వాషింగ్టన్: కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆన్లైన్ వినియోగం పెరిగింది. అయితే ఆయా దేశాలకు చెందిన కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ లేకపోవడంతో తమకు ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో గూగుల్ సంస్థ భూగర్బంలో కేబుల్స్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా యూఎస్, బ్రెజిల్, ఉరుగ్వే మరియు అర్జెంటీనాలను అనుసంధానించే ఒక సముద్రగర్భ కేబుల్స్ నిర్మిస్తున్నట్లు గూగుల్కు చెందిన ఆల్ఫాబెట్ తెలిపింది.
యునైటెడ్ స్టేట్స్ తూర్పు తీరం నుండి అర్జెంటీనాలోని లాస్ టోనినాస్ వరకు ..అలాగే బ్రెజిల్‌లోని ప్రియా గ్రాండే, పుంటా డెల్ ఎస్టే, ఉరుగ్వే ప్రాంతాల్లో అదనంగా ఈ కేబుల్స్ను ఏర్పాట్లు చేయనుంది. ఫిర్మినా అని పిలువబడే ఈ కేబుల్ను సముద్ర భూగర్భంలో ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచంలోనే అతి పొడవైన సముద్ర భూగర్బంలోని కేబుల్ అవుతుందని గూగుల్ పేర్కొంది.
ఫిర్మినా కేబుల్స్ అందుబాటులోకి వస్తే దక్షిణ అమెరికాలో గూగుల్ సేవలు మెరుగుపడతాయని గూగుల్ అభిప్రాయం వ్యక్తం చేసింది. 12 ఫైబర్ జతలతో కేబుల్ ఉత్తర మరియు దక్షిణ అమెరికా మధ్య సముద్ర భూగర్భానా ఏర్పాటు చేయడం ద్వారా గూగుల్ సేవలకు అంతరాయం తొలగినట్లేనని వెల్లడించింది. సముద్ర భూభాగంలో కేబుల్ ఏర్పాటు కోసం గూగుల్ ఇతర కేబుల్ సంస్థల నుంచి ఇన్వెస్టర్లను ఆహ్వానించింది. వీటిలో డునాంట్, ఈక్వియానో మరియు గ్రేస్ హాప్పర్ కేబుల్స్,అలాగే ఎకో, జెజిఎ, ఇండిగో మరియు హావ్‌ఫ్రూ వంటి కేబుల్ సంస్థలు ఉన్నాయి.
చదవండి : ఈ గూగుల్ ఇయర్ బడ్స్ స్పెషల్ ఏంటో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment