విద్యుదాఘాతంతో మహిళ మృతి | Woman killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో మహిళ మృతి

Published Sat, Dec 5 2015 10:19 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

Woman killed by electric shock

రోడ్డు పక్క నుంచి వెళ్తున్న మహిళ ట్రాన్స్‌ఫార్మర్ తీగలు తగలడంతో విద్యుధ్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన విశాఖపట్నం తగరపువలసలోని భీమిలి వెళ్లే ర హదారి సమీపంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న దల్లి నిర్మల(25) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తొంది.

ఈ క్రమంలో ఈ రోజు భీమిలి రోడ్డుపై ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో ఉన్న కలప దుకాణం వద్ద రోడ్డు శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదకరంగా బయటకు వెళ్లి ఉన్న విద్యుత్ తీగలు తాకి అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలైందని ఆరోపిస్తూ.. స్థానికులు ఆందోళన చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement