లండన్ : కమ్యూనిస్ట్ దేశమైన రష్యాను తలుచుకుని బ్రిటన్ భయపడుతోంది. ప్రధానంగా సముద్ర జలాల్లో ఉన్న కేబుల్స్‌కు రష్యా ఎక్కడ సమస్యలు తీసుకువస్తుందన్న భయంలో బ్రిటన్ ఆర్మీ ఉంది. సముద్ర జలాల్లోరి కేబుల్స్ రష్యా తెంచేస్తే.. బ్రిటన్ అత్యంత తీవ్రమైన ప్రమాదంలో పడుతుందని బ్రిటన్ ఎయిర్ చీఫ్ మార్షల్ సర్ స్టువర్ట్ పీచ్ ఆందోళన వ్యక్తం చేశారు. అది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు.
రష్యా ప్రపంచంపై సమాచార యుద్ధానికి దిగే అవకాశం ఉందని.. దాని ప్రభావం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయని ఆయన చెప్పారు. రష్యా నేవీ పూర్తిస్థాయిలో ఆధునీకరించడం ప్రమాద సంకేతాలను పంపుతోందని ఆయన అన్నారు. ప్రధానంగా న్యూక్లియర్, సంప్రదాయ యుద్ధనౌకలు, సబ్‌మెరైన్స్ అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణిస్తున్నాయని చెప్పారు. భవిష్యత్‌లో సమాచార వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేయడం కూడా యుద్ధంలో భాగమవుతుందని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment