ముంబై: బస్సు తనపై నుంచి వెళ్లినా క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాడు ఓ వృద్ధుడు. వెంటనే లేచి నడుచుకుంటూ వచ్చాడు. మహారాష్ట్ర ముంబైలోని పొవాయ్ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో.. రద్దీగా ఉన్న రోడ్డుపై కార్లు ఇతర వాహనాలు వెళ్తున్నాయి. అయితే ఓ వృద్ధుడి రోడ్డు దాటుతుండగా అప్పుడే ఓ బస్సు వచ్చింది. ముందున్న వ్యక్తిని డ్రైవర్ గమనించలేదు. అలాగే పోనిచ్చాడు. దీంతో బస్సు కింద పడిపోయాడు వృద్ధుడు. బస్సు అతనిపై నుంచి వెళ్లింది. అక్కడున్న వారు గట్టిగా అరవడంతో డ్రైవర్ బస్సు ఆపాడు.
కింద ఉన్న వృద్ధుడు ప్రాణాలతోనే ఉన్నాడా? లేదా? అని అందరూ చూస్తుండగా.. అతడు బస్సు కింద నుంచి లేచి నడుచుకుంటూ వచ్చాడు. ఎలాంటి గాయాలు కూడా కాలేదు. దీంతో డ్రైవర్ ఊపిరిపీల్చుకున్నాడు.
#WATCH | Elderly man's close shave in Powai area of Mumbai. The incident was captured on a CCTV camera.
(Source: viral video) pic.twitter.com/50LV4N2Pvk
— ANI (@ANI) December 15, 2022
చదవండి: లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్‌ను కర్రలతో చితకబాదిన అమ్మాయిలు
Comments
Please login to add a commentAdd a comment