ఇదొక పురాతన అధోలోక నగరం. ప్రస్తుత తుర్కియాలోని కపడోసియ ప్రాంతంలో ఉంది. భూమి లోపల 285 అడుగుల లోతున పదకొండు అంతస్తుల్లో ఉన్న ఈ నగరాన్ని తొలి పర్షియన్ సామ్రాజ్యానికి చెందిన పాలకులు నిర్మించి ఉంటారని చరిత్రకారులు, పురాతత్త్వ శాస్త్రవేత్తల అంచనా. దీనిని క్రీస్తుపూర్వం 550 ప్రాంతంలో నిర్మించి ఉంటారని వారు భావిస్తున్నారు. ఇందులో ఇరవైవేల మంది నివాసం ఉండేందుకు తగిన ఏర్పాట్లు ఉన్నాయి.
నూనె గానుగలు, మద్యం పీపాలను భద్రపరచుకునే గదులు, తిండి గింజలు భద్రపరచుకునే గదులు, ప్రార్థన మందిరాలు వంటివీ ఉన్నాయి. దీని లోపలికి గాలి, వెలుతురు ప్రసరించేందుకు వీలుగా 180 అడుగుల పొడవైన మార్గం ఉండటం విశేషం. తొలిసారిగా దీనిని విహార యాత్రకు వచ్చిన ఒక కుటుంబం 1963లో గుర్తించడంతో ఈ నగరం గురించి ఆధునిక ప్రపంచానికి తెలిసింది. తుర్కియాలో దీనికి ‘డెరింకుయు’ అని పేరు పెట్టారు. అంటే నేలమాళిగ నగరం అని అర్థం.
(చదవండి: టీచరే బడిదొంగ... ఇరవై ఏళ్లుగా డుమ్మా!)
Comments
Please login to add a commentAdd a comment