cables
-
టెలికాం సేవల విస్తరణకు కొత్త ప్రాజెక్టులు
భారత్‌లో టెలికాం సేవలందించే ఎయిర్టెల్, జియోతోపాటు ఇతర దేశాల్లోని మెటా, సౌదీ టెలికాం, చైనా మొబైల్ వంటి కంపెనీలు కొత్తగా మూడు ప్రాజెక్ట్‌లను ప్రారంభించాలని యోచిస్తున్నాయి. ఇందులో భాగంగా సముద్రంలో కేబుల్స్ ఏర్పాటు చేసిన డేటాను సరఫరా చేయనున్నాయి. ‘2ఆఫ్రికా పిరల్స్’ అనే ప్రాజెక్ట్ ద్వారా 180 టెరాబిట్స్ పర్ సెకండ్(టీబీపీఎస్) సామర్థ్యంతో డేటాను సరఫరా చేయాలని ఎయిర్టెల్, మెటా, సౌదీ టెలికాం ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఆఫ్రికా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాలను ఈ ప్రాజెక్ట్ ద్వారా అనుసంధానం చేస్తున్నారు. ఇందులో భాగంగా సముద్రంలో మొత్తం 45,000 కిలోమీటర్లు పొడవున కేబుల్స్ ఏర్పాటు చేస్తారు.ఇదీ చదవండి: సెప్టెంబర్ 1 నుంచి ఆ మెసేజ్‌లు, కాల్స్ నిలిపివేత!ఇండియా-ఆసియా ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్ట్‌లో భాగంగా జియో, చైనా మొబైల్ సంస్థలు కలిసి 200 టీబీపీఎస్ కెపాసిటీతో 16,000 కి.మీ పొడవున సముద్రంలో కేబుల్ సిద్ధం చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ముంబయి, సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, శ్రీలంక దేశాల్లో సర్వీసులు అందిస్తారు. ఇండియా-యూరప్ ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్ట్ ద్వారా జియో, చైనా మొబైల్ కంపెనీలు 200 టీబీపీఎస్ కెపాసిటీతో 9,775 కి.మీ పొడవున కేబుల్స్ ఏర్పాటు చేస్తాయి. దీంతో ముంబయి, గల్ఫ్, యూరప్ ప్రాంతాల్లో సేవలందించనున్నాయి. ఇదిలాఉండగా, ఇప్పటికే ఎయిర్టెల్ కంపెనీ ఈ విధానం ద్వారా ఆఫ్రికాలో సేవలందిస్తోంది. -
ఫ్రాన్స్‌లో కమ్యూనికేషన్ లైన్ల ధ్వంసం
పారిస్: పారిస్‌లో ఒలింపిక్స్ ప్రారంభం రోజున శుక్రవారం రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించిన గుర్తు తెలియని దుండగులు..ఈసారి టెలీకమ్యూనికేషన్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో ఒలింపిక్స్ ఈవెంట్లు జరుగుతుండగా పలు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ కేబినెట్లలోని కేబుల్‌ను, సెల్‌ఫోన్, ల్యాండ్ లైన్లను దుండగులు ధ్వంసం చేసినట్లు ఫ్రాన్సు ప్రభుత్వం తెలిపింది. నష్టం తీవ్రత, ఒలింపిక్ కార్యక్రమాలపై ఏమేరకు ప్రభావం పడిందనే విషయాలను ప్రభుత్వం వెల్లడించలేదు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వరకు స్థానికంగా టెలీకమ్యూనికేషన్ సేవలకు అంతరాయం కలిగినట్లు మాత్రమే సంబంధిత మంత్రిత్వ శాఖ వివరించింది. పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు ఈ పరిణామంపై ఎటువంటి ప్రకటనా చేయలేదు. -
ఆర్ఆర్ కేబుల్ ఐపీవో బాట
న్యూఢిల్లీ: వైర్లు, కేబుళ్లుసహా ఎఫ్ఎంఈజీ ప్రొడక్టుల తయారీ కంపెనీ ఆర్ఆర్ కేబుల్ పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఉంది. ఇందుకు అనుగుణంగా వచ్చే మే నెలలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక దరఖాస్తును దాఖలు చేసే అవకాశముంది. ఆర్ఆర్ గ్లోబల్ గ్రూప్ కంపెనీ రానున్న మూడేళ్లపాటు ప్రతీయేటా టర్నోవర్‌ను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వెరసి 2026కల్లా రూ. 11,000 కోట్ల అమ్మకాలు అందుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ ఎండీ, గ్రూప్ ప్రెసిడెంట్ శ్రీగోపాల్ కాబ్రా తెలియజేశారు. 2023–24 మూడో త్రైమాసికంలో ఐపీవో చేపట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌టీవీ! -
గుడ్ క్యాచ్! ఆకాశం నుంచి పడిపోతున్న రాకెట్‌ని పట్టుకున్న హెలికాప్టర్!
US-based launch firm was partially successful: అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన రాకెట్‌ల్యాబ్ ప్రయోగ సంస్థ ఒక అత్యద్భుతమైన ప్రయోగాన్ని విజయవంతం చేసింది. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన ప్రయోగాలలో ఒక గొప్ప మైలురాయిని సాధించింది. అంతరిక్షంలోకి బహుళ ఉపగ్రహాలతో రాకెట్‌ని పంపే ఖర్చుని తగ్గించుకునేలా వాటిని తిరిగి భూమ్మీదకు తీసుకువచ్చేందుకు చేసిన ఒక ప్రయోగం అద్భుతమైన విజయాన్ని సాధించింది. అపర కుభేరుడు, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలెన్ మస్క్ ఈ రాకెట్ ల్యాబ్‌ని నిర్వహిస్తున్నారు. న్యూజిల్యాండ్‌లో బుధవారం ఉదయం 10.50 గంటలకు అంతరిక్షంలోని కక్ష్యలోకి 34 ఉపగ్రహాలను పంపడానికి బయలుదేరిన బూస్టర్ రాకెట్ ఆకాశంలో ఒకనొక దశలో కొంత ఎత్తుకు చేరుకున్న తర్వాత భూమ్మీద పడిపోబోతోంది. అదే సమయంలో న్యూజిలాండ్ తీరంలో సౌత్ పసిఫిక్‌కి సమీపంలో ఉన్న ఒక హెలికాప్టర్ రాకెట్‌ని పట్టుకునేందుకు 22 మైళ్ల దూరంలో ఒక పారాచూట్‌ని వదిలింది. హెలికాప్టర్ పారాచూట్, కేబుల్ వైర్ల సాయంతో ఆ రాకెట్‌ని పట్టుకుంది. ఆ తర్వాత ఆ రాకెట్ పసిఫిక్ మహా సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ మేరకు ఈ రాకెట్ ప్రయోగం పాక్షికంగా విజయవంతమైంది గానీ ఆ రాకెట్‌ని సముద్రంలో పడకుండా భూమ్మీదకు తేగలిగినట్లయితే పూర్తి స్థాయిలో విజయం సాధించనట్లు అని రాకెట్ ల్యాబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ బెక్ చెప్పారు. ఆ రాకెట్ సురక్షితంగా సముద్రంలోకి వెళ్లిందని, దాన్ని ఓడ సాయంతో తిరిగి తీసుకువస్తామని తెలిపారు. ఐతే ఆ బూస్టర్ రాకెట్ తిరిగి వినయోగించనుందా లేదా అనేది స్పష్టం చేయలేదు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. 🚁 This was the moment a helicopter caught a falling rocket booster before dropping it into the ocean https://t.co/sPxDJjhEtt pic.twitter.com/I00r9G014L — Reuters (@Reuters) May 3, 2022 This is what it looked like from the front seats. pic.twitter.com/AwZfuWjwQD — Peter Beck (@Peter_J_Beck) May 3, 2022 (చదవండి: నేనేం రోబోను కాదు.. నాకూ ఫీలింగ్స్ ఉన్నాయి: ఎలన్ మస్క్) -
టెల్కోల ధరల పోరుకు తెర!
న్యూఢిల్లీ: కొన్నాళ్లుగా హోరాహోరీ పోరులో గణనీయంగా టారిఫ్‌లను తగ్గించాల్సి వచ్చి తీవ్రంగా దెబ్బతిన్న టెలికామ్ కంపెనీలు... క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరునాటికి టెలికం మార్కెట్లో స్థిరత్వం, హేతుబద్ధత తిరిగి రాగలదన్న అంచనాలు ఏర్పడుతున్నాయి. పరస్పరం దెబ్బతీసుకునే చార్జీల విధానానికి స్వస్తి చెప్పి..లాభాలు, ఆదాయాలు పెంచుకోవడానికి టెల్కోలు కొత్త మార్గాలను అన్వేషిస్తుండటం ఇందుకు దోహదపడుతుందని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ అంచనా వేస్తోంది. ‘ధరల విషయంలోనూ, ఇతర సంస్థల కస్టమర్లను తమవైపు తిప్పుకోవడంలోనూ కొన్నాళ్లుగా మార్కెట్ పరిస్థితి అసంబద్ధంగా మారింది. అయితే, క్రమంగా మార్కెట్లో స్థిరత్వం, హేతుబద్ధత తిరిగి వస్తాయని ఆశిస్తున్నాం‘ అని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీవోఏఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ చెప్పారు. ‘పరిశ్రమపరంగా చూస్తే పోటాపోటీగా టారిఫ్‌లు తగ్గించడం మొదలుకుని అత్యంత దారుణ పరిస్థితులన్నీ ఈ మధ్య కాలంలో చూడటం జరిగింది. నిధుల సమీకరణలో సవాళ్ల వల్ల మార్కెట్ క్రమంగా స్థిరపడుతున్నట్లుగా కనిపిస్తోంది. గతం ఎంత దుర్భరంగా ఉండేదనేది పక్కన పెట్టి భవిష్యత్‌పై సానుకూల దృక్పథంతో పరిశ్రమ ముందుకెడుతోంది‘ అని మాథ్యూస్ చెప్పారు. కొత్త మార్గాలవైపు దృష్టి.. ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు ఆదాయాలు, లాభాల తగ్గుదలకు అడ్డుకట్ట వేసేందుకు టెలికం సంస్థలు మరిన్ని కొత్త మార్గాల వైపు దృష్టి పెడుతున్నాయని మాథ్యూస్ చెప్పారు. కంటెంట్, ఈ–కామర్స్, ఆర్థిక సేవలు మొదలైనవన్నీ కూడా అందించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ‘గడిచిన 5–6 త్రైమాసికాలుగా ఆదాయాలు, లాభదాయకత తగ్గడాన్ని చూశాం. దీనికి అడ్డుకట్ట పడొచ్చు. వ్యక్తిగతంగానైతే... ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికల్లా ఆదాయాల క్షీణతకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నాను‘ అని ఆయన చెప్పారు. ఆశావహంగా టెల్కోల ఫలితాలు అసాధారణ ఆదాయం ఊతంతో గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో అనూహ్యంగా లాభంలో 29 శాతం వృద్ధితో టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ అందర్నీ ఆశ్చర్యపర్చింది. రిలయన్స్ జియో రాకతో తీవ్రంగా దెబ్బతిన్న ఎయిర్టెల్.. జనవరి– మార్చి త్రైమాసికంలో రూ. 107.2 కోట్ల నికర లాభం ఆర్జించింది. పలు త్రైమాసికాల తర్వాత లాభంలో వృద్ధి నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక కంపెనీ ఆదాయం కూడా 6.2 శాతం ఎగిసి రూ.20,602.2 కోట్లకు పెరిగింది. మరోవైపు, రిలయన్స్ జియో నికర లాభం 64.7 శాతం పెరిగి రూ.840 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో జియో లాభం రూ. 510 కోట్లు. 2018–19 నాలుగో త్రైమాసికంలో జియో నిర్వహణ ఆదాయం 55.8 శాతం పెరిగి రూ. 11,106 కోట్లకు చేరింది. అంతక్రితం సంవత్సరం ఇదే వ్యవధిలో నిర్వహణ ఆదాయం రూ. 7,128 కోట్లు. మరో టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా మే 13న ఆర్థిక ఫలితాలు వెల్లడించనుంది. ఎయిర్టెల్ సిగ్నల్: ఫిచ్ న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ మార్చి క్వార్టర్ నికర లాభం 29 శాతం వృద్ధి చెందడం ఆధారంగా చూస్తే.. ఈఏడాదిలో దేశీ మొబైల్ రంగ ఆదాయం 5–10 శాతం మేర పెరిగేందుకు అవకాశం ఉందని ఫిచ్ రేటింగ్స్ అంచనావేసింది. ఈ రంగంలోని టాప్–3 కంపెనీలు లాభదాయకత వైపు దృష్టిసారించేందుకు ఆస్కారం ఉండగా.. వీటి మార్కెట్ వాటా ప్రతి కంపెనీకి 30–33 శాతం మధ్య ఉండనుందని అంచనాకట్టింది. ఈ సంస్థల మధ్య కొనసాగుతున్న పోటీతత్వం ఇక నుంచి నెమ్మదిగా తగ్గిపోయి.. డేటా టారిఫ్ పెరిగేందుకు ఆస్కారం ఉంది. ఒక్కో ఖాతాదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) నెలకు 10–20 శాతం వృద్ధి చెంది 1.6–1.7 డాలర్లకు చేరుతుందని అంచనావేసింది. -
హైదరాబాద్: ఐటీ కంపెనీలకు ఇంటర్నెట్ కట్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ స్తంభాలకు ఉండే ఇంటర్ నెట్ కేబుల్స్‌ను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించడంతో పలు ఐటీ కంపెనీలలో నెట్‌సేవలు నిలిచిపోయాయి. గచ్చిబౌలి డీఎల్ఎఫ్ ఐటీ కారిడార్‌కు అనుకొని ఉన్న జయభేరి ఎన్‌క్లేవ్‌లోని ఖాళీ స్థలంలో పెట్ పార్కును నిర్మిస్తున్నారు. పెట్ పార్కు ముందు కరెంట్ స్తంభాలకు ఇంటర్ నెట్ వైర్లు ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం శేరిలింగంపల్లి వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన, శేరిలింగంపల్లి సర్కిల్ –20 ఉప కమిషనర్ వి.మమత పెట్ పార్కును సందర్శించారు. అదే సమయంలో వెస్ట్ జోనల్ ఎలక్ట్రికల్ విభాగం సిబ్బంది క్రేన్ సహాయంతో స్తంభాలకు ఉన్న ఇంటర్ నెట్ కెబుల్ వైర్లను తొలగించారు.ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇంటర్ నెట్ కేబుల్స్ తొలగించారని ఐటీ కంపెనీ ప్రతినిధులు వాపోయారు. ఈ విషయంపై మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. స్తంభాలను మార్చుతున్నాం... కొద్ది రోజుల్లోనే పెట్ పార్కు ప్రారంభం కానుందని, ఈ క్రమంలో పార్కును అనుకొని ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాల్సి ఉందన్నారు. దీనిలో భాగంగా స్తంభాలకు ఉన్న కెబుళ్లను ముందుగా తొలగించామని తెలిపారు. స్తంభాలకు కెబుల్ పెట్టిన వారు ఎలాంటి అనుమతి పొందలేదన్నారు. అనుమతి తీసుకుంటే మళ్లీ కెబుళ్లను పునరుద్ధరించేందుకు అవకాశమిస్తామని అన్నారు. – జోనల్ కమిషనర్ హరిచందన -
‘రికార్డు’ కరెంటు!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో విద్యుత్ వినియోగం రికార్డుస్థాయిలో నమోదైంది. ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవడంతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్ల వినియోగం అనూహ్యంగా పెరిగింది. గత రెండురోజుల నుంచి విద్యుత్ వినియోగం రెట్టింపైంది. గతేడాది ఇదే సీజనల్లో 60 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగం నమోదు కాగా, ఈ ఏడాది మార్చి 28న 61 మిలియన్ యూనిట్లు నమోదైంది. తాజాగా బుధవారం 62.5 మిలియన్ యూనిట్లు నమోదైంది. డిస్కం చరిత్రలో విద్యుత్ వినియోగం ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి. రోజురోజుకు పెరుగుతున్న ఈ విద్యుత్ డిమాండ్ వల్ల ఒత్తిడిని తట్టుకోలేక అండర్ గ్రౌండ్ కేబుళ్లు కాలిపోతుండగా, సబ్స్టేషన్లలోని ఫీడర్లు తరచూ ట్రిప్పవుతున్నాయి. ముఖ్యంగా పీక్ అవర్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉత్పన్నం అవుతోంది. సాధారణంగా వాతావరణంలో తేమ 50 శాతం ఉండాల్సి ఉంది. కానీ గురువారం 36 శాతమే నమోదైంది. గతవారంతో పోలిస్తే నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ.. వాతవరణంలో తేమశాతం తక్కువగా నమోదు అవుతుండటం వల్ల ఉక్కపోత ఉంటుంది. ఈ ఉక్కపోతను తట్టుకోలేక వినియోగదారులు రోజంతా ఏసీలోనే గడుపుతుండటమే వినియోగం పెరగడానికి కారణమని డిస్కం ప్రకటిస్తుంది. ట్రిప్పవుతున్న ఫీడర్లు.. నిలిచిపోతునన్న సరఫరా చంపాపేట్ సర్కిల్ నందనవనం సబ్‌స్టేషన్ పరిధిలోని శ్రీరమణ కాలనీ ఫీడర్ ఓవర్‌లోడ్ వల్ల గత నాలుగైదు రోజుల నుంచి రోజుకు నాలుగైదుసార్లు ట్రిప్పవుతుంది. ఫలితంగా తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. రంగారెడ్డి నార్త్ సర్కిల్ పరిధిలోని కూకట్పల్లి సబ్‌డివిజన్ సబ్‌స్టేషన్ జివికాస్ సబ్‌స్టేషన్ కోకకోలా ఫీడర్ పరిధిలో యూజీ కేబుల్ దగ్ధమైంది. దీంతో ఆ ఫీడర్ పరిధిలోని కాలనీల్లో రెండు గంటల పాటు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. కందికల్‌గేట్ సబ్‌స్టేషన్ ఆషామాబాద్ ఫీడర్ పరిధిలో ఆర్ఎంయూలో సాంకేతికలోపం తలెత్తడం వల్ల సుమారు గంటన్నర పాటు సరఫరా నిలిచిపోయింది. ఆస్మాన్‌ఘడ్ డివిజన్లోని చంచల్‌గూడ సబ్‌స్టేషన్ ఆనందర్‌నగర్ ఫీడర్ ఏబీస్విచ్ సహా జంపర్ కట్ అయింది. ఫలితంగా ఆయా కాలనీల్లో గంటకు పైగా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. చార్మినార్ డివిజన్ కిలావత్సబ్స్టేషన్ పరిధిలోని టెలిఫోన్ ఎక్సే్చంజ్ సమీపంలో కేబుల్ ఫాల్ట్ వల్ల రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతకు తోడు విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరగడంతో ఒత్తిడి తట్టుకోలేక ఫీడర్లు తరచూ ట్రిప్పవుతున్నాయి. ఫలితంగా ఆయా ఫీడర్ల పరిధిలోని కాలనీలు అర్థరాత్రి అంధకారంలో మగ్గాల్సి వస్తుంది. అసలే ఉక్కపోత..ఆపై ఇంట్లో ఫ్యాన్లు కూడా తిరుగక పోవడంతో దోమలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గ్రేటర్లో విద్యుత్ వినియోగదారుల సంఖ్య ఇలా 2006 24.12 లక్షలు 2010 29.75 లక్షలు 2013 34 లక్షలు 2015 38 లక్షలు 2016 40 లక్షలు 2018 51 లక్షలు విద్యుత్ డిమాండ్ ఇలా.... 2006లో 1538 మెగావాట్లు 2010లో 1881 2013లో 2000 21015 2300 2017 2600 2018 2900 -
రష్యా ఆ పనిచేస్తే! భయంతో వణుకుతున్న బ్రిటన్!!
లండన్ : కమ్యూనిస్ట్ దేశమైన రష్యాను తలుచుకుని బ్రిటన్ భయపడుతోంది. ప్రధానంగా సముద్ర జలాల్లో ఉన్న కేబుల్స్‌కు రష్యా ఎక్కడ సమస్యలు తీసుకువస్తుందన్న భయంలో బ్రిటన్ ఆర్మీ ఉంది. సముద్ర జలాల్లోరి కేబుల్స్ రష్యా తెంచేస్తే.. బ్రిటన్ అత్యంత తీవ్రమైన ప్రమాదంలో పడుతుందని బ్రిటన్ ఎయిర్ చీఫ్ మార్షల్ సర్ స్టువర్ట్ పీచ్ ఆందోళన వ్యక్తం చేశారు. అది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు. రష్యా ప్రపంచంపై సమాచార యుద్ధానికి దిగే అవకాశం ఉందని.. దాని ప్రభావం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయని ఆయన చెప్పారు. రష్యా నేవీ పూర్తిస్థాయిలో ఆధునీకరించడం ప్రమాద సంకేతాలను పంపుతోందని ఆయన అన్నారు. ప్రధానంగా న్యూక్లియర్, సంప్రదాయ యుద్ధనౌకలు, సబ్‌మెరైన్స్ అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణిస్తున్నాయని చెప్పారు. భవిష్యత్‌లో సమాచార వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేయడం కూడా యుద్ధంలో భాగమవుతుందని ఆయన చెప్పారు. -
కాల సర్పాలై..కాటేస్తున్న విద్యుత్ తీగలు
♦ అడుగడుగునా ఆపదే ♦ ఈ ఏడాది 245 మంది మృత్యువాత ♦ దాదాపు 4.5 లక్షల కిలోమీటర్ల ♦ మేర వేలాడుతున్న విద్యుత్తు తీగలు ♦ వేలాడే వైర్లు, ఎర్తింగ్లోపాలు, ♦ రక్షణలేని ట్రాన్స్పార్మర్లే అధికం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నిశీధి వేళ వెలుగులు చిమ్మాల్సిన కరెంటు.. డొంక ‘దారి కాచి’ కాలనాగై కాటేస్తోంది. పచ్చని సంసారాల్లో కార్చిచ్చును రేపుతోంది. ఏళ్ల కేళ్లుగా ఆలనా పాలనా లేక గాలికి వదిలేసిన విద్యుత్తు తీగలు ఇళ్ల మీద, ఊరు బయట, పంట పొలాల్లో సిబ్బి తీగల్లా అల్లుకుపోయి కాళ్లకు చుట్టకుంటున్నాయి. జిల్లాలో ఏడాదికి సగటున 245 మంది విద్యుత్తు కాటుకు బలైపోతున్నారు. ఎప్పుడో స్వాతంత్య్రం వచ్చిన కొత్తలోనో.. అనంతర కాలంలోనో బిగించిన విద్యుత్తు లైన్లను మళ్లీ ఇప్పటి వరకు పునరుద్ధరించకపోవటంతో నిత్యం ఏదో ఒక చోట అమాయకులను బలి తీసుకుంటూనే ఉన్నాయి. దేగుల్ వాడీ తండాలో అర్ధరాత్రి వేళ సంభవించిన విద్యుదాఘాతం సంఘటనతో మెతుకుసీమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన అధికారులకు కనువిప్పు కావాలి. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా దిద్దిబాటు చర్యలు చేపట్టాలి. కరెంటు చావులు కొత్త కాదు. జిల్లాలో నిత్యం జరిగే తంతే. కానీ ఎవరికీ పట్టదు. ఎందుకంటే చనిపోతున్నది బక్క రైతులు..బడుగు జీవులు.. గిరిజనులు. వీరి చావులంటే విద్యుత్తు శాఖకు లెక్కేలేదు. స్థానికంగా దొరికే ఏఈనో.. జేఈనో తీగలు వేలాడుతున్నాయి అని అడిగితే ‘ మేమేం చేయాలి.. ముందు నీ కరెంటు బకాయిలు కట్టు’ అనే బెదిరింపులు. విద్యుత్తు స్తంభం వంగిపోయానా.. కరెంటు తీగలు కిందకు వేలాడుతున్న... ట్రాన్స్ ఫార్మర్ ఫ్యూజ్ పోయినా... ఒక్క లైన్మెన్ గాని, హెల్పర్ గాని వచ్చి సహాయం చేయరు. ప్రాణాలను కరెంటు తీగలకు వదిలేసి రైతులే వాటిని రిపేర్ చేసుకోవాలి. కంగ్టి మండలం దెవ్లా తండాలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ప్రమదం విద్యుత్‌శాఖ అధికారుల లోపాలను ఎత్తిచూపుతోంది. రోడ్డుకు అడ్డంగా విద్యుత్ తీగలు వేలాడటం, తండావాసులు పలుమార్లు విద్యుత్ అధికారులకు తెలిపినా దీనిగూర్చి పట్టించుకోక పోవటంతోనే ప్రమాదం జరిగిందని బాధిత గిరిజనులు చెప్పడం గమనార్హం. ఓ లారీసైతం వైర్లకిందనుంచి వెళ్ళలేని స్థితిలో వైర్లు వేలాడుతున్నా.. విద్యుత్తు అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. వీళ్ల నిర్లక్ష్యానికి 2015-16లో 245 కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి బజారున పడ్డాయి. టీఎస్ ట్రాన్స్‌కో నివేదికల ప్రకారమైతే ఈ లెక్క 112 మాత్రమే. మరణాలు చూపించడంలోనూ మోసమే. ఒక విద్యుత్తు మరణాన్ని ధ్రువీకరించడానికి సవాలక్ష కొర్రీలు. ఇష్టపరిహారం ఇవ్వడానికి రోజుల కొద్ది జాప్యం చేయడం. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 33 మందికి మాత్రమే పరిహారం చెల్లించారు. జిల్లాలో 3.07 లక్షల కిలోమీటర్లలో ఎల్టీ లైన్, 1.32 లక్షల కిలో మీటర్లలో 11 కేవీ లైన్స్, 19 వేల కిలో మీటర్ల 32 కేవీ లైన్, 158.9 కిలో మీటర్ల హైటెన్షన్ వైర్లు ఉన్నాయి. ఈ లెక్కన కరెంటు తీగలు సిబ్బి తీగల మాదిరిగా జిల్లాను చుట్టేశాయి. ఇందులో కేవలం 158.9 కిలో మీటర్ల మేరకు ఉన్న హైటెన్షన్ వైర్లు మాత్రమే కాస్తో కూస్తో పతిష్టంగా ఉన్నాయి. మిగిలిన లైన్లు అన్ని కూడా దాదాపు 35 నుంచి 40 ఏళ్ల కిందట వేసిన లైన్లే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ట్రాన్స్‌కో అధికారులు చేసిన సర్వే ప్రకారం ఎల్టీ, 11కేవీ, 32 కేవీ లైన్ల కాలం తీరిపోయి బాగా సాగినట్టు గుర్తించారు. సాధారణంగా గ్రామాల్లో వేసే విద్యుత్తు లైన్లు 8 మీటర్ల ఎత్తులో, పట్టణ ప్రాంతాల్లో 9 నుంచి 11 మీటర్ల ఎత్తులో లైన్లు ఉండాలి. కానీ ఈ విద్యుత్తు తీగలు నిర్ధిష్ట ఎత్తు నుంచి దాదాపు మూడు నుంచి 6 మీటర్ల వరకు సాగి కిందికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వ్యవసాయ క్షేత్రాల్లో భూమికి కేవలం రెండు గజాల దూరంలో వేలాడుతున్న తీగలను కూడా ట్రాన్స్‌కో అధికారులే గుర్తించారు. కాని వాటిని ఇప్పటి వరకు సరి చేయకపోవటం గమనార్హం. కరెంటు చావుల అడ్డా... నారాయణఖేడ్ నియోజకవర్గంలో విద్యుత్తు మరణాలు ఎక్కువ. జిల్లాలో ఎక్కడా లేని విధంగా నారాయణఖేడ్ నియోజకవర్గం విద్యుత్షాక్లకు, విద్యుత్ ప్రమాదాలకు నిలయంగా మారింది. గడిచిన నాలుగేళ్లలో ఇక్కడ దాదాపు 70 మంది మరణించారు. నర్సాపూర్‌లోనూ అదే తంతు శివ్వంపేట మండలంలోని అల్లీపూర్‌కు చెందిన సాయిలు సుమారు ఆరు నెలల క్రితం తన ఇంటి బాల్కనీ వద్ద బట్టలు ఆరెస్తుండగా ఇంటిని ఆనుకుని ఉన్న కరెంటు వైర్లు తగిలి షాక్ కొట్టి అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఆరు నెలలు గడుస్తున్నా ప్రాణం తీసిన వైర్లను అధికారులు ఇంత వరకు సరిచేయకపోవడం గమనార్హం. జహీరాబాద్‌లో అదే అలజడి ♦ ఏడాది క్రితం సదాశివపేటకు చెందిన అభిలాష్ (25) ఝరాసంగంలోని బంధువు ఇంటికి వచ్చి విద్యుత్ తీగలకు బలయ్యాడు. ♦ మహీంద్రా కాలనీలో విద్యుత్ తీగలు తగిలి ఒక వ్యక్తి మరణించగా, ఒక బాలుడు గాయపడ్డాడు. ♦ కోహీర్ పట్టణ సమీపంలో గత సంవత్సరం ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మరణించాడు. ♦ ఇక మూగజీవాలకు లెక్కేలేదు. మనియార్‌పల్లి మాణిక్యనాయక్ తండాలో ఇళ్ల మధ్యన ఉన్న ప్రమాదకర ట్రాన్స్‌ఫార్మకు తగులుకొని ఏడు, బిలాల్పూర్ గ్రామ శివారులో మూడు, కోహీర్ పట్టణ పరిధిలో మూడు, కవేలి సమీపంలో రెండు, రాజనెల్లి సమీపంలో విద్యుత్ తీగెలకు తగులుకొని ఒక పశువు మరణించింది. ♦ న్యాల్కల్ మండలంలోని గుంజోటి, మల్గి, చాల్కి, తాటిపల్లి, శంశల్లాపూర్, హూసెళ్లి, గణేష్‌పూర్ గ్రామాల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. వాటిని పైకి లేపి సరి చేసే విషయంలో ఎవరూ పట్టించుకోవడం లేదు. ‘ఆందోళ’నలోనే .. అందోలు నియోజకవర్గం పరిధిలోని అందోలు, రాయికోడ్, అల్లాదుర్గం, టేక్మాల్, మునిపల్లి, పుల్కల్ మండలాల్లో విద్యుత్ తీగలు తెగిపడి పోవడం వల్ల కొన్ని చోట్ల మనుషుల ప్రాణానికి నష్టం కలుగగా, మరికొన్ని చోట్ల మూగ జీవాలు మృత్యువాతకు గురయ్యాయి. అందోలు మండలంలోని సాయిబాన్‌పేట, రాయికోడ్ మండలంలో ఒక ఆపరేటర్, పుల్కల్ మండలం ఇసోజిపేట గ్రామాల్లో తెగిపడిన విద్యుత్ తీగలకు బలయ్యారు. అందోలు, పుల్కల్, రాయికోడ్, మునిపల్లి ప్రాంతాల్లో సుమారు 50 పశువులు కరెంటు షాక్‌తో అక్కడికక్కడే మరణించాయి. -
'విశాఖలో భూగర్భ విద్యుత్ వ్యవస్థ'
విజయగనరం: హుద్‌హుద్ తుఫాన్‌తో సంభవించిన నష్టాలు వంటివి పునరావృతం కాకుండా విశాఖ నగరంలో రూ.720 కోట్ల నిధులతో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ముత్యాలరాజు వెల్లడించారు. శనివారం విజయనగరం వచ్చిన ఆయన సంస్థ పరిధిలో నూతనంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనులను తెలిపారు. నాలుగు ప్యాకేజీల కింద చేపట్టే ఈ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అమోదం లభించినట్లు పేర్కొన్నారు. మార్చిలో తొలి దశ పనులు ప్రారంభించి, 2018 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. అందరికీ విద్యుత్ పథకంలో భాగంగా రెండు డిస్కంల పరిధిలో మొత్తంగా 5 లక్షల విద్యుత్ సర్వీసులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.