తూర్పు ఆసియాలోని ఆరు దేశాలను కలుపుతూ వేల మైళ్లు సముద్రగర్భంలో ఇంటర్నెట్ కేబుల్ వేయడానికి గూగుల్ కొత్త ప్రాజెక్టు చేపట్టింది. "ఆప్రికాట్" అని పిలువబడే ఈ ప్రాజెక్ట్ జపాన్, తైవాన్, గువామ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, సింగపూర్ దేశాలను అనుసంధానం చేస్తుంది. ఆప్రికాట్ ప్రాజెక్టులో భాగంగా సముద్రగర్భంలో 12,000 కిలోమీటర్లు (7,456 మైళ్ళు) కేబుల్ వేయనున్నట్లు గూగుల్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ వ్యవస్థ 2024లో అందుబాటులోకి వస్తుంది అని తెలిపింది. ఫేస్‌బుక్ కూడా కేబుల్ వ్యవస్థకు పాక్షికంగా నిధులు సమకూరుస్తుంది. అలాగే, ప్రాంతీయ టెలికామ్ ప్రొవైడర్ల నుంచి కూడా గూగుల్ నిదులు సేకరిస్తుంది.
ఫేస్‌బుక్, గూగుల్ రెండూ కలిసి ఇప్పటికే వేలాది మైళ్ల సముద్రగర్భంలో ఇంటర్నెట్ కేబుల్ ను వేశాయి. ఇంకా వేలాది మైళ్లు ఇంటర్నెట్ కేబుల్ వేసేందుకు సిద్దం అవుతున్నాయి. యుఎస్ ఈస్ట్ కోస్ట్, అర్జెంటీనాను కలిపేందుకు కేబుల్ వేయనున్నట్లు గూగుల్ జూన్ లో ప్రకటించింది. ఈ రెండు కంపెనీలు సింగపూర్, ఇండోనేషియాతో యుఎస్ వెస్ట్ కోస్ట్ ను కలిపేందుకు నిధులు సమకూర్చినట్లు మార్చిలో ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment