ముంబయి : ముంబయిలో పెద్ద ప్రమాదం తప్పింది. మూడో దశ మెట్రో పనులు చేస్తున్న కార్మికులకు ఓ మెట్రో పిల్లర్ గుంట తీస్తుండగా ఓ పాత లైవ్ బాంబ్ లభ్యమైంది. అదృష్టం కొద్ది వారు వెలికి తీసే సమయంలో అది పేలలేదు. ఈ విషయం తెలుసుకున్న బాంబు నిర్వీర్య బృందం హుటాహుటిన ఆ స్థలానికి చేరుకుని బాంబును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అదే ప్రాంతంలో దాన్ని నిర్వీర్యం చేశారు. అయితే, ఆ క్రమంలో చిన్నసైజు పేలుడు సంభవించింది. అయితే ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.
దీనిపై ఓ పోలీసు అధికారి వివరణ ఇస్తూ బుధవారం సాయంత్రం 6.30గంటల ప్రాంతంలో మెట్రో పిల్లర్ గుంట తీస్తుండగా తమకు ఓ అనుమానాస్పద వస్తువు దొరికిందంటూ వారికి ఫోన్ వచ్చింది. రోడ్డు ఉపరితలానికి ఓ మీటర్ లోతు తవ్వకాలు జరిపిన తర్వాత ఆ వస్తువు బయటపడింది. దాంతో పోలీసులు ముందే అనుమానించి బాంబ్ స్క్వాడ్‌కు ఫోన్ చేశారు. దీంతో దాన్ని నిర్వీర్యం చేశారు. ఆ బాంబులో స్ప్లింటర్లు, నెయిల్స్వంటివి కూడా చాలా ఉన్నాయి. ఆ బాంబు లభించిన చోట గతంలో ఓ టైరు షాపు, ప్రజా మరుగుదొడ్డి ఉండేదని అధికారులు తెలిపారు. ఏదైనా భారీ ఉగ్రవాద కుట్రతో ఆ బాంబును అమర్చి ఉంచారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మెట్రో పిల్లర్ గుంతలో లైవ్ బాంబు..
Published Thu, Jan 11 2018 2:20 PM | Last Updated on Tue, Oct 16 2018 5:16 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment