏడాది పొడవుగా నీళ్లు పారుతుంటాయి. కానీ, గ్రామ పొలాలకు ఈ నీరు పారదు. వెంకటేశ్వరరెడ్డి పైపులైను గురించి ఆలోచించారు. గ్రామ రాజకీయాలను, రైతుల్లో అనైక్యతను అధిగమించి 30 మంది రైతులను ఏకం చేశారు. భూగర్భ పైపులైను నిర్మించి డీజిల్ పంపుల ద్వారా కాలువ నీటిని పొలాల్లో పారించారు. మీటరు లోతులో, 5–6 అడుగుల వెడల్పున ఉమ్మడిగా కందకం తవ్వి.. రైతులు ఎవరికి వారు తమ పీవీసీ పైపులను ఈ కందకంలో పక్క పక్కనే ఏర్పాటు చేసుకున్నారు. ఎవరి డీజిల్ ఇంజన్లను వాళ్లే ఏర్పాటు చేసుకొని, ఎవరికి కావాల్సినప్పుడు నీటిని వారు తోడుకుంటున్నారు. ఫామ్ పాండ్స్‌లో నీటిని నిల్వ చేసుకొని డ్రిప్‌లో, స్ప్రింక్లర్ల ద్వారా పొదుపుగా వాడుకుంటున్నారు. ఈ స్కీము అమలయ్యేనా? అన్న అనుమానంతో తొలుత ఏ ఇతర రైతులూ డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదు. వెంకటేశ్వరరెడ్డి పట్టుదలతో తనే రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టి, పైపులైను నిర్మించి నీటిని పొలాలకు పారించారు. సొంత పూచీకత్తుపై ప్రతి రైతు పేరిట రూ. లక్ష బ్యాంకు రుణం ఏర్పాటు చేయించి.. తాను పెట్టుబడి పెట్టిన సొమ్ము 4 నెలల తర్వాత తిరిగి తీసుకున్నానని ఆయన తెలిపారు. ఆ విధంగా తమ గ్రామ పొలాల్లో ఆరుతడి పంటలకు రక్షక తడులు ఇవ్వడానికి నీటి భద్రత చేకూరిందని వెంకటేశ్వరరెడ్డి సంబరంగా చెబుతుంటారు. ఆ తర్వాత గ్రామంలో ఇతర రైతులు కూడా అనుసరించారు. సుమారు వంద మంది రైతులు దశల వారీగా మరో 8 భూగర్భ పైపులైన్ స్కీముల ద్వారా 800 ఎకరాలకు నీటి భద్రత కల్పించుకున్నారని ఆయన తెలిపారు. వెంకటేశ్వరరెడ్డి పాడి గేదెల ఫారం ఎకరానికి రూ. 5–6 వేల ఖర్చు రేగడి నేలలు కావటాన మూడు నాలుగు వారాలు వర్షం మొహం చాటేసినప్పుడు పంటలను రైతులు కాలువ నీటితో రక్షక తడులు అందించి రక్షించుకుంటున్నారు. ఖరీఫ్ కాలంలో వర్షాభావ పరిస్థితులను బట్టి 1–2 సార్లు, రబీలో 2–3 సార్లు నీటిని సొంత ఖర్చుతో తోడుకుంటున్నారు. ఎకరానికి రెండు పంటలకు కలిపి రూ. 5–6 వేల వరకు డీజిల్ ఖర్చవుతున్నదని వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. కొందరు రైతులు వేసవిలో కూరగాయలను సైతం మూడో పంటగా సాగు చేసుకొని మంచి ఆదాయం గడిస్తున్నారు. నీటి భద్రత వల్ల భూముల ఉత్పాదకత గణనీయంగా పెరిగింది. పత్తి, వేరుశనగ తదితర పంటల సాగుతో రైతుల ఆదాయం పెరిగింది. భూమి విలువ పెరగడంతో పాటు కౌళ్లు రెట్టింపయ్యాయి. 25 ఎకరాల దేవాలయ భూములకు పైపులైను ద్వారా కాలువ నీటిని తెప్పించేందుకు సొంత డబ్బు రూ. 5 లక్షలు విరాళం ఇచ్చారు. ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి 4 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. మల్లెపల్లె ప్రాథమిక పాఠశాల, అల్లుగుండు ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలకు వాటర్ ట్యాంకులు విరాళంగా ఇచ్చారు. సంఘటితమైతే రైతులకు మేలు జరుగుతుందని నమ్మే వెంకటేశ్వరరెడ్డి ‘నాగలి రైతు ఉత్పత్తిదారుల సంఘం’ను ఏర్పాటు చేశారు వెంకటేశ్వరరెడ్డి. ప్రస్తుతం ఇందులో 40 మంది రైతులు ఉన్నారు. రైతు బంధు వెంకటేశ్వరరెడ్డి రుణం తీర్చుకోవటం కోసమే ప్రజలు సర్పంచ్‌గా ఎన్నుకున్నారు! పైపులైన్ నీటితో సాగవుతున్న వేరుశనగ రాజకీయాలకు అతీతంగా కృషి దేశానికి అన్నం పెట్టే రైతులు సంతోషంగా ఉండాలనేది నా లక్ష్యం. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని రైతులను రాజకీయాలకు అతీతంగా ఒక్కతాటిపై తెచ్చాం. హంద్రీ నీవా కాలువ నీటిని అందించే పైపులైను స్కీమును అమలు చేశాం. ఎంతో కష్టపడ్డాం. ఒకప్పడు ఏటా ఒక పంట పండటమే కష్టంగా ఉంది. నేడు అనేక మంది 2 పంటలు సాగు చేస్తున్నారు. కొందరు మూడు పంటలు కూడా వేసుకుంటున్నారు. తర్వాత మరో 8 పైపులైను స్కీములు ఏర్పాటయ్యాయి. తద్వారా 800 ఎకరాలకు నీటి భద్రత చేకూరింది. రాజకీయాలకు అతీతంగా నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. దీంతో బాధ్యత పెరిగింది. – సూగూరు వెంకటేశ్వరరెడ్డి (98660 09889), మాజీ బ్యాంకు ఉన్నతాధికారి, రైతు, సర్పంచ్, మల్లెపల్లి, కర్నూలు జిల్లా -
సొరంగం అనుకుంటే పొరపాటే..
జోగుళాంబ : చారిత్రక నేపథ్యం కలిగిన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో మంగళవారం భూగర్భంలో 12 అడుగుల లోతుతో ధాన్యం భద్రపరుచుకునే గది బయటపడింది. పట్టణంలో ఉబేద్ అనే వ్యక్తి పాడుబడిన ఓ దుకాణం గదిలో గిర్ని మిషన్ ఏర్పాటు చేసుకునేందుకు మేస్త్రీతో గొయ్యి తీయించగా బండ కనిపించింది. మూత తరహాలో ఉన్న ఆ బండను తెరిచి చూడగా.. దాదాపు 5 అడుగుల వెడల్పు, 12 అడుగుల లోతుతో సొరంగంలా కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అది సొరంగం కాదని, పూర్వం రోజుల్లో ధాన్యాన్ని భద్రపరిచేందుకు ఏర్పాటు చేసుకున్న గది అని ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి చెప్పారు. -
అయోధ్యలో ‘కాలనాళిక’
పట్నా: అయోధ్యలో భవ్య రామ మందిరం భూమి పూజకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మందిరం నిర్మాణంలో మరో విశేషం చోటుచేసుకోబోతోంది. రామ జన్మభూమికి సంబంధించిన సమస్త చరిత్రను అక్కడే భూగర్భంలో నిక్షిప్తం చేస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండడానికే ఇదంతా అని తెలిపారు. ఆలయ నిర్మాణ స్థలంలో 2,000 అడుగుల లోతున ఒక కాల నాళిక(టైమ్ క్యాప్సూల్)ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇందులోనే ఆలయ చరిత్ర, కీలక పరిణామాల సమాచారం భద్రపరుస్తామన్నారు. రామ జన్మభూమి కేసు సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలం కొనసాగిందని, ప్రస్తుత, రాబోయే తరాలకు ఇదొక పాఠమని వెల్లడించారు. భవిష్యత్తులో ఈ రామాలయం గురించి ఎవరైనా అధ్యయనం చేయడానికి ఈ కాల నాళిక ఉపయోగపడుతుందన్నారు. వాస్తవాలు వక్రీకరణకు గురయ్యే అవకాశం ఉండదని, తద్వారా ఎలాంటి వివాదాలు తలెత్తవని చెప్పారు. కాల నాళికను తామ్ర పత్రంలో(కాపర్ ప్లేట్) ఉంచి భూగర్భంలో భద్రపరుస్తామని కామేశ్వర్ చౌపాల్ వివరించారు. శ్రీరాముడు నడయాడిన పుణ్య క్షేత్రాలు, పవిత్ర నదుల నుంచి మట్టి, నీరు తెప్పిస్తున్నామన్నారు. భూమి పూజలో వీటిని ఉపయోగస్తామని తెలిపారు. -
మావోయిస్టు భాస్కర్ దశాబ్దాల అజ్ఞాతం
సాక్షి,ఆదిలాబాద్: మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ ఉమ్మడి జిల్లా అడవుల్లో సంచారం తెలంగాణ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. భాస్కర్ దళాన్ని పట్టుకోవడమా లేదా తెలంగాణ నుంచి తరమికొట్టడమా అనే లక్ష్యంగా పోలీసుల కూంబింగ్ సాగుతోంది. అయితే ఈ మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్‌ది ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర సొంత గ్రామం. దళ సభ్యుడిగా నక్సల్ బరిలోకి దిగి దండకారణ్యంలో పని చేసి ప్రస్తుతం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కీలక బాధ్యతలు వహిస్తున్నాడు. దీంతో పోలీసులు ఆపరేషన్ భాస్కర్ లక్ష్యంగా ముందుకు కదులుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. భాస్కర్ నేపథ్యం.. బోథ్ మండలం పొచ్చెర గ్రామంలో జన్మించిన భాస్కర్ 10వ తరగతి వరకు బోథ్‌లోనే చదివారు. ఆ తర్వాత 1989–91 మధ్యలో నిర్మల్‌లో ఇంటర్ చేశారు. ఆ సమయంలో ర్యాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ) ప్రెసిడెంట్‌గా పని చేశారు. అభ్యుదయ భావాలు కలిగిన భాస్కర్ ఆ సమయంలోనే నక్సల్ బరి వైపు ఆకర్షితులయ్యారు. అంతకు ముందు విద్యార్థి దశలోనే 1989 కాలంలో భూపోరాటాలు విస్తృతంగా సాగుతున్న సమయంలో తానుకూడా అందులో పాల్గొన్నాడు. 1994–95 లో దళంలోకి ప్రవేశించాడు. బోథ్ దళ సభ్యుడిగా పని చేసి అక్కడి నుంచి ఇంద్రవెల్లి దళం డిప్యూటీ కమాండర్‌గా ఎదిగాడు. అక్కడి నుంచి కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు చత్తీస్ఘడ్ దండకారణ్యంలోకి వెళ్లాడు. 25 ఏళ్ల వయసులో భాస్కర్ దళంలో చేరినట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది. ప్రసుతం 50 ఏళ్లు ఉంటాయని వారు చెబుతున్నారు. తల్లిదండ్రులు చనిపోయారు. భాస్కర్‌కు ముగ్గురు సోదరులు ఉండగా వారు ప్రస్తుతం పొచ్చెరలోనే వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. భాస్కర్ దళంలో పని చేస్తున్న సమయంలోనే సహచరురాలు కంతి లింగవ్వను వివాహం చేసుకున్నట్లు చెప్తారు. అయితే దళంలోకి వెళ్లిన తర్వాత సోదరులకు భాస్కర్‌తో సంబంధాలు దూరమయ్యాయి. రెండున్నర దశాబ్దాలుగా ఆయన అజ్ఞాతం కొనసాగుతోంది. రిక్రూట్మెంట్ కోసం.. కేంద్రం ఆపరేషన్ గ్రీన్ హంట్ విస్తృతంగా నిర్వహించడంతో ఛత్తీస్‌ఘడ్ దండకారణ్యం నుంచి బయటకు వచ్చినట్లు ప్రచారం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మార్చిలోనే ప్రవేశించినట్లుగా అనుమానిస్తున్నారు. బోథ్, సిరికొండ అటవీ ప్రాంతాల్లో సంచరించినట్లు పోలీసుల దృష్టిలో ఉంది. ప్రస్తుతం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో పోలీసులకు దళం తారస పడటంతో ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోని ఓ మండలం నుంచి కొంత మంది యువకులు మిస్సింగ్ ఉండడంతోనే పోలీసులు దీన్ని సవాలుగా తీసుకుని ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మావో రిక్రూట్మెంట్ అనుమానాలు పోలీసుల్లో బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పట్టుకోవడమో లేని పక్షంలో తరిమికొట్టడమో అనే రీతిలో అడవులను జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కడే కాదు.. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ సంచారం నేపథ్యంలో మరోసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకప్పటి నక్సల్ ఉద్యమాన్ని గుర్తుకు తెస్తున్నాయి. మంగీ, ఇంద్రవెల్లి, బోథ్, చెన్నూర్, సిర్పూర్, పిప్పల్‌ధరి, ఖానాపూర్ దళాలు ఒకప్పుడు అడవుల్లో అలజడి సృష్టించినవి. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికీ దళంలో సుమారుగా 20 మంది ఉన్నట్లు ప్రచారంలో ఉంది. అందులో కొంత మంది కీలక పదవుల్లో ఉండటం గమనార్హం. మే నెలలో బోథ్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో వాల్‌పోస్టర్లు వెలిశాయి. ప్రజాపోరాట ముసుగులో నరహంతక నక్సలైట్లు అనే శీర్షికతో ఉన్నటు వంటి ఆ పోస్టర్లలో మావోయిస్టులకు సహకరించవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. భాస్కర్ తలపై ప్రస్తుతం రూ.20 లక్షల రివార్డు ఉంది. అయితే పోస్టర్లో రూ.8లక్షలుగా ఉండటం గమనార్హం. -
యురేనియం గరళం!
‘అణు ఇంధన శాఖ పరిధిలోని ఏఎండీ (ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్) లంబాపూర్–పెద్దగట్టు ప్రాంతంలోని 25 బోరుబావులు, చేతిపంపుల నుంచి సేకరించిన నీటిలో యురేనియం ఉన్నట్లు గుర్తించింది. ఏఈఆర్బీ (ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు) విధించిన పరిమితి 60 పీపీబీ (పార్ట్ పర్ బిలియన్)కి లోబడి కొన్ని నమూనాల్లో, పరిమితికి మించి ఎంతో ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు గుర్తించింది. సేకరించిన నీటి నమూనాల్లో 1పీపీబీ నుంచి 2,618 పీపీబీ వరకు యురేనియం ఉన్నట్లు తేలింది...’ – లోక్‌సభలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రత్తన్ లాల్ కటారియా సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా భూగర్భంలో ఫ్లోరైడే కాదు.. ఇప్పుడు మరో కొత్త గరళం యురేనియం కూడా ఉందని తేలింది. యురేనియం నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని గుర్తించిన దేవరకొండ నియోజవకర్గం పెద్ద అడిశర్లపల్లి (పీఏ పల్లి) పరిధిలోని పెద్దగట్టు–లంబాపూర్ ప్రాంతంలోని నీటిలో యురేనియం ఆనవాళ్లు ప్రమాదరకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. సరిగ్గా దశాబ్దన్నరం కిందట ప్రజాందోళనలతో వెనక్కి వెళ్లిపోయిన పెద్దగట్టు యురేని యం ప్రాజెక్టుకు తిరిగి ఊపిరి పోయాలని జరిగిన ప్రయత్నాలనూ గతేడాది ఈ ప్రాంత ప్రజలు అడ్డుకున్నారు. అయితే ఇక్కడ యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన కేంద్రం.. ప్రాజెక్టును (మైనింగ్) ఏర్పాటు చేయకున్నా ఈ ప్రాంతం నుంచి నిత్యం నీటి నమూనాలు సేకరించి పరిశోధనలు చేస్తూనే ఉంది. ఇప్పుడు ఆ పరిశోధనల ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. నల్లగొండ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తవ్ ుకుమార్‌రెడ్డి పార్లమెంటు సమావేశాల్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రత్తన్‌లాల్ కటారియా వారం కిందట బదులిచ్చారు. ఆయన సమాధానంతో యురేనియం నిక్షేపాలు ఉన్న లంబాపూర్, పెద్దగట్టు ప్రాంతంలోని తాగు, సాగు నీటిలో యురేనియం ఆనవాళ్లు ఉన్నాయని స్పష్టమైంది. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇదీ.. కథ!: దేవరకొండ నియోజకవర్గం పెద్ద అడిశర్లపల్లి (పీఏ పల్లి) మండలంలోని లంబాపూర్, నామాపురం, ఎల్లాపురం, పులిచర్ల, పెద్దగట్టు తదితర ప్రాంతాల్లో 11.02 మిలియన్ టన్నుల యురేనియం నిక్షేపాలు 1,326 ఎకరాల్లో విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. ఒక ఓపెన్ కాస్ట్ గనితో పాటు, మరో మూడు భూగర్భ గనుల్లో యురేనియం తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించి, 2003 వరకు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఏ) రూపొందించారు. ఈ గనులకు అనుబంధంగా మల్లాపూర్‌లో ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. అయితే అన్ని వర్గాల నుంచి వచ్చిన వ్యతిరేకతతో యూసీఐఎల్ అధికారులు వెనక్కి తగ్గారు. వాస్తవానికి ఈ గనులకు 1,301.35 ఎకరాలు అవసరమని గుర్తించగా ఇందులో 1,104.64 ఎకరాలు రిజర్వు అటవీ భూమి కావడంతో అనుమతులు అవసరమయ్యాయి. మరో 196.71 ఎకరాలు మాత్రమే అనుమతులు అక్కర్లేని భూమిగా గుర్తించారు. ఇక మల్లాపూర్ వద్ద ఏర్పాటు చేయాలని తలపెట్టిన ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం 760 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా వేశారు. మైనింగ్ మొదలుపెట్టే ముందు కేంద్ర అణు ఇంధన శాఖ ఆ ప్రాంతంలోని నీటి నమూనాలు సేకరించి విశ్లేషించడం పరిపాటి. దీనిలో భాగంగానే 2010–2011 మధ్య 468 నీటి శాంపిళ్లను సేకరించి విశ్లేషించారు. 2018 నవంబర్–2019 జూలై మధ్య ఎంపిక చేసిన 25 బోరు బావులు, చేతి పంపుల నుంచి నమూనాలు సేకరించి నీటిలో యురేనియం ఆనవాళ్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదకర స్థాయిలో యురేనియం ఆనవాళ్లు తాజా పరిశోధనల ప్రకారం లంబాపూర్–పెద్దగట్టు చుట్టుపక్కల 8 కిలోమీటర్ల పరిధిలోనే ఎంపిక చేసిన 21 బోరు బావులు, 4 చేతి పంపుల నుంచి నీటి నమూనాలు సేక రించారు. ఇందులో 1 పీపీబీ నుంచి 2,618 పీపీబీ వరకు యురేనియం ఆన వాళ్లను కనుగొన్నా రు. 13 చోట్ల 60 పీపీబీకి తక్కువగా యురేనియం ఆనవాళ్లు ఉన్నాయని, మిగిలిన 12 చోట్ల 1 పీపీబీ నుంచి 2,618 పీపీబీ అంటే.. అత్యధిక స్థాయిలో ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. తాగే నీటిలో 60 పీపీబీ వరకు యురేనియం ఉండొచ్చని ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ (ఏఈఆర్బీ) రక్షిత పరిమితులు విధించిందని చెబుతున్నారు. కానీ యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (యూఎస్‌ఈపీఏ) మాత్రం నీటిలో 30 పీపీబీ వరకు యురేనియం ఉంటేనే ఆ నీరు తాగడానికి రక్షితమ ని నిర్దేశించినట్లు చెబుతున్నారు. నమూనాలు సేకరించిన 4 చేతి పంపుల నీటిలో 1 పీపీబీ నుంచి 48 పీపీబీ వరకు యురేనియం ఉన్నట్లు పరిశోధన అధ్యయనాలు తేల్చాయి కాబట్టి, ఆ చేతి పంపుల నీరు తాగడానికి పనికిరాదంటున్నారు. ఈ లెక్కన సేకరించిన 25 చోట్ల నీటి నమూనాల్లో యురేనియం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లేనని విశ్లేషిస్తున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 50 వేల మంది వరకు దీనివల్ల ప్రభావితమయ్యే అవకాశాలున్నాయి. -
ఇంకా అజ్ఞాతంలో రవిప్రకాశ్
-
చైనా భూగర్భంలో ఉక్కు గోడ
బీజింగ్: దాడుల నుంచి అణ్వస్త్రాలను కాపాడుకునేందుకు పర్వతాల కింద, భూగర్భంలో పెద్ద ఉక్కు గోడను చైనా నిర్మించిందని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖలో పనిచేసే శాస్త్రవేత్త క్వియాన్ క్విహు (82) వెల్లడించారు. ఇటీవలే ఈయనకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, చైనా రక్షణ శాఖలో అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. ఈ భారీ ఉక్కు గోడ చైనా వ్యూహాత్మక ఆయుధాలకు రక్షణగా నిలుస్తుందనీ, ఎవరైనా చైనాపై దాడులు చేసినపక్షంలో ఆయుధాలు ధ్వంసం కాకుండా కాపాడుతుందని క్విహు వెల్లడించినట్లు చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ తెలిపింది. పర్వతాల కింద భాగాల్లో చైనాకు రక్షణ స్థావరాలున్నాయి. సాధారణంగా శత్రు దాడుల నుంచి ఆ పర్వతాలే ఆయుధాలకు రక్షణ కల్పిస్తాయి. రక్షణ స్థావరాల్లోకి ప్రవేశించే, నిష్క్రమించే చోట్ల మాత్రం ఎవరైనా దాడులు చేస్తే ఆయుధాలు ధ్వంసం అయ్యే అవకాశం ఉండటంతో ద్వారాల దగ్గర మరింత భద్రంగా ఉండేలా చేసే బాధ్యతను చైనా ప్రభుత్వం క్విహుపై పెట్టింది. ఆయన ఆ పనిని పూర్తి చేయడంతో 2018 ఏడాదికి ‘స్టేట్ ప్రీమినెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్’ను చైనా ప్రభుత్వం క్విహుకు ప్రదానం చేసింది. ఓ కార్యక్రమంలో క్విహు మాట్లాడుతూ ‘బల్లెం పదును ఎక్కువవుతున్నప్పుడు కవచం కూడా దృఢంగా తయారైతేనే రక్షణను ఇవ్వగలదు. సవాళ్లకు దీటుగా ఈ భూగర్భ ఉక్కు గోడను నిర్మించాం’ అని చెప్పారు. -
వాళ్లకు ఏదైనా సాధ్యమే!
షాంఘై: మనసుంటే మార్గముంటుందనే దానికి నిదర్శనమిది. ఏదో కొత్తగా చేయాలనే తపన, గట్టి సంకల్పం ముందు అన్ని ఆటంకాలు బలాదూర్ అయ్యాయి. సాదారణంగా మనం ఏదైనా మూలనపడ్డ క్వారీని చూసి, దీనిని ఏం చేయలేం ఇక దీని పని అంతే అని చూసి వెళతాం. ఆ క్వారీని నిరుపయోగం వదిలేస్తాం. కానీ మనం క్వారీనే వదిలేయటం లేదు. ఎంతో విలువైన స్థలాన్ని వృదాగా వదిలేస్తున్నాం. అది కొంత మంది ఇంజనీర్లకు నచ్చలేదు. అందుకే కళ్లు చెదిరే రీతిలో భవంతిని నిర్మించించి లోకానికి చూపించారు. మార్గ నిర్దేశం చేశారు. ప్రపంచంలోనే ఇలాంటి తొలి కట్టడంగా పేరు గడించేలా చేశారు. అద్భుత కట్టడాలకు నిలయమైన చైనా మరో నమ్మశక్యం కాని భవంతిని నిర్మించి ఔరా అనిపించింది. సెంట్రల్ షాంఘైకు అతి దగ్గరలో మూలనపడ్డ క్వారీలో హోటల్‌ను నిర్మించి అందరి చూపు అటువైపు తిప్పేలా చేశారు చైనా ఇంజనీర్లు. మూలనపడ్డ పెద్ద క్వారీలో ఏకంగా 17 అంతస్థుల హోటల్‌ను నిర్మించింది. 290 అడుగుల లోతు గల క్వారీలో నీరు చేరకుండా చీఫ్ ఇంజనీర్లు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 336 గదులతో భవనాన్ని నిర్మించారు. అందులోనూ ఈ హోటల్‌ను సాదాసీదాగా నిర్మించలేదు. రిలాక్స్ కావడానికి పార్క్, స్విమ్మింగ్ పూల్, వాటర్ ఫాల్ వంటి అన్ని వసతులను కల్పించారు. దీంతో ఇలాంటి ప్రాజెక్ట్‌కు సరితూగే నిర్మాణమే ప్రపంచంలో లేదని చైనా తేల్చిచెప్పేసింది. ఇక దీని కోసం చైనా ప్రభుత్వం 288 మిలియన్ డాలర్లను ఖర్చుచేసింది. 2013లో దీని నిర్మాణం చేపట్టినప్పటికీ ఆ ఏడాదే భారీ వర్షాల కారణంగా సమీపంలోని నది ఉప్పొంగి ఈ క్వారీలోకి నీళ్లు చేరడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. నీటి మట్టం తగ్గిన తర్వాత మరలా నిర్మాణానికి పూనుకున్నారు. ఇక భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి ఘటన జరగకుండా ఉండేందుకు ఇంజనీర్లు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక క్వారీలో నీటి మట్టం ఎప్పుడూ ఒకేలా ఉంచేందుకు ప్రత్యేకంగా పంప్ హౌజ్‌ను ఏర్పాటుచేశారు. సెంట్రల్ షాంఘై నుంచి గంట ప్రయాణం చేస్తు ఈ హోటల్‌కు చేరుకోవచ్చు. ఇక ఇన్ని జాగ్రత్తలతో, అన్ని హంగులతో నిర్మితమైన ఈ హోటల్లో ఓ గది బుక్ చేసుకోవాలంటే రోజుకు 490 డాలర్ల ఖర్చవుతుంది. -
భూగర్భ గదిలో వారం నుంచి మహిళ
తూప్రాన్: మూఢత్వమో.. దైవత్వమో.. భక్తి మార్గమో తెలియదు. కానీ మాతమాణికేశ్వరి శిష్యురాలిగా చెప్పుకుంటున్న ఓ భక్తురాలు సజీవంగా భూగర్భంలో యోగనిద్ర చేస్తున్న ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామ సమీపంలోని రామలింగేశ్వర ఆలయంలో చోటుచేసుకుంది. ఆమె శిష్యులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. వారం రోజులుగా భూగర్భంలోని ఓ చిన్న గదిలో ఆమె తపస్సు చేస్తున్నట్లు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణానికి చెందిన అంజమ్మ అనే భక్తురాలు తాను శ్రీమాణికేశ్వరిమాత శిష్యురాలినని గ్రామస్తులకు తెలిపింది. లోక కల్యాణమే పరమావధిగా వారం రోజులపాటు గాలి, వెలుతురు లేని భూగర్భ గదిలో యోగముద్రలో ఆమె గడుపుతున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. గత గురువారం ఉదయం 11:30 గంటలకు మాత అంజమ్మ రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న ఓ భూగర్భ గదిలోకి వెళ్లింది. గది పైనుంచి శిష్యులు ఇటుకల గోడతో పూర్తిగా మూసివేశారు. బుధ వారం 7వ రోజు యోగముద్ర నుంచి బయటకు వస్తుందని ఆమె శిష్యులు చెబుతున్నారు. బుధ వారం ఆమె బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేయనున్నట్లు తెలిపారు. కర్ణాటకలోని తన ఆశ్రమంలో ఇప్పటి వరకు 8 సార్లు భూగర్భంలో తపస్సు చేసినట్లు తెలిపారు. ఏటా శ్రావణ మాసంలో 41 రోజులు దీక్ష చేపట్టి 7 రోజులు భూగర్భంలో తపస్సు చేస్తుందన్నారు. -
రాజు సమక్షంలో ఇలా నడుచుకోవాలి
మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు, షరతు మేరకు పన్నెండేళ్లపాటు అరణ్యవాసం పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఇక సంవత్సరకాలం అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసం అంటే మాటలు కాదు, ఎవరి కంటా పడకుండా బతకాలి. అందుకోసం వారు మత్స్యదేశాధిపతి విరాటరాజు కొలువులో చేరాలనుకున్నారు. ధర్మరాజు కంకుభట్టు పేరుతో జూదమాడి రాజును సంతోషపెట్టేవాడిగానూ, భీముడు వలలుడనే పేరుతో వంటవానిగానూ, అర్జునుడు నపుంసకుడిగా ఉంటూ అంతఃపుర స్త్రీలకు సంగీతం, లలిత కళలు నేర్పుతూ, చక్కటి కథలు చెబుతూ బృహన్నల అనే పేరుతోనూ, నకులుడు గ్రంథికుడనే పేరుతో గుర్రాలను రక్షిస్తూ, అశ్వపాలకుడిగానూ, సహదేవుడు తంత్రీపాలుడి పేరుతో గోపాలకుడిగానూ, ద్రౌపది సైరంధ్రి పేరుతో రాణివాసపు స్త్రీలకు జడలు వేసి, పూలు మడిచే పనిలో ఉంటూ, రాణిగారి ప్రధాన పరిచారికగానూ ఉండాలనుకుంటారు. ధర్మరాజు తమ పురోహితుడైన ధౌమ్యుడిని పిలిచి, తమ అభిప్రాయాన్ని చెబుతాడు. అప్పుడు ధౌమ్యుడు ‘‘రాజా, మీరు రాజాస్థానంలో ఉండబోతు న్నారు. మీకు తెలియనిదేమీ లేదు. అయినా, మీ మేలుకోరి నేను మీకు కొన్ని సూత్రాలను చెబుతాను. జాగ్రత్తగా వినండి. రాజులను పూర్తిగా నమ్మరాదు. రాజుగారి వాహనమో, మంచమో, ఏనుగో, ఆసనమో అధిరోహింపరాదు. ఏ ఆసనంలో కూర్చుంటే దుష్టులు సందేహపడతారో అక్కడ కూర్చోరాదు. రాజు అడగనిదే దేనినీ చెప్పరాదు. రాజస్త్రీలతో మైత్రి, పరిహాసం చేయరాదు. ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోరాదు. రాజు సమ్మతించిన పనులు మాత్రమే చేయాలి. హితాన్నైనా, ప్రియంగానే తెలపాలి. రాజుకు ఇష్టంలేని వాటిని ఆచరించరాదు. రాజుగారి అహితులతో మాట్లాడరాదు. రాజుగారికి కుడివైపో, ఎడమవైపో మాత్రమే కూర్చోవాలి. రాజు సమక్షంలో ఆవులించడం, ఉమ్మివేయడం, గట్టిగా నవ్వడం పనికిరాదు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎప్పుడూ రాజును, వారి పుత్రాదులను పొగుడుతూ ఉండాలి. సత్యాన్నే పలకాలి. ఎప్పుడూ చురుకుగా ఉండాలి. రాజుగారిచ్చిన రథమో, వస్త్రాలో, అలంకారమో ప్రతిరోజూ ధరించాలి. అప్పుడే రాజుకు ప్రీతిపాత్రమైన వారిగా ఉంటారు. ఇలా నడుచుకుని ఒక సంవత్సర కాలం పాటు గడిపి మీ దేశం వెళ్లి సుఖంగా జీవించండి’’ అని చెప్పి ఆశీర్వదించాడు. ధౌమ్యుడు ధర్మరాజుకు చెప్పిన ఈ నీతి సూత్రాలు ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయాలే. ఇప్పుడు రాజులు ఉండకపోవచ్చు, ఉన్నతాధికారులు కూడా మనకు రాజులే కదా! – డి.వి.ఆర్. భాస్కర్ -
ఈ ఇళ్లు భూగర్భంలో..!
నేషనల్ డెస్క్: సాధారణంగా మనకు ఎండ ఎక్కువగా ఉందనిపిస్తే ఫ్యాన్ లేదా ఏసీ వేసుకుంటాం. యూరప్, అమెరికా వంటి చలితీవ్రంగా ఉండే ప్రాంతాల్లో ఇళ్లను వెచ్చగా ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అయితే ఏడారులకు సమీపంలో నివసించే ప్రజలు ప్రతిరోజూ ఈ రెండురకాల వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆఫ్రికా దేశమైన ట్యూనీషియాలో జెబెల్దహార్లోని గ్రామాల్లో నివసిస్తున్న బెర్బెర్ జాతి ప్రజలు ఈ సమస్యకు తమదైన పరిష్కారాన్ని కనుగొన్నారు. సహారా ఎడారికి సమీపంలో ఉండటంతో పగటి పూట వడగాలుల్ని, రాత్రిపూట తీవ్రమైన చలిని తట్టుకునేందుకు వీలుగా నేలను తవ్వి గుహల్లాంటి ఇళ్లను నిర్మించుకున్నారు. వలయాకారం మధ్యలో ఖాళీ ప్రదేశంతో పగలు, రాత్రి స్థిరమైన ఉష్ణోగ్రత ఉండేలా ఈ ఇళ్లను అక్కడి ప్రజలు తీర్చిదిద్దుకున్నారు. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ఇళ్లను అక్కడి కుటుంబాలు వారసత్వంగా కాపాడుకుంటున్నాయి. సౌర విద్యుత్ సాయంతో రాత్రిపూట ప్రజలు తమ పనుల్ని చక్కబెట్టుకుంటున్నారు. పట్టణీకరణ ప్రభావంతో.. స్థానికులు ప్రధానంగా యువత ఉపాధిని వెతుక్కుంటూ పట్టణాలకు వలసవెళుతుండటంతో ప్రస్తుతం ఈ ప్రాంతం ప్రజలు లేక వెలవెలబోతోంది. ఇళ్లతో అనుబంధం పెనవేసుకున్నవారు మాత్రం వదిలివెళ్లట్లేదు. ఈ విషయమై స్థానికురాలు లతీఫా బిన్ యహ్యా(38) మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాన్న, అమ్మ చనిపోయారు. నా కుమార్తెలు వివాహం చేసుకుని వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఐదు గదులున్న ఇంట్లో నేనొక్కదాన్నే ఉంటున్నా. ఇప్పుడు నేను ఈ ఇంటిని వదిలేస్తే ఇల్లు మాదికాకుండా పోతుంది’ అని తెలిపారు. మరికొందరు కొత్త ఇళ్లను నిర్మించుకుని ఈ భూగర్భ గృహాలను స్టోర్‌రూమ్‌లుగా మార్చుకుంటున్నారని ఆమె వెల్లడించారు. ఫ్రాన్స్ నుంచి 1956, మార్చి 20న స్వాతంత్య్రం పొందిన తర్వాత అధ్యక్షుడు హబీబ్ బోర్గిబా 1960,70 దశకాల్లో చేపట్టిన సంస్కరణల ప్రభావంతో పలువురు బెర్బెర్ జాతి ప్రజలు ఈ భూగర్భ ఇళ్లను వదలి పట్టణాలకు వలస వెళ్లారు. అయితే తమ జాతిని విచ్ఛిన్నం చేసేందుకే అధ్యక్షుడు హబీబీ అప్పట్లో ఈ మార్పులు తీసుకొచ్చాడని పలువురు స్థానికులు ఆరోపించారు. ఆదాయంపై విప్లవ పంజా 1977లో వచ్చిన ‘స్టార్ వార్స్’ సినిమా కోసం ఓ హోటల్ సెట్‌ను ఇక్కడ వేయడంతో ప్రత్యేకమైన నిర్మాణశైలితో ఉన్న ఈ భూగర్భ ఇళ్లకు అంతర్జాతీయంగా సందర్శకుల తాకిడి పెరిగిపోయింది. అప్పటివరకూ ఆలివ్, పామ్‌జాతి(ఈత,ఖర్జూర) చెట్ల సాగుపై ప్రధానంగా ఆధారపడ్డ స్థానికులు.. పర్యాటకుల కోసం హోటళ్లు ఏర్పాటుచేసి అదనపు ఆదాయాన్ని ఆర్జించడం మొదలుపెట్టారు. అయితే 2011లో చెలరేగిన ‘అరబ్ విప్లవం’తో పరిస్థితి తారుమారైంది. విదేశీ పర్యాటకులపై ట్యూనీషియాలో దాడులు పెరిగిపోవడంతో వారి రాక తగ్గిపోయింది. ఆదాయం తగ్గిపోవడంతో పాటు వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడుతున్న తీవ్రమైన కరువు, భారీ వర్షాలను తట్టుకోలేక పలువురు ప్రజలు ఈ ఇళ్లను వదిలి మెరుగైన జీవితం కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఈ ప్రాంతంలో చివరి భూగర్భ గృహాన్ని తాను 1970లో నిర్మించానని అలీ కయెల్ అనే వ్యక్తి చెప్పారు. ఆస్ట్రేలియాలో కూడా ఆస్ట్రేలియాలోని కూబర్పెడీ పట్టణంలోనూ తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొండల్ని ఆనుకుని ఇలాంటి నిర్మాణాలే వెలిశాయి. 1915లో ఏర్పడిన ఈ పట్టణంలో ప్రస్తుతం 3,500 మంది ప్రజలుండగా వీరిలో 60 శాతం మంది కొండల్ని తొలిచి భూగర్భంలో నిర్మించిన ఇళ్లలోనే నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 95 శాతం ఓపల్(ఓ రకమైన విలువైన రాయి) ఇక్కడే లభ్యమవుతోంది. కప్పడోసియా ఇళ్లు (టర్కీ), వర్జెడియా కేవ్ సిటీ(జార్జియా), కండోవన్(ఇరాన్) లలోనూ ఇలాంటి ఇళ్లున్నాయి. -
ఇక అండర్‌గ్రౌండ్ డస్ట్ బిన్స్
నగరంలో తీవ్రమవుతున్న చెత్త సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ కొత్త ఆలోచన చేస్తోంది. రోడ్డు పక్కన డంపర్ బిన్లు...వాటి చుట్టూ చెత్తాచెదారం నిండడం..దుర్వాసన వెదజల్లడం వంటి సమస్యలకు చెక్ చెప్పేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా అండర్ గ్రౌండ్ బిన్స్ ఏర్పాటు చేయనుంది. ప్రయోగాత్మకంగా జీహెచ్ఎంసీ సర్కిల్–10 (ఏ, బీ) పరిధిలో డంపర్‌బిన్స్ ఉండే చోట అండర్‌గ్రౌండ్ బిన్స్ నిర్మిస్తారు. బంజారాహిల్స్: స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలకు సిద్ధమైన జీహెచ్ఎంసీ ..మరో కొత్త కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టనుంది. రోడ్ల పక్కన చెత్తడబ్బాలు(డంపర్ బిన్లు) కనిపించకుండా ఉండేందుకు వీటిని భూగర్భంలో ఏర్పాటు చేసే కార్యక్రమానికి ప్రణాళికలు రూపొందించారు. లండన్, బ్రిస్సెల్స్, హాంబర్గ్లతో పాటు మన దేశంలోనూ కొన్ని నగరాల్లో పూర్తిగా లేదా పాక్షికంగా భూగర్భంలో ఉండే డంపర్ బిన్లున్నాయి. నగరంలోనూ కార్పొరేట్ సంస్థల నుంచి సీఎస్సార్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ద్వారా అలాంటివి ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. భూగర్భంలోనే ఈ డంపర్బిన్లను ఏర్పాటు చేయడం వల్ల రహదారులపై చెత్త కనిపించదు. దాంతో పరిసరాలు పరిశుభ్రంగా కనిపిస్తాయి. రోడ్లపై పయనించే వారికి దుర్గంధం రాదు. సెన్సర్ల సహాయంతో పనిచేసే ఈ చెత్త డబ్బాలు నిండగానే సంబంధిత అధికారుల మొబైల్ఫోన్లకు సమాచారం అందేలా సాంకేతిక ఏర్పాట్లుంటాయి. దాంతో చెత్త నిండినట్లు తెలియగానే వెంటనే తరలిస్తారు. చెత్త ట్రక్‌లో వేసేందుకు సైతం ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. ట్రక్‌లో ఉండే క్రేన్ డంపర్‌బిన్‌ను పైకి లేపుతుంది. డంపర్‌బిన్ నుంచి చెత్త మాత్రం ట్రక్‌లో పడుతుంది. తొలిదశలో ఎంపిక చేసిన వాణిజ్య ప్రాంతాల్లో 50 డబ్బాలను ఏర్పాటుచేయాలనుకున్నారు. ఇందుకుగాను దాదాపు రూ. 2.5 కోట్లు ఖర్చు కాగలదని అంచనా. వీటి వల్ల మానవ శ్రమ చాలా వరకు తగ్గుతుంది.తొలి దశలో సెంట్రల్‌జోన్ పరిధిలోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో వీటిని ఏర్పాటు చేయాలని భావించిన అధికారులు బుధవారం జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద స్థలాన్ని పరిశీలించారు. సర్కిల్ 10–బి ఏఎంఓహెచ్, ట్రాన్స్పోర్ట్ ఇంజినీర్లు, అర్బన్ గ్రీన్‌సిటీ సంస్థకు చెందిన ప్రతినిధులు స్థలాన్ని పరిశీలించిన వారిలో ఉన్నారు. -
ఉగ్రదాడి.. ఉలిక్కిపడ్డ లండన్..!
-
ఇలా పుట్టింది
కర్కోటకుడు ఎవరైనా అన్యాయంగా అవతలివారిని బాధిస్తుంటే, కొంచెం కూడా జాలి చూపించకుండా ఇబ్బంది పెడుతుంటే వారిని కర్కోటకుడు అంటాం. మహాభారతంలోని అరణ్యపర్వంలో కర్కోటకుడి ప్రస్తావన కనిపిస్తుంది. నిషాధిపతి నలుడు చాలా అందగాడు. అతడు కుండిన పురి రాజకుమార్తె దమయంతిని పెళ్లాడాడు. కలిప్రభావం వల్ల నలుడు జూదంలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో అడవుల పాలయ్యాడు. మార్గమధ్యంలో ఒకచోట దావాగ్ని రగులుతోంది. ఆ అగ్నిలో చిక్కుకొని ఒక సర్పం ‘రక్షించండి’ అని ఆర్తనాదాలు చేస్తోంది. నలుడు జాలితో ఆ సర్పాన్ని మంటల నుండి బయట పడేశాడు. అయితే, చేసిన మేలు మరచిన ఆ సర్పం నలుడిని కాటేసింది. ఆ విషప్రభావానికి నలుడు వికృతరూపాన్ని పొందాడు. నిజానికి కర్కోటకుడు నలుడిని కాటువేసింది మంచి చేసేందుకే, అతణ్ణి అజ్ఞాతవాసంలో ఉంచేందుకే. అయినప్పటికీ, చేసిన మేలు మరచి పోయి, కఠినంగా వ్యవహరించేవారిని కర్కోటకుడనే పిలుస్తున్నారు. -
అజ్ఞాతంలో విద్యుత్ ఎస్ఈ
– సెలువు పేరుతో రెండు రోజులుగా కార్యాలయానికి దూరం – బదిలీలపై విమర్శలు, ఆరోపణలే కారణం? కర్నూలు (రాజ్‌విహార్): విద్యుత్ శాఖ ఏపీ ఎస్పీడీసీఎల్ కర్నూలు సర్కిల్ ఆపరేషన్స్ ఎస్ఈ జి.భార్గవ రాముడు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవలే చేపట్టిన బదిలీలే అందుకు కారణమని స్పష్టంగా తెలుస్తోంది. ఆయన ఇచ్చిన ఉత్తర్వుల్లో అవకతవకలు జరిగాయని ఒకవైపు ఉద్యోగ, కార్మిక సంఘాలు, అసోసియేషన్లు ఆరోపిస్తుంటే తమకు అన్యాయం జరిగిందని మహిళా ఉద్యోగిణులు మండిపడుతున్నారు. ఈ రెండు వర్గాల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక సెలువు పేరుతో రెండు రోజులుగా ఆయన కార్యాలయానికి దూరంగా ఉంటున్నారు. ఇటు ఆయన తన అధికారిక సెల్ ఫోన్ 94408 13316 నంబర్‌ను స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. సెలవుల వెనుక ఇదీ కథ: సాధారణ బదిలీలు నెల రోజుల నుంచి ఎస్పీడీసీఎల్లో వేడి పుట్టించాయి. కోరుకున్న పోస్టింగ్ కోసం కొందరు పైరవీలు చేయగా మరికొందరు ప్రలోభాలకు తెరలేపారు. అధికారు పార్టీ నేతలు, ఉత్తర్వులు ఇచ్చే అధికారి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు పొందినట్లు తెలుస్తోంది. జరగుతున్న వ్యవహారం అంతా ఈనెల 24న ‘సాక్షి’లో ప్రచురితమైన విషయం తెలిసిందే. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఈనెల 24లోపు బదిలీ ప్రభావితం అయిన వారికి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. దీనిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తూ కథనం వచ్చింది. అయితే అధికారులు బదిలీ అయిన వారికి 26న ఉత్తర్వులు ఇచ్చారు. వీటిపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. రాజకీయ నాయకుల అండ, చేతులు తడిపిన కొందరికి దీర్ఘకాలికంగా పనిచేస్తున్నా కేవలం సీటు మార్చారు తప్ప దూర ప్రాంతాలకు వేయలేదని ఆరోపించడంతోపాటు వాటిని మార్చాలని ఎస్ఈ బహిరంగంగా సూచించారు. సిఫార్సులు, పైరవీకారులకు పెద్ద పీట వేశారు తప్ప మిగిలిన వారికి న్యాయం చేయలేదని విమర్శించారు. ఇటు బదిలీకి అర్హులైన మహిళా ఉద్యోగుల్లో 50శాతం మందిని జిల్లా స్థానికంగానే ఉంచాల్సి ఉండగా ఆళ్లగడ్డ, నంద్యాల తదితర దూర ప్రాంతాలకు బదిలీ చేయడంతో మహిళలు ఆగ్రహించారు. అదే రోజు రాత్రి 10:30గంటల వరకు నిర్బంధించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సీఎండీ సైతం ఎస్ఈకి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఇరువర్గాల ఆరోపణలు, రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక ఉత్తర్వుల్లో మార్పులు చేస్తానని ప్రకటించిన ఆయన వాటిలో సవరణలు చేశారు. సంతకాలు పెట్టి సెలువుపై వెళ్తున్నట్లు చెప్పి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. శాంతించని ఇరు వర్గాలు: బదిలీల విషయంలో నెలకొన్న చిచ్చు ఇంకా చల్లారలేదు. రెండు వార్గాలు శాంతించలేదు. ఆయన వచ్చాక తాడో పేడో తేల్చుకోవాలని ఎదురు చూస్తున్నారు. బదిలీల్లో జరిగిన అవకతవకలపై ప్రశ్నించేందుకు ఫోన్ ద్వారా ప్రయత్నిస్తుండగా మూడు రోజులగా స్విచ్ ఆఫ్ అని వస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. గతంలోనూ ఇలాంటి తంతే..! బదిలీల విషయంలో గతంలోనూ ఇలాంటి తంతే జరిగింది. ఎస్ఈ ఇచ్చిన ఉత్తర్వుల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ గతంలో పనిచేసిన సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌ను నిర్బంధించి మధ్యాహ్నం భోజనానికి కూడా పంపలేదు. దీంతో ఆయనకు షుగర్ డౌన్ అయి కళ్లు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించిన ఘటన సంచలనంగా మారింది. సెల్‌ఫోనూ స్విచ్ ఆఫ్.. ఎస్ఈ భార్గవ రాముడు తన అధికారిక సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. వినియోగదారులతో ముడిపడిన ఆపరేషన్స్ పోస్టు కావడంతో సమస్య వచ్చినప్పుడు వినియోగదారులు, పారిశ్రామిక వేత్తలు ప్రజా ప్రతినిధులతోపాటు జిల్లా కలెక్టర్, డైరెక్టర్లు, సీఎండీ ఇలా అన్ని వర్గాల నుంచి కాల్స్ వస్తుంటాయి. అయితే మూడు రోజులుగా స్విచ్ ఆఫ్ చేసుకోవడం సరైంది కాదని, అధికారి సెలవుల్లో వెళితే ఇన్‌చార్జీగా వేరే ఒకరిని నియమించాలని కార్యాలయ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఓ యూనియన్ పేర్కొంది. -
బతికుండగానే సజీవ సమాధి
-
గత పాలకుల నిర్లక్ష్యం వల్లే నిలిచిన పనులు
నిజామాబాద్ అర్బన్ : గత పాలకుల నిర్లక్ష్యం, అవినీతి వల్లే భూగర్భ డ్రెయినేజీ పనులు నిలిచిపోయాయని, ఫలితంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎంపీ కవిత పేర్కొన్నారు. నగర శివారులోని దుబ్బ ప్రాంతంలో మురుగునీటి శుద్ధిప్లాంటు పనులకు ఆదివారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ ంసదర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ గత పాలకులు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనుల పేరిట అవినీతికి పాల్పడ్డారని, రోడ్లను ధ్వంసం చేశారన్నారు. ప్రజలు ఇబ్బందులకు గురైనా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం నగర అభివృద్ధికి నిధులు విడుదల చేశామని, ఇందులోభాగంగా అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ప్రారంభిస్తున్నామన్నారు. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు పూర్తయ్యాక రోడ్లన్నీంటినీ అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో నీటి శుద్ధిప్లాంటు నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ ఆకుల సుజాత, డిప్యూటీ మేయర్ ఫయీం, కార్పొరేటర్లు సురేష్, చాంగుబాయి, మురళీ, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భూగర్భంలో కలిసిపోతున్న వినాయకుడి గుడి
► వర్షం వస్తే నీటిలో మునిగిపోవడమే.. ► విగ్రహాలు తొలగించి చేతులు ► దులుపుకున్న అధికారులు సీతానగరం (తాడేపల్లి రూరల్): వినాయకుడి గుడి కాలక్రమేణా భూగర్భంలో కలిసిపోతోంది. కనకదుర్గమ్మ దత్తత దేవాలయమైన సీతానగరం శ్రీకోదండరామ ఆంజనేయస్వామి ఆలయం, రాష్ట్ర దేవాలయ పరిపాలన విభాగం (సీత కార్యాలయం) మధ్య ఈ గుడి ఉంది. కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ దేవాదాయ శాఖ నిర్లక్ష్యం వల్ల వినాయకుడి గుడికి ఈ పరిస్థితి దాపురించిందంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే పుష్కరాలప్పుడన్నా దేవాదాయ శాఖ అధికారులు దేవాలయాలకు మరమ్మతులు నిర్వహించేవారు. కానీ ఈ సారి ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. మరో 70 రోజుల్లో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. సీత కార్యాలయ భవన నిర్మాణంలో భాగంగా వినాయకుడి గుడి పక్కనే 15 అడుగుల మెరక తోలారు. దీనివల్ల వర్షం కురిస్తే దేవాలయం నీటిలో మునిగిపోయే పరిస్థితి దాపురించింది. దీంతో గుడిలో ఉన్న వినాయకుడి విగ్రహం, నాగేంద్రస్వామి విగ్రహాలను తీసివేసి, పక్కనున్న ఆంజనేయ స్వామి దేవాలయంలో భద్రపరిచారు. అప్పటి నుంచి భక్తులకు ఆ విగ్రహాల దర్శన భాగ్యం కలుగడంలేదు. పుష్కరాల కోసం కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు కానీ, వినాయకుడి గుడి పునర్నిర్మాణం కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పక్కనే ఉన్న సీత కార్యాలయానికి కోట్ల రూపాయలు వెచ్చించి అధికారులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు గార్డెన్లు, వాకింగ్ టైల్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు ఏ పని మొదలు పెట్టినా మొట్టమొదట పూజించే బొజ్జ గణపతికి ఆలయ పునర్నిర్మాణం మాత్రం అధికారులు చేపట్టడం లేదు. గత సంవత్సర కాలంలో సీత కార్యాలయానికి దేవాదాయ శాఖ మంత్రి మూడు సార్లు వచ్చారు. అయినా పక్కనే ఉన్న వినాయకుడి గుడి దుస్థితిపై స్పందించలేదు. గతంలో రూ.18 లక్షలతో వినాయక గుడిని పునర్నిర్మించాలని టెండర్లు పిలిచారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో దాన్ని అలా వదిలేయడం మన దేవాదాయ శాఖ అధికారులకే చెల్లింది. -
అంతు చిక్కని భూగర్భ అద్భుతాలు
మానవులు తలచుకుంటే సాధించలేనిదే లేదంటారు. అయితే భూగర్భంలో మనకు తెలియని రహస్యాలెన్నో నిక్షిప్తమై ఉన్నా వాటిని కనుగొనేందుకు పురాతత్వవేత్తలు, శాస్త్రనిపుణులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నా కనిపెట్టలేకపోతున్నారు. ఎన్నో ప్రయోగాలు చేసినా ఇంకా తెలియని రహస్యాలెన్నో భూగర్భంలోనే మిగిలిపోతున్నాయి. మనకు తెలియని అద్భుత ప్రపంచాన్ని కనిపెట్టేందుకు పురాతత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు అహర్నిశలూ కృషి చేస్తున్నారు. భూగర్భ ప్రపంచాన్ని సందర్శించేందుకు, ప్రజలకు ప్రాచీన చరరిత్రను పరిచయం చేసేందుకు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ప్రాచీన పురాణాలు, ఇతిహాసాలు, రహస్య స్థావరాలు, ఆలయాలు, కట్టడాలు, సమాధులు వంటి ఎన్నో అద్భుతాలను కనుగొన్న శాస్త్రవేత్తలు, పురాతత్వవేత్తలు ప్రాచీన చరిత్రను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. భూగర్భ ప్రపంచంలో అనేక పొరంగాలు, గుహలు, నగరాలు కూడ ఉన్నాయని, వాటి వెనుక ఎంతో చరిత్ర దాగి ఉందని, అయితే వాటిని ఎటువంటి ప్రయోజనాలకోసం, ఏ సందర్భంలో నిర్మించారో పూర్తిగా తెలుసుకోలేకపోతున్నామని చెప్తున్నారు. మనకు లభించిన ఆధారాలను బట్టి కొంత చరిత్ర తెలిసినా, ఇంకా భూగర్భంలో గుర్తించలేని ప్రపంచం ఎంతో ఉందని అంటున్నారు. అయితే చరిత్ర చెప్తున్న 11 అత్యంత రహస్య భూగర్భ ప్రాంతాల్లోని విశేషాలను, వివరాలను శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్టులు ఇప్పటివరకూ ఇంకా గుర్తించలేకపోయారని, అసలు అవి ఉన్నాయా లేవా అన్న అనుమానాలు కూడ వ్యక్తమౌతున్నాయని ఓ ప్రైవేట్ వెబ్ సైట్ వివరించింది. తమకు తెలిసిన ఆధారాలను బట్టి ఆయా భూగర్భ అద్భుతాలకు సంబంధించిన చిత్రాలను వెలువరించింది. ముఖ్యంగా ఈజిప్టు లోని 'లాబ్రినాథ్' భూగర్భ అద్భుతాల్లో ఒకటి. పిరమిడ్లకు ప్రఖ్యాతి చెందిన ఈజిప్టులో లాబ్రినాథ్ గోడలపై చెక్కిన పురాతన లిపి కూడ ఎంతో ప్రాముఖ్యతను పొందింది. అయితే ఆ లిపి ఏమిటి అన్నది మాత్రం నేటికీ శాస్త్రవేత్తలకు అంతుబట్టడం లేదు. కానీ లాబ్రినాథ్ పై పరిశోధనలు చేపట్టేందుకు ఈజిప్ట్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక అమెరికాలోని కాలిఫోర్నియాలో 'డెత్ వ్యాలీ'గా పిలిచే ప్రాంతం 5 వేల ఏళ్ళనాటి అండర్ గ్రౌండ్ పట్టణం. అక్కడ మమ్మీలు, కళాఖండాలు ఉన్నట్లుగా గుర్తించినా... శాస్త్రవేత్తలు వాటిని అక్కడ ఎవరు ఎందుకు ఉంచారో చెప్పలేకపోయారు. అలాగే 'ది గ్రాండ్ కెన్యాన్' లో పురాతన నాగరికతకు చెందిన ప్రజలు నివసిస్తారని పరిశోధనల్లో తేలినా... అది నిజమా కాదా అన్న విషయం తేల్చలేకపోయారు. మరో అద్భుత భూగర్భ నగరం టర్కీలోని డేరిన్ కియు. ఈ అత్యంత ఆధునిక నగరాన్నిఎవరు ఎప్పుడు నిర్మించారో ఇప్పటికీ శాస్త్రవేత్తలు చెప్పలేకపోగా... మిస్సోరి భూగర్భంలోని పట్టణంలోమనుషుల భారీ అస్తికలను కనుగొన్న నిపుణులు... అవి రాక్షసులవి అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇక జపాన్ లోని మౌంట్ త్సురుగి డీపెన్స్ ప్రాంతాన్ని కనిపెట్టి, అది అత్యంత ప్రాచీన నగరమని గుర్తించి, అక్కడే మూడేళ్ళపాటు ప్రయోగాలు చేసినా దానికి సంబంధించిన మరే వివరాలను తెలుసుకోలేకపోయారు. రహస్య భూగర్భ స్థావరం 'తకలమకన్ డెజర్ట్' ఎడారి పరిస్థితీ అదే. అక్కడి ఎడారిలో వెళ్ళినవారికి తిరిగి వచ్చేందుకు దారి కనిపించదని, ఇసుకతో నిర్మించిన ఎన్నో దేవాలయాలు అక్కడ ఉన్నాయని నిపుణులు కనుగొన్నారు. అయితే వాటిని ఇసుకతో ఎలా నిర్మించారో మాత్రం ఇంకా తెలుసుకోలేకపోయారు. రష్యాలోని హైపర్ బోరియా సరస్సును అక్కడివారు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారని తెలుసుకున్నా... దీన్ని ఎవరు నిర్మించారన్న వివరాలు చెప్పలేకపోతున్నారు. అయితే సియాక్స్ ఇండియన్స్ వైట్ హార్స్ భూగర్భ ప్రాంతంలోని, ఓ భూగర్భ గుహ కథనం మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఓ గిరిజన వ్యక్తికి చెందినదిగా వినిపిస్తుంది. ఇటలీలోని భూగర్భ పిరమిడ్ తో పాటు.... త్రీ ఐడ్ లామా వంటి అద్భుతాలెన్నో మనకు తెలియని రహస్యాలుగానే మిగిలిపోయాయి. -
బెంగళూరులో మొదటి భూగర్భ రైలు!
బెంగళూరు: ట్రాఫిక్ సమస్యలనుంచీ బయట పడేందుకు బెంగళూరు మరో అడుగు వేసింది. మొట్టమొదటి భూగర్భ మెట్రో రైల్ 'నమ్మ మెట్రో'ను నగరంలో త్వరలో ప్రారంభించనుంది. కోట్లాది రూపాయలతో సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఆ మెగా అవస్థాపన ప్రణాళికలోని... భూగర్భ విభాగం శుక్రవారం అధికారిక ప్రారంభోత్సవం చేసింది. శాసన సభ భవనం విధాన సౌధా ఆ కార్యక్రమానికి వేదికైంది. బెంగళూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలు త్వరలో తీరేందుకు అధికారులు మరో అడుగు ముందుకేశారు. అండర్ గ్రౌండ్ మెట్రో రైలు ప్రాజెక్టు లోని భూగర్భ సొరంగ మార్గాన్ని ప్రారంభించారు. 42 కిలోమీటర్ల లైన్ లో 5 కిలోమీటర్ల పొడవు భూగర్భంలో విధాన సభతోపాటు నగరంలోని ప్రధాన ప్రాంతాలగుండా ఈ లైన్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా బెంగళూరులోని రెండు ప్రధాన ప్రాంతాల్లోని నమ్మా మెట్రో రైల్ టన్నెల్ పనులను సిబ్బంది పరిశీలించారు. వేలమంది ఉద్యోగులు కలిగి ఉన్న విధాన సౌధ తమ సిబ్బంది సౌకర్యార్థం మెట్రోరైల్ కు సంబంధించిన ఓ స్టేషన్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటోంది. అయతే ఈ కొత్త భూగర్భ రైల్ విషయంలో లాస్ట్ మైల్ కనెక్టివిటీ విషయం మాత్రం ఓ సమస్యగా పరిణమించడమే కాక... నగరంలోని ప్రధాన బస్టాండ్, రైల్వే స్టేషన్లకు కూడ సరైన మార్గం లేకపోవడం ఒకింత ఆలోచింపజేస్తోంది. కొత్త భూగర్భ రైలు మార్గంతో తూర్పు పశ్చిమ విభాగంలోని... పశ్చిమాన ఉన్న మైసూర్ రోడ్ నుంచి తూర్పన బైప్పనహల్లి వరకు సుమారు 18 కిలోమీటర్ల ప్రయాణానికి 33 నిమిషాల సమయం పడుతుంది. తీవ్రమైన ట్రాఫిక్ ఉండే సమయాల్లో ఈ మార్గంలో వాహనాల్లో ప్రయాణించాలంటే గంటలకొద్దీ సమయం వెచ్చించాల్సి వస్తుంది. ఈ నూతన రైళ్ళు ఉదయం 6 గంటలనుంచి రాత్రి 11 వరకూ ప్రతి పది నిమిషాలకు ఈ మార్గంలో రైళ్ళు నడుస్తుంటాయి. భూగర్భంలోని రాతిని దొలిచి ఏర్పాటు చేస్తున్న ఈ సొరంగ రైలు మార్గం ఇంజనీర్లకు కూడా ఛాలెంజింగ్ గానే మారింది. దీంతో కొంత సమయం ఎక్కువ పట్టడంతోపాటు, అధిక ఖర్చుకూడ అవుతోంది. ఇటీవలి కాలంలో భారీ సొరంగాలను తవ్వేందుకు బోరింగ్ మెషీన్లను, చిన్నవాటికి టీబీయం లను వాడుతున్నారని, ప్రస్తుతం 5 కిలోమీటర్ల పొడవున తవ్వాల్సిన ఈ నూతన రైలు మార్గానికి జపాన్ యంత్రాలు హెలెన్, మార్గరీటాలను వినియోగించినట్లు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రదీప్ సింగ్ ఖరోలా తెలిపారు. ఈ యాంత్రాలతో సొరంగం తవ్వడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టినట్లు ఆయన తెలిపారు. -
అజ్ఞాతంలో ఎమ్మెల్యే జేసీ..!
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన అనుచరులకు గన్మెన్లను కేటాయించాలని ఇటీవల ఆయన లేఖలు రాయడంతో, రాష్ట్ర ప్రభుత్వం పెయిడ్ గన్మెన్లను కేటాయించింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన తన గన్మెన్లతోపాటు అనుచరులకు కేటాయించిన గన్మెన్లను సైతం ఐదు రోజుల కిందట వెనక్కి పంపేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన చెప్పాపెట్టకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సెల్‌ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేశారు. పోలీసులు తాను చెప్పినట్లు వినడం లేదని, కనీసం తాను సూచించిన వారిని కూడా ఎస్పీ నియమించడం లేదనే అక్కసుతోనే గన్మెన్ల ఉదంతాన్ని ఆయన తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. అనంతపురం పాత ఊరు రోడ్డు విస్తరణ అంశం అక్కడి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మధ్య మనస్పర్ధలు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎంపీ సోదరుడు ఇలా అజ్ఞాతంలోకి వెళ్లడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు జేసీ సోదరులిద్దరూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. -
'విశాఖలో భూగర్భ విద్యుత్ వ్యవస్థ'
విజయగనరం: హుద్‌హుద్ తుఫాన్‌తో సంభవించిన నష్టాలు వంటివి పునరావృతం కాకుండా విశాఖ నగరంలో రూ.720 కోట్ల నిధులతో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ముత్యాలరాజు వెల్లడించారు. శనివారం విజయనగరం వచ్చిన ఆయన సంస్థ పరిధిలో నూతనంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనులను తెలిపారు. నాలుగు ప్యాకేజీల కింద చేపట్టే ఈ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అమోదం లభించినట్లు పేర్కొన్నారు. మార్చిలో తొలి దశ పనులు ప్రారంభించి, 2018 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. అందరికీ విద్యుత్ పథకంలో భాగంగా రెండు డిస్కంల పరిధిలో మొత్తంగా 5 లక్షల విద్యుత్ సర్వీసులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. -
అసూయోధనులు
మనుషులు నిజంగా పిచ్చి మాలోకాలు. ప్రేమ గుడ్డిదని గుడ్డిగా నమ్మేస్తారు. నిజానికి ప్రేమ కాదు గుడ్డిది, అసూయే అసలు గుడ్డిది. ప్రేమ మైకం కమ్మినవాళ్లకు లోకంమసకమసకగానైనా కనిపిస్తుంది. అదే, అసూయ కమ్మితేనా..? లోకంలో మరేదీ కనిపించదు. అసూయాగ్రస్తులకు లోలోపలే కనిపించని చితిమంట తెగ రగులుతూ ఉంటుంది.వాడుక లేని ఇనుమును తుప్పు కొరికేస్తున్నట్లుగానే, అసూయ మనిషి అంతరాత్మను కొరికేస్తుంది. అసూయకు ఆహారంగా మారిన మనిషి ఇంకేం మిగులుతాడు..? తనకు తానే సర్వ నాశనమవుతాడు. పురాణ పురుషుల్లో సుయోధనుడిని అసూయకు ప్రతీకగా చెప్పుకుంటారు. ఆధునిక సమాజంలోనూ ‘అసుయో’ధనుల సంఖ్య తక్కువేమీ కాదు. సమాజంలో నేరాలూ, ఘోరాలూ ఊరకే జరగవు. మనుషుల్లో అసూయ శ్రుతిమించిన సందర్భాల్లోనే అలాంటివి జరుగుతాయి. అసూయను అదుపులో ఉంచుకుంటే సమాజం ఇంత నేరపూరితంగా మారేది కాదు. సమాజం ఇంత దారుణంగా కలుషితం, నేరపూరితం కాకూడదనే తపనతోనే చాలామంది మహానుభావులు అసూయను విడనాడండర్రా.. అంటూ శక్తివంచన లేకుండా లోకానికి హితబోధలు చేశారు. మహనీయుల మాటలను అంత తేలికగా విని బాగుపడిపోతే, మనం ఆధునిక మానవులం ఎలా అవుతాం..? భర్తృహరిలాంటి మహానుభావుడు ఈర్ష్యాళువులను కాపురుషుల (దుర్మార్గులు) జాబితాలో చేర్చాడంటే, ఇతరుల బాగును చూసి ఓర్వలేని అసూయాపరులు ఎంతటి అనర్థకారులో గుర్తించవచ్చు. ఆత్మవిధ్వంసక లక్షణం.. అసూయ.. ఇతరులను ఇబ్బందిపెట్టే లక్షణం మాత్రమే కాదు, ఆత్మవిధ్వంసక లక్షణం కూడా. అసూయను ఆత్మకు సోకిన పచ్చకామెర్లతో పోలుస్తారు. అసూయ కమ్మిన వాడి కళ్లకు నిజానిజాలు కనిపించవు. అసూయకు అభిజాత్యం కూడా తోడైతేనా.. అలాంటి మనిషికీ, తోక తొక్కిన తాచుకు పెద్దగా తేడా ఉండదు. మహాభారతంలో దుర్యోధనుడు అలాంటి వాడే! పాండవులంటే మొదటి నుంచి అతడికి అసూయ. పాండవుల్లో బలశాలి అయిన భీముడంటే దుర్యోధనుడికి మరీ మంట. పాండవులు పచ్చగా ఉంటే కళ్లలో కారం పోసుకొనేవాడు. భీముడిని అడ్డు తొలగించుకుంటే, తనకు లోకంలో ఎదురే ఉండదనే భ్రమతో అతడిని అంతం చేయడానికి విఫల యత్నాలన్నీ చేస్తాడు. పాండవుల ఐకమత్యం అతడికి అస్సలు నచ్చేది కాదు. అందుకే, వాళ్లందరినీ మూకుమ్మడిగా పరలోకానికి పంపడానికి లక్క ఇంటిని దహనం చేయిస్తాడు. అసూయతో అసలే కన్నూ మిన్నూ కానని దుర్యోధనుడిని అడుగడుగునా రెచ్చగొట్టడానికి శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు తయారవుతారు. ఇంద్రప్రస్థంలో ధర్మరాజు వైభోగాన్ని చూసి దుర్యోధనుడు మరింత రగిలిపోతాడు. మయసభలో తన పాట్లు చూసి నవ్విన ద్రౌపదిపై కక్ష పెంచుకుంటాడు. శకుని పన్నాగం మేరకు మాయజూదంలో ఓడించి, పాండవులను అడవులకు పంపుతాడు. నిండుసభలో ద్రౌపదిని అవమానిస్తాడు. అజ్ఞాతవాసంలో పాండవుల గుట్టు రట్టు చేయాలనుకుని, ఉత్తరగోగ్రహణం తలపెట్టి, అర్జునుడి చేతిలో భంగపడతాడు. శ్రీకృష్ణుడి సంధి రాయబారాన్ని తోసిపుచ్చి, పాండవులకు సూదిమొన మోపినంత నేలనైనా ఇవ్వడానికి నిరాకరిస్తాడు. కురుక్షేత్ర సంగ్రామం దుర్యోధనుడి అసూయకు పర్యవసానమే! అసూయతో అడుగడుగునా రగిలిపోయిన దుర్యోధనుడు, అతడి తొంభైతొమ్మిది మంది సోదరులు, అతడికి అండగా వచ్చిన రాజులు, వారి సైన్యాలు యుద్ధంలో దుంపనాశనమవుతాయి. పాండవులపై పెంచుకున్న అసూయ వల్ల తాను నాశనం కావడం తప్ప దుర్యోధనుడు బావుకున్నదేమీ లేదు. ప్రేమ.. పిచ్చి.. జెలసీ.. ‘ప్రేమా.. పిచ్చీ.. ఒకటే..’ అని భానుమతి పాడిన పాట చాలామందికి తెలిసిందే. ప్రేమకు, పిచ్చికి అట్టే తేడాలేదంటారు విజ్ఞులు. ప్రేమ గుడ్డిదని అంటారు. ప్రేమ ముదిరితే పిచ్చి తలకెక్కుతుందని కూడా కొందరు అనుభవజ్ఞులు చెబుతుంటారు. అయితే, ప్రేమ కాదు, అసూయే గుడ్డిది అని నుడివాడు లారెన్స్ డ్యూరెల్ అనే మహానుభావుడు. అసూయ చెందని వాడు ప్రేమించనట్లే లెక్క అని కూడా కొందరు ప్రేమ గురువుల ప్రవచనం. అంటే, ప్రేమకు అసూయకు అవినాభావ సంబంధం ఉందని, ప్రేమ ముదిరితే అసూయగా మారుతుందని చెప్పుకోవచ్చు. అయితే, ఇది అర్ధసత్యం. అంటే, కొంత వరకు మాత్రమే నిజం. తోబుట్టువులు పుట్టిన కొత్తలో పసిపిల్లలు వారిపై అసూయ పెంచుకుంటారు. కొత్తగా పుట్టిన వాళ్లపైనే తల్లిదండ్రులు ఎక్కువగా శ్రద్ధ చూపడాన్ని వాళ్లు తట్టుకోలేరు. తల్లిదండ్రులు నెమ్మదిగా నచ్చజెబితే, పరిస్థితిని అర్థం చేసుకుని, తమ ధోరణిని మార్చుకుంటారు. ప్రియుడు లేదా ప్రేయసి మరొకరితో సన్నిహితంగా ఉంటే ప్రేమికులు సహించలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమ వల్ల జనించిన అభద్రతాభావం అసూయగా పరిణమిస్తుంది. అయితే, ప్రేమ మాత్రమే అసూయకు ఏకైక కారణం కాదు. పొరుగు వారు పచ్చగా ఉంటే కొందరు అనవసరంగా అసూయ పెంచుకుంటారు. ఇలాంటి అసూయకు ప్రేమ ఎంతమాత్రం కారణం కాదు. చదువుల్లో, ఉద్యోగాల్లో తమ తోటివారి విజయాలను జీర్ణించుకోలేక అసూయ పెంచుకునే వారు ఉంటారు. అసూయతో లోలోపలే రగిలిపోయేవాళ్లలో చాలామంది ఏమాత్రం బయటపడరు. వారిలో కొందరు అశాంతి పెంచుకుంటారే తప్ప పెద్దగా విధ్వంసక చర్యలకు దిగరు. అసూయ మోతాదుకు మించి తలకెక్కిన వారు మాత్రం ఊరకే ఉండలేరు. తమ అసూయకు కారణమైన వారికి హాని తలపెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఇలాంటి ప్రయత్నాలే ఒక్కోసారి తీవ్రమైన నేరాలకు దారితీస్తాయి. కేవలం అసూయ వల్ల భయంకరమైన నేరాలకు, దారుణమైన ఘోరాలకు పాల్పడిన వారు సుఖప్రదంగా శేషజీవితాన్ని గడిపిన దాఖలాలేవీ చరిత్రలో లేవు. అయితే, అలాంటి నేరాలకు అమాయకులు బలైపోయిన సంఘటనలు మాత్రం కొల్లలుగా కనిపిస్తాయి. - పన్యాల జగన్నాథదాసు అసూయపై అభిమతాలు అసూయ గురించి కొందరు మహానుభావులు అనుభవపూర్వకంగా చెప్పిన సూక్తులను పరిశీలిస్తే, ఈ దుర్గుణానికి గల స్వరూప స్వభావాలు మనకు అవగతం అవుతాయి. అలాంటి సూక్తులు మచ్చుకు కొన్ని: క్యాన్సర్ వ్యాధితో కంటె అసూయ అనే వ్యాధితో మరణించేవారు ఎక్కువ. - జోసెఫ్ పి. కెన్నడీ అసూయాపరులతో ఇతరులకు ఇబ్బంది కలుగడమే కాకుండా, వారిని వారు దగ్ధం చేసుకుంటారు. - విలియం పెన్ {పేమను మించిన గొప్ప ఖ్యాతి లేదు. అసూయను మించిన శిక్ష లేదు. - లోప డి వెగా అసూయా పరులలో పైశాచికత్వం, విచక్షణా రాహిత్యం ఒకేసారి చేరతాయి. - జోహాన్ క్యాస్పర్ ఇవేటర్ ఇనుమును తుప్పు తినేసినట్టుగానే, మనిషిలోని మానవత్వాన్ని అసూయ తినేస్తుంది. - యాంటిస్థిన్స్ దొంగలను ఆకర్షించే కుక్క అరుపు లాంటిది అసూయ. - కార్ల్ క్రాస్ అసూయాపరులు ఇతరులను ప్రేమించలేరు. - సెయింట్ అగస్టిన్ {పేమ కాదు గుడ్డిది, అసూయ అసలైన గుడ్డిది. - లారెన్స్ డ్యూరెల్ అసూయ అనేది మనిషిలోని మంచికి ముడి మీద ముడి వేస్తూనే ఉంటుంది. - హెలెన్ రౌలాండ్ వ్యామోహం శరవేగంగా... అసూయగా, ఒక్కోసారి ద్వేషంగా పరిణమిస్తుంది. - అర్థర్ గోల్డెన్ {పేమ, అసూయ అక్కచెల్లెళ్లు. - రష్యన్ సామెత -
బండ కింద బతుకులు
బెల్లంపల్లి : భూగర్భంలో పనిచేస్తున్నకార్మికుల ప్రాణాలకు రక్షణ లేదు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతపై చూపిస్తున్న శ్రద్ధ అధికారులు గనుల్లో రక్షణ చర్యలపై చూపడం లేదు. కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో కార్మికులు ప్రమాదాల భారినపడుతున్నారు. మందమర్రి ఏరియా శాంతిఖని గనిలో కార్మికులు ప్రతికూల పరిస్థితుల మధ్య విధులు నిర్వహిస్తున్నారు. పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ఎవరికి సంభవిస్తుందోననే అభద్రతాభావం కార్మికుల్లో వ్యక్తమవుతోంది. గత శనివారం రెండో షిప్ట్‌లో 2 డీప్ 55 లెవల్ వద్ద సపోర్టు పనులు నిర్వహిస్తుండగా ఆకస్మికంగా పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఓవర్‌మెన్ మీన సుదర్శన్ ఎడమ కాలుకు తీవ్రమైన గాయాలు తగలగా, బ్రహ్మేశ్వర్రావు అనే బదిలీ ఫిల్లర్ కార్మికుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ క్షణంలో ఏఎం యంత్రం మరమ్మతులకు రావడంతో పక్కకు వెళ్లిన మరో నలుగురు కార్మికులు తృటిలో ప్రాణాల నుంచి బయటపడ్డారు. బొగ్గు అధికోత్పత్తి సాధనే లక్ష్యంగా పని చేస్తున్న అధికారులు ప్రకృతికి విరుద్దంగా భూగర్భంలో పని చేస్తున్న కార్మికుల ప్రాణాల మీదికి వస్తున్నా పట్టింపు చేయడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ టీంకే రక్షణ లేదు.. భూగర్భంలో బొగ్గు వెలికితీతకు రక్షణ చర్యలు పటిష్టవంతంగా చేపట్టాల్సి ఉంటుంది. కార్మికులు పనిస్థలాలకు వెళ్లే ముందస్తుగానే రక్షణ టీం సపోర్టు పనులు నిర్వహించాలి. పైకప్పు కూలకుండా డబ్ల్యుస్ట్రాఫ్ రూఫ్ బోల్ట్‌తో బిగించి కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రక్షణ టీంపైనే ఉంటుంది. ప్రెస్లీ ఎక్స్పోజ్డ్(బొగ్గు వెలికితీత తర్వాత ఏర్పడిన ఖాళీ స్థలం)లో రక్షణ పనులు నిర్వహించే సపోర్టు టీం సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది. సపోర్టు పనులు చేపట్టే ముందు రక్షణ టీం ఖాళీ ప్రదేశంలో దాటు లేదా దిమ్మె, ఫోర్ఫోలింగ్ను ఏర్పాటు చేసుకొని సపోర్టు పనులు ప్రారంభించాల్సి ఉండగా అలాంటి పద్ధతులు శాంతిఖని గనిలో నిర్వహించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు. ఈ విధానం కొంత కాలం నుంచి గనిలో చేపట్టడం లేదు. ఈ కారణంగానే రక్షణ టీంకు రక్షణ లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అడపాదడపా పైకప్పు కూలి గాయాలపాలవుతున్నారు. పర్యవేక్షణ లేని డీజీఎంఎస్ భూగర్భ గనుల్లో రక్షణ చర్యలపై పర్యవేక్షణ నిర్వహించే డెప్యూటీ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ(డీజీఎంఎస్) పత్తా లేకుండా పోయారు. మైన్స్ యాక్టు ప్రకారం ప్రతి ఆరు నెలలకోసారి డీజీఎంఎస్ గనులను తనిఖీ చేయాల్సి ఉండగా ఇటీవలి కాలంలో నిర్లక్ష్యం విహ స్తున్నారు. మైనింగ్ ఇన్స్పెక్టర్లు గనుల వైపు కన్నెత్తి చూడటం లేదు. పర్యవేక్షణ నిర్వహించడం లేదు. ఏదో ఏడాదికోసారి అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గనిలో దిగి రక్షణ చర్యలను నిశితంగా పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లిప్తంగా పర్యవేక్షిస్తుండటంతో సింగరేణి అధికారులు చిత్తశుద్ధితో సేఫ్టీ పనులు చేపట్టలేకపోతున్నట్లు తెలుస్తోంది. వర్క్‌లేని... వర్క్‌మన్ ఇన్స్పెక్టర్లు మైనింగ్ ఇన్స్పెక్టర్లే కాకుండా గని స్థాయిలో ఏర్పాటు చేసిన వర్క్‌మెన్ ఇన్స్పెక్టర్లు కూడా సపోర్టు పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. గనిలో వర్క్‌మెన్ ఇన్స్పెక్టర్లు వారానికో రోజు సేఫ్టీ పనులను తనిఖీ చేసి రిపోర్టు తయారు చేయాల్సి ఉంటుంది. చాలా మట్టుకు గని ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే వీరు పని చేయాల్సి ఉండటం వల్ల ఉన్నతాధికారుల సూచనల మేరకే రిపోర్టులు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. సేఫ్టీ విషయంలో వర్క్‌మన్ ఇన్స్పెక్టర్లు సూచనలు, సలహాలు ఇచ్చిన ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు. వర్క్‌మన్ ఇన్స్పెక్టర్లకు స్వయం ప్రతిపత్తి లేకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. ఆ రకంగా గనిలో కార్మికుల ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రక్షణ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే భవిష్యత్‌లో ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితులు ఉంటాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
హజ్రత్ నిజాముద్దీన్ మెట్రో స్టేషన్ భారీ ఇంటర్ చేంజ్ పాయింట్
సాక్షి, న్యూఢిల్లీ : ముకుంద్‌పుర్- శివ్ విహార్కారిడార్లో భాగంగా భూగర్భంలో నిర్మించనున్న హజ్రత్ నిజాముద్దీన్ మెట్రో స్టేషన్ ఇతర ప్రాంతాలనుంచి వచ్చేవారితోపాటు స్థానికులకు భారీ ఇంటర్చేంజ్ పాయింట్‌గా మారనుంది. హజ్రత్ నిజాముద్దీన్ రైల్వేష్టేషన్, సరాయ్ కాలేఖాన్ ఐఎన్బీటీలను కలుపుతూ హజ్రత్ నిజాముద్దీన్ మెట్రో స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. ఈ స్టేషన్లో రైల్వేస్టేషన్‌తోపాటు ఐఎస్బీటీ కోసం ప్రత్యేక ఆగమన, నిష్ర్కమణ ద్వారాలు ఉంటాయి. అంతేకాకుండా రైల్వే స్టేషన్-ఐఎస్బీటీలను కలుపుతూ 100 మీ పొడవు సబ్వేను కూడా నిర్మిస్తారు. హజ్రత్ నిజాముద్దీన్ రైల్వేస్టేషన్‌ను, సరాయ్ కాలేయ్ ఐఎస్బీటీని కలిపే ఈ మెట్రో స్టేషన్ స్థానిక ప్రయాణీకులతో పాటు, బయటి నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులకు ఇంటర్చేంజ్ పాయింట్ కానుంది. ఐఎస్బీటీ కోసం మెట్రో స్టేషన్ ప్రవేశ, నిష్ర్కమణ పాయింట్లు ఐఎస్బీటీలోనే ఉంటాయి. రైల్వే స్టేషన్‌కు ప్రవేశ, నిష్ర్కమణ పాయింట్లు స్టేషన్ కాంప్లెక్స్‌కు 50 మీటర్ల దూరంలో ఉంటాయి. మెట్రో స్టేషన్‌కు మూడో ప్రవేశ నిష్ర్కమణ పాయింట్ స్మృతి వన్ వైపు ఉంటుంది. ఇవికాకుండా రైల్వేస్టేషన్‌ను ఐఎస్బీటీతో కలిపే 100 మీటర్ల సబ్‌వేతోపాటు అనేక ప్రవేశ నిష్ర్కమణ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. 2016 నాటికి ఈ స్టేషన్‌ను 53,370 మంది, 2021 నాటికి 72 వేల మందికి పైగా ఉపయోగించుకోగలుగుతారని అం చనా. భూగర్భంలో 18 మీటర్ల లోతున నిర్మించే ఈ మెట్రో స్టేషన్ ఇంజనీరింగ్అత్యద్భుతం కానుందని వారంటున్నారు.యమునా నదికి సమీపాన ఉన్నందువల్ల చుట్టూరా ఎల్లప్పుడూ నీరు నిలిచిఉండే ఈ మెట్రో స్టేషన్ నిర్మాణం కోసం కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మెట్రో స్టేషన్ నిర్మాణం కోసం ప్రత్యేకమైన డ్రైనేజ్ వ్యవస్థను నిర్మిస్తున్నారు. ఈ మెట్రో స్టేషన్‌ను ఆశ్రమ్, మయూర్ విహార్ మెట్రో స్టేషన్ల మధ్య నిర్మిస్తారు. లజ్‌పత్‌నగర్ నుంచి నిజాముద్దీన్ వరకు 3.36 కి.మీ పొడవైన టన్నెల్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. -
భూగర్భ మార్గాలకే మెట్రో ప్రాధాన్యత
సాక్షి, ముంబై: మెట్రో-2, మెట్రో-3 ప్రాజెక్టులను భూగర్భ మార్గాలుగా నిర్మించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత వడాలా-ఠాణే-కాసర్వాడావలి ప్రాజెక్టులో కూడా కొంత భాగం భూగర్భమార్గంగా నిర్మించాలని ముంబై మహానగర ప్రాం తీయాభివృద్ధి సంస్థ(ఎమ్మెమ్మార్డీయే) యోచిస్తోంది. కాగా వడాలా నుంచి కాపూర్బవాడీ వరకు భూగర్భమార్గంగా, మిగతా మార్గం.. కాసర్వాడావలి వరకు ఎలెవేటెడ్ కారిడార్‌గా నిర్మించాలని ఎమ్మెమ్మార్డీయే అధికారులు యోచి స్తున్నారు. వడాలా నుంచి కాసర్వాడావలి వరకు 30 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మార్గంలో 30 స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.20 వేల కోట్ల నుంచి 30 వేల కోట్ల వరకు వ్యయం అవనుందని అధికారులు అంచనావేశారు. సిద్ధమైన ప్రతిపాదనల ప్రకారం...వడాలా-ఠాణే-కాసర్వాడావలి మెట్రోప్రాజెక్టును మొత్తంగా ఈస్ట్ర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే మీద నుంచి ఎలివేటెడ్ కారిడార్‌గా నిర్మించాలని మొదట నిర్ణయించారు. అయితే నగరవాసులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రణాళిక కమిటీ ఈ ప్రాజెక్టులో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. దీంతో ఈ ఎలివేటెడ్ కారిడార్‌ను ఎల్బీఎస్ మార్గం మీదుగా నిర్మించాలని నిర్ణయించారు. అయితే ఈ రహదారి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ఎల్బీఎస్ మార్గం వద్ద భూగర్భ కారిడార్‌ను నిర్మించాలని ప్రణాళిక కమిటీ సూచిం చింది. ఇటీవలె ఎమ్మెమ్మార్డీయే ఈ ప్రాజెక్టు కోసం ఆర్ఐటీఈఎస్ సలహా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను వివరిస్తూ ఓ నివేదికను సమర్పించింది. దాని ప్రకారం.. వడాలా ఉంచి కాపూర్ బవాడీ వరకు భూగర్భ కారి డార్‌ను నిర్మించాలి. మిగితా మొత్తాన్ని ఎలివేటెడ్ మార్గంగా నిర్మించాలని సూచించింది. అంతేకాకుం డా ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే, కాసర్వాడావలిలో ని ఓవలే వద్ద ఎమ్మెమ్మార్డీయే మెట్రో డిపోను నిర్మిం చేందుకుగాను స్థలాన్ని కూడా గుర్తించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎమ్మెమ్మార్డీయే అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రపంచ బ్యాంక్, జపాన్ ఏజెన్సీల నుంచి రుణాలు తీసుకోనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. అంతేకాకుండా 30 కి.మీ. ఈ కారిడార్‌లో 11 కి.మీ. ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుండడంతో కార్పొరేషన్ ఈ ప్రా జెక్టుకు అయ్యే వ్యయంలో 10 శాతం భరిం చాల్సి ఉంటుంది. దీంతో ఎమ్మెమ్మార్డీయే ఈ విషయమై ఠాణే కార్పొరేషన్‌ను త్వరలో సంప్రదించనుంది. మెట్రో-2 ప్రాజెక్టు.. 32 కి.మీ మేర ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. చార్కోప్-బాంద్రా-మాన్‌కుర్ద్ వరకు ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికైతే కాగితాలకే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు కోసం నియమించిన సలహా కమిటీ ఈ కారిడార్ మొత్తాన్ని భూగర్భ మార్గంగా నిర్మించాలని ప్రతిపాదించింది. తర్వాత ఈ కారిడార్‌ను దహిసర్ వరకు పొడి గించాలని కూడా సూచించింది. ఈ ప్రాజెక్టుకు గాను రూ.8,250 కోట్ల వ్యయం అవుతుందని అధికారులుఅంచనా వేశారు. మెట్రో-3 ప్రాజెక్టు.. ఈ ప్రాజెక్టును సిబ్జ్ నుంచి బాంద్రా మీదుగా కొలాబా వరకు 33.5 కి.మీ మేర నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును కూడా భూగర్భ మార్గంగా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే ఏడాదిలో ఈ పనులను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.23,156 కోట్ల వ్యయం కానుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. -
అల్వాల్‌లో బయటపడ్డ పురాతన బావి