world's largest underground hospital in 30 hours ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas War) మధ్య యుద్ధం రోజురోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తోంది. ఏడో రోజుకు చేరిన ఈ యుద్ధంలో ఇప్పటికే ఇరువైపులా 2,800 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్‌ను అణిచి వేసేందుకు ఇజ్రాయెల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు హైఫాలోని కార్ పార్కింగ్ స్థలాన్ని ప్రపంచంలోని అతిపెద్ద అండర్ గ్రౌండ్ ఆసుపత్రి సిద్దమైపోయింది.
యుద్ధం ప్రారంభమైన తర్వాత రాంబమ్ హెల్త్ కేర్ క్యాంపస్ (RHCC) పార్కింగ్ స్థలంలో తాత్కాలిక అత్యవసర అండర్‌గ్రౌండ్ ఆసుపత్రి సిద్దం చేశారు. అదీ కేవలం 30 గంటల్లో భారీ భూగర్భ ఆసుపత్రిగా మార్చారు. 1,300 పడకలతో, ఆక్సిజన్, వైద్య , శానిటరీ సామాగ్రి కోసం ఫిట్టింగ్‌లతో పూర్తి చేశారు.
షవర్లు, సింక్‌లు, నీటి సరఫరాతో మరుగుదొడ్లు , మురుగు నీటి కనెక్షన్‌లు, 1,300 పడకలు క్లీన్ షీట్లు , దుప్పట్లతో అన్ని సిద్దంగా ఉన్నాయి. క్యూబికల్‌ల మధ్య ఉండే కేబుల్స్ ఆక్సిజన్ సరఫరాను లోపలికి పంపేలా, లేదా లోపలి మానవ స్రావాలను బయటకు పంపేలా ఏర్పాట్లు చేశారు.
ముఖ్యంగా క్లాస్ట్రోఫోబియా ఉన్నవారిలో ఆందోళన తగ్గించాలనే లక్ష్యంతో హాస్పిటల్ సిబ్బంది గోడలను పూల పోస్టర్‌లతో అలంకరించడం ద్వారా ఆ ప్రాంతాన్ని సజీవంగా మార్చడానికి ప్రయత్నించడం గమనార్హం. ఈ స్థలం చాలా అందంగా ఉండకపోవచ్చు, కానీ చాలా సురక్షిత మైందని డిప్యూటీ చీఫ్ ఆఫ్ నర్సు అయినట్ పెరెక్స్ అన్నారు.
మూడు అంతస్తుల్లో, ప్రతి అంతస్తు 20వేల చదరపు మీటర్లకు పైగా ఉంటుందనీ, సాధారణ రోజుల్లో ఇది పార్కింగ్ స్థలం కానీ అత్యవసర పరిస్థితుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ ఆసుపత్రిగా మారిపోతుందని రాంబమ్ హాస్పిటల్ సీఈవో, డైరెక్టర్ జనరల్ మైఖేల్ హాల్బెర్తాల్ చెప్పారు.
వాస్తవానికి 2006లో హిజ్బుల్లాతో జరిగిన సెకండ్ లెబనాన్ వార్ సందర్బంగా ద్వంద్వ-వినియోగ ఆలోచనతో ఇది ముందుకొచ్చింది. ఆ సమయంలో ఆసుపత్రి చుట్టూ 400 రాకెట్ల వర్షం కురిసిందని అనస్థటిస్ట్ ఫిలిప్ అబెకాసిస్ గుర్తు చేసుకున్నారు. యుద్ధం తిరిగి వస్తే , దురదృష్టవశాత్తు యుద్ధం తిరిగి వస్తుందని తెలుసు. అపుడు ఈ పార్కింగ్‌ను అండర్‌గ్రౌండ్ హాస్పిటల్‌గా ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచన వచ్చిందన్నారు. దాని ఫలితమే ఇది అని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment