సాక్షి, ముంబై : నగరవాసులు త్వరలోనే ఒకే ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ కార్డుతో వివిధ రవాణా వ్యవస్థల్లో ప్రయాణించవచ్చు. ఈ స్మార్ట్‌కార్డుతో ముంబై మెట్రో, మోనో రైళ్లలో అదేవిధంగా బెస్ట్ బస్సుల్లో కూడా ప్రయాణించవచ్చు. బృహన్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్), ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారటీ (ఎమ్మెమ్మార్డీఏ), ముంబై మెట్రోవన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్) కలిసి ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ కార్డును ప్రారంభించేందుకు యోచిస్తున్నాయి.
ఈ స్మార్ట్ కార్డు ద్వారా ముంబై మెట్రో, మోనో బెస్ట్ బస్సుల్లో టికెట్‌ను కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం ఉన్న స్మార్ట్ కార్డ్‌లో మరో చిప్‌ను జత చేయనున్నారు. దీని ద్వారా అన్ని పబ్లిక్ రవాణాల్లో ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రారంభ దశలో ఉంది.
ఈ సందర్భంగా ఎమ్మెమ్మార్డీఏ కమిషనర్ యూపీఎస్ మదన్ మాట్లాడుతూ.. ఒక్క స్మార్ట్ కార్డునే మెట్రో,మోనో రైళ్లలోనూ, బెస్ట్ బస్సుల్లోనూ ఉపయోగించే విధంగా ఐడియా రూపొందిస్తున్నామన్నారు. అలాగే సెంట్రల్, వెస్టర్న్ రైల్వేల్లో కూడా ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మదన్ పేర్కొన్నారు. బెస్ట్ బస్ జనరల్ మేనేజర్ ఓపీ గుప్తా మాట్లాడుతూ.. ఈ కార్డు ద్వారా ప్రయాణికులకు మంచి కనెక్టివిటీ అందించే విషయమై చర్చిస్తున్నామని తెలిపారు.
ఆల్ ‘రన్’ వన్..
Published Tue, Nov 4 2014 11:19 PM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM
Advertisement
Advertisement