Mono
-
టీ బ్యాగ్‌లు ఉపయోగిస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!
ఇటీవల కాలంలో సరికొత్త రెడీమేడ్ పుడ్స్ ప్రిపరేషన్లు వచ్చాయి. అలాంటి వాటిలో టీ బ్యాగ్‌లు కూడా ఒకటి. చక్కగా వీటిని వేడివేడి పాలల్లో లేదా వేడినీళ్లలో ముంచితే చాలు మంచి టీ రెడీ అయిపోతుంది. మనం కూడా హాయిగా సిప్ చేసేస్తున్నాం. ఇలాంటివి ఎక్కువగా జర్నీల్లో లేదా కార్యాలయాల్లో సర్వ్ చేస్తుంటారు. ఐతే ఇలా టీ బ్యాగ్‌లతో రెడీ అయ్యే టీని అస్సలు తాగొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది ఆరోగ్యానికి అత్యంత హానికరమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు పరిశోధకులు. తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బార్సిలోనా అటానమస్ యూనివర్సిటి పరిశోధకులు జరిపిన అధ్యయనంలో టీ బ్యాగ్‌లు(Tea Bags) బిలియన్ల కొద్దీ హానికరమైన మైక్రోప్లాస్టిక్‌లను(Microplastics) విడుదల చేస్తాయి తేలింది. వారి పరిశోధన ప్రకారం..ఆహార ప్యాకేజింగ్(Food Packaging)అనేది సూక్ష్మ నానోప్లాస్టిక్(Mono Plastic)లకు మూలం. ఇది కాలుష్యానికి, మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. ముఖ్యంగా టీ బ్యాగ్ బయటి పొరలో ఉపయోగించే పదార్థం ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు. "మనం ఈ టీ బ్యాగ్‌లతో తయారైన టీని సిప్ చేయగానే.. అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు లోనికి వెళ్లిపోతాయి. వాటిని శరీరంలోని ప్రేగు కణాలు గ్రహిస్తాయి. అక్కడ నుంచి రక్తప్రవాహంలోకి చేరుకుని శరీరం అంతటా వ్యాపిస్తాయి." అని చెప్పారు. ఈ మోనో ప్లాస్టిక్ కణాలను అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి విజయవంతంగా వర్గీకరించారు పరిశోధకులు. అంతేగాదు ఈ టీ బ్యాగ్‌ల ద్వారా నానో పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ అవశేషాలు, దాని తాలుకా కణాలు విడుదలవుతాయని గుర్తించారు. ముఖ్యంగా పాలిమర్-ఆధారిత పదార్థంతో తయారు చేసిన వాణిజ్య టీ బ్యాగ్‌లు మరింత ప్రమాదకరమని అన్నారు. నిజానికి ఈ టీ బ్యాగ్‌లు నైలాన్-6, పాలీప్రొపైలిన్, సెల్యూలోజ్లతో తయారు చేస్తారు. మనం ఎప్పుడైతో ఈ టీ బ్యాగ్‌లను వేడి నీరు లేదా పాల్లో ముంచగానే..ఇందులోని పాలీప్రొఫైలిన్ ఒక మిల్లీలీటర్‌కు సుమారుగా 1.2 బిలియన్ కణాలను విడుదల చేయగా, సెల్యులోజ్ ఒక మిల్లీలీటరుకు 135 మిలియన్ కణాలను, అలాగే నైలాన్-6 ఒక మిల్లీలీటర్‌కు 8.18 మిలియన్ కణాలను విడుదల చేస్తాయని వెల్లడించారు. ఈ పరిశోధన ప్లాస్టిక్ మానవ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు కలుగజేస్తాయనే దిశగా చేసే పరిశోధనలకు కీలకంగా ఉంటుందన్నారు. (చదవండి: భారత్‌లోని తొలి విడాకుల కేసు..! ఏకంగా క్వీన్ విక్టోరియా జోక్యంతో..) -
ఆల్ ‘రన్’ వన్..
సాక్షి, ముంబై : నగరవాసులు త్వరలోనే ఒకే ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ కార్డుతో వివిధ రవాణా వ్యవస్థల్లో ప్రయాణించవచ్చు. ఈ స్మార్ట్కార్డుతో ముంబై మెట్రో, మోనో రైళ్లలో అదేవిధంగా బెస్ట్ బస్సుల్లో కూడా ప్రయాణించవచ్చు. బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్), ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారటీ (ఎమ్మెమ్మార్డీఏ), ముంబై మెట్రోవన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్) కలిసి ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ కార్డును ప్రారంభించేందుకు యోచిస్తున్నాయి. ఈ స్మార్ట్ కార్డు ద్వారా ముంబై మెట్రో, మోనో బెస్ట్ బస్సుల్లో టికెట్‌ను కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం ఉన్న స్మార్ట్ కార్డ్‌లో మరో చిప్‌ను జత చేయనున్నారు. దీని ద్వారా అన్ని పబ్లిక్ రవాణాల్లో ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రారంభ దశలో ఉంది. ఈ సందర్భంగా ఎమ్మెమ్మార్డీఏ కమిషనర్ యూపీఎస్ మదన్ మాట్లాడుతూ.. ఒక్క స్మార్ట్ కార్డునే మెట్రో,మోనో రైళ్లలోనూ, బెస్ట్ బస్సుల్లోనూ ఉపయోగించే విధంగా ఐడియా రూపొందిస్తున్నామన్నారు. అలాగే సెంట్రల్, వెస్టర్న్ రైల్వేల్లో కూడా ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మదన్ పేర్కొన్నారు. బెస్ట్ బస్ జనరల్ మేనేజర్ ఓపీ గుప్తా మాట్లాడుతూ.. ఈ కార్డు ద్వారా ప్రయాణికులకు మంచి కనెక్టివిటీ అందించే విషయమై చర్చిస్తున్నామని తెలిపారు. -
ఆల్ ‘రన్’ వన్..
సాక్షి, ముంబై : నగరవాసులు త్వరలోనే ఒకే ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ కార్డుతో వివిధ రవాణా వ్యవస్థల్లో ప్రయాణించవచ్చు. ఈ స్మార్ట్కార్డుతో ముంబై మెట్రో, మోనో రైళ్లలో అదేవిధంగా బెస్ట్ బస్సుల్లో కూడా ప్రయాణించవచ్చు. బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్), ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారటీ (ఎమ్మెమ్మార్డీఏ), ముంబై మెట్రోవన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్) కలిసి ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ కార్డును ప్రారంభించేందుకు యోచిస్తున్నాయి. ఈ స్మార్ట్ కార్డు ద్వారా ముంబై మెట్రో, మోనో బెస్ట్ బస్సుల్లో టికెట్‌ను కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం ఉన్న స్మార్ట్ కార్డ్‌లో మరో చిప్‌ను జత చేయనున్నారు. దీని ద్వారా అన్ని పబ్లిక్ రవాణాల్లో ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రారంభ దశలో ఉంది. ఈ సందర్భంగా ఎమ్మెమ్మార్డీఏ కమిషనర్ యూపీఎస్ మదన్ మాట్లాడుతూ.. ఒక్క స్మార్ట్ కార్డునే మెట్రో,మోనో రైళ్లలోనూ, బెస్ట్ బస్సుల్లోనూ ఉపయోగించే విధంగా ఐడియా రూపొందిస్తున్నామన్నారు. అలాగే సెంట్రల్, వెస్టర్న్ రైల్వేల్లో కూడా ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మదన్ పేర్కొన్నారు. బెస్ట్ బస్ జనరల్ మేనేజర్ ఓపీ గుప్తా మాట్లాడుతూ.. ఈ కార్డు ద్వారా ప్రయాణికులకు మంచి కనెక్టివిటీ అందించే విషయమై చర్చిస్తున్నామని తెలిపారు.