region
-
విద్వేష వ్యాఖ్యలొద్దు
న్యూఢిల్లీ: కేసుల విచారణ సందర్భంగా వాడే పదజాలం విషయంలో న్యాయస్థానాలు అత్యంత జాగరూకత వహించాలని సుప్రీంకోర్టు సూచించింది. పురుషాధిక్య భావజాలం, స్త్రీద్వేషం తదితరాలతో కూడిన వ్యాఖ్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని హితవు పలికింది. కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీశానంద ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా బెంగళూరులో ఒక ముస్లిం ప్రాబల్య ప్రాంతాన్ని పాకిస్తాన్‌తో పోల్చడం, మహిళా న్యాయవాదిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ ఉదంతంపై సుమోటో విచారణను సీజేఐ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం ముగించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోని ఏ ప్రాంతాన్నీ పాకిస్తాన్‌తో పోల్చకూడదని కుండబద్దలు కొట్టింది. అవి దేశ ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధమని గుర్తు చేసింది. ఇలా ప్రాంతాలను, సామాజికవర్గాలను ఉద్దేశించి అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదని స్పష్టం చేసింది. ‘‘న్యాయవ్యవస్థ నిష్పాక్షికతపై సమాజంలో అన్ని వర్గాల ప్రజలకూ పూర్తి విశ్వాసముండాలి. దీన్ని కాపాడాల్సిన బాధ్యత లాయర్ల నుంచి జడ్జిల దాకా అందరిపైనా ఉంది. న్యాయమూర్తులు యథాలాపంగా చేసే ఇలాంటి వ్యాఖ్యలు వారి వ్యక్తిగత అభిప్రాయాలకు, రాగద్వేషాలకు అద్దం పడతాయి. వాటి ప్రభావం మొత్తం న్యాయవ్యవస్థపై పడుతుంది’’ అంటూ హెచ్చరించింది.మరింత వెలుగే పరిష్కారం!న్యాయవ్యవస్థలో పారదర్శకత చాలా ముఖ్యమని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. కోర్టుల విచారణ ప్రక్రియపై సోషల్ మీడియాలో విద్వేష వ్యాప్తి పెద్ద సవాలుగా మారిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. దీనిపై సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘వెలుగుకు మరింత వెలుగే పరిష్కారం తప్ప చీకట్లు కాదు. అన్నిరకాల కోర్టుల్లోనూ విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయడం, తద్వారా న్యాయవ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడమే సమస్యకు పరిష్కారం’’ అని కుండబద్దలు కొట్టారు. -
ఉగ్రవాదుల ఏరివేత.. జమ్ములో సైనికుల మోహరింపు
జమ్ము ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న నేపధ్యంలో ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో సైనికులను మోహరించారు. జమ్ములో ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇంటర్ కమాండ్‌లో మార్పులు చేశారు. కథువా, సాంబా, దోడా, బదర్వా, కిష్త్వార్లలో సైనికుల సంఖ్యను మరింతగా పెంచారు. వెస్ట్రన్ కమాండ్ నుండి కూడా ఇక్కడకు సైనికులను పంపారు.గత సోమవారం జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్‌కు చెందిన సాయుధ ఉగ్రవాదులతో జరిగిన భీకర ఎన్కౌంటర్లో కెప్టెన్‌తో సహా నలుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. మూడు వారాల్లో జమ్మూ ప్రాంతంలో ఇది మూడో అతిపెద్ద ఉగ్రవాద ఘటన. దీనికి ముందు కథువా జిల్లాలో ఉగ్రవాదులు ఆర్మీ పెట్రోలింగ్ వాహనంపై మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. అంతేసంఖ్యలో సైనిక సిబ్బంది గాయపడ్డారు.అంతకుముందు జూలై 9న కిష్త్వార్ జిల్లా సరిహద్దుల్లోని అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత ఉగ్రవాదులు పారిపోయారు. జూన్ 26న గండో ప్రాంతంలో ఒక రోజంతా జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అదేవిధంగా జూన్ 12న జరిగిన భీకర కాల్పుల్లో ఐదుగురు ఆర్మీ సిబ్బంది, ఒక ప్రత్యేక పోలీసు అధికారి గాయపడటంతో దోడాలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు ముమ్మరం చేశారు.గండోలో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఒక పోలీసు గాయపడ్డాడు. 2005- 2021 మధ్య భద్రతా దళాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించిన తర్వాత జమ్ము ప్రాంతం సాపేక్షంగా శాంతియుతంగా ఉంది. అయితే ఈ ప్రాంతంలో గత నెల నుంచి ఉగ్రవాద దాడులు పెరిగాయి. ఇటీవల యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన దాడిలో తొమ్మిది మంది మృతిచెందగా, 40 మంది గాయపడ్డారు. -
Kokapet Land Auction: రికార్డుల కోకాపేట.. ఒక్క ఫ్లాట్ రూ.22.50 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా కోకాపేట సరికొత్త రికార్డులను సృష్టించింది. గురువారం హెచ్ఎండీఏ నిర్వహించిన నియోపొలిస్ కోకాపేట ఫేజ్–2 వేలంలో అత్యధిక బిడ్ వేసి ప్లాట్ నంబరు–11ను ఏపీఆర్ గ్రూప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎకరం రూ.67.25 కోట్ల చొప్పున రూ.506.39 కోట్లతో మొత్తం 7.53 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ ప్రాంతంలో హైదరాబాద్‌కు, ఏపీఆర్ గ్రూప్ తలమానికంగా నిలిచే అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్‌కు ప్రణాళికలు చేస్తున్నామని డైరెక్టర్ ఆవుల సంజీవ్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇంకా ఏమన్నారంటే.. నాలుగు టవర్లు, ఒక్కోటి 50 అంతస్తులలో ఉంటుంది. ఫ్లోర్‌కు ఒక ఫ్లాట్ చొప్పున ఒక్క ఫ్లాట్ 15 వేల చ.అ. విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 200 అల్ట్రా లగ్జరీ ఫ్లాట్లు ఉంటాయి. ధర చ.అ.కు రూ.15 వేలు చొప్పున ఒక్క ఫ్లాట్ ప్రారంభ ధర రూ.22.50 కోట్లుగా ఉంటుంది. ప్రాజెక్ట్ డిజైన్, ఎలివేషన్స్ నుంచి మొదలుపెడితే క్లబ్ హౌస్, వసతులు, మెటీరియల్స్ ప్రతీది హైఎండ్గా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం ఉంటుంది. ఇప్పటికే సింగపూర్ ఆర్కిటెక్చర్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్లాట్ నంబరు–11 ఉన్న ప్రాంతం ఇతర మిగిలిన ప్లాట్ల కంటే ఎత్తులో ఉండటం, గండిపేట వ్యూ స్పష్టంగా కనిపిస్తుండటం దీని ప్రత్యేకతలు. అతి తక్కువ ధర ఈ ప్లాటే.. నియోపొలిస్ కోకాపేట ఫేజ్–2లో అతి తక్కువ ధర పలికింది కూడా ఈ 11 నంబరు ప్లాటే కావటం గమనార్హం. ఎకరం రూ.67.25 కోట్లతో ఏపీఆర్ గ్రూప్ ఈ ప్లాట్‌ను సొంతం చేసుకుంది. అయితే గతంలో కోకాపేట ఫేజ్–1 వేలంలో గరిష్ట ధర రూ.60 కోట్లు. గోల్డ్‌మైన్ లేఅవుట్లో రాజపుష్ప ప్రాపరీ్టస్ ఎకరం రూ.60.2 కోట్ల చొప్పున మొత్తం రూ.99.33 కోట్లతో 1.65 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. -
భూమిలో 285 అడుగుల లోతులో 'నగరం'.. 20 వేల మందిదాక..
ఇదొక పురాతన అధోలోక నగరం. ప్రస్తుత తుర్కియాలోని కపడోసియ ప్రాంతంలో ఉంది. భూమి లోపల 285 అడుగుల లోతున పదకొండు అంతస్తుల్లో ఉన్న ఈ నగరాన్ని తొలి పర్షియన్ సామ్రాజ్యానికి చెందిన పాలకులు నిర్మించి ఉంటారని చరిత్రకారులు, పురాతత్త్వ శాస్త్రవేత్తల అంచనా. దీనిని క్రీస్తుపూర్వం 550 ప్రాంతంలో నిర్మించి ఉంటారని వారు భావిస్తున్నారు. ఇందులో ఇరవైవేల మంది నివాసం ఉండేందుకు తగిన ఏర్పాట్లు ఉన్నాయి. నూనె గానుగలు, మద్యం పీపాలను భద్రపరచుకునే గదులు, తిండి గింజలు భద్రపరచుకునే గదులు, ప్రార్థన మందిరాలు వంటివీ ఉన్నాయి. దీని లోపలికి గాలి, వెలుతురు ప్రసరించేందుకు వీలుగా 180 అడుగుల పొడవైన మార్గం ఉండటం విశేషం. తొలిసారిగా దీనిని విహార యాత్రకు వచ్చిన ఒక కుటుంబం 1963లో గుర్తించడంతో ఈ నగరం గురించి ఆధునిక ప్రపంచానికి తెలిసింది. తుర్కియాలో దీనికి ‘డెరింకుయు’ అని పేరు పెట్టారు. అంటే నేలమాళిగ నగరం అని అర్థం. (చదవండి: టీచరే బడిదొంగ... ఇరవై ఏళ్లుగా డుమ్మా!) -
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, మరి జేడీఎస్?
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కీలక ఘట్టం.. పోలింగ్ ముగిసింది. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు. 13వ తేదీన ఏ పార్టీ భవితవ్యం ఏంటన్నది తేలిపోతుంది. ఈలోగా ఓటర్‌నాడిని అంచనా వేస్తూ.. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు పొలిటికల్ హీట్‌ను పెంచాయి. ప్రధానంగా భావించిన మూడు పార్టీలలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం కట్టబెట్టకుండా.. దాదాపు మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ హంగ్ సంకేతాలను అందించాయి. ఈలోపు రీజియన్ల వారీగా ఆ ఫలితాలను ఓసారి పరిశీలిస్తే.. 👉 కోస్టల్ కర్ణాటకలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. ఈ రీజియన్‌లో స్థానాలను మొత్తం బీజేపీ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కు పరిమితం కావొచ్చని తెలుస్తోంది. అదే సమయంలో స్థానిక జనతాదళ్ సెక్యులర్ ఇక్కడ ఎలాంటి ఖాతా తెరవకపోవచ్చనే ఎగ్జిట్‌పోల్స్ కోడై కూస్తున్నాయి. 👉 ఈ రీజియన్‌లో ఓటింగ్ శాతంలోనూ.. బీజేపీ ఆధిక్యం కనబర్చవచ్చని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. సగానికి పైగా ఓట్ షేర్‌ను కాషాయం పార్టీ దక్కించుకోనుంది. కాంగ్రెస్ కూడా దాదాపు 40 శాతం ఓట్ షేర్ దక్కించుకోవచ్చని, అదే సమయంలో జేడీఎస్ కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితం కావొచ్చని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. 👉 ఇక రాజధాని బెంగళూరు రీజియన్‌లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ విజయదుంధుబి మోగిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. సగానికి పైగా సీట్లతో కాంగ్రెస్ ఆధిపత్యం కనబరుస్తుందని, సింగిల్ డిజిట్ నుంచి పది స్థానాల దాకా బీజేపీ గెలవొచ్చనే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. 👉 ఓట్ షేరింగ్‌లో.. గ్రాండ్ ఓల్డ్ పార్టీకి 44 శాతం, కాషాయం పార్టీకి 40 శాతం, జేడీఎస్ ఓట్ షేరింగ్ 15 శాతానికి ఉండొచ్చని అంచనా. ఈ రీజియన్‌లో మెల్కోటోలో అత్యధికంగా 67.4 శాతం పోలింగ్ నమోదు కాగా.. సీవీ నగర్లో అత్యల్పంగా 32 శాతం పోలింగ్ రికార్డు అయ్యింది. 👉 సెంట్రల్ కర్ణాటకలో ప్రధాన పార్టీలు బీజేపీ-కాంగ్రెస్ నడుమ హోరాహోరీ పోటీ నెలకొందని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. 23 సీట్లున్న సెంట్రల్ కర్ణాటకలో సగం సగం సీట్లు గెలిచి ఇరు పార్టీలు గట్టి పోటీ ఇవ్వొచ్చని ముక్తకంఠంతో ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. ఇక జేడీఎస్ ఇక్కడ అసలు ఆధిపత్యం ప్రదర్శించకపోవచ్చని.. గెలిచినా ఒకటికి మించి స్థానం కైవసం చేసుకోకపోవచ్చనే అంచనా నెలకొంది. 👉 హైదరాబాద్-కర్ణాటక రీజియన్‌లో.. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. ఈ రీజియన్‌లో 40కిగానూ.. 30 దాకా కాంగ్రెస్ సొంతం కావొచ్చని అంచనా వేశాయి. అదే సమయంలో బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావొచ్చని పేర్కొన్నాయి. జేడీఎస్ ఇక్కడ కేవలం ఒక్క సీటుకే పరిమితం కావొచ్చని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి. అదే సమయంలో ఓటు షేర్‌లోనూ 47 శాతం దాకా కాంగ్రెస్‌కే దక్కవచ్చని అంచనా వేశాయి. ఇక కుమారస్వామి ఎంతగానో ఆశలుపెట్టుకున్న.. ఉత్తర కర్ణాటక, పాత మైసూర్ రీజియన్ల ఓటర్లు సైతం జేడీఎస్ ఆశలకు గండికొట్టేలా కనిపిస్తున్నారు. -
ఫలానా చోటికే బదిలీ చేయాలని ఉద్యోగి పట్టుబట్టజాలడు
న్యూఢిల్లీ: ఉద్యోగి ఫలానా ప్రాంతానికే బదిలీ చేయాలని పట్టుబట్టజాలడని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యూపీకి చెందిన మహిళా లెక్చరర్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధబోస్‌ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ‘ఒక ఉద్యోగి/ ఉద్యోగిని తనను ఫలానా చోటికే బదిలీ చేయాలనీ లేదా బదిలీ చేయరాదని పట్టుబట్టకూడదు. యాజమాన్యమే అవసరాలను అనుగుణంగా బదిలీలను చేపడుతుంది’అని పేర్కొంది. అమ్రోహాలోని కళాశాలలో పనిచేస్తున్న మహిళా లెక్చరర్ తనను గౌతమ్‌బుద్ధ నగర్‌లోని కళాశాలకు బదిలీ చేయాలని అధికారులను కోరగా తిరస్కరించారు. దీనిపై ఆమె అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. నాలుగేళ్లుగా అమ్రోహాలో పనిచేస్తున్న ఆమె, గతంలో 2000–2013 వరకు దాదాపు 13 ఏళ్లపాటు గౌతమబుద్ధ నగర్లో పనిచేసినట్లు గుర్తించిన హైకోర్టు తిరిగి అక్కడికే బదిలీ చేయాలని కోరడం సరికాదని పేర్కొంది. పనిచేసిన ప్రాంతానికే తిరిగి బదిలీ చేయాలని పట్టుబట్టరాదంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. -
పరమయోగుల పవిత్ర భూమి...శతవసంతాల యోగ పీఠి
పుణ్యతీర్థం :: కుర్తాళం పీఠం పరమ యోగులెందరో నడయాడిన పవిత్ర ప్రాంతం.. దక్షిణ భారతావని. తెలుగు, తమిళ సీమల్లో ఒక్కో ప్రాంతం, ఒక్కో క్షేత్రం, ఒక్కో తీర్థానికి ఒక్కొక్క ప్రత్యేకత. తమిళనాట తిరునల్వేలి జిల్లాలో దక్షిణ కాశి (తెన్ కాశి)కి 3 మైళ్ళ దూరంలో చిత్రానదీ తీరంలోని కుర్తాళం అలాంటి ప్రత్యేకతలెన్నో ఉన్న పవిత్రభూమి. స్థలం (త్రికూటాచలం), తీర్థం (చిత్రా నది), దైవం (త్రికూటాచలపతి) – ఈ మూడు విశేషాలూ ఒకే చోట ఉండడం వల్ల ఈ ప్రాంతం ‘త్రికూటాచల క్షేత్రం’గా ప్రసిద్ధి. ‘త్రికూటా చలం’ అన్నమాట వ్యవహారంలో ‘తిరు కుర్తాళం’, ఇప్పుడు ‘కుర్తాళం’ అయి ఉంటుందని అంచనా. (సంస్కృత గ్రంథాల్లో కుద్దాలం అన్నారు). కుర్తాళం అనగానే ఆహ్లాదం పంచే జలపాతాలు, ప్రకృతి సోయగం నిండిన పర్యాటక ప్రాంతం గుర్తుకొస్తాయి. అక్కడే సరిగ్గా నూరేళ్ళ క్రితం భక్తి, ముక్తి, యోగ సాధనలకు కేంద్రంగా మహిమాన్వితమైన ఒక పీఠం ఏర్పడింది. ఆ పీఠం మన తెలుగు స్వామి ఒకరు ఏర్పాటుచేసిందవడం విశేషం. అదే – శ్రీసిద్ధేశ్వరీ పీఠం... మౌనస్వామి ఆశ్రమం... కుర్తాళం పీఠం.. ఇలా భక్తులు రకరకాల పేర్లతో పిలుచుకొనే పవిత్రమైన ప్రాంగణం. కుర్తాళం ప్రాచీనకాలం నుంచి ‘అగస్త్య క్షేత్రం’గా ప్రసిద్ధం. అపరిమితంగా ఎత్తు పెంచేస్తున్న వింధ్య పర్వతాన్ని నియంత్రించేందుకు వింధ్యకు అటువైపు ఉన్న ఉత్తరాది నుంచి ఇటు వైపు ఉన్న దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి, తన భార్య లోపాముద్రతో సహా ఈ కుర్తాళం ప్రాంతంలోనే శాశ్వతంగా వసించి, జపతపాలు ఆచరించారట. దక్షిణాదికి వచ్చినప్పుడు విశ్వామిత్రుడు కూడా ఇక్కడ తపస్సు చేశా డంటారు. త్రికూటాచలం అంటే – మూడు కూటముల (శిఖరాల)తో కూడిన అచలం (కొండ). ఇక్కడి కొండ కూడా పడమటి కనుమల్లో మామూలుగా కనిపించే కొండల వరుసలా కాక, 3 శిఖరాలతో దాదాపు ఒక వలయాకారంగా అనిపిస్తుంది. ఆ రకంగా దీన్ని ‘త్రికూటా చలం’ అన్నారు. ఈ క్షేత్రంలోని పురాతన ఆలయంలో దేవుడి పేరు – త్రికూటాచలపతి. ఆయన్నే ‘కుర్తాళనాథుడు’ అనీ పిలుస్తారు. దక్షిణ పాండ్య దేశంలోని 14 ప్రధాన శివ క్షేత్రాల్లో ఈ ‘కుర్తాళం’ ప్రసిద్ధమైనది. గృహస్థాశ్రమం నుంచి యోగిగా.... అలాంటి చోట ఏర్పాటైన పీఠం – కుర్తాళం పీఠం. గడచిన ఆశ్వయుజ మాసంలో శత వసంతాలు పూర్తి చేసుకున్న ఈ తెలుగు వారి పీఠానిది ఘన చరిత్ర. వందేళ్ళ క్రితం 1916లో శ్రీశివచిదానంద సరస్వతీస్వామి నెలకొల్పిన పీఠమిది. కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా దేశమంతా పర్యటించి, ఎంతోమంది సాధువులు, సన్న్యాసుల నుంచి విజ్ఞానం అందుకొని, అనంతరం మౌనాన్ని ఆశ్రయించిన ఆయన ‘మౌనస్వామి’గా ప్రసిద్ధికెక్కారు. ఆయన అచ్చ తెలుగువారు. దేవీ ఉపాసకులైన ఆయన, మహనీయుడైన ఒక సాధువును కలవడంతో పారమార్థికం వైపు మళ్ళారు. 1906 ప్రాంతంలో ఒక అర్ధరాత్రి వేళ భార్యాబిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిన ఆయన మళ్ళీ ఇంటి ముఖం చూడలేదు. ఉత్తరాదిన పుణ్యక్షేత్రాలు తిరుగుతూ, సన్న్యాస దీక్షతో శివచిదానంద సరస్వతి అయ్యారు. ఆ తరువాత అపర దత్తాత్రేయ అవతారమైన వాసుదేవానంద సరస్వతీ స్వామిని దర్శించి, యోగవిద్య అభ్యసించారు. ఎన్నో సిద్ధులు పొందారు. ఇంద్రుడు పంపిన పీఠం... స్వామి పెట్టిన మఠం దేశంలో అనేక మఠాలున్నా కుర్తాళం మఠం ప్రత్యేకత వేరు. భూలోకంలో పూజ కోసం పూర్వం దేవేంద్రుడు నాలుగు పీఠాలను పంపాడట. వాటిలో ఒకటి – శృంగేరిలోని శారదా పీఠం. రెండోది – ఈ కుద్దాల (కుర్తాళ) క్షేత్రంలోని ధరణీ పీఠం. మూడోది – కంచిలోని కామకోటి పీఠం. నాలుగోది ఉత్తర భారతావనిలో నెలకొల్పినట్లు చెబుతారు. ఈ ప్రాశస్త్యాన్ని గుర్తించిన శృంగేరీ పీఠాధిపతి కుర్తాళంలో యతులకు కావాల్సిన మఠం నిర్మించాల్సిందిగా మౌనస్వామితో చెప్పారు. ఫలితమే కుర్తాళం మఠం. ఆ విఘ్ణపతికి నాడి కొట్టుకొంటుంది! ఈ పీఠంలో రావి చెట్టు కింద సిద్ధి వినాయక విగ్రహాన్ని మౌనస్వామి ప్రతిష్ఠించారు. హారతిచ్చే సమయంలో విగ్రహం కదులుతున్న అనుభూతి కల్గింది. విగ్రహానికి నాడి కొట్టుకుంటున్న ట్లనిపించింది. ఏదైనా కోరుకొని, గణపతిని ప్రార్థించి, గుడి గడప వద్ద కొబ్బరికాయ కొడితే, ఆ కోరిక తీరుతుంది. ప్రత్యర్థులపై జయానికి... ప్రత్యంగిరా దేవి క్షుద్రశక్తుల నుంచి, ప్రత్యర్థులు, శత్రువుల నుంచి కాపాడే దైవం – ప్రత్యంగిరాదేవి. ఎండు మిరపకాయలతో ప్రత్యంగిరా హోమం చేస్తే ప్రతికూల శక్తులు, దురదృష్టం దూరమవుతాయి. అమావాస్యకి ప్రత్యంగిరా హోమం, మంగళవారం మధ్యాహ్నం రాహుకాల పూజ చేస్తారు. క్షేత్రపాలకుడు దండాయుధపాణి మౌనస్వామి ప్రతిష్ఠించిన దండాయుధపాణి (కుమారస్వామి) ఆలయమిక్కడ ప్రసిద్ధం. ఈ పీఠానికి క్షేత్ర పాలకుడు దండాయుధపాణే! కాళి, కాలభైరవ ఆలయాలూ ఉన్నాయి. పర్యాటక ప్రాంతం... కుర్తాళం మంచి వేసవి విడిది – కుర్తాళం. పడమటి కనుమల్లో 160 మీటర్ల ఎత్తున నెలకొన్న పంచాయతీ ఇది. భౌగోళికంగా ఇది తమిళనాట ఉన్నా, కేరళ సరిహద్దులకు అతి దగ్గర! కుర్తాళంలో డజను జలపాతాలున్నాయి. ఈ జలపాతాల నీటికి మహత్తరమైన ఔషధీ విలువలున్నాయని నమ్మకం. మదురై, రామేశ్వరం, తిరుచెందూర్, త్రివేండ్రం, శబరిమల లాంటి భక్తి పర్యాటక క్షేత్రాలన్నీ కుర్తాళం నుంచి దగ్గరే! ఎలా వెళ్ళాలి? కుర్తాళం సమీప రైల్వే స్టేషన్ – తెన్కాశి. చెన్నైలోని ఎగ్మూర్ నుంచి తెన్కాశికి ట్రైన్లున్నాయి. తెన్కాశి దగ్గర రైలు దిగితే, కుర్తాళానికి రోడ్డు మార్గంలో 20 నిమిషాల్లో చేరవచ్చు. ఆ స్వామి ‘మౌనస్వామి’ ఎందుకయ్యారు? హిమాలయాల్లో తపస్సాధనలతో ఎన్నో ఏళ్ళు గడిపిన ఆయన మౌన దీక్ష స్వీకరించడం చిత్రమైన గాథ. కాశ్మీర్లో పెద్ద పండిత సభ జరిగింది. అక్కడ వాదనలో చిత్రమైన ఒక ప్రశ్నకు మహా మహా పండితులు సైతం అందరూ అంగీకరించే జవాబివ్వలేకపోయారు. అక్కడే ఉన్న స్వామీజీ జవాబు చెప్పి, సమస్యను చిటికెలో పరిష్కరించారు. అయితే, ఇలా పాండిత్యాన్నీ, శక్తినీ ప్రదర్శిస్తే అహం పెరుగుతుందని స్వామి వారి గురువు గారు సూచించారు. ‘వివాదాల్లో పాల్గొనకుండా, మౌనవ్రతం ఆచరిస్తూ, యోగాన్ని అనుష్ఠించు’ అని శాసించారు. అంతే! వెంటనే స్వామి మౌన దీక్ష చేపట్టారు. అప్పటి నుంచి శేష జీవితమంతా మౌనం లోనే గడిపారు. ఆశ్రయించిన భక్తుల్ని ఆశీర్వదించి, మార్గదర్శనం చేశారు. ఆశీర్వదించే అమ్మవారు... అయ్యవారు... మౌనస్వామి దక్షిణాదిలో పర్యటిస్తూ, కుర్తాళంలో స్థిరపడ్డారు. అక్కడే త్రికూటాచలేశ్వరుడి ఆలయంలో ధరణీ పీఠానికి ఎదురుగా కూర్చొని, శిరస్సు నుంచి పాదాల దాకా కాషాయ వస్త్రం కప్పుకొని, రాత్రింబగళ్ళు యోగనిష్ఠలో ఉంటూ తపస్సు చేశారు. దైవప్రేరణ మేరకు 1914లో ఒక తోటలో దత్తాత్రేయ మందిరం నిర్మిం చారు. అటు పైన 1916 అక్టోబర్‌లో శ్రీసిద్ధేశ్వరీ దేవిని ప్రతిష్ఠించారు. అదే ఇప్పటికి వందేళ్ళుగా భక్తుల్ని ఆకర్షిస్తున్న పవిత్ర మౌనస్వామి మఠం. పచ్చటి ప్రకృతి మధ్య నెలకొన్న ఈ మఠంలో ప్రధాన దేవత శ్రీసిద్ధేశ్వరీదేవి (శ్రీరాజ రాజేశ్వరీ దేవి). దేవుడు – కామేశ్వరుడు. ఇక్కడకు వచ్చి, ఆ ఆదిదంపతులను ప్రార్థించి, ధ్యానించిన భక్తులకు ప్రశాంతత చేకూరు తుందనీ,అమ్మ ఆశీర్వదిస్తుందనీ నమ్మిక. పీఠం ఏర్పాటైంది ఇలా! అనేక మఠాలలో పీఠాలున్నట్లే, మన మఠంలోనూ పీఠం ఉండా లని భక్తులు కోరారు. పీఠమంటే శ్రీచక్రం. పీఠం మీద సాక్షాత్తూ పరాశక్తే ప్రతిష్ఠితురాలై ఉంటుంది. మౌనస్వామి రాజరాజేశ్వరీ దేవి సన్నిధానంలో శ్రీచక్రం స్థాపించారు. అలా పీఠం ఏర్పడింది. దానికి ‘శ్రీసిద్ధేశ్వరీ పీఠం’గా పేరు పెట్టారు. రాజరాజేశ్వరీ దేవి అలా శ్రీసిద్ధేశ్వరీ పీఠాధిష్ఠాన దేవత అయింది. కుర్తాళం తెలుగు వారి పీఠమైంది. మహిమాన్విత మౌనస్వామి షిర్డీ సాయిబాబా, రమణ మహర్షి, శేషాద్రిస్వామి సహా నిఖిలేశ్వరా నంద, విశుద్ధానంద, వాసుదేవానంద తదితర యోగులతో కుర్తాళం పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అనుబంధం ఉండేది. శూన్యం నుంచి బంగారం, నవరత్నాలతో సహా సమస్తం సృష్టించే అష్ట మహా సిద్ధులు, భౌతికేతర లింగ శరీరంతో చేసే అతీంద్రియ యానం లాంటివి స్వామికి కరతలామలకం. ఒకసారి నవరాత్రులకు సంతర్పణలో పిండివంటలకు నెయ్యి దొరకనప్పుడు, కిరసనాయిల్ని కాచి, దాన్ని నెయ్యిగా మార్చారు. ఇక భక్తుల వ్యాధుల్ని తగ్గించి, కరుణించిన ఘట్టాలు కొల్లలు. ఏకకాలంలో మూడు చోట్ల దర్శనమిచ్చిన ఉదంతాలూ ఉన్నాయి. పీఠంలోని దండా యుధపాణి గుడిలో యోగసమాధి నిష్ఠలోనే ఆయన దేహత్యాగం చేశారు. ఇప్పటికీ పీఠంలో మౌనస్వామి సమాధినీ, శివలింగాన్నీ దర్శించుకోవచ్చు. వందే గురు పరంపరాభ్యామ్! ఆది శంకరాచార్యుల వారి శృంగేరీ మఠ సంప్రదాయాన్ని అనుసరించి మౌనస్వామి స్థాపించిన పీఠం ఇది. ఆయనే దీనికి విమలానంద భారతీస్వామిని మొదటి పీఠాధిపతిగా నియమించారు. ఆ మొదటి పీఠాధిపతి తరువాత కాలక్రమంలో ఇప్పటికి మరో ముగ్గురు పీఠాధిపతులు అయ్యారు. ప్రస్తుతం శ్రీసిద్ధేశ్వరానంద భారతీస్వామి (పూర్వాశ్రమంలో గుంటూరు హిందూ కళాశాల ప్రధాన ఆచార్యులైన, కవి – పండితులు డాక్టర్ ప్రసాదరాయ కులపతి) పీఠాధిపతి. ప్రకాశం జిల్లా ఏల్చూరులో జన్మించిన ఆయనది కవి నుంచి ఋషిగా, ఋషి నుంచి యతిగా, యతి నుంచి పీఠాధిపతిగా ఎదిగిన విశిష్ట చరిత్ర. వేల పద్యాల్ని ఆశువుగా చెప్పి, అవధానాలు చేసి, 100 పుస్తకాలు రాసిన ఆయన హిమాలయాల సహా పలుచోట్ల తపస్సు చేశారు. సాక్షాత్తూ బృందావనేశ్వరి అయిన శ్రీరాధాదేవి కరుణ పొందారు. ఆమె దర్శనమిచ్చి, మంత్రోపదేశం చేయడంతో ఆధ్యాత్మిక సాధనలు చేసి, యోగి అయ్యారు. గుంటూరులో స్వయంసిద్ధ కాళీ పీఠం పెట్టి, మంత్ర సాధనలతో కాళి, కాలభైరవ దేవతల దర్శనం, అనుగ్రహం పొందారు. 14 ఏళ్ళ క్రితం సన్న్యాసం స్వీకరించి, అమ్మవారే చెప్పడంతో కుర్తాళం పీఠాధి పత్యం తీసుకున్నారు. మంత్రదీక్షతో భక్తుల సమస్యలకూ, వ్యాధులకూ పరిష్కారం చూపిస్తున్నారు. గుంటూరు, విజయవాడ, నెల్లూరు, విశాఖ, హైదరాబాద్‌లలో పీఠాలు నిర్వహిస్తూ, లోకకల్యాణం కోసం యాగాలు చేస్తుండడం కుర్తాళం పీఠాధిపతి ప్రత్యేకత. ఈ జనవరి 23న ఆయన 80 వసంతాలు నిండి, 81వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఆ రోజున స్వామి వారి జన్మదిన వేడుకలను భక్తులు ఒంగోలులో ఘనంగా జరపనుండడం విశేషం. – డాక్టర్ రెంటాల జయదేవ -
ముత్తారం జెడ్పీటీసీ రాజీనామా
మంథనిని జిల్లాగా ప్రకటించాలని.. మంథని : మంథని రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని జిల్లాగా ప్రకటించకపోవడం, ఆర్డబ్ల్యూఎస్ డివిజన్ కార్యాలయాన్ని పెద్దపల్లికి తరలించడాన్ని నిరసిస్తూ ముత్తారం జెడ్పీటీసీ సభ్యుడు చొప్పరి సదానందం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని జిల్లా ప్రజాపరిషత్ ముఖ్య నిర్వాహణాధికారి బుధవారం మెయిల్ ద్వారా పంపారు. ముఖ్యమంత్రికి సైతం తన రాజీనామాకు గల కారణాలు, మంథని జిల్లా ఏర్పాటుకు ఉన్న ప్రత్యేకతో కూడిన లేఖను పంపిస్తానని తెలిపారు. మంథనిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 30 సంవత్సరాల క్రితమే మంథని కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాలని డిమాండ్ వచ్చిందన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, మేధావులు ప్రజల ఆకాంక్షను తెలియజేశారని గుర్తుచేశారు. జిల్లా ఏర్పాటుకు అవసరమైన అన్ని అర్హతలు మంథనికి ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 31 జిల్లాలకు అనుకూలంగా ఉండి అందులో మంథనికి చోటుకల్పించకపోవడం ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే అన్నారు. ఆయన వెంట డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి శశిభూషణ్ కాచే,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆజీంఖాన్, నాయకులు ఉన్నారు. -
రీజియన్‌లో 510 బస్సులు నిలిపివేత
* రూ.80 లక్షలకుపైగా నష్టం * హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సుల ఏర్పాటు * పరిస్థితిని సమీక్షించిన ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి పట్నంబజారు: భారీ వర్షాలకు ఆర్టీసీ రీజయన్ పరిధిలోని పలు సర్వీసులను రద్దు చేశారు. సుమారు 510పైగా బస్సులు రీజయన్ వ్యాప్తంగా ఆయా డిపోల్లో నిలిచిపోయాయి. మాచర్ల – పిడుగురాళ్ల, మాచర్ల– చిలకలూరిపేట, సత్తెనపల్లి– నర్సరావుపేట, సత్తెనపల్లి– మాదిపాడు, సత్తెనపల్లి– గుంటూరు, సత్తెనపల్లి– పిడుగురాళ్ల, చిలకలూరిపేట– నర్సరావుపేట, నర్సరావుపేట– గుంటూరు రూట్లలో పూర్తిస్థాయిలో సర్వీసులు రద్దయ్యాయి. గురజాల, రెడ్డిగూడెం, పిడుగురాళ్ల మొదలగు ప్రాంతాల్లో పరిస్థితిని ఆర్టీసీ రీజయన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి పర్యవేక్షించి అప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెడ్డిగూడెం వద్ద ఆగిపోయిన పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులను పిడుగురాళ్ల డిపో నుంచి ప్రత్యేకంగా 10 బస్సులు, బెల్లకొండ వద్ద నిలిచిన ఫలక్నామా ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులను 20 బస్సుల్లో తరలించారు. రెడ్డిగూడెం, మాచర్ల, బెల్లకొండల నుంచి హైదరాబాద్‌కు 40 బస్సులు ప్రత్యేకంగా నడుపుతున్నట్లు ఆర్ఎం శ్రీహరి చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అధికారులతో చర్చించి అదనంగా బస్సుల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నామన్నారు. వరదల కారణంగా గురువారం ఒక్క రోజే రూ.80 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. -
వరంగల్ రీజియన్‌లోనే కొత్త జిల్లాలు
అదనంగా యాదగిరి, హుజూరాబాద్ డిపోల చేరిక ఖమ్మం రీజియన్‌లోకి మహబూబాబాద్, తొర్రూరు డిపోలు హన్మకొండ : జిల్లాల పునర్విభజనతో ఆర్టీసీలో స్వల్ప మార్పులు జరగనున్నాయి. ప్రస్తుత రీజియన్‌లోని కొత్త జిల్లాల్లో ఆర్టీసీ సేవలు అందించనుంది. కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నా ఆ మేరకు నూతనంగా డిపోలు ఏర్పాటు కావడంలేదు. దీంతో ప్రస్తుత రీజియన్‌లోని కొత్త జిల్లాల్లోనే డిపోలు తమ కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లాను యూనిట్‌గా ఆర్టీసీ పరంగా రీజియన్‌గా పరిగణిస్తున్నారు. వరంగల్ జిల్లాలో (రీజియన్‌లో) ప్రస్తుతం 9 డిపోలు ఉన్నాయి. హన్మకొండలో వరంగల్-1, వరంగల్-2, హన్మకొండ డిపోలు ఉన్నాయి. జనగామ, పరకాల, నర్సంపేట, తొర్రూరు, మహబూబాబాద్, భూపాలపల్లిలో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడనున్న హన్మకొండ జిల్లాలోకి హన్మకొండలోని వరంగల్-1, వరంగల్-2, హన్మకొండ డిపోలతోపాటు, కొత్తగా హుజూరాబాద్ డిపో రానుంది. వరంగల్ జిల్లాలో పరకాల, నర్సంపేట డిపోలు ఉంటాయి. ఇక జయశంకర్ (భూపాలపల్లి) జిల్లాలో భూపాలపల్లి డిపో ఉంది. మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్, తొర్రూరు డిపోలు ఉంటాయి. ప్రస్తుతం వరంగల్ రీజియన్‌లో ఉన్న జనగామ డిపో ప్రాంతం యాదాద్రి జిల్లాలో కలువనుండగా, ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఉన్న హుజూరాబాద్ డిపో ప్రతిపాదిత హన్మకొండ జిల్లాలోకి వస్తుంది. హన్మకొండ - హైదరాబాద్ రూట్ ఒకే రీజియన్ పరిధిలోకి తీసుకురావాలనే ఆలోచనలో ఆర్టీసీ యాజమాన్యం ఉంది. దీంతో ప్రతిపాదిత యాదాద్రి జిల్లాలోని యాదగిరి గుట్ట డిపో, జనగామ డిపో వరంగల్ రీజియన్‌లోనే ఉంచాలనే ఆర్టీసీ యాజమాన్యం యోచిస్తోంది. హుజూరాబాద్ నుంచి మొదలుకుంటే హైదరాబాద్ వరకు ఒకే రీజియన్ పరిధిలో ఈ రూట్ ఉండడం ద్వారా పర్యవేక్షణతోపాటు బస్సుల ఫ్రీక్వెన్షీ పరంగా నిర్ణయం తీసుకోవడం సులువవుతుందనే ఆలోచనతో ఆర్టీసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పాలనాపరంగా యాదగిరిగుట్ట, జనగామ డిపోలకు వరంగల్ కేంద్రంగా ఉండడం అనుకూలంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ రూట్లో ప్రధానంగా ప్రస్తుత వరంగల్ జిల్లా పరిధిలోని బస్సులే అధికసంఖ్యలో నడుస్తున్నాయి. వరంగల్ జిల్లాలో విభజించిన నాలుగు జిల్లాల్లో వరంగల్ రీజియన్ పరిధిలోని బస్సులే ఈ రూట్లో నడుస్తాయి. ఇతర రీజియన్ల బస్సులకు ఏమాత్రం అవకాశం లేదు. ఈ క్రమంలో ఈ రూట్‌ను ఒకే గొడుగు కింద ఉండేలా యాదగిరిగుట్ట, జనగామను వరంగల్‌లో రీజియన్‌లో కొనసాగించాలనేది ఆర్టీసీ యాజమాన్యం ఆలోచన. రీజియన్‌లోకి యాదగిరిగుట్ట, హుజూరాబాద్ డిపోలు రానుండగా, కొత్త జిల్లాల ఏర్పాటుతో మహబూబాద్ జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు డిపోలు ఖమ్మం రీజియన్‌లో కలుపనున్నట్లు సమాచారం. మహబూబాబాద్ జిల్లాలోకి ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలు కలుస్తున్నాయి. ఈ క్రమంలో పాలనాపరంగా మçహబూబాబాద్ జిల్లాలోని డిపోలకు ఖమ్మం రీజియన్‌లో ఉండడం సౌలభ్యంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తొర్రూరు డిపోకు వరంగల్ రీజియన్ అనుకూలంగా ఉన్న జిల్లా పరంగా ఒక డిపో ఖమ్మం రీజియన్‌లో, ఒక డిపో వరంగల్ రీజియన్‌లో ఉంటే ఇబ్బందులు తలెత్తనున్నాయని భావిస్తున్న అధికారులు మహబూబాద్ జిల్లాను ఆర్టీసీ పరంగా ఖమ్మం రీజియన్‌లో ఉంచాలనే ఆలోచనలో ఆర్టీసీ యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. అయితే సిబ్బంది అంశంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఉద్యోగులు, కార్మికుల నియామకం రీజియన్ల వారీగా చేపట్టడంతో సీనియారిటీపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఉద్యోగులకు, కార్మికులకు ఆప్షన్ అవకాశం ఇవ్వాలా? నియామకం పొందిన జిల్లాలోనే కొనసాగించాలా? ఆనే ఆలోచనలో యాజమాన్యం ఉంది. -
వరంగల్ రీజియన్ మూడు ముక్కలు
మార్కెటింగ్ శాఖలో విభజన నూతన రీజియన్లకు జేడీఎంలు రూ.10కోట్ల ఆదాయం దాటితే డీఎంఓలు వరంగల్ సిటీ : నూతన జిల్లాల ఏర్పాటుతో మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజియన్ మూడు ముక్కలు కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మార్కెటింగ్ శాఖ ఐదు ల్లాలతో హైదరాబాద్ రీజియ న్, మరో 5 జిల్లాలతో వరంగల్ రీజియన్‌గా కొనసాగుతోంది. దసరా నుంచి మరో 17 జిల్లాలు నూతనంగా ఏర్పడుతున్నందు న మార్కెటింగ్ శాఖను 4 రీజియన్లుగా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరంగల్ రీజియన్ పరిధిలో ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలు ఉన్నాయి. నూతన జి ల్లాల ఏర్పాటుతో వరంగల్, కరీంనగర్ రెండు జిల్లాలు ఒక రీజి యన్‌గా, ఖమ్మం, నల్గొండ జిల్లాలు మరో రీజియన్‌గా, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు ఇంకో రీజియన్‌గా ఏర్పాటు కాబోతున్నాయి.హైదరాబాద్ రీజియన్ యథావిధిగా కొనసాగనుంది. నలుగురు జేడీఎంలు నాలుగు రీజియన్లు ఏర్పడుతున్నందున మార్కెటింగ్ శాఖలో నలుగురు జేడీఎంలు విధులు నిర్వర్తించాల్సి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ జేడీఎంగా రవికుమార్, వరంగల్ రీజియన్ జేడీఎంగా సామ్యేల్‌రాజ్ ఇంచార్జీ అధికారిగా ఉన్నారు. దసరా నుం చి నూతన జిల్లా పాలన ప్రారంభం కానున్నందున నలుగురు జేడీఎంలు అవసరం ఉండగా, ప్రస్తుతం వరంగల్ రీజియన్ జేడీఎం సామ్యేల్రాజును వరంగల్‌లోనే పర్మనెంట్ పోస్టింగ్ ఇస్తారా, లేదంటే నూతన రీజియన్‌కు బదిలీ చేస్తారా సందిగ్దం నెలకొంది. కాగా ప్రస్తుతం జేడీఎంల తర్వాత సీనియార్టీ ప్రకారం 3వ స్థానంలో నర్సంపేట మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎర్రం అశోక్, 4వ స్థానంలో ప్రస్తుతం వరంగల్ రీజియన్ మార్కెట్ డీడీఎంగా విధులు నిర్వర్తిస్తున్న ఉప్పుల శ్రీనివాస్, 5వ స్థానంలో మల్లేశం, 6వ స్థానంలో ఎల్లయ్య ఉన్నారు. కాగా ఇందులో మూడో స్థానంలో ఉన్న అశోక్ అనారోగ్యంతో బాధపడుతుండగా జేడీఎంగా బాధ్యతలు తీసుకోవడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. రాజధానికి తరలనున్న 18 మంది డీడీఎంలు రాష్ట్రవ్యాప్తంగా రెండు రీజియన్లల్లో ప్రస్తుతం 18 మంది డీడీఎం(డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్)లు మార్కెటింగ్‌శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో 13మంది డీడీఎంలు వరంగల్ రీజియన్ పరిధిలో పనిచేస్తుండగా, 5గురు డీడీఎంలు హైదరాబాద్ రీజియన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం వీరందరినీ హైదరాబాద్ హెడ్ ఆఫీస్‌కు తరలించి, విజిలెన్స్ అధికారులుగా బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. ముగ్గురికే డీఎంఓలుగా అవకాశం మార్కెటింగ్ శాఖలో ప్రస్తుతం జిల్లా స్థాయి మార్కెటింగ్ అధికారిగా డీఎంఓ (డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్)లను నియమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు జిల్లా స్థాయి అధికారిగా ఏడీ(అసిస్టెంట్ డైరెక్టర్) విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా డీఎంలను నియమిస్తే ఇంతకు ముందు డీడీఈఎంలుగా పనిచేసిన అధికారులే తిరిగి డీఎంలుగా బాధ్యతలు స్వీకరిస్తారు. దీంతో కొత్తేమీ లేదనే కోణంలో మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు ఆలోచించి, రూ.10కోట్లు ఆదాయం దాటిన మార్కెట్లకే డీఎంలను నియమించాలని, రూ.10కోట్ల ఆదాయం లోపు ఉన్న మార్కెట్లలో ఏడీలే అధికారులు విధులు నిర్వర్తించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రూ.10కోట్ల ఆదాయం దాటిన మార్కెట్లు వరంగల్‌తోపాటు ఖమ్మం, నిజామాబాద్ మార్కెట్లు మాత్రమే ఉన్నాయి. అంటే నాలుగు రీజియన్లతో నూతన జిల్లాలు ఏర్పాౖటెతే ముగ్గురు డీఎంలు బాధ్యతలు స్వీకరిస్తారు. అంటే మరో 15మంది డీడీఎంలు హెడ్ ఆఫీస్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. గత 5 రోజులుగా మార్కెటింగ్ శాఖలో మార్పుల కోసం ఉన్నతాధికారులతో ముమ్మరంగా సమావేశాలు, చర్చలు కొనసాగుతున్నాయి. ఈనెల 20వ తేదీ వరకు ఎన్ని రీజియన్లు, ఎంత మంది డీఎంలు, జేడీఎంల వివరాలు పూర్తిగా వెల్లడికానున్నాయి. -
ఏఎంసీల పరిధిలో భారీగా మొక్కల పెంపకం
5 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం మార్కెటింగ్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు రావులపాలెం: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల పరిధిలో వనం–మనం పథకం ద్వారా ఐదు లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్టు మార్కెటింగ్ శాఖ విశాఖపట్నం రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె. శ్రీనివాసరావు తెలిపారు. వనం–మనంలో భాగంగా రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో ఏఎంసీ చైర్మన్ బండారు వెంకట సత్తిబాబు ఆధ్వర్యంలో సోమవారం వన మహోత్సవం జరిగింది. యార్డు ప్రాంగణంలో జేడీ శ్రీనివాసరావు, చైర్మన్ సత్తిబాబులు పలు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి ఎస్. సత్యనారాయణ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఏవీ శ్రీధర్, సూపర్వైజర్లు పి.సుబ్బరాజు, ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ గుతు ్తల ఏడుకొండలు పాల్గొన్నారు. స్థానిక డాన్‌బాస్కో స్కూల్లో కరస్పాండెంట్ బాలరాజు ప్రిన్సిపాల్ బల్తాజార్ ఆధ్వర్యంలో 550 మొక్కలను విద్యార్థులకు పంపిణీ చేశారు. -
మతం-శాస్త్రీయత
సమాజంలో శాస్త్రీయ సంశోధననూ, వివేచననూ కలిగించడం పౌరులందరి బాధ్యతని భారత రాజ్యాంగంలోని 51 ఏ(హెచ్) అధికరణ చెబుతోంది. ఈ బాధ్యతను గుర్తించి నిర్వర్తించినందుకే పక్షం రోజులక్రితం కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్‌లో ప్రముఖ కన్నడ సాహితీవేత్త, హంపీ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ డాక్టర్ ఎంఎం కల్బుర్గిని ఉన్మాదులు కాల్చిచంపారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని చెప్పడం వంటివి అంతిమంగా తమకు ఎసరు తెస్తాయేమోనని...జనంపై తమ పట్టు సడలిపోతుందేమోనని ఉన్మాదులు భావిస్తారు. అందుకే అలాంటి చైతన్యం కలిగించేవారిపై దాడులకు దిగుతారు. బెదిరిస్తారు. ఈ బాపతు ఉన్మాదులు అన్ని మతాల్లోనూ ఉంటారు. ఈ నేపథ్యంలో... శాస్త్రీయ ప్రాతిపదికలేని హిందూ మత విలువలను విడనాడాలని రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఒక సదస్సులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) అధినేత మోహన్ భాగవత్ ఇచ్చిన పిలుపు స్వాగతించదగ్గది. విమర్శలను స్వీకరించడం, లోటుపాట్లున్నప్పుడు సరిదిద్దు కోవడం, తప్పుడు ఆలోచనలను, ఆచరణను గట్టిగా వ్యతిరేకించడం ఎవరైనా చేయవలసిందే. వాస్తవానికి ఆరెస్సెస్ సంస్థ హిందూ మతానికి ప్రతినిధి కాదు. హిందూ మత విశ్వాసాలుండేవారిని సంఘటితపరిచి, జాతీయ భావాలను పెంపొందింపజేసే ఆశయంతో 90 ఏళ్లక్రితం ఆరెస్సెస్ ఆవిర్భవించింది. వివాదాస్పద అంశాలను స్పృశించడం, వాటికి సంబంధించి తనదైన అభిప్రాయాన్ని చెప్పడం మోహన్ భాగవత్‌కు మొదటినుంచీ అలవాటే. ఆ అభిప్రాయాలు హాస్యాస్పదమైనవని కొట్టిపారేసే వారుండొచ్చు. అందులో తప్పులు వెతికేవారుండొచ్చు. అయితే ఆయన ఆ అంశాలను ప్రస్తావిస్తున్నందుకు, వాటిపై ఒక చర్చ లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నందుకూ భాగవత్‌ను అభినందించాలి. మొన్న ఫిబ్రవరిలో ఒక సదస్సులో మాట్లాడుతూ దేశంపై దండయాత్రలకు వచ్చినవారే ఇక్కడి ప్రజలను కుల ప్రాతిపదికన విభజించే కుట్ర చేశారని ఆరోపించారు. దేశంలో అంటరానితనం వంటి దురాచారాలన్నిటికీ ఆ దండయాత్రలే కారణమని చెప్పారు. సమాజంలో ఆధిపత్య సంస్కృతికి, ప్రత్యేకించి కుల వివక్షకు, సాంఘిక దురాచారాలకు ఏ శక్తులు కారణమో, వాటి ప్రయోజనాలేమిటో ఎవరికీ తెలియనిది కాదు. సమాజం ఇలా చీలి ఉండటం, ఆ మేరకది బలహీనపడటంవల్లే దండెత్తి వచ్చినవారి పని సులభమైందనడం వాస్తవం. కానీ భాగవత్ దీన్ని తలకిందులు చేసి చెప్పారు. అయినా సమాజంలో కుల వివక్ష ఉన్నదని, అంటరానితనం ఉన్నదని అంగీకరించడం, దాని పరిష్కారానికి ఒక ప్రయత్నం చేయడం హర్షించదగింది. గ్రామాల్లో కొన్ని కులాలను తక్కువగా చూస్తూ ఆ కులాలకు చెందిన పౌరులను దేవాలయాల్లోకి ప్రవేశించనీయకపోవడం, బావుల్లో నుంచి, చెరువుల్లోనుంచి మంచి నీరు తెచ్చుకునేందుకు అనుమతించకపోవడం, ఆఖరికి మరణానంతరం స్మశాన వాటికలను వినియోగించుకోవడానికి కూడా అభ్యంతరం చెప్పడం ఈనాటికీ మన సమాజంలో అమలవుతున్న దురాచారాలు. మారుమూల ప్రాంతాల్లో ఇంత దుర్మార్గంగా అమలయ్యే ఈ బాపతు పద్ధతులు నాగరికత ఉందంటున్న పట్టణ ప్రాంతాల్లో, నగరాల్లో మరో రూపంలో...మరో విధంగా అమలవుతున్నాయి. ఎక్కువ మందిని ప్రభావితం చేయగల ఆరెస్సెస్ వంటి సంస్థ వీటిని ప్రస్తావించి సరిచేయడానికి పూనుకోవడం మంచిదే. ఈ క్రమంలో ఆ దురాచారాల పుట్టుకకు సంబంధించి భాగవత్కున్న అభిప్రాయాలతో ఏకీభవించాల్సిన అవసరం లేదు. మతంలోని అశాస్త్రీయమైన విలువలను, ఆచరణను విడనాడాలని తాజాగా ఆయన ఇచ్చిన పిలుపుపైనా భిన్నాభిప్రాయాలుంటాయి. మతం పునాదులే అశాస్త్రీయమైన వని వాదించేవారికి ఈ పిలుపు వింతగా అనిపించవచ్చు. ఏడేళ్లక్రితం మహారాష్ట్రలోని మాలెగావ్‌లో పేలుళ్లకు పాల్పడి 37మంది ప్రాణాలను బలిగొన్నది అభినవ భారత్ అనే సంస్థ అని తొలిసారి వెల్లడయినప్పుడు అందరూ దిగ్భ్రాంతులయ్యారు. ఆ సంస్థకు సంబంధించి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్‌లు అరెస్టయ్యారు. ఆ తర్వాత శ్రీరాంసేన పేరిట కర్ణాటక రాష్ట్రంలో పార్క్‌ల్లో, పబ్‌లలో యువ జంటలపై దాడి చేసి అమానుషంగా కొట్టడంలాంటి ఉదంతాలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్రలో మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన డాక్టర్ దభోల్కర్, పన్సారే వంటివారిని కాల్చిచంపారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వాన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక సంఘ్ పరివార్ నేతలు, కొందరు బీజేపీ నేతలు చేసిన ప్రకటనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఢిల్లీని పాలించాల్సింది రాముడి సంతానమా...అక్రమ సంతానమా తేల్చుకోవాలంటూ ఒక కేంద్రమంత్రి ఢిల్లీ ప్రజలకు పిలుపునివ్వడం, హిందువులు ఎక్కువమంది పిల్లల్ని కనాలని మరికొందరు నేతలు అనడం, ఘర్‌వాపసీ పేరుమీద మత మార్పిడులకు దిగడంవంటివి అలజడిని రేకెత్తించాయి. ఢిల్లీలోనూ, కొన్ని ఇతరచోట్లా చర్చిలపై దాడులు జరిగాయి. విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులపై కఠిన చర్యలుంటాయని ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించిన తర్వాతనే వీటికి అడ్డుకట్ట పడింది. ఇప్పుడు మోహన్ భాగవత్ శాస్త్రీయ ప్రాతిపదిక గురించి మాట్లాడటం కూడా ఆ తరహా ప్రభావాన్నే చూపుతుంది. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా సాగే ఉద్యమాలు తమ మత ప్రయోజనాలను దెబ్బతీస్తాయనుకునే ఉన్మాదులను భాగవత్ చేసిన ప్రకటన ఆలోచింపజేస్తుంది. అబార్షన్లు చేయించుకున్న మహిళలను క్షమించాలని ఈ మధ్య పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చిన పిలుపును చాలామంది స్వాగతించారు. అబార్షన్లపై వాటికన్ తన అభిప్రాయాలు మార్చుకొనకపోయినా కనీసం ఇలా పిలుపునివ్వడం మెచ్చదగిందన్నారు. ఇప్పుడు శాస్త్రీయతకు విరుద్ధంగా ఉన్న విలువలను విడనాడాలన్న భాగవత్ పిలుపు కూడా ఎన్ని పరిమితులున్నా హర్షించవలసిందే. -
ఇంధన పొదుపులో రీజియన్ ముందంజ
హన్మకొండ : ఇంధన పొదుపులో ఆర్టీసీ వరంగల్ రీజియన్ ఇతర రీజియన్లకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడి అధికారుల కృషితో వరంగల్ రీజియన్ ఇంధన ఆదాలో రికార్డులు సాధిస్తోంది. నష్టాల నుంచి ఆర్టీసీని గట్టెక్కించేం దుకు ఖర్చులు తగ్గించడంలో భాగంగా రీజి యన్ అధికారులు ఇంధన పొదుపు, టైర్ల మ న్నిక, టైర్ల జీవితకాలం పెంపుపై దృష్టి సారిం చారు. ఈ మేరకు డీజిల్ పొదుపుపై డ్రైవర్లకు నిరంతర శిక్షణ ఇస్తూ ఎలా బస్సు నడిపితే డీజి ల్ ఆదా అవుతుందో వివరిస్తున్నారు. ఈ శిక్షణ ఫలితంగా 2011-2012 ఆర్థిక సంవత్సరంలో 5.49 కేఎంపీఎల్‌తో రాష్ట్రంలోనే ప్రథమ స్థా నం, 2012-2013 ఆర్థిక సంవత్సరంలో 4.9 కేఎంపీఎల్‌తో రాష్ట్రంలో ద్వితీయ స్థానం, 2013-2014లో 5.50 కేఎంపీఎల్‌తో ద్వితీయ స్థానంలో నిలిచిన ఆర్టీసీ వరంగల్ రీజియన్ ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు 5.55 కేఎంపీఎల్ సాధించి అగ్రస్థానంలో దూసుకువెళ్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే 5.55 కేఎంపీఎల్‌తో ప్రథమ స్థానంతో ముందు నిలుస్తోందని అధికారులు వెల్లడించారు. కాగా, ఆర్టీసీ వినియోగిస్తున్న బస్సుల్లో గరుడ బస్సులు డీజిల్ అతి ఎక్కువగా తీసుకుంటుండగా.. ఇందులో కూ డా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో 4.24 కేఎంపీఎల్‌తో వరంగల్ రీజి యన్ అగ్రస్థానంలో నిలిచింది. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో 763 బస్సులు ప్రతి రోజుకు మూడు లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా.. అధికారుల సూచనలు, ప్రోత్సాహంతో కార్మికులు ఇంధన పొదుపు ద్వారా ఏటా రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చులు తగ్గిస్తూ ఆదా చేస్తున్నారు. సమష్టి కృషితోనే ఈ విజయం... సమష్టి కృషితో ఇంధన పొదుపులో సంస్థలోనే ప్రథమ స్థానంలో నిలవగలుగుతున్నాం. రీజినల్ మేనేజర్ ఇ.యాదగిరి సూచనలు.. డ్రైవర్లు, మెకానిక్‌ల సహకారంతో నిరంతర శిక్షణ ద్వారా ఇంధన పొదుపును చేయగలుగుతున్నాం. అలాగే, పొదుపులో ముందు నిలుస్తున్న డ్రైవర్లకు ప్రోత్సాహకాలు అందించి ప్రోత్సహిస్తున్నాం. డీజిల్ పొదుపు ద్వారా ఖర్చులు త గ్గిస్తూ సంస్థకు పరోక్షంగా ఆదాయాన్ని సమకూర్చుతున్నాం. - అంచూరి శ్రీధర్, డిప్యూటీ సీఎంఈ, వరంగల్ రీజియన్ -
కాంగ్రెస్ పార్టి విప్‌ను ఎంపీలు ధిక్కరించాలి