undersea internet cables
-
సముద్ర గర్భంలో సవాల్! ఇంటర్నెట్ కేబుళ్లపై పెత్తనానికి అమెరికా, చైనా ఢీ
అమెరికా, చైనా ఆధిపత్య పోరు ఇప్పుడు సముద్ర గర్భంలోకి చేరింది. సమాచార విప్లవ వారధులైన సముద్రంలోని ఇంటర్నెట్ కేబుళ్లపై పెత్తనానికి ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఫోన్లు, వీడియో చాట్లు, ఈ మెయిల్స్.. ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థకు మూలం ఇంటర్నెట్. సముద్రాల్లో ఏర్పాటుచేసిన దాదాపు 9 లక్షల మైళ్ల ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారానే ప్రపంచంలోని 95 శాతం డాటా అనుక్షణం ట్రాన్స్ఫర్ అవుతోంది. ఇప్పుడా కేబుల్ వ్యవస్థలే అమెరికా, చైనా మధ్య సముద్రంలో మంటలు రేకెత్తించాయి. రెండు అగ్రరాజ్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికీ ఆయుధాలవుతున్నాయి. చాలాకాలంగా ఈ సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ అమెరికా కంపెనీల చేతుల్లో సాగుతోంది. తాజాగా... చైనాకు చెందిన కన్సార్షియం రంగంలోకి దిగటంతో సమస్య మొదలైంది. ఆసియా, పశ్చిమాసియా, ఐరోపాలను కలుపుతూ సింగపూర్ నుంచి ఫ్రాన్స్ వరకూ సాగే సముద్ర గర్భ కేబుల్‌లైన్ వేయడానికి అమెరికాకు చెందిన సబ్కామ్ కన్సార్షియానికి పోటీగా ముందుకొచ్చింది చైనా కంపెనీ హెచ్ఎంఎన్ టెక్ కేబుల్ నెట్వర్క్. హెచ్ఎంఎన్ కన్సార్షియంలో వివిధ దేశాల కంపెనీలతో పాటు చైనా టెలికాం దిగ్గజం హువావే కూడా ఉండటం వివాదానికి దారితీసింది. అయితే.. సబ్‌సీ ఇంటర్నెట్ కేబుల్ వ్యవస్థ చైనా చేతుల్లోకి వెళ్లకుండా బలంగానే పావులు కదిపింది అమెరికా. బైడెన్ ప్రభుత్వం పరోక్షంగా రంగంలోకి దిగి కన్సార్షియంలోని కంపెనీలను దారిలోకి తేవడం మొదలుపెట్టింది. సర్కారు ఒత్తిడితో కన్సార్షియంలోని వివిధ దేశాల కంపెనీలు అమెరికన్ సంస్థ సబ్కామ్వైపే మొగ్గు చూపాయి. దీంతో చైనా హెచ్ఎంఎన్ నెట్వర్క్ పోటీ నుంచి వైదొలిగింది. ప్రాజెక్టు సబ్కామ్కే దక్కింది. చైనాపై అమెరికా అనుమానాలు ఆసియా, పశ్చిమాసియా, ఐరోపాలను కలుపుతూ సింగపూర్ నుంచి ఫ్రాన్స్ వరకూ సాగే సముద్ర గర్భ కేబుల్‌లైన్ వేయడానికి అమెరికాకు చెందిన సబ్కామ్ కన్సార్షియానికి పోటీగా ముందుకొచ్చింది చైనా కంపెనీ హెచ్ఎంఎన్ టెక్ కేబుల్ నెట్వర్క్. హెచ్ఎంఎన్ కన్సార్షియంలో వివిధ దేశాల కంపెనీలతోపాటు చైనా టెలికాం దిగ్గజం హువావే కూడా ఉండటం వివాదానికి దారితీసింది. చైనా ప్రభుత్వం, కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థగా పేర్కొంటూ... 5జీ నెట్వర్క్ ఏర్పాటులోనూ ఈ కంపెనీని అమెరికాతోపాటు అనేక యూరప్ దేశాలు దూరం పెట్టాయి. సమాచారం అంతటినీ ఈ కంపెనీ చైనా ప్రభుత్వంతో పంచుకుంటుందనేది ఆరోపణ. తాజాగా సముద్ర గర్భంలోని ఇంటర్నెట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వ్యవస్థపైనా హువావే రూపంలో చైనా ప్రభుత్వం నిఘా పెట్టబోతోందన్నది అమెరికా వాదన. ఈ కేబుళ్ల ద్వారా ప్రసారమయ్యే డేటాను, అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలను, మిలిటరీ సమాచారాన్ని... చైనా ప్రభుత్వం గుప్పిట పెట్టుకునే ప్రమాదముంది అంటోంది. చైనా కంపెనీలు సైబర్, టెలికాం నెట్వర్క్ ద్వారా నిఘా వేస్తున్నాయనేది అగ్రరాజ్యం అనుమానం. గతంలో అమెరికా కంపెనీలు చైనా టెలికాం పరికరాలు వాడటానికి వీలుండేది. 2021 తర్వాత నుంచి దేశ భద్రతకు ముప్పంటూ చైనా టెలికాం పరికరాలకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఉపసంహరించింది. అంతేగాకుండా చైనా టెలికాం కంపెనీలు అమెరికాగడ్డపై నుంచి కార్యకలాపాలు నిర్వహించకుండా నిషేధం కూడా విధించింది. తాజాగా సామదానభేద దండోపాయాలను ప్రయోగించి.. ఆసియా-ఐరోపా ఇంటర్నెట్ కేబుల్ లైన్ ప్రాజెక్టు నుంచి చైనా కంపెనీలను తప్పించి.. తమ దేశ కంపెనీకి కట్టబెట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. Successful U.S. gov. campaign helped US’s SubCom beat China’s HMN Tech to win a $600M contract to build prized SeaMeWe-6 submarine optic cable. Washington pressured foreign countries to shun HMN Tech. It’s one of at least 6 private undersea cable deals in the Asia-Pacific + pic.twitter.com/tWapOm7QXf — Ephemeral (@yawahuguama) March 24, 2023 ఇదీ చదవండి: గాల్లో డబుల్ డెక్కర్: భలే డిజైన్ చేశారు.. ఫొటో వైరల్ -
ఆప్రికాట్ ప్రాజెక్టు కోసం జతకట్టిన గూగుల్, ఫేస్బుక్
తూర్పు ఆసియాలోని ఆరు దేశాలను కలుపుతూ వేల మైళ్లు సముద్రగర్భంలో ఇంటర్నెట్ కేబుల్ వేయడానికి గూగుల్ కొత్త ప్రాజెక్టు చేపట్టింది. "ఆప్రికాట్" అని పిలువబడే ఈ ప్రాజెక్ట్ జపాన్, తైవాన్, గువామ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, సింగపూర్ దేశాలను అనుసంధానం చేస్తుంది. ఆప్రికాట్ ప్రాజెక్టులో భాగంగా సముద్రగర్భంలో 12,000 కిలోమీటర్లు (7,456 మైళ్ళు) కేబుల్ వేయనున్నట్లు గూగుల్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ వ్యవస్థ 2024లో అందుబాటులోకి వస్తుంది అని తెలిపింది. ఫేస్బుక్ కూడా కేబుల్ వ్యవస్థకు పాక్షికంగా నిధులు సమకూరుస్తుంది. అలాగే, ప్రాంతీయ టెలికామ్ ప్రొవైడర్ల నుంచి కూడా గూగుల్ నిదులు సేకరిస్తుంది. ఫేస్బుక్, గూగుల్ రెండూ కలిసి ఇప్పటికే వేలాది మైళ్ల సముద్రగర్భంలో ఇంటర్నెట్ కేబుల్ ను వేశాయి. ఇంకా వేలాది మైళ్లు ఇంటర్నెట్ కేబుల్ వేసేందుకు సిద్దం అవుతున్నాయి. యుఎస్ ఈస్ట్ కోస్ట్, అర్జెంటీనాను కలిపేందుకు కేబుల్ వేయనున్నట్లు గూగుల్ జూన్ లో ప్రకటించింది. ఈ రెండు కంపెనీలు సింగపూర్, ఇండోనేషియాతో యుఎస్ వెస్ట్ కోస్ట్ ను కలిపేందుకు నిధులు సమకూర్చినట్లు మార్చిలో ప్రకటించాయి. -
ఇంటర్నెట్ సౌకర్యం.. సముద్ర భూగర్బంలో కేబుల్స్!
వాషింగ్టన్: కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆన్లైన్ వినియోగం పెరిగింది. అయితే ఆయా దేశాలకు చెందిన కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ లేకపోవడంతో తమకు ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో గూగుల్ సంస్థ భూగర్బంలో కేబుల్స్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా యూఎస్, బ్రెజిల్, ఉరుగ్వే మరియు అర్జెంటీనాలను అనుసంధానించే ఒక సముద్రగర్భ కేబుల్స్ నిర్మిస్తున్నట్లు గూగుల్‌కు చెందిన ఆల్ఫాబెట్ తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ తూర్పు తీరం నుండి అర్జెంటీనాలోని లాస్ టోనినాస్ వరకు ..అలాగే బ్రెజిల్‌లోని ప్రియా గ్రాండే, పుంటా డెల్ ఎస్టే, ఉరుగ్వే ప్రాంతాల్లో అదనంగా ఈ కేబుల్స్‌ను ఏర్పాట్లు చేయనుంది. ఫిర్మినా అని పిలువబడే ఈ కేబుల్‌ను సముద్ర భూగర్భంలో ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచంలోనే అతి పొడవైన సముద్ర భూగర్బంలోని కేబుల్ అవుతుందని గూగుల్ పేర్కొంది. ఫిర్మినా కేబుల్స్ అందుబాటులోకి వస్తే దక్షిణ అమెరికాలో గూగుల్ సేవలు మెరుగుపడతాయని గూగుల్ అభిప్రాయం వ్యక్తం చేసింది. 12 ఫైబర్ జతలతో కేబుల్ ఉత్తర మరియు దక్షిణ అమెరికా మధ్య సముద్ర భూగర్భానా ఏర్పాటు చేయడం ద్వారా గూగుల్ సేవలకు అంతరాయం తొలగినట్లేనని వెల్లడించింది. సముద్ర భూభాగంలో కేబుల్ ఏర్పాటు కోసం గూగుల్ ఇతర కేబుల్ సంస్థల నుంచి ఇన్వెస్టర్లను ఆహ్వానించింది. వీటిలో డునాంట్, ఈక్వియానో మరియు గ్రేస్ హాప్పర్ కేబుల్స్,అలాగే ఎకో, జెజిఎ, ఇండిగో మరియు హావ్ఫ్రూ వంటి కేబుల్ సంస్థలు ఉన్నాయి. చదవండి : ఈ గూగుల్ ఇయర్ బడ్స్ స్పెషల్ ఏంటో తెలుసా? -
రష్యా ఆ పనిచేస్తే! భయంతో వణుకుతున్న బ్రిటన్!!
లండన్ : కమ్యూనిస్ట్ దేశమైన రష్యాను తలుచుకుని బ్రిటన్ భయపడుతోంది. ప్రధానంగా సముద్ర జలాల్లో ఉన్న కేబుల్స్‌కు రష్యా ఎక్కడ సమస్యలు తీసుకువస్తుందన్న భయంలో బ్రిటన్ ఆర్మీ ఉంది. సముద్ర జలాల్లోరి కేబుల్స్ రష్యా తెంచేస్తే.. బ్రిటన్ అత్యంత తీవ్రమైన ప్రమాదంలో పడుతుందని బ్రిటన్ ఎయిర్ చీఫ్ మార్షల్ సర్ స్టువర్ట్ పీచ్ ఆందోళన వ్యక్తం చేశారు. అది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు. రష్యా ప్రపంచంపై సమాచార యుద్ధానికి దిగే అవకాశం ఉందని.. దాని ప్రభావం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయని ఆయన చెప్పారు. రష్యా నేవీ పూర్తిస్థాయిలో ఆధునీకరించడం ప్రమాద సంకేతాలను పంపుతోందని ఆయన అన్నారు. ప్రధానంగా న్యూక్లియర్, సంప్రదాయ యుద్ధనౌకలు, సబ్‌మెరైన్స్ అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణిస్తున్నాయని చెప్పారు. భవిష్యత్‌లో సమాచార వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేయడం కూడా యుద్ధంలో భాగమవుతుందని ఆయన చెప్పారు. -
మీ నెట్ ఎందుకు స్లో అయిందో తెలుసా?
గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ బాగా స్లో అయ్యింది. పేజీలు లోడ్ కావడానికి ఇంతకుముందు కంటే ఎక్కువ సమయం పడుతోంది. ఏం జరిగిందోనని కొంతమంది ఆందోళనతో తమ సర్వీస్ ప్రొవైడర్లకు ఫోన్లు చేశారు. కానీ తప్పు వాళ్లది కాదు.. వర్ధా తుపానుది! అవును.. వర్ధా తుపాను తీవ్రత కారణంగా సముద్రగర్భంలో ఉన్న పలు టెలికం కంపెనీలకు చెందిన కేబుళ్లు దెబ్బతిన్నాయి. ఎయిర్టెల్ కేబుళ్లు బాగా ఎక్కువగా దెబ్బతిన్నాయని, ఇతర కంపెనీలకు చెందిన కేబుళ్లు కూడా దెబ్బతినడంతో నెట్ బాగా స్లో అయిందని నిపుణులు చెబుతున్నారు. చెన్నై తీరంలో సంభవించిన తీవ్ర పెనుతుపాను కారణంగా సముద్రగర్భంలో ఉన్న తమ అంతర్జాతీయ కేబుళ్లు దెబ్బతిన్నాయని, దాంతో ఇంటర్నెట్ ట్రాఫిక్ పాక్షికంగా ప్రభావితం అయ్యిందని.. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్/డేటా స్పీడు బాగా తగ్గిందని ఎయిర్టెల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ విషయమై కస్టమర్లకు కూడా పలువురు సర్వీస్ ప్రొవైడర్లు ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. దెబ్బతిన్న కేబుళ్లను సరిచేసేందుకు, ఆపరేషన్లను సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈలోపు అంతర్జాతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను మళ్లించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకుంటున్నారు. తమ కేబుళ్లు కూడా దెబ్బతిన్నాయని వోడాఫోన్ ప్రతినిధి ఒకరు చెప్పారు. టాటా కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్.. ఇలా ప్రతి ఒక్కరికి సంబంధించిన కేబుళ్లు కూడా దారుణంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.