సాక్షి, ముంబై: మెట్రో-2, మెట్రో-3 ప్రాజెక్టులను భూగర్భ మార్గాలుగా నిర్మించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత వడాలా-ఠాణే-కాసర్‌వాడావలి ప్రాజెక్టులో కూడా కొంత భాగం భూగర్భమార్గంగా నిర్మించాలని ముంబై మహానగర ప్రాం తీయాభివృద్ధి సంస్థ(ఎమ్మెమ్మార్డీయే) యోచిస్తోంది. కాగా వడాలా నుంచి కాపూర్‌బవాడీ వరకు భూగర్భమార్గంగా, మిగతా మార్గం.. కాసర్‌వాడావలి వరకు ఎలెవేటెడ్ కారిడార్‌గా నిర్మించాలని ఎమ్మెమ్మార్డీయే అధికారులు యోచి స్తున్నారు. వడాలా నుంచి కాసర్‌వాడావలి వరకు 30 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఈ మార్గంలో 30 స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.20 వేల కోట్ల నుంచి 30 వేల కోట్ల వరకు వ్యయం అవనుందని అధికారులు అంచనావేశారు. సిద్ధమైన ప్రతిపాదనల ప్రకారం...వడాలా-ఠాణే-కాసర్‌వాడావలి మెట్రోప్రాజెక్టును మొత్తంగా ఈస్ట్‌ర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే మీద నుంచి ఎలివేటెడ్ కారిడార్‌గా నిర్మించాలని మొదట నిర్ణయించారు. అయితే నగరవాసులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రణాళిక కమిటీ ఈ ప్రాజెక్టులో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. దీంతో ఈ ఎలివేటెడ్ కారిడార్‌ను ఎల్‌బీఎస్ మార్గం మీదుగా నిర్మించాలని నిర్ణయించారు. అయితే ఈ రహదారి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ఎల్‌బీఎస్ మార్గం వద్ద భూగర్భ కారిడార్‌ను నిర్మించాలని ప్రణాళిక కమిటీ సూచిం చింది.
ఇటీవలె ఎమ్మెమ్మార్డీయే ఈ ప్రాజెక్టు కోసం ఆర్‌ఐటీఈఎస్ సలహా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను వివరిస్తూ ఓ నివేదికను సమర్పించింది. దాని ప్రకారం.. వడాలా ఉంచి కాపూర్ బవాడీ వరకు భూగర్భ కారి డార్‌ను నిర్మించాలి. మిగితా మొత్తాన్ని ఎలివేటెడ్ మార్గంగా నిర్మించాలని సూచించింది. అంతేకాకుం డా ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే, కాసర్‌వాడావలిలో ని ఓవలే వద్ద ఎమ్మెమ్మార్డీయే మెట్రో డిపోను నిర్మిం చేందుకుగాను స్థలాన్ని కూడా గుర్తించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎమ్మెమ్మార్డీయే అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రపంచ బ్యాంక్, జపాన్ ఏజెన్సీల నుంచి రుణాలు తీసుకోనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. అంతేకాకుండా 30 కి.మీ. ఈ కారిడార్‌లో 11 కి.మీ. ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుండడంతో కార్పొరేషన్ ఈ ప్రా జెక్టుకు అయ్యే వ్యయంలో 10 శాతం భరిం చాల్సి ఉంటుంది. దీంతో ఎమ్మెమ్మార్డీయే ఈ విషయమై ఠాణే కార్పొరేషన్‌ను త్వరలో సంప్రదించనుంది.
మెట్రో-2 ప్రాజెక్టు..
32 కి.మీ మేర ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. చార్‌కోప్-బాంద్రా-మాన్‌కుర్ద్ వరకు ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికైతే కాగితాలకే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు కోసం నియమించిన సలహా కమిటీ ఈ కారిడార్ మొత్తాన్ని భూగర్భ మార్గంగా నిర్మించాలని ప్రతిపాదించింది.
తర్వాత ఈ కారిడార్‌ను దహిసర్ వరకు పొడి గించాలని కూడా సూచించింది. ఈ ప్రాజెక్టుకు గాను రూ.8,250 కోట్ల వ్యయం అవుతుందని అధికారులుఅంచనా వేశారు.
మెట్రో-3 ప్రాజెక్టు..
ఈ ప్రాజెక్టును సిబ్జ్ నుంచి బాంద్రా మీదుగా కొలాబా వరకు 33.5 కి.మీ మేర నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును కూడా భూగర్భ మార్గంగా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే ఏడాదిలో ఈ పనులను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.23,156 కోట్ల వ్యయం కానుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
భూగర్భ మార్గాలకే మెట్రో ప్రాధాన్యత
Published Sun, Jun 1 2014 11:05 PM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement
Advertisement