Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

MLC Kavitha Serious Comments On BRS Party1
కేటీఆర్‌పై విరుచుకుపడ్డ కవిత.. నాతో పెట్టుకోవద్దు..

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌లో ఉన్న కోవర్టులే తనను ఓడించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ ఇంటి ఆడ బిడ్డపైనే పేయిడ్‌ వార్తలు రాయిస్తున్నారు. లేఖ ఎవరు బయటపెట్టారో చెప్పమంటే నాపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో కేటీఆర్‌ను టార్గెట్‌ చేసి విమర్శలు చేశారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా చేయాల్సిన పనులు చేయాలి.. కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా? అని ప్రశ్నించారు. తనది బీఆర్‌ఎస్‌ పార్టీనే. కొత్త పార్టీలు ఎందుకు?. ఉన్న పార్టీని, కేసీఆర్‌ను కాపాడుకుంటే సరిపోతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత తాజాగా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ఏది ఉన్నా నేను సూటిగానే మాట్లాడతాను. వెన్నుపోటు రాజకీయాలు చేయను. నేను కేసీఆర్‌ లాగే నేను ఏదైనా సూటిగానే మాట్లాడతాను. తిక్క తిక్కగానే ఉంటాను. పార్టీని నడిపించే సత్తా మీకు లేదు.. నాకు నీతులు చెబుతున్నారా?. వరంగల్‌ మీటింగ్‌ సక్సెస్‌ అయ్యిందని చెప్పుకుంటున్న వాళ్లను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఏమైనా ఉంటే.. పార్టీ ఫోరమ్‌ లోపల మాట్లాడాలి అన్నారు. నేను బయటే మాట్లాడతాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ సోయితో పరిపాలన జరగట్లేదు అని అన్నారు. నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదు.. ఏది ఉన్నా నేను ముక్కు సూటిగానే మాట్లాడతాను.ట్వీట్లకే పరిమితం అయితే ఎలా?..అంతర్గత విషయాలపై లేఖ రాస్తే ఎందుకు బయటపెట్టారు. నేను రాసిన లేఖను ఎవరు బయటపెట్టారు. బీఆర్‌ఎస్‌లో నాకు ఒకే నాయకుడు కేసీఆర్‌.. నాకు ఇంకెవరూ నాయకులు లేరు. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని నేను అంగీరించను. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా చేయాల్సిన పనులు చేయాలి.. కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా?. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఆయన చేసే కార్యచరణ చేయనివ్వండి. నాది బీఆర్‌ఎస్‌ పార్టీనే. కొత్త పార్టీలు ఎందుకు?. ఉన్న పార్టీని, కేసీఆర్‌ను కాపాడుకుంటే సరిపోతుంది. నేను కాంగ్రెస్‌తో 2013లోనే మాట్లాడాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడలేదు. కాంగ్రెస్‌ మునిగిపోయే నావ అని సెటైర్లు వేశారు. నేను అసలే మంచి దాన్ని కాదు..డబ్బులు ఇచ్చి నాపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. నన్ను అరెస్ట్ చేసే సమయంలో కేసీఆర్‌ వద్దకు వెళ్లి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అని అడిగితే కేసీఆర్‌ వద్దని చెప్పినట్టు తెలిపారు. పార్టీ చేయలేని పనులను జాగృతి తరఫున నేను చేసి చూపించాను. కేసీఆర్ తప్ప ఇప్పుడు నన్ను విమర్శిస్తున్న వారు ఏం చేశారో చెప్పాలి. నేను ఎప్పుడూ పదవులు అడగలేదు. కేసీఆరే నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పార్టీ నడిపించే సత్తా లేదు.. నాకు నీతులు చెబుతున్నారా అని మండిపడ్డారు. నేను కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ కోసం పోరాటం చేశాను. నేను మంచి దాన్ని కాదు.. నాతో పెట్టుకోవద్దు అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలిపే ప్లాన్‌.. అలాగే, పార్టీ చేసే పనులు నేను సగం చేస్తున్నాను. అందుకే తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. తెలంగాణ తల్లి విగ్రహం మారిస్తే.. ఈ బీఆర్‌ఎస్‌ పార్టీ ఏం చేసింది?. పార్టీ కోసం కేసీఆర్‌కు వంద లేఖలైనా రాస్తాను. నేను 25 ఏళ్ల నుంచి కేసీఆర్‌కు లేఖలు రాస్తున్నాను. ప్రతీసారి లేఖలు చూడగానే కేసీఆర్‌ వాటిని చించేస్తారు.. కానీ, ఈసారి ఏమైందో లేఖ బయటకు వచ్చింది. అలాంటి లేఖను ఎందుకు బయట పెట్టారు. నేను జైలులో ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలపాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ, నేను బీజేపీలో​ కలపవద్దని చెప్పాను. వందకు 101 శాతం బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలిపే ప్రయత్నం జరుగుతోంది. నేను పార్టీలో ఉంటే బీఆర్‌ఎస్‌.. బీజేపీలో కలిసే అవకాశం ఉండదు. నేను ఉంటే అది కుదరని పని.. అందుకే నన్ను కేసీఆర్‌కు దూరం చేయాలని చూస్తున్నారు. నేను కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తాను. ఇవాళ తెలంగాణ వ్యతిరేకులు పనిచేస్తున్నారు. అది అడ్డుకునే ప్రయత్నం పార్టీ చేయట్లేదు. కేసీఆర్‌ను ఎప్పుడు కలిసేది ఇప్పుడు చెప్పలేను.. డెడ్‌లైన్‌ అంటూ ఏమీ లేదు’ అని చెప్పుకొచ్చారు.

Telangana Government Issues Gaddar Awards2
'గద్దర్‌ అవార్డ్స్‌' ప్రకటించిన తెలంగాణ.. ఉత్తమ నటుడిగా 'అల్లు అర్జున్‌'

తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్‌ అవార్డులను (Gaddar Awards) ప్రకటించింది. తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ ఛైర్మన్‌ నటి జయసుధ (Jayasudha), ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు (Dil Raju) తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అవార్డ్స్‌ కోసం ఎంపికైనా వారి జాబితాను విడుదల చేశారు. 2014 నుంచి 2023 వరకు సెన్సార్‌ అయిన చిత్రాలను అవార్డ్స్‌ కోసం ఎంపిక చేశారు. అయితే, ప్రస్తుతం 2024 ఏడాదికి సంబంధించి అన్ని విభాగాల్లో అవార్డ్స్‌ అందుకున్న వారి వివరాలు ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నుంచి చలన చిత్ర అవార్డులను ఇస్తున్నట్టు దిల్‌ రాజు గుర్తుచేశారు. చిత్ర పరిశ్రమలోని నటీనటులతో పాటు టెక్నికల్‌ టీమ్‌, ఫీచర్‌ ఫిల్మ్‌, జాతీయ సమైక్యత చిత్రం, బాలల చలన చిత్ర విభాగం, హెరిటేజ్‌, చరిత్రపై తీసే చిత్రాలకు పురస్కారాలు అందజేశారు. గద్దర్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు వస్తే.. వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్ వంటి తదితర విభాగాల్లో 76 దరఖాస్తులు వచ్చాయి. 2024 విజేతలు ఉత్తమ చిత్రం : కల్కీ 2898ఉత్తమ రెండో చిత్రం ‌: పోటేల్‌ఉత్తమ మూడో చిత్రం: లక్కీ భాస్కర్‌ఉత్తమ బాలల చిత్రం : 35- చిన్న కథకాదుఉత్తమ ప్రజాదరణ చిత్రం - ఐ అండ్‌ మై ఫ్రెండ్స్‌ఉత్తమ వినోదాత్మక చిత్రం : ఆయ్‌హిస్టరీ ఫీచర్‌ విభాగంలో ఉత్తమ హెరిటేజ్‌ చిత్రం- రజాకార్‌ ఉత్తమ నటుడు‌: అల్లు అర్జున్‌ (పుష్ప 2)ఉత్తమ నటి: నివేధా థామస్‌ ( 35 చిన్న కథ కాదు)ఉత్తమ దర్శకుడు: నాగ అశ్విన్‌ (కల్కి 2898 ఏ.డీ)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌ : యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)ఉత్తమ సంగీత దర్శకుడు :భీమ్స్‌ (రజాకార్‌)ఉత్తమ సహాయ నటుడు : ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)ఉత్తమ సహాయ నటి: శరణ్య ప్రదీప్‌ (అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌)ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ : చంద్రశేఖర్‌ (గ్యాంగ్‌స్టర్‌ )ఉత్తమ కొరియోగ్రాఫర్‌ : గణేష్‌ ఆచార్య (దేవర)ఉత్తమ కమెడియన్‌: సత్య, వెన్నెల కిశోర్‌ (మత్తువదలరా 2)ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌ : సిద్‌ శ్రీరామ్‌ (ఊరుపేరు భైరవకోన)ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌ ఫిమేల్‌: శ్రేయ ఘోషాల్ (పుష్ప2/ సూసేకి అగ్గిరవ్వ)ఉత్తమ కథా రచయిత- శివ పాలడుగు (మ్యూజిక్‌ షాప్‌ మూర్తి)ఉత్తమ స్క్రీన్‌ ప్లే రచయిత- వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్‌)ఉత్తమ గేయ రచయిత- చంద్రబోస్‌ (రాజూ యాదవ్‌)ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌- విశ్వనాథ్‌రెడ్డి (గామి)ఉత్తమ బాలనటులు- మాస్టర్‌ అరుణ్‌ దేవ్‌, బేబీ హారిక (35 చిన్న కథ కాదు)ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌: నితిన్ జిహానీ చౌదరీ (కల్కి)ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌: నల్ల శ్రీను (రజాకార్‌)ఉత్తమ కాస్టూమ్‌ డిజైనర్‌: అర్చనా రావు, అజయ్‌ కుమార్‌ (కల్కి) బెస్ట్ బుక్ ఆన్ సినిమా - మన సినిమా ఫస్ట్ రీల్ (రెంటాల జయదేవ్)స్పెషల్‌ జ్యూరీ అవార్డ్స్‌ విజేతలు దుల్కర్‌ సల్మాన్‌: లక్కీ భాస్కర్‌అనన్య నాగళ్ల: పొట్టేల్‌దర్శకులు సూజిత్‌, సందీప్‌ (క) నిర్మాతలు ప్రశాంత్‌ రెడ్డి, రాజేశ్‌ (రాజూ యాదవ్‌)స్పెషల్‌ జ్యూరీ : ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)

TDP Mahanadu Day 3 Updates: Even Police Faced Troubles In Mahanadu3
మహానాడులో పోలీసులకూ తప్పని కష్టాలు!

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: తెలుగు దేశం పార్టీ మహానాడు(TDP Mahanadu) కార్యక్రమం మాటేమోగానీ.. జనాల్ని తరలించలేక, సభకు వచ్చినవాళ్లను నిలువరించలేక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తొలిరెండు రోజులు ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం, నేతలు మాట్లాడుతుండగానే మధ్యలో జనాలు వెళ్లిపోవడాన్ని సాక్షి హైలైట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మూడోరోజు మహానాడు బహిరంగ సభనైనా జనంతో నింపేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. మహానాడు కారణంగా చివరకు పోలీసులు(AP Police) సైతం పడుతున్న కష్టాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేయించుకుంది టీడీపీ. అయితే కనీసం తిండి కూడా పెట్టడం లేదంటూ ఓ ఎస్సై పడిన ఆవేదన వీడియో రూపేణా బయటకు వచ్చింది. మహానాడులో రకరకాల రుచులతో భోజనాలు ఘనంగా పెడుతున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా ఎంతలా ప్రచారం చేసుకుందో తెలిసిందే. కానీ, తాము ఏ పూట వెళ్లినా తమకు తిండి మాత్రం దొరకడం లేదని ఆయన అక్కడికి వచ్చిన వాళ్లకు చెప్పుకుంటూ వాపోయారు. ఇంకోవైపు.. మరోవైపు.. కడప మహానాడు (Kadapa Mahanadu)ను ఎలాగైనా ‘సక్సెస్‌’ చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి జనసేకరణ చేపట్టింది. అన్నమయ్య జిల్లాలో మహానాడు కోసం ఓబులవారిపల్లి హరిజన వాడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే.. అది బలవంతపు తరలింపు అని ఇప్పుడు తేలింది. డ్వాక్రా మహిళలు మహానాడుకు కచ్చితంగా రావాలని, సమావేశానికి రాకపోతే లోన్లు ఇవ్వమంటూ బెదిరించిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది.ఇదీ చదవండి: మహానాడులో ఎన్టీఆర్‌ స్పీచ్‌.. నవ్వుకున్న టీడీపీ కార్యకర్తలు

Kuppam farmers Serious On Chandrababu4
చంద్రబాబును గెలిపించడమే మా తప్పు.. కుప్పంలో రైతుల ఆగ్రహం

సాక్షి, చిత్తూరు: చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కూటమి సర్కార్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఎయిర్‌పోర్టు కోసం ప్రభుత్వం బలవంతంగా భూసేకరణకు దిగింది. ఈ నేపథ్యంలో తమ భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. చంద్రబాబును గెలిపించినందుకు తమకు తగిన బుద్ధి చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.కుప్పంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు కోసం చంద్రబాబు ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేపట్టింది. రామకుప్పం, శాంతిపురం మండలాల్లో భూసేకరణ చేస్తోంది. శాంతిపురం మండలం దండికుప్పంలో బలవంతంగా భూసేకరణకు కూటమి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా రెవెన్యూ అధికారులు అక్కడ భూమిని పరిశీలించేందుకు వెళ్లారు. దీంతో, రెవెన్యూ అధికారులను రైతులు అడ్దుకున్నారు. ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబును గెలిపిస్తున్నందుకు మాకు తగిన బుద్ధి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అధికారులు మాత్రం.. ఎకరాకు 16 లక్షలు ఇస్తామని రైతులను బలవంతంగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. తమను ప్రశ్నిస్తే, కోర్టులకు వెళ్తే రూ.10లక్షలు మాత్రమే ఇస్తామని రెవెన్యూ అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని రైతులు చెబుతున్నారు.కాగా, కుప్పంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు కోసం చంద్రబాబు ప్రభుత్వం 1405 ఎకరాలు భూ సేకరణ చేయాలని టార్గెట్‌ పెట్టుకుంది. ఈ క్రమంలోనే రైతుల వద్ద నుంచి బలవంతంగా భూసేకరణకు దిగింది. ఇప్పటికే 458 ఎకరాలు భూమి సేకరించింది. అదనపు భూమి కోసం రైతులను వేధింపులకు గురిచేస్తోంది.

South African Bowler Pushes Bangladesh Batter5
సిక్స్ బాదాడని బ్యాట‌ర్‌ను కొట్టిన బౌల‌ర్‌! వీడియో వైర‌ల్‌

మిర్పూర్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికా-ఈ, బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో వివాదం చెల‌రేగింది. ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా ఫాస్ట్ బౌల‌ర్ షెప్టో తులి జెంట‌ల్‌మేన్ గేమ్‌కు మాయని మ‌చ్చ తీసుకొచ్చేలా ప్ర‌వ‌ర్తించాడు. క్రికెట్‌లో చిన్న చిన్న‌ గొడ‌వ‌లు సాధారణంగా మ‌నం చూస్తూ ఉంటాము.కానీ ఈ యువ బౌలర్‌ తులి మాత్రం ప్రత్యర్ధి బ్యాటర్ సిక్స్ బాదడని దాడికి దిగాడు. బంగ్లా ఇన్నింగ్స్ 105వ ఓవర్ వేసిన తులి బౌలింగ్‌లో తొలి బంతిని రిపోన్ మోండోల్ స్ట్రైయిట్‌గా సిక్సర్ బాదాడు. దీంతో సహనాన్ని కోల్పోయిన సఫారీ బౌలర్.. రిపోన్‌తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో అతడి వద్దకు వెళ్లి చేయి చేసుకున్నాడు.రిపోన్ కూడా తిరగబడడంతో గొడం పెద్దదైంది. ఇద్దరు ఆటగాళ్ళు ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో అంపైర్‌లు, సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో గొడవసద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. క్రిక్ ఇనో ఫో రిపోర్ట్ ప్రకారం.. ఈ ఇద్దరి ఆటగాళ్లపై మ్యాచ్ రిఫరీ క్రికెట్ సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులకు తన నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరిపై వారి క్రికెట్ బోర్డు సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశముంది.I have never seen such an incident in the history of cricket. A direct fight. What a shameful incident of cricket happened between the talented bowler Shepo Ntuli of South Africa and Ripon Mondal of Bangladesh. This is extreme. #BANevsSAe #CricketTwitter #Bangladesh #SouthAfrica pic.twitter.com/3CbMTHwUEA— Monirul Ibna Rabjal 🇧🇩🇪🇺 (@to2monirul) May 28, 2025

US Court Blocks Donlad Trump Tariffs6
ట్రంప్‌కు టారిఫ్‌లు విధించే అధికారాల్లేవ్‌.. కోర్టు సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌కు యూఎస్‌ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ‘లిబరేషన్ డే’ సందర్భంగా పలు దేశాలపై ట్రంప్‌ విధించిన టారిఫ్‌ల విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యవసర పరిస్థితిలో మాత్రమే అధ్యక్షుడికి ఆర్థిక ఆంక్షలు విధించే అధికారం ఉంటుందని మాన్‌హట్టన్‌ కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో, ట్రంప్‌ ప్రభుత్వానికి చుక్కెదురైంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ టారిఫ్‌లు (Trump Tariffs) అమలుకాకుండా యూఎస్‌ ట్రేడ్‌ కోర్టు నిలుపుదల చేసింది. ఈ క్రమంలో మాన్‌హట్టన్‌ కోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల బృందం తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే అధికారం కేవలం కాంగ్రెస్‌కే ఉంది. విశేష అధికారాలతో టారిఫ్‌లు విధించడం సరికాదు. ఇది రాజ్యాంగ వ్యవస్థలను బలహీన పరచడమే అవుతుంది అని చెప్పుకొచ్చింది.అయితే, ట్రంప్ ఈ చర్యను అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద తీసుకున్నట్టు అమెరికన్ కమాండర్ ఇన్ చీఫ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని ఆర్థిక ఒత్తిడి సాధనంగా వినియోగించేందుకు వీలు లేదని కోర్టు తేల్చింది. ఇదే సమయంలో ‘భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల (India-Pakistan Tensions)’ అంశాన్ని ట్రంప్‌ సర్కారు ప్రస్తావించగా.. కోర్టు దాన్ని తోసిపుచ్చింది.🇺🇸 JUST IN: US federal court blocks Trump's "Liberation Day" tariffs from taking effect.It rules that the president overstepped his constitutional authority by unilaterally imposing import duties on countries with trade surpluses against the United States. pic.twitter.com/WmJlyoEz9H— Cointelegraph (@Cointelegraph) May 29, 2025అధ్యక్షుడికి ఉన్న టారిఫ్‌ అధికారాలను సమర్థించాలని ట్రంప్‌ (Donald Trump) అడ్మినిస్ట్రేషన్‌ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. చట్టపరంగా ఎదురైన ఈ సవాల్‌.. చైనాతో వాణిజ్య సంధిని మార్చేస్తుందని, భారత్‌-పాక్‌ మధ్య ఘర్షణలను పెంచుతుందని అధికారులు వాదించారు. ‘‘టారిఫ్‌ అధికారం వల్లనే ఇటీవల భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్‌ సాధించగలిగారు’’ అని కోర్టుకు తెలిపారు. సుంకాలకు సంబంధించి ప్రస్తుతం అనేక దేశాలతో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్‌ సర్కారు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఈ ట్రేడ్‌ డీల్స్‌ను ఖరారు చేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఉందని, అప్పటివరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని కోర్టును కోరింది. అయితే ట్రంప్‌ అడ్మిస్ట్రేషన్‌ చేసిన అన్ని వాదనలను కోర్టు తిరస్కరించింది.ఇక, ఈ టారిఫ్‌లపై అమెరికాలోని ఐదు చిన్న దిగుమతి వ్యాపార సంస్థలు, ఒరెగాన్ రాష్ట్ర అటార్నీ జనరల్ డాన్ రేఫీల్డ్ నాయకత్వంలో ఉన్న 13 రాష్ట్రాల కూటమి వ్యాజ్యం దాఖలు చేశాయి. ఈ టారిఫ్‌లు చట్టవిరుద్ధం, నిర్లక్ష్యంగా తీసుకున్నవని, ఆర్థికంగా నష్టం కలిగించేవి అంటూ వారు పేర్కొన్నారు. 🚨 BIG BREAKING 🚨🇺🇸 US Federal Court blocks President Trump's Liberation Day tariffs from taking effect.Donald Trump files appeal after Federal Court blocks tariffs.White House: It's "not for unelected judges to decide how to properly address a national emergency." pic.twitter.com/yCotgRaQq6— Crypto Aman (@cryptoamanclub) May 29, 2025

TDP Atrocities: Mid Night High Drama in Pulivendula After TDP Flags Removed7
పులివెందుల: అర్ధరాత్రంతా హైడ్రామా

సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో.. పులివెందుల, వేములలో గత అర్ధరాత్రంతా హైడ్రామా నడిచింది. మహానాడు నేపథ్యంతో ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్ విగ్రహాలకు టీడీపీ తోరణాలు కడితే.. వాటిని తొలగించారంటూ వైఎస్సార్సీపీ నేతలపై అరెస్ట్‌ చేసి రాత్రంతా పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచారు. నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బుధవారం రాత్రి మున్సిపల్ చైర్మన్ వర ప్రసాద్‌ సహా పలువురు వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై పులివెందుల నుంచి వేముల పీఎస్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పీఎస్‌కు చేరుకుని పోలీసులను నిలదీశారు. ‘‘ మా పార్టీ నేతలను అరెస్ట్‌ చేయం దారుణం. వైఎస్సార్ విగ్రహానికి కట్టిన టీడీపీ జెండాలు తొలగించమంటే పోలీసులు స్పందించలేదు. తమ మనోభావాలు దెబ్బ తినడంతో తోరణాలు తొలగించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ నేతలపై కేసులు పెట్టడం దారుణం’’ అని వైఎస్‌ అవినాష్‌ రెడ్డి అన్నారు.ఇదీ చదవండి: వైఎస్సార్‌.. ఓ ఎమోషన్‌

Marco Rubio Says US will Revoke visas for Chinese students8
చైనా విద్యార్థులకు భారీ షాక్‌!

వాషింగ్టన్‌: అమెరికాలోని డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాలో చైనా విద్యార్థుల వీసాలు రద్దు చేయడానికి ట్రంప్‌ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో ఓ ప్రకటనలో వెల్లడించారు. దీంతో, చైనా విద్యార్థుల్లో టెన్షన్‌ మొదలైంది.మంత్రి మార్కో రూబియో తాజాగా ట్విట్టర్‌ వేదికగా..‘అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ నాయకత్వంలో చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయడానికి అమెరికా విదేశాంగ శాఖ హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖతో కలిసి పని చేస్తుంది. చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తాం.వీరిలో చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నవారు, కీలక రంగాలలో చదువుతున్నవారు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఇక, అమెరికాలో భారత్‌, తర్వాత చైనా విద్యార్థులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా విద్యార్థులే రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. 2023-2024 విద్యా సంవత్సరానికి గాను చైనా నుండి 2,70,000 మంది విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు.The U.S. will begin revoking visas of Chinese students, including those with connections to the Chinese Communist Party or studying in critical fields.— Secretary Marco Rubio (@SecRubio) May 28, 2025ట్రంప్ vs హార్వర్డ్మరోవైపు.. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కొత్త అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోకుండా తాత్కాలికంగా నిలిపివేసింది. వర్సిటీలోని పరిశోధన భాగస్వామ్యాల ద్వారా విద్యార్థులు.. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో సమన్వయం చేసుకుంటున్నట్టు ఆరోపించింది. హార్వర్డ్ ఒక చైనీస్ పారామిలిటరీ గ్రూప్ సభ్యులకు శిక్షణ ఇస్తోందని డీహెచ్‌ఎస్‌ వ్యాఖ్యానించింది. చైనా విద్యార్థులు వామపక్ష భావజాలంతో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేసింది.ఇదిలా ఉండగా.. అమెరికా వీసాల విషయంలో ట్రంప్‌ సర్కార్‌ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. యూఎస్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అమెరికన్లు చేసే పోస్టులను, కామెంట్లను సెన్సార్‌ చేయడానికి ప్రయత్నించే విదేశీ అధికారులపై కొత్తగా వీసా నిషేధాన్ని ప్రకటించింది. అంతేకాకుండా తమ దేశానికి చెందిన సామాజిక మాధ్యమాలకు కంటెంట్‌ను తీసేయమని నోటీసులు పంపడం, ఒత్తిడికి గురిచేసిన వారిపైనా ఈ వీసా నిషేధం అమలుకానున్నట్లు అమెరికా పేర్కొంది. ఇటీవల పలు దేశాల ప్రభుత్వాల నుంచి యూఎస్‌ సోషల్‌ మీడియా కంపెనీలకు ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.‘అమెరికా పౌరులు లేదా నివాసితులు తాము సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌లను, కామెంట్లను తొలగించమని ఒత్తిడికి గురిచేయడం, అరెస్టు వారెంట్లు జారీ చేయడం, యూఎస్‌ టెక్‌ కంపెనీలను సైతం ఒత్తిడికి గురిచేసే విదేశీ అధికారులను లక్ష్యంగా చేసుకొని ఈ కొత్త పాలసీ తీసుకొచ్చాం’ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. ఈ సందర్బంగా విదేశీ అధికారులు ఇలా అమెరికా పౌరులను, టెక్‌ కంపెనీలను ఒత్తిడికి గురిచేయడం అనైతికం అన్నారు. అంతేకాకుండా గ్లోబల్‌ కంటెంట్‌ మోడరేషన్‌ విధానాలు అవలంభించడం లేదా వారి అధికార పరిధి దాటి సెన్సార్‌షిప్‌ కార్యకలాపాల్లో పాల్గొనాలని ఇతర దేశాల అధికారులు యూఎస్ టెక్‌ కంపెనీలను డిమాండ్‌ చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. అయితే ఏ దేశం పేరును గానీ, అధికారులను గానీ ఆయన నేరుగా ప్రస్తావించలేదు.

India records 81 04 billion dollars FDI inflow in FY259
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయ్‌..

న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) గత ఆర్థిక సంవత్సరంలో పెరిగాయి. 2024–25లో 13% వృద్ధితో 50 బిలియన్‌ డాలర్లు తరలివచ్చినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. కాగా, 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇవి 44.42 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. మొత్తం ఎఫ్‌డీఐలు(ఈక్విటీలు, రిఇన్వెస్టెడ్‌ ఎర్నింగ్స్, ఇతర మూలధనం) 14% పెరిగి 81.04 బిలియన్‌ డాలర్లుగా నిలిచాయి. గడిచిన మూడేళ్లలో ఇదే అత్యధికం. 2023–24లో ఇవి 71.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. సమీక్షా కాలం(2024–25లో)లో సింగపూర్‌ నుంచి అత్యధిక (14.95 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులు వచ్చాయి. తర్వాతి స్థానాల్లో మారిషస్‌(8.34 బి. డాలర్లు), అమెరికా (5.45 బి. డాలర్లు), నెదర్లాండ్స్‌(4.62 బి.డాలర్లు), యూఏఈ(3.12 బి.డాలర్లు), జపాన్‌(2.47 బి.డాలర్లు), సైప్రస్‌(1.2 బి.డాలర్లు), యూకే(795 మిలియన్‌ డాలర్లు), జర్మనీ (469 మి.డాలర్లు), కైమన్‌ ఐస్‌లాండ్‌(371 మి.డాలర్లు) ఉన్నాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం(2023–24)తో నెదర్లాండ్స్, జపాన్, యూకే, జర్మన్‌ల నుంచి పెట్టుబడులు తగ్గాయి. రంగాల వారీగా చూస్తే... సర్వీసెస్, ఎగుమతి, టెలికమ్యూనికేషన్, ఆటోమొబైల్, నిర్మాణాభివృద్ధి, పునరుత్పాదక, రసాయన రంగాల్లో పెట్టుబడులు పెరిగాయి. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, నిర్మాణ కార్యకలాపాలు, ఫార్మాస్యూటికల్స్‌ రంగాల్లో పెట్టుబడులు తగ్గాయి. 2024–25లో అత్యధికంగా మహారాష్ట్ర (19.6 బి.డాలర్లు) ఎఫ్‌డీఐ పొందింది. తర్వాతి స్థానాల్లో కర్ణాటక (6.61 బి.డాలర్లు), న్యూఢిల్లీ (6 బి.డాలర్లు), గుజరాత్‌ (5.7 బి.డాలర్లు), తమిళనాడు (3.68 బి.డాలర్లు), హర్యానా (3.14 బి.డాలర్లు), తెలంగాణ (2.99 బి.డాలర్లు)లు ఉన్నాయి. కాగా గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏడాది ప్రాతిపదికన 24.5 శాతం తగ్గి 9.34 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. 2023–24 ఏడాది ఇదే త్రైమాసికంలో భారత్‌లోకి 12.38 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి.

Pahalgam Attack 770 from Delhi alone Deported to Bangladesh10
‘పహల్గామ్‌’ ఎఫెక్ట్‌: అక్రమ నివాసితుల ఏరివేత

న్యూఢిల్లీ: భారత్‌లో అక్రమంగా తలదాచుకుంటున్న విదేశీయులపై ప్రభుత్వం నిఘా మరింతగా పెంచింది. జమ్ముకశ్మీర్‌(Jammu and Kashmir)లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన అనంతరం ఈ చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌ నుంచి వచ్చి భారత్‌లో నివాసం కొనసాగిస్తున్న వారిపై సంబంధిత అధికారులు ఓ కన్నేసి ఉంచారు. వీరి చర్యలను గమనిస్తూ, నిందితులుగా తేలినవారిపై కొరఢా ఝుళిపిస్తున్నారు.మరోవైపు బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి పరిస్థితుల్లో పలువులు బంగ్లాదేశీయులు అక్రమంగా భారత్‌కు తరలివచ్చి, ఇక్కడ తలదాచుకుంటున్నారు. గడచిన 6 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న 770 మంది బంగ్లాదేశీయులను వారి దేశానికి తరలించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది మృతి చెందిన విషయం విదితమే. నాటి నుంచి ఇప్పటివరకూ పోలీసులు రాజధాని వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 470 మంది బంగ్లాదేశ్ వలసదారులను, మరో 50 విదేశీయులను గుర్తించారు, వారిలో బంగ్లాదేశకు చెందిన వారిని అగర్తలాకు విమానంలో తరలించి, భారత భూ సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్‌కు పంపించారు.బంగ్లాదేశ్‌(Bangladesh) నుంచి అక్రమంగా వచ్చిన వలసదారులను, రోహింగ్యాలను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ధృవీకరణ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించిందని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 2024, నవంబర్ 15, 2025 ఏప్రిల్ 20 మధ్య కాలంలో 220 మంది అక్రమ వలసదారులను, 30 మంది గడువు దాటి దేశంలోనే ఉంటున్న విదేశీయులను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారని సమాచారం. కాగా ‘పహల్గామ్‌’ ఘటన తర్వాత కొంత అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, వెరిఫికేషన్ డ్రైవ్‌లు నిర్వహించి, బంగ్లాదేశ్ వలసదారులను, రోహింగ్యాలను అదుపులోకి తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు అందాయని పోలీసులు తెలిపారు. మరోవైపు బంగ్లాదేశ్, మయన్మార్ నుండి వచ్చిన అక్రమ వలసదారుల ఆధారాలను ధృవీకరించడానికి రాష్ట్రాలకు 30 రోజుల గడువు ఇచ్చారు. వారి పత్రాలు ధృవీకరణ పొందకపోతే వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమ వలసదారుకు సౌకర్యాలు కల్పించి, వారు భారత్‌లో స్థిరపడటానికి ఏర్పాట్లు చేసిన వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశాయి.ఇది కూడా చదవండి: పాక్‌కు దమ్ము లేదు.. అందుకే ఉగ్రవాదులను పంపుతోంది: ప్రధాని మోదీ

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement