భారత్‌లో టెలికాం సేవలందించే ఎయిర్‌టెల్, జియోతోపాటు ఇతర దేశాల్లోని మెటా, సౌదీ టెలికాం, చైనా మొబైల్ వంటి కంపెనీలు కొత్తగా మూడు ప్రాజెక్ట్‌లను ప్రారంభించాలని యోచిస్తున్నాయి. ఇందులో భాగంగా సముద్రంలో కేబుల్స్ ఏర్పాటు చేసిన డేటాను సరఫరా చేయనున్నాయి. ‘2ఆఫ్రికా పిరల్స్’ అనే ప్రాజెక్ట్ ద్వారా 180 టెరాబిట్స్ పర్ సెకండ్(టీబీపీఎస్) సామర్థ్యంతో డేటాను సరఫరా చేయాలని ఎయిర్‌టెల్, మెటా, సౌదీ టెలికాం ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఆఫ్రికా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాలను ఈ ప్రాజెక్ట్ ద్వారా అనుసంధానం చేస్తున్నారు. ఇందులో భాగంగా సముద్రంలో మొత్తం 45,000 కిలోమీటర్లు పొడవున కేబుల్స్ ఏర్పాటు చేస్తారు.
ఇదీ చదవండి: సెప్టెంబర్ 1 నుంచి ఆ మెసేజ్‌లు, కాల్స్ నిలిపివేత!
ఇండియా-ఆసియా ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్ట్‌లో భాగంగా జియో, చైనా మొబైల్ సంస్థలు కలిసి 200 టీబీపీఎస్ కెపాసిటీతో 16,000 కి.మీ పొడవున సముద్రంలో కేబుల్ సిద్ధం చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ముంబయి, సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, శ్రీలంక దేశాల్లో సర్వీసులు అందిస్తారు. ఇండియా-యూరప్ ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్ట్ ద్వారా జియో, చైనా మొబైల్ కంపెనీలు 200 టీబీపీఎస్ కెపాసిటీతో 9,775 కి.మీ పొడవున కేబుల్స్ ఏర్పాటు చేస్తాయి. దీంతో ముంబయి, గల్ఫ్, యూరప్ ప్రాంతాల్లో సేవలందించనున్నాయి. ఇదిలాఉండగా, ఇప్పటికే ఎయిర్‌టెల్ కంపెనీ ఈ విధానం ద్వారా ఆఫ్రికాలో సేవలందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment