అంతు చిక్కని భూగర్భ అద్భుతాలు | Mysterious of Ancient Underground Worlds | Sakshi
Sakshi News home page

అంతు చిక్కని భూగర్భ అద్భుతాలు

Published Fri, May 27 2016 6:33 PM | Last Updated on Sat, Jun 2 2018 7:27 PM

అంతు చిక్కని భూగర్భ అద్భుతాలు - Sakshi

అంతు చిక్కని భూగర్భ అద్భుతాలు

మానవులు తలచుకుంటే సాధించలేనిదే లేదంటారు. అయితే భూగర్భంలో మనకు తెలియని రహస్యాలెన్నో  నిక్షిప్తమై ఉన్నా వాటిని కనుగొనేందుకు పురాతత్వవేత్తలు, శాస్త్రనిపుణులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నా కనిపెట్టలేకపోతున్నారు. ఎన్నో ప్రయోగాలు చేసినా ఇంకా తెలియని రహస్యాలెన్నో భూగర్భంలోనే మిగిలిపోతున్నాయి. మనకు తెలియని అద్భుత ప్రపంచాన్ని కనిపెట్టేందుకు పురాతత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు అహర్నిశలూ కృషి చేస్తున్నారు. భూగర్భ ప్రపంచాన్ని సందర్శించేందుకు, ప్రజలకు ప్రాచీన చరరిత్రను పరిచయం చేసేందుకు అనేక ప్రయోగాలు చేస్తున్నారు.

ప్రాచీన పురాణాలు, ఇతిహాసాలు, రహస్య స్థావరాలు, ఆలయాలు, కట్టడాలు, సమాధులు వంటి ఎన్నో అద్భుతాలను కనుగొన్న శాస్త్రవేత్తలు, పురాతత్వవేత్తలు ప్రాచీన చరిత్రను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. భూగర్భ ప్రపంచంలో అనేక పొరంగాలు, గుహలు, నగరాలు కూడ ఉన్నాయని, వాటి వెనుక ఎంతో చరిత్ర దాగి ఉందని, అయితే వాటిని ఎటువంటి ప్రయోజనాలకోసం, ఏ సందర్భంలో నిర్మించారో పూర్తిగా తెలుసుకోలేకపోతున్నామని చెప్తున్నారు. మనకు లభించిన ఆధారాలను బట్టి కొంత చరిత్ర తెలిసినా, ఇంకా భూగర్భంలో గుర్తించలేని ప్రపంచం ఎంతో ఉందని అంటున్నారు. అయితే చరిత్ర చెప్తున్న 11 అత్యంత రహస్య భూగర్భ ప్రాంతాల్లోని విశేషాలను, వివరాలను శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్టులు ఇప్పటివరకూ ఇంకా గుర్తించలేకపోయారని, అసలు అవి ఉన్నాయా లేవా అన్న అనుమానాలు కూడ వ్యక్తమౌతున్నాయని ఓ ప్రైవేట్ వెబ్ సైట్ వివరించింది.  తమకు తెలిసిన ఆధారాలను బట్టి ఆయా భూగర్భ అద్భుతాలకు సంబంధించిన చిత్రాలను వెలువరించింది.


ముఖ్యంగా ఈజిప్టు లోని 'లాబ్రినాథ్' భూగర్భ అద్భుతాల్లో ఒకటి. పిరమిడ్లకు ప్రఖ్యాతి చెందిన ఈజిప్టులో లాబ్రినాథ్ గోడలపై చెక్కిన పురాతన లిపి కూడ ఎంతో ప్రాముఖ్యతను పొందింది. అయితే ఆ లిపి ఏమిటి అన్నది మాత్రం నేటికీ శాస్త్రవేత్తలకు అంతుబట్టడం లేదు. కానీ లాబ్రినాథ్ పై పరిశోధనలు చేపట్టేందుకు ఈజిప్ట్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక అమెరికాలోని  కాలిఫోర్నియాలో 'డెత్ వ్యాలీ'గా పిలిచే ప్రాంతం 5 వేల ఏళ్ళనాటి అండర్ గ్రౌండ్ పట్టణం. అక్కడ మమ్మీలు, కళాఖండాలు ఉన్నట్లుగా గుర్తించినా... శాస్త్రవేత్తలు వాటిని అక్కడ ఎవరు ఎందుకు ఉంచారో చెప్పలేకపోయారు. అలాగే 'ది గ్రాండ్ కెన్యాన్' లో పురాతన నాగరికతకు చెందిన ప్రజలు నివసిస్తారని పరిశోధనల్లో తేలినా... అది నిజమా కాదా అన్న విషయం తేల్చలేకపోయారు. మరో అద్భుత భూగర్భ నగరం టర్కీలోని డేరిన్ కియు. ఈ అత్యంత ఆధునిక నగరాన్నిఎవరు ఎప్పుడు నిర్మించారో ఇప్పటికీ శాస్త్రవేత్తలు చెప్పలేకపోగా... మిస్సోరి భూగర్భంలోని పట్టణంలోమనుషుల భారీ అస్తికలను కనుగొన్న నిపుణులు... అవి రాక్షసులవి అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇక జపాన్ లోని మౌంట్ త్సురుగి డీపెన్స్ ప్రాంతాన్ని కనిపెట్టి, అది అత్యంత ప్రాచీన నగరమని గుర్తించి, అక్కడే మూడేళ్ళపాటు ప్రయోగాలు చేసినా దానికి సంబంధించిన మరే వివరాలను తెలుసుకోలేకపోయారు. రహస్య భూగర్భ స్థావరం 'తకలమకన్ డెజర్ట్' ఎడారి పరిస్థితీ అదే. అక్కడి ఎడారిలో వెళ్ళినవారికి తిరిగి వచ్చేందుకు దారి కనిపించదని, ఇసుకతో నిర్మించిన ఎన్నో దేవాలయాలు అక్కడ ఉన్నాయని నిపుణులు కనుగొన్నారు.  అయితే వాటిని ఇసుకతో ఎలా నిర్మించారో మాత్రం ఇంకా తెలుసుకోలేకపోయారు. రష్యాలోని హైపర్ బోరియా సరస్సును అక్కడివారు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారని తెలుసుకున్నా... దీన్ని ఎవరు నిర్మించారన్న వివరాలు చెప్పలేకపోతున్నారు. అయితే సియాక్స్ ఇండియన్స్ వైట్ హార్స్ భూగర్భ  ప్రాంతంలోని, ఓ భూగర్భ గుహ కథనం మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఓ గిరిజన వ్యక్తికి చెందినదిగా వినిపిస్తుంది. ఇటలీలోని భూగర్భ పిరమిడ్ తో పాటు.... త్రీ ఐడ్ లామా వంటి అద్భుతాలెన్నో మనకు తెలియని రహస్యాలుగానే మిగిలిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement