
ముంబై: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రద్దీగా ఉన్న రోడ్డుపై కదులుతున్న బస్సు కింద తల పెట్టి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం అంధేరి వెస్ట్‌లోలోని డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీని ప్రకారం.. జనాలు, వాహనాలతో రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో అటువైపుగా వస్తున్న బస్సును గమనించాడు. బస్సు దగ్గరికి రావడంతో వెంటనే దాని చక్రాల మధ్య పడుకుండిపోయాడు.
డ్రైవర్ గమనించకుండా బస్సును అలాగే ముందుకు వెళ్లనివ్వడంతో అతని నడుము భాగం మీద నుంచి వెనక టైర్లు వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. డిసెంబర్ 6న ఈ ఘటనకు సంబంధించిన వీడియో పోలీసుల దృష్టికి రాకముందే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న ముంబై పోలీసులు వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేశారు.
ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ గఫార్ ఇస్మాయిల్ సయ్యద్ (59)గా పోలీసులు గుర్తించారు. అతని మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. బాధిత వ్యక్తి ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడనే దానిపై స్పష్టత రాలేదు.
చదవండి: బస్ టైర్ల కిందకు దూసుకెళ్లిన బైకర్.. హెల్మెట్ ఉండడంతో సేఫ్..
#Watch | On Camera, Mumbai Man Lunges Under Moving Bus On Busy Road, Dies pic.twitter.com/lWmv3cQE9V
— NDTV Videos (@ndtvvideos) December 13, 2022