
పారిస్: పారిస్‌లో ఒలింపిక్స్ ప్రారంభం రోజున శుక్రవారం రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించిన గుర్తు తెలియని దుండగులు..ఈసారి టెలీకమ్యూనికేషన్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో ఒలింపిక్స్ ఈవెంట్లు జరుగుతుండగా పలు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ కేబినెట్లలోని కేబుల్‌ను, సెల్‌ఫోన్, ల్యాండ్ లైన్లను దుండగులు ధ్వంసం చేసినట్లు ఫ్రాన్సు ప్రభుత్వం తెలిపింది.
నష్టం తీవ్రత, ఒలింపిక్ కార్యక్రమాలపై ఏమేరకు ప్రభావం పడిందనే విషయాలను ప్రభుత్వం వెల్లడించలేదు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వరకు స్థానికంగా టెలీకమ్యూనికేషన్ సేవలకు అంతరాయం కలిగినట్లు మాత్రమే సంబంధిత మంత్రిత్వ శాఖ వివరించింది. పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు ఈ పరిణామంపై ఎటువంటి ప్రకటనా చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment