విజయగనరం: హుద్‌హుద్ తుఫాన్‌తో సంభవించిన నష్టాలు వంటివి పునరావృతం కాకుండా విశాఖ నగరంలో రూ.720 కోట్ల నిధులతో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ముత్యాలరాజు వెల్లడించారు. శనివారం విజయనగరం వచ్చిన ఆయన సంస్థ పరిధిలో నూతనంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనులను తెలిపారు.
నాలుగు ప్యాకేజీల కింద చేపట్టే ఈ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అమోదం లభించినట్లు పేర్కొన్నారు. మార్చిలో తొలి దశ పనులు ప్రారంభించి, 2018 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. అందరికీ విద్యుత్ పథకంలో భాగంగా రెండు డిస్కంల పరిధిలో మొత్తంగా 5 లక్షల విద్యుత్ సర్వీసులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.