the transport system
-
ఆల్ ‘రన్’ వన్..
సాక్షి, ముంబై : నగరవాసులు త్వరలోనే ఒకే ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ కార్డుతో వివిధ రవాణా వ్యవస్థల్లో ప్రయాణించవచ్చు. ఈ స్మార్ట్కార్డుతో ముంబై మెట్రో, మోనో రైళ్లలో అదేవిధంగా బెస్ట్ బస్సుల్లో కూడా ప్రయాణించవచ్చు. బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్), ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారటీ (ఎమ్మెమ్మార్డీఏ), ముంబై మెట్రోవన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్) కలిసి ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ కార్డును ప్రారంభించేందుకు యోచిస్తున్నాయి. ఈ స్మార్ట్ కార్డు ద్వారా ముంబై మెట్రో, మోనో బెస్ట్ బస్సుల్లో టికెట్‌ను కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం ఉన్న స్మార్ట్ కార్డ్‌లో మరో చిప్‌ను జత చేయనున్నారు. దీని ద్వారా అన్ని పబ్లిక్ రవాణాల్లో ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రారంభ దశలో ఉంది. ఈ సందర్భంగా ఎమ్మెమ్మార్డీఏ కమిషనర్ యూపీఎస్ మదన్ మాట్లాడుతూ.. ఒక్క స్మార్ట్ కార్డునే మెట్రో,మోనో రైళ్లలోనూ, బెస్ట్ బస్సుల్లోనూ ఉపయోగించే విధంగా ఐడియా రూపొందిస్తున్నామన్నారు. అలాగే సెంట్రల్, వెస్టర్న్ రైల్వేల్లో కూడా ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మదన్ పేర్కొన్నారు. బెస్ట్ బస్ జనరల్ మేనేజర్ ఓపీ గుప్తా మాట్లాడుతూ.. ఈ కార్డు ద్వారా ప్రయాణికులకు మంచి కనెక్టివిటీ అందించే విషయమై చర్చిస్తున్నామని తెలిపారు. -

వర్ష బీభత్సం
మునగపాక : హుదూద్ తుపానుతో మండలంలో భారీ నష్టం వాటిల్లింది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఒకవైపు భారీ ఈదురు గాలులు మరోవైపు వర్షాలు పడడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి వాతావరణం అల్లకల్లోలంగా ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. విపరీతమైన గాలులతో చెట్లు పలుచోట్ల పడిపోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్త స్తంభించిపోయింది. ఇళ్లల్లోనుంచి బయటకు రావడానికి ప్రజలు వణికిపోతున్నారు. దీనికి తోడు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామాల్లో అంధకారం నెలకొంది. చాలా చోట్ల పూరిళ్లు నేలకొరిగాయి. గాలలకు చెరకు తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాలకు వరిపొలాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ఆయా ప్రాంతాల వారు ఇబ్బందులు పడ్డారు. అరకు రూరల్ : హుదూద్ తుపాను బీభత్సం సృష్టించింది. శనివారం రాత్రి నుంచి వీచిన బలమైన గాలలుకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. విశాఖ నుంచి అరకు వరకూ ఉన్న రహదారి మొత్తం నేల కూలిన చెట్లతో నిండిపోయింది. రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. పద్మాపురం జంక్షన్ నుంచి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎల్లమ్మ తల్లి గుడి వద్ద, అరకు లోయ వరకూ రహదారంతా నేలకూలిన చెట్లతోనే నిండిపోయాయి. పుట్టగొల్లడ, అట్టగుడ, ఒసుబడల్లో గెడ్డలు పొంగిపొర్లాయి. దీని వల్ల సుంకరమెట్ట వారపు సంతకు వెళ్లిన వారివారి ప్రాంతాలకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. చాలా మంది వారికి తెలిసిన వారి ఇళ్ల వద్దే ఉండిపోయారు.