Ancient artifacts
-
ఇది.. 'మట్టిదిబ్బ' అనుకుంటున్నారా!?
దూరం నుంచి చూస్తే భారీ మట్టిదిబ్బలా కనిపిస్తుంది గాని, ఇది పురాతన రాతి కట్టడం. ఇది సామూహిక సమాధి. కొత్తరాతి యుగం నాటి ఈ భారీ సమాధి ఐర్లండ్‌లోని డ్రోహడా పట్టణానికి చేరువలో బోయన్ నదీ తీరాన ఉంది. దీనిని క్రీస్తుపూర్వం 3200 ప్రాంతంలో నిర్మించి ఉంటారని అంచనా.ఈ పురాతన నిర్మాణాన్ని యునెస్కో చారిత్రక వారసత్వ కట్టడంగా గుర్తించింది. న్యూగ్రేంజ్ మాన్యుమెంట్ పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ కట్టడాన్ని 1.1 ఎకరాల విస్తీర్ణంలో 39 అడుగుల ఎత్తున నిర్మించారు. దీని లోపలకు చేరుకోవడానికి ప్రవేశ ద్వారం, అక్కడి నుంచి అరవై అడుగుల నడవ దారి ఉంటాయి. లోపలి భాగంలో ఉన్న మూడు గదుల్లో పురాతన మానవ అస్థికలు కనిపిస్తాయి.ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ కాలంలోనే నిట్టనిలువుగా రాళ్లను నిలిపి, వాటిని కలుపుతూ వృత్తాకారంలో ఈ సమాధిని నిర్మించడం విశేషం. పురాతత్త్వ శాస్త్రవేత్తలు దీనిలోపల జరిపిన తవ్వకాల్లో దహనం చేసిన మానవ అస్థికలు, దహనం చేయని మానవ అస్థికలు కూడా దొరికాయి. వాటితో పాటు ఆనాటి మానవులు ఉపయోగించిన పలు వస్తువులు కూడా దొరికాయి.ఇవి చదవండి: పూర్వం 'ధ్రువసంధి' అయోధ్యకు.. రాజుగా.. -
భళా.. చిత్రకళా..!
మనసులో మెదిలే భావాలకు రంగులరూపం దిద్దుతూ.. ప్రకృతి అందాలని మనసులో నిక్షిప్తం చేసుకుని సృజనాత్మకత జోడించి కుంచెతో అద్భుతంగా తీర్చిదిద్దే ప్రాచీన కళ పెయింటింగ్.. ప్రాచీనకళగా గుర్తింపు పొందిన చిత్రలేఖనం నేడు ఆధునిక హంగులు అందుకున్న కార్పొరేట్ అవకాశాలను సైతం దక్కించుకుంటూ తన ప్రత్యేకతను చాటుతోంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ కోర్సు డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉంది. ఏఎఫ్‌యూ : వైఎస్సార్ జిల్లా కడప నగరంలో ఏర్పాటైన డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో బీఎఫ్ఏ పెయింటింగ్ అందుబాటులో ఉంది. 40 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియట్, డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఇందులో ప్రవేశం పొందేందుకు అర్హులు. ప్రస్తుతం సమాజంలో కళాభిలాష పెరిగిన నేపథ్యంలో పెయింటింగ్ యువతకు మంచి కెరీర్ మార్గంగా నిలుస్తోంది. ఆయిల్పెయింట్, వాటర్, ఆక్రిలిక్ పెయింట్, టెంపెరా పెయింట్ వంటి రకాలు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఉద్యోగావకాశాలు.. ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో చిత్రలేఖనానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సృజనాత్మకత కలిగిన ప్రతిరంగానికి ఇది విస్తరించింది. కాలానికి అనుగుణంగా చిత్రలేఖనంలో సైతం మార్పులు చోటుచేసుకుని సాఫ్ట్వేర్ రంగం వరకు విస్తరించింది. వెబ్, గ్రాఫిక్డిజైనర్గా, యానిమేటెడ్ ఆర్టిస్ట్‌గా, త్రీడీ, టూడీ కన్సల్టెంట్‌గా, ఆర్ట్గేమ్ డిజైనర్, టెక్స్టైల్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్, ఫ్యాషన్ డిజైనర్, ఫాంట్ డిజైనర్, మ్యూరల్ ఆర్టిస్ట్, ఆర్ట్ హిస్టారియన్, బుక్ ఇలస్ట్రేటర్, కామిక్ ఆర్టిస్ట్, ఫర్చీనర్ డిజైనర్, పోలీస్ స్కెచ్ ఆర్టిస్ట్ ఇలా విభిన్న రంగాల్లో వీరికి కొలువులు లభిస్తాయి. విద్యార్థిదశ నుంచే ఫ్రీలాన్స్ ఆర్టిస్టుగా ఆర్జన ప్రారంభించవచ్చు. వీటితో పాటు ప్రభుత్వ విద్యాసంస్థల్లో డ్రాయింగ్ టీచర్‌గా, అధ్యాపకులుగా రాణించవచ్చు. తమ చిత్రకళా ప్రదర్శనల ద్వారా ఆర్థిక పరిపుష్టి, పేరు ప్రఖ్యాతులు సాధించవచ్చు. ఉన్నతవిద్యలో అవకాశాలు.. బీఎఫ్ఏ పూర్తి చేసిన వారికి మాస్టర్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్ పెయింటింగ్, ఆర్ట్హిస్టరీ, ప్రింట్మేకింగ్లలో పీజీ చేసే అవకాశం ఉంది. వీటితో పాటు బెంగుళూరు ఐఐఎస్సీ, యూఉడీ, ఐడీసీ, నిఫ్ట్, ఎన్ఐడీ వంటి ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో పీహెచ్‌డీలు, ఫెలోషిప్‌లు పొందే అవకాశం ఉంది. ఉజ్వల భవిష్యత్‌కు మార్గం.. విభిన్నంగా ఆలోచించగలగడం, సృజనాత్మకత కలిగిన వారికి ఈ కోర్సు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ కోర్సును పూర్తి చేయడం ద్వారా సాఫ్ట్వేర్, కార్పొరేట్ సంస్థల్లో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ చిత్రలేఖనం ద్వారా ఉపాధి మార్గాలతో పాటు చక్కటి పేరు ప్రఖ్యాతులు అందించే కోర్సు. – వై. మనోహర్‌రావు, కోఆర్డినేటర్, బీఎఫ్ఏ పెయింటింగ్, డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ -
Puppetry: తోలు బొమ్మలాట.. బతుకు బొమ్మలాట
జీవం లేని ఆ మూగ బొమ్మలు ఎన్నో విన్యాసాలు చేస్తాయి. మరెన్నో మాటలు మాట్లాడతాయి. జీవ నిబద్ధమైన రామాయణ, మహాభారత కథలను, మానవ బతుకు చిత్రాల్లో నీతిని కళ్లెదుట ఆవిష్కరిస్తాయి. కేతిగాడు, బంగారక్క, జుట్టు పోలిగాడు రూపంలో హాస్యాన్నీ పండిస్తాయి. వీటి కదలికల వెనుక.. అవి చెప్పే ఊసుల వెనుక బయటకు కనిపించని ఓ జానపదుడి కళాత్మకత దాగి ఉంటుంది. ఆదరణ తగ్గిన ఆ కళనే నమ్ముకుని నేటికీ కొన్ని కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రాచీన కళను భావి తరాలకు అందించేందుకు తహతహలాడుతున్నాయి. అద్దంకి: తోలు బొమ్మలాట అత్యంత పురాతన కళ. విలక్షణమైన ఉన్నతిని అనుభవించిన ఈ కళ భారతీయ జానపద కళా రూపాల్లోనే విశిష్ట స్థానాన్ని పొందింది. మన రాష్ట్రంలోని ప్రాచీన ఓడ రేవులైన కళింగ పట్నం, భీముని పట్నం, కోరంగి, మచిలీపట్నం, వాడరేవు, కొత్తపటా్నల నుంచి విదేశాలకు భారతీయులతో పాటు ఈ కళారూపం కూడా పయనించింది. పర్షియా, టర్కీ మీదుగా గ్రీసు దేశంలో ప్రవేశించిన తోలు బొమ్మలు అక్కడ నూతన రూపం సంతరించుకుని ఉత్తరాఫ్రికాలోని ముస్లిం దేశాలకు, 17వ శతాబ్దంలో ఇటలీకి, అక్కడి నుంచి ఫ్రాన్స్‌లోని వెర్సయిల్స్, పారిస్, పేలేరాయల్ నగరాలకు వ్యాపించాయి. కాలానుగుణంగా ఆయా దేశాల్లో భిన్నరూపాలు ధరించినప్పటికీ దీనికి మాతృక మాత్రం భారత దేశమే. ఇంతటి విశిష్టత పొందిన ఆ కళకు నేడు ఆదరణ తగ్గిపోయింది. అయినప్పటికీ తర తరాలుగా వారసత్వంగా వస్తున్న కళను కాపాడుకునేందుకు కొందరు కళాకారులు నేటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. మిణుకు మిణుకుమంటూనే.. ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో తోలు బొమ్మలాట ప్రదర్శనలిచ్చే కుటుంబాలు సుమారు 500 వరకు ఉన్నాయి. ప్రకాశం జిల్లా అద్దంకిలో 10 కుటుంబాలు, దర్శిలో 10 కుటుంబాలు, ముండ్లమూరు మండలంలోని ఈదర, భీమవరం గ్రామాల్లో 10 కుటుంబాలు, నరసరావుపేటలోని సాతులూరులో 20 కుటుంబాలు, కోటప్పకొండలోని చీమలమర్రి, కొండమోడు వద్ద కొన్ని కుటుంబాలు ప్రాచీన కళను బతికిస్తున్నాయి. ఈ కుటుంబాలు ప్రస్తుతం వినాయక విజయం, రామాయణంలోని సుందరకాండ, మహిరావణ చరిత్ర, లక్ష్మణ స్వామి మూర్చ, రామరావణ యుద్ధం, ఇంద్రజిత్ యుద్దం, సీతా కల్యాణం, మహాభారతంలో పద్మవ్యూహం, విరాటపర్వం, కీచక వధ, కర్ణ, శల్య, సైంధవ, నరకాసురవధ వంటి కథలను ప్రదర్శిస్తున్నాయి. తోలు బొమ్మలాటనే నమ్ముకుని అద్దంకిలో ఉంటున్న రేఖనార్ కోటిలింగం కుటుంబం నేటికీ జీవనం సాగిస్తోంది. ఈ ప్రాచీన కళను భావి తరాలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని ఆ కుటుంబం కోరుతోంది. ఈ కళను వదల్లేం తోలు బొమ్మలాట మా తాతల నుంచి వంశపారంపర్యంగా వస్తోంది. మరో వృత్తి చేయలేం. మా తాతల తండ్రులు మహారాష్ట్ర నుంచి ఆంధ్రాకు వలస వచ్చారు. కళలకు నిలయమైన అద్దంకిలో ఆదరించే వారు ఎక్కువగా ఉంటారని మేమిక్కడ స్థిరపడ్డాం. కుటుంబం మొత్తం కళాకారులమే. ప్రదర్శనకు అవసరమైన బొమ్మలను మేక, గొర్రె చర్మంతో మేమే తయారు చేసుకుంటాం. ఒక్కో బొమ్మ తయారీకి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. భారత, రామాయణ పాత్రలకు సంబంధించిన పాత్రల బొమ్మలను ఆకర్షణీయంగా తెరవెనుక ఆడించడానికి వీలుగా తయారు చేసుకుంటాం. వాటికి దారాలు కట్టి, రేకులకు బిగించి నటనకు అనుగుణమైన కదలికలిస్తాం. మేం బతికున్నంత కాలం ఈ కళను వదల్లేం. జీవన భృతి కోసం మా పిల్లలు ఊరూరా తిరుగుతూ బీరువాలు, సోఫాలు, గ్యాస్ స్టవ్ మరమ్మతులు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ కళకు వైభవం తెచ్చేందుకు కృషి చేయాలి – రేఖనార్ కోటిలింగం, తోలు బొమ్మలాట కళాకారుడు, అద్దంకి -
దత్త చరిత్ర
-
వే వే వేడుక చేద్దాం!
ఒక కవి అనవేమారెడ్డి కొలువుకు వెళ్లి, ఆయన్ని కీర్తిస్తూ ఈ పద్యం చదివాడట. అనవేమ మహీపాల స్వస్త్వస్తు తవ బాహవే అహవే రిపుదోర్దండ చంద్రమండల రాహవే (శత్రువులను అంతమొందించడంలో అనవేమ ప్రభువు చంద్రమండలంలోని రాహువు లాంటివాడని అర్థం.) రాజు సంతోషించి, కవికి మూడువేల వరహాల బహుమానం ప్రకటించాడు. అప్పుడు కవి, ‘ప్రభూ, మీకు నేను నాలుగు ‘వే’లిచ్చాను. మీరు నాకు మూడు వేలివ్వడం ధర్మమా?’ అన్నాడు. రాజు కవి చమత్కారానికి మళ్లీ సంతోషించి, ‘అయితే నాలుగు వేల వరహాలు పుచ్చుకోండి’ అన్నాడు. ‘నేను మీకిచ్చినంతే మీరు నాకు ఇస్తే మీ గొప్పేమిటి?’ అన్నాడు కవివర్యుడు. రాజు పెద్దగా నవ్వి, బహుమానాన్ని అయిదు వేల వరహాలకు పెంచాడు. దానికి కూడా ఆ కవిపుంగవుడు, ‘నేను ఆరువేల నియోగిని మహాప్రభూ’ అన్నాడట. కవి సమయస్ఫూర్తికి మెచ్చి, ఆరువేల వరహాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు రాజు. కానీ కవీంద్రడు ఊరుకున్నాడా! ‘నా దగ్గర వున్నదే నాకు ఇస్తే మీ ఘనత ఏమిటి ప్రభూ’ అన్నాడు. కవి యుక్తి రాజుకు నచ్చి, ఏడు వేల వరహాలు చేశాడు బహుమానాన్ని. ఊహూ! ‘ఏడు అంకె శుభసూచకం కాదుగా’ అన్నాడు ఆ కవి. చివరకు అనవేమారెడ్డి అక్షరాలా ఎనిమిది వేల వరహాలతో ఆ కవికేసరిని సత్కరించాడట. (మీకు ఇలాంటి మరమరాలు తెలిస్తే మాకు రాయండి.) -
ఇలా చేద్దాం...!
తెలుగు భాషది ఎంతో గొప్ప చరిత్ర.. ప్రాచీన హోదా ఉంది. భాషా వైభవం ఇదని, మరే ఇతర ప్రపంచ భాషకూ తీసిపోని సంపూర్ణత్వం తెలుగు భాషకుందని చాటి చెప్పాలి. స్ఫూర్తి పంచాలి. కానీ, అది మాత్రమే సరిపోదు. ప్రభుత్వాలు ఈ నిజాన్ని గ్రహించాలి. భాషను భద్రంగా భవిష్యత్తరాలకు అందించాలంటే.... తెలుగు జాతికి ఒక నమ్మకం కలిగించాలి. తెలుగును నేర్చుకోవడం వల్ల, తెలుగే మాధ్యమంగా పిల్లలకు ప్రాథమిక విద్యాభ్యాసం చేయించడం వల్ల పూర్ణవికాసం సాధ్యమనే విశ్వాసం కలిగించాలి. ఇంగ్లీషు మాధ్యమంగా ప్రాథమిక విద్య నేర్చిన వారి కన్నా తెలుగులో చదివితే ఏ విధంగాను నష్టపోము అన్న భరోసా తల్లిదండ్రులకు, సమకాలీన సమాజానికి కల్పించాలి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన అన్ని దేశాలూ మాతృభాషలోనే ప్రాథమిక విద్యనేర్పడం వల్ల అంతటి సృజన పరిఢవిల్లుతోందని శాస్త్రీయ పరిశోధనల్లో వెల్లడైన విషయాల్ని తెలియపరచాలి. అది సాకారం కావడానికి అవసరమైన వనరుల అందుబాటు, సాధన సంపత్తి సమకూర్చడం, ప్రోత్సాహకాలివ్వడం వంటివి ప్రభుత్వం నిరంతరం చేయాలి. ఇవి కొరవడటం వల్లే నమ్మకం సన్నగిల్లి అత్యధికులు తమ పిల్లలను తెలుగుకు దూరం చేస్తున్నారు. ఇంగ్లీషులో పెంచుతున్నారు. తెలుగుపై ప్రేమ, అభిమానం ఉండీ... ఇంగ్లీషుతోనే భవిష్యత్తు అనుకుంటున్నారు. తెలుగు లేకపోయినా ఒరిగే నష్టం ఏమీ ఉండదని భావిస్తున్నారు. తెలుగు గొప్పతనం తెలియక కాదు. తెలుగుకింత వైభవముందని గ్రహించక కాదు. తెలుగులో తగిన సాంకేతిక సమాచారం లభించదు, పుస్తకాలుండవు, తర్జుమాలు–అనువాదాలు సరిగ్గా జరుగవు, పారిభాషిక పదకోశాలు దొరకవు, పరిశోధనలు లేవు. ఆధునికమైన ఏ అంశమూ తెలుగు భాషలో లభించదు... ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి నమ్మకం కలుగుతుంది? ఆ నమ్మకం పెంచే కృషి నిరంతరం జరగాలి. . .: దిలీప్‌రెడ్డి -
అది.. డైనోసార్లను భయపెట్టింది..!
భారత దేశంలో అంతరించిపోయిన డైనోసార్లు తిరుగాడాయా? ఇక్కడే రాక్షసబల్లులు.. స్వేచ్ఛగా విహరించాయా? లక్షల సంవత్సరాల కిందటే పురాతన జంతువులు భారత్‌లో.. ఆవాసమేర్పరచుకున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. 150 మిలియన్ ఏళ్ల చరిత్ర.. 1500 గంటల పురాతత్వ అధికారుల ప్రయత్నాలు సఫలమ్యాయి. గుజరాత్‌లోని లోడాయి ప్రాంతంలో డైనోసార్లు.. వాటికంటే పూర్వపు జంతువులు సంచరించాయన్న నమ్మకంతో శిలాజాలపై పరిశోధనలు చేసే అధికారులు, భారత పురాతత్వ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తవ్వకాల్లో భారీ సముద్ర సరీసృప శిలాజాల వెలుగు చూశాయి. ఈ శిలాజం 5 మీటర్లు పొడవు.. ఉంది. ఆధునిక తిమింగలాలు, డాల్ఫిన్లకు మాతృకలా ఇది కనిపించడం విశేషం. పొడవైన తోక, నాలుగు రెక్కలు కలిగిన ఈ సముద్ర జంతువు.. 152 నుంచి 157 మిలియన్ సంవత్సరా మధ్య జీవించి ఉండొచ్చని శిలాజ నిపుణులు అంచనా వేస్తున్నారు. డైనోసార్లు, ఇటువంటి సముద్ర సరీసృపాల మధ్య అప్పట్లో భీకరమైన పోరాటాలు జరిగి ఉండొచ్చని వారు అంటున్నారు. ఒక దశలో డైనాసర్లును సైతం ఇవి భయపెట్టి ఉంటాయని అంచనా వేస్తున్నారు. డైనోసార్లను సైతం భయపెట్టే ఈ సముద్ర జంతువులు అప్పట్లో ప్రపంచమంతా ఎలా విస్తరించాయో తెలుసుకునేందుకు ఈ శిలాజాలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. సముద్ర జంతువుల శిలాజాలను గుర్తించే క్రమంలో యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్ బర్గ్‌కు చెందిన స్టీవ్ బ్రుస్టే కృషి వల్లే ఇది బయట పడిందని అధికారులు చెబుతున్నారు. -
గిల్గమెష్: ప్రపంచ ప్రాచీన పురాణం
‘సిధ్యురి’ మరొక స్త్రీ పాత్ర. ‘ఉట్‌నపిస్తిమ్’ నివసించే ప్రాంతానికి ఎలా చేరుకోవాలో గిల్‌గమెష్‌కు తెలియజేస్తుంది. అయితే అమరత్వం సాధించటం సాధ్యం కాదనీ, మనుషులు పరిశుద్ధంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలనీ చెబుతుంది. వివాహం చేసుకొని భార్యను సుఖపెట్టటం, పిల్లల్ని రక్షించటం మగవాడి విధి అని తెలియజేస్తుంది. ప్రపంచ సాహిత్యం మొత్తంలో దీన్ని మించిన హితబోధ లేదనటం అతిశయోక్తి కాదేమో! ఏ పురాణాన్నైనా పుక్కిటి పురాణమని పూర్తిగా తీసిపారవెయ్యకూడదు. రామ రావణ యుద్ధం పురాణం; రావణుడి పొట్టలో అమృతభాండం ఉండటం పుక్కిటి పురాణం. పురాణాన్ని నమ్మటం విజ్ఞత; పుక్కిటి పురాణాన్ని నమ్మటం మూర్ఖత్వం. ఒక జాతి అనుభవసారాన్ని మతవిశ్వాస రూపంలో తెలియజేసేది పురాణం. ఒక పురాణగాథలో అనేక అభూత కల్పనలు ఉండవచ్చు; వాటి వెనకాల అంతర్లీనంగా ఒక సత్యం దాగి ఉంటుంది. ఆ సత్యాన్ని అర్థం చేసుకోవటం వల్ల చరిత్ర పూర్వకాలానికి చెందిన మనుషుల భౌతిక జీవితాన్నీ, విశ్వాసాలనూ, సామాజిక వ్యవస్థలనూ అంచనా వెయ్యవచ్చు. ప్రపంచ పురాణాలన్నింటిలో అత్యంత ప్రాచీనమైనదీ, మొట్టమొదట లిపిబద్ధం చేయబడినదీ సుమేరియన్ నాగరికతకు చెందిన ‘గిల్గమెష్ పురాణం’. సుమేరియన్ల అతి ప్రాచీన నగరాలలో ‘ఉరుక్’ఒకటి. క్రీ.పూ. 2800 కాలంలో ఉరుక్ నగరాన్ని ‘గిల్గమెష్’ పాలించాడు. అతను చేసిన వీరోచిత సాహస కృత్యాలకు గాను మరణానంతరం అతనికి దైవత్వం ఆపాదించబడింది. అతని వీరగాథలు పద్య రూపంలో మౌఖికంగా వాడుకలోకి వచ్చాయి. క్రీ.పూ. 2000 నాటికి లిఖిత రూపంలోకి వచ్చాయి. సుమేరియన్లను అకేడియన్లు ఓడించి సామ్రాజ్యాన్ని స్థాపించారు. గిల్గమెష్ గాథలు అకేడియన్ భాషలోకి మారాయి. ఆ తరువాత బాబిలోనియన్లు సామ్రాజ్యాన్ని స్థాపించారు. గిల్గమెష్ గాథలు బాబిలోనియన్ భాషలోనికీ వెళ్ళాయి. భాషలు వేరయినా సుమేరియన్లకూ, అకేడియన్లకూ, బాబిలోనియన్లకూ లిపి ఒక్కటే. అది సుమేరియన్ల ‘క్యూని ఫారం’ లిపి. గిల్గమెష్ గాథలన్నింటినీ క్రమబద్ధీకరించి ఒక సాధికార ప్రతిని తయారుచేసినవాడు సిన్– లిక్–యునిన్ని (క్రీ.పూ. 1200). సుమేరియన్ భాషలో గిల్‌గమెష్‌కు సంబంధించిన గా«థలు ఐదున్నాయి. బాబిలోనియన్ కాలానికి ఇవి (సాధికార ప్రతిలో) పన్నెండు భాగాలుగా వ్రాయబడ్డాయి. ఒక్కొక్కభాగం ఒక్కొక్క పెద్ద మట్టి ఫలకం (ఖ్చీbl్ఛ్ట) మీద వ్రాయబడి ఉంటుంది. అటువంటి ఫలకాలు సుమేరియన్ భాషలో, అకేడియన్ భాషలో వందల కొద్దీ దొరికాయి. వాటిలో ఏ ఒక్కటీ పూర్తిగా చెక్కు చెదరకుండా లభించలేదు. పురాణాలకు ఉండవలసిన ముఖ్యలక్షణాలన్నీ గిల్గమెష్ పురాణానికి ఉన్నాయి. చెడు మీద మంచి విజయం సాధించటమనేది దాదాపు అన్ని పురాణాల్లో కనిపించే ముఖ్య విషయం. కానీ ‘గిల్గమెష్ పురాణం’లో అటువంటిదేమీ ఉండదు. గిల్గమెష్ చేసిన సాహసకృత్యాలు, స్నేహానికి అతనిచ్చిన ప్రాముఖ్యత, అమరత్వం పొందటానికి చేసిన విఫల ప్రయత్నం ఇందులో కనిపిస్తాయి. దీన్ని ప్రపంచపు మొట్టమొదటి ఆటౌఝ్చnఛ్ఛి (అన్నదమ్ములు లేక స్నేహితులు కలసి చేసే సాహసకృత్యాలు) అనవచ్చు. (రామాయణాన్ని కూడా ఆటౌఝ్చnఛ్ఛి అనవచ్చు.) ఇందులో మొత్తం పది పాత్రలు ఉన్నాయి. నేప«థ్యంలో కొన్ని పాత్రల ప్రస్తా్తవన ఉంటుంది కానీ వాటికి కథతో సూటిగా సంబంధం ఉండదు. గిల్గమెష్ ఈ పురాణానికి కేంద్ర బిందువు. ‘ఉరుక్’నగరంలో ‘ఇష్తార్’ దేవతకూ, ఆమె తండ్రి ‘అను’కూ ఆలయాన్ని నిర్మించినవాడు. ‘ఉరుక్’ నగర రక్షణ కోసం యువకుల చేత గోడల నిర్మాణం చేయిస్తుంటాడు. యువకులు నిరంతరం పనిచేస్తుండటంతో యువతులకు వివాహం కావట్లేదని నగర పెద్దలు ‘అను’ దేవుడికి గిల్గమెష్ గురించి ఫిర్యాదు చేస్తారు. రెండవ ముఖ్య పాత్ర పేరు ‘ఎంకిడు’. సుమేరియన్ల గాథల్లో ఇతను గిల్గమెష్ సేవకుడిగా పేర్కొనబడ్డాడు. అకేడియన్, బాబిలోనియన్ గాథల్లో ఇతను ప్రత్యేకంగా సృష్టించబడినట్లు చెప్పబడింది. బల పరాక్రమాలలో ఇతను గిల్‌గమెష్‌కు సమవుజ్జీ. వీరిద్దరూ మంచి స్నేహితులవుతారు. కలసి రెండు గొప్ప సాహసకృత్యాలు చేస్తారు. అయితే ఎంకిడు మరణం గిల్గమెష్ను కృంగదీస్తుంది. ఎంకిడు లాగా తను మరణించ కూడదనీ, మరణాన్ని జయించాలనీ నిర్ణయించుకొంటాడు. అమరత్వాన్ని సాధించటానికి అతను చేసిన ప్రయత్నం అతన్ని ‘ఉట్‌నపిస్తిమ్’ వద్దకు తీసుకువెళ్తుంది. బైబిల్లోని ‘నోవా’లాగా, హిందువుల పురాణాలలోని ‘మను’ లాగా ఇతను ప్రాణి కోటిని జలప్రళయం నుండి రక్షించినవాడు. అందువల్ల అమరత్వం పొందినవాడు. అమరత్వ రహస్యం తెలుసుకోవటానికి గిల్గమెష్ ఇతని లోకానికి వెళతాడు. ఈ పురాణంలోని స్త్రీ పాత్రలు పైకి కనిపించేది చాలా కొద్దిసేపయినా ఆ కాలంలో చోటు చేసుకొంటున్న మార్పులను అర్థం చేసుకోవటానికి ఉపయోగపడతాయి. స్త్రీ పాత్రలలో ముఖ్యమైనది ‘ఇష్తార్’ దేవత. ‘ఉరుక్’ నగర ప్రధానదేవత (్క్చ్టటౌn జౌఛీఛ్ఛీటట). ‘హుంబబ’ అనే భయంకర మృగంతో యుద్ధం చెయ్యటానికి వెళ్ళేటప్పుడు సహాయం కోసం గిల్గమెష్ ఈమెను ప్రార్ధించడు. సూర్యదేవుడైన ‘షమాష్’ సహాయం కోరతాడు. విజయం సాధిస్తే ‘షమాష్’ మహిమల్ని కీర్తిస్తాననీ, సింహాసనమెక్కిస్తాననీ అంటాడు. ‘హుంబబ’ మృగాన్ని గిల్గమెష్ వధించాక తనను వివాహం చేసుకొమ్మని అడుగుతుంది ‘ఇష్తార్’. అతను నిరాకరిస్తాడు. ఆమె ఆగ్రహించి ‘ఉరుక్’ నగరాన్ని ధ్వంసం చెయ్యటానికి దైవ వృషభాన్ని పంపిస్తుంది. ఎంకిడు, గిల్గమెష్ కలసి దాన్ని వధిస్తారు. ‘ఇష్తార్’ దేవతను ‘ఎంకిడు’ అవమానిస్తాడు. ఆమె అతణ్ని శపిస్తుంది. ఆ తరువాత కొద్దికాలానికి ఎంకిడు వ్యాధిగ్రస్తుడై మరణిస్తాడు. తన నగరానికి ప్రధాన దేవత ఐన ‘ఇష్తార్’ను గిల్గమెష్ నిరాకరించటం ‘ఇష్తార్’ దేవతపైన ‘షమాష్’ ఆధిపత్యాన్ని నెలకొల్పే ప్రయత్నంగా భావించాలి. అయితే ఆ ప్రయత్నం ఆ కాలంలో విఫలమైంది. ‘ఇష్తార్’ దేవతను నిరాకరించినప్పటి నుండి గిల్గమెష్ చేసిన పనులేవీ సఫలం కావు. ‘ఇష్తార్’ దేవత ఆలయ పూజారిణి లేక వేశ్య పేరు ‘షమ్హత్’. సుమేరియన్ భాషలో ఈమె పేరు ‘హరిమ్’. అడవిలో ఉంటూ జంతువులలో జంతువుగా సంచరించే అనాగరికుడైన ‘ఎంకిడు’ను నాగరికుడిగా తీర్చిదిద్ది ‘ఉరుక్’ నగరానికి తీసుకువచ్చిన యువతి ఈమె. మానవజాతిని అనాగరిక దశ నుండి నాగరిక దశకు తీసుకు వచ్చింది మాతృస్వామ్యమని దీనివల్ల అర్థమౌతుంది. వ్యవసాయం వల్ల, పశుపోషణ వల్ల ఆహారాన్ని నిలువ చేయటం నేర్పిన తరువాతనే పితృస్వామ్యం ప్రారంభమయింది. ఇతరుల సంపదను (ధాన్యం, పశువులు) దోచుకొనే దోపిడి వ్యవస్థ ప్రారంభమైంది. ‘సిధ్యురి’ మరొక ముఖ్య స్త్రీ పాత్ర. ‘ఉట్‌నపిస్తిమ్’ నివసించే ప్రాంతానికి ఎలా చేరుకోవాలో ఈమె గిల్‌గమెష్‌కు తెలియజేస్తుంది. అయితే దారి తెలియచేసే ముందు అమరత్వం సాధించటం సాధ్యం కాదనీ, మనుషులు పరిశుద్ధంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలనీ చెబుతుంది. వివాహం చేసుకొని భార్యను సుఖపెట్టటం, పిల్లల్ని రక్షించటం మగవాడి విధి అని తెలియజేస్తుంది. ప్రపంచ సాహిత్యం మొత్తంలో దీన్ని మించిన హితబోధ లేదనటం అతిశయోక్తి కాదేమో! వివాహం చేసుకోవటం, సంతానాన్ని పొందటం మగవాడికి ముఖ్యమని గిల్గమెష్ తల్లి ‘నిన్సున్’ కూడా చెబుతుంది. కాని గిల్గమెష్ మాత్రం మరణించే వరకు వివాహం చేసుకోడు. గిల్గమెష్ కాలం నాటికి (క్రీ.పూ. 2800) పితృస్వామ్యం ప్రారంభమై బలపడుతున్నది. రాజకీయ, సామాజిక వ్యవహారాలలో పురుషులు పెత్తనం దొరకబుచ్చుకొన్నారు. కాని పితృస్వామ్యాన్ని బలపరిచే తాత్విక చింతన, దాని చుట్టూ అల్లబడే మతసిద్ధాంతాలు ఏర్పడలేదు. స్త్రీ తన సంతానంలో తన పునర్జన్మని చూసుకుంటుంది. అమరత్వం సాధించిన తృప్తి పొందుతుంది. పురుషుడికి అటువంటి అవకాశం లేదు. కనుక అతను అమరత్వం పొందటానికి వేరే మార్గాలు అన్వేషిస్తాడు. పరమాత్మ, జీవాత్మ, పునర్జ్జన్మ, పరలోకం, మోక్షం మొదలైనవన్నీ ఆ అన్వేషణలో అతను ఏర్పరచుకున్న భ్రమలు. ఈ భ్రమలు గిల్గమెష్ పురాణంలో మచ్చుకి కూడా కనపడవు. అంటే పితృస్వామ్యం ప్రారంభ దశలో ఉందని అర్థం. క్రైస్తవం, ఇస్లాం, హిందూ మతం, బౌద్ధం మొదలైనవన్నీ అసలు సిసలు పితృస్వామ్య మతాలు. ఇవన్నీ ఇహలోకానికి కాకుండా పరలోకానికి పెద్ద పీట వేస్తాయి (బౌద్ధం కాస్త మినహాయింపు). ఐదువేల సంవత్సరాలకు పూర్వం మాతృస్వామ్యం చెప్పిన సత్యాలు నిజమని ఇప్పుడు సైన్సు చెబుతున్నది. దైవసృష్టి సిద్ధాంతం, ఆత్మ సిద్ధాంతం, పరలోకం మొదలైనవన్నీ భ్రమలని ఆధారాలతో అది నిరూపిస్తున్నది. అయినా మనం ఇంకా పితృస్వామ్య ప్రవచిత తప్పుడు భ్రమలనే పట్టుకు వ్రేళ్ళాడుతున్నాం. పురాణాలను కాకుండా పుక్కిటి పురాణాలను నమ్మే మేధావులం కదా మనం! ది ఫెమినిస్ట్ ప్రసాద్ 9849828797 -
శిథిలావస్థలో కాకతీయుల కాలం నాటి ఆలయం
-
భవిష్యత్తులో ‘తెలుగు’ వెలుగులు
తెలుగు వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ శివారెడ్డి తెయూలో తెలుగు అధ్యాపకుల సదస్సు తెయూ(డిచ్పల్లి): భవిష్యత్తులో తెలుగు వెలుగులీనుతుందని తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి ఎల్లూరి శివారెడ్డి తెలిపారు. తెలుగుకు ప్రాచీన హోదా దక్కడంతో భవిష్యత్‌లో మన భాషకు మంచి రోజులు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన తెలుగు అధ్యాపకుల నాలుగో సమావేశంలో శివారెడ్డి ప్రసంగించారు. తెలుగుకు ప్రాచీన హోదా దక్కడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషియే ప్రధాన కారణమని, తెలంగాణ సాంస్కృతిక సంచాలకుడు మామిడి హరికృష్ణ అభినందనీయుడని ఆయన పేర్కొన్నారు. హృదయానందాన్ని పంచేదే సాహిత్యమని, తెలుగు అధ్యాపకులు ఎవరికీ తీసిపోరని, ఆత్మగౌరవంతో ఉండాలని పిలుపునిచ్చారు. తెలుగు అధ్యాపకులు హృదయ వికాసం చేస్తారని, తెలుగును శక్తివంతం చేయాలంటే ఇతర భాషలపై పట్టు సాధించాలని వివరించారు. తెలుగు భాష మహోన్నతమైనదని, భాష, యాస, నుడికారం, జాతీయాలపై పట్టుతోనే సీఎం కేసీఆర్ ఒక మహా ఉద్యమాన్ని నిర్మించ గలిగారని తెయూ రిజిస్ట్రార్ జయప్రకాశ్‌రావు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ భాషపై పట్టుతోనే ప్రజలను కదిలించ గలిగారన్నారు. తెలుగు అధ్యయన శాఖ అధిపతి, ప్రిన్సిపల్ కనకయ్య మాట్లాడుతూ.. తెయూ తెలుగు అధ్యయన శాఖ రాష్ట్రంలో ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. ఆణిముత్యాలాంటి అధ్యాపకులు, విభాగానికి గొప్ప పేరు తెచ్చారని అన్నారు. ఈ సందర్భంగా ‘సాహితీ మంజీర, సాహితీ కిన్నెర’ అనే పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. అనంతరం ప్రొఫెసర్ శివారెడ్డి, రిజిస్ట్రార్ జయప్రకాశ్‌రావు, సీవోఈగా నియమితులైన కనకయ్యను ఘనంగా సన్మానించారు. సహాయ ఆచార్యులు బాలశ్రీనివాసమూర్తి, లావణ్య, త్రివేణి, బీవోఎస్ లక్ష్మణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
మద్దూరులో పురాతన విగ్రహాలు
మద్దూరు మండలం బెక్కల్ శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలోని రైతు భూమిలో శుక్రవారం పురాతన విగ్రహ నమూనాలు బయటపడ్డాయి. వెయ్యేళ్ల క్రితం నాటి బొడ్రాయి, దొంగలను కట్టేసే కొండం (కారాగారం) వెలుగుచూశాయి. – మద్దూరు -
అధికారులను అడ్డుకున్న పాము
తవ్వకాల్లో బయటపడిన పురాతన విగ్రహాలను తరలిస్తున్న అధికారులకు అనుకోని అవాంతరం ఎదురైంది. పురాతన విగ్రహాలను తీసుకెళ్తున్న రెవెన్యూ సిబ్బందిని పాము వెంబడించడంతో.. అధికారులు ఆ విగ్రహాలను అక్కడే వదిలి పరుగులు తీశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్లలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన భూస్వామి రాజా తన పొలాన్ని బుల్డోజర్ల సాయంతో చదును చేయిస్తున్న క్రమంలో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు బుధవారం సంఘటనా స్థలానికి చేరుకొని విగ్రహాలను పరిశీలించారు. పురాతన శివలింగం, వీరభద్రుడి విగ్రహంతో పాటు ఆనవాళ్లు కోల్పోయిన మరో విగ్రహం తవ్వకాల్లో బయటపడింది. దీంతో తహశీల్దార్ కనకదుర్గ వాటిని స్వాధీనం చేసుకొని పురావస్తు శాఖ కార్యాలయానికి పంపించేందుకు తీసుకెళ్తుండగా.. ఓ పాము ఆమెను వెంబడించింది. రెవెన్యూ సిబ్బంది అందరు ఆమె వెంట ఉన్నా.. పాము మాత్రం కేవలం విగ్రహాలు పట్టుకున్న ఎమ్మార్వోనే వెంబడించింది. దీంతో భయాందోళనలకు గురైన రెవెన్యూ సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. అనంతరం కార్యాలయానికి వెళ్లిన సిబ్బందికి కూడా విచిత్ర అనుభవాలు ఎదురవుతుండటంతో పాటు ఆందోళన పెరిగిపోవడంతో.. ఉన్నతాధికారుల ఆదేశాలతో విగ్రహాలను గురువారం తిరిగి యధాస్థానానికి చేర్చారు. ఈ విషయం సమీప గ్రామాలకు పాకడంతో విగ్రహాలను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. -
కాలువ పనుల్లో పురాతన విగ్రహం లభ్యం
మర్రిపాడు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరులో సోమవారం హైలెవల్ కెనాల్ పనులు నిర్వహిస్తుండగా పురాతన విగ్రహం బయట పడింది. సోమశిల ప్రాజెక్ట్ కాలువ పనులు నిర్వహిస్తున్న సమయంలో చెన్నకేశవ స్వామి విగ్రహం కనిపించింది. విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని కాలువ పనులను అడ్డుకున్నారు. ఆలయ నిర్మాణం చేపట్టిన తర్వాతే పనులు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో పురాతన శివాలయం, గంగమ్మగుడి, పోలేరమ్మ గుడి ఉండటంతో తవ్వకాలు జరిపితే మరికొన్ని విగ్రహాలు బయటపడే అవకాశం ఉండొచ్చని గ్రామస్థులు అంటున్నారు. -
చైనాలో బయటపడ్డ బుద్ధుడి అవశేషాలు
బీజింగ్: చైనాలోని నాంజింగ్ నగరంలోని ఓ బౌద్ధాలయంలో గౌతమ బుద్ధుడి అవశేషాలు దొరికాయని చైనా పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వెయ్యి ఏళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్న ఓ బాక్సులో గౌతమ బుద్ధుడి కపాలంలోని ఓ పార్శపు ఎముక దొరికందనేది వారి వాదన. ఎర్రచందనం, బంగారం, వెండితో తయారు చేసిన నాలుగు అడుగుల పొడవు, ఒకటిన్నర అడుగుల బాక్సులో ఇతర బౌద్ధ సన్యాసుల అవశేషాలతోపాటు బుద్ధుడి కపాల భాగం దొరికిందని వారు తెలిపినట్లు ఓ చైనా సాంస్కృతిక పత్రికలో ఇటీవల పేర్కొన్నారు. బాక్సు దొరికన రాతి ఫలకం మీద ఆలయాన్ని నిర్మించిన వారి పేరుతోపాటు అవశేషాలున్న వారి పేర్లను కూడా చెక్కారని, దాని ద్వారా అందులో బుద్ధిడి అవశేషాలు ఉన్నట్లు స్పష్టమవుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు. 2010లో జరిపిన తవ్వకాల్లోనే ఈ అవశేషాలు బయటపడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ ప్రజల దృష్టికి రావడంలో ఇంత ఆలస్యం ఎందుకు జరిగిందో ఎవరూ చెప్పడం లేదు. హిరన్నవతి నదీ తీరం వద్ద బుద్ధుడి అంత్యక్రియలు జరిగాయని, అప్పుడు సేకరించిన ఆయన ఎముకల్లో 19 ఎముకలు చైనాకు చేరాయని ఆ శిలాఫలకంపై ఉన్న రాతల ద్వారా తెలుస్తోంది. 11వ శతాబ్దానికి చెందిన జెంగ్జాంగ్ అనే రాజు అప్పటికే శిథిలమైన ఆలయం చోట ఈ బుద్ధుడి అవశేషాలున్న బాక్సును, శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి బౌద్ధాలయాన్ని నిర్మించినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2010లో అక్కడ జరిపిన తవ్వకాల్లో బంగారు, వెండితో తయారు చేసిన ఓ స్థూపం కూడా దొరికిందని, ఆ స్థూపం ముందు కూర్చొని బౌద్ధ సన్యాసులు ధ్యానం చేసే వారని వారంటున్నారు. -
కృష్ణా తీరంలో పురాతన విగ్రహాలు లభ్యం
దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం ఇర్కిగూడెం వద్ద కృష్ణాతీరంలో పార్వతీదేవి ఆలయ నిర్మాణానికి గాను తవ్వకాలు నిర్వహిస్తుండగా పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. కృష్ణానదీ తీరంలో పార్వతీదేవి ఆలయ నిర్మాణానికి తెలంగాణ సర్కార్ రూ. 5లక్షలు మంజూరు చేసింది. దాంతో ఈ రోజు ఉదయం నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రొక్లైన్‌తో తవ్వకాలు జరుపుతుండగా శివపార్వతులు, వీరభద్రస్వామి విగ్రహాలు మూడు బయటపడ్డాయి. విగ్రహాలు మూడు అడుగుల పొడవు ఉండి చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇవి 200 సంవత్సరాల నాటివని స్థానికులు చెబుతున్నారు. ఆలయ నిర్మాణానికి తవ్వుతుండగా విగ్రహాలు బయటపడడం శుభశూచకమని వారు చెప్పారు. -
మోదీ ‘మేధో’ మథనం
ప్రపంచ పరిణామాలపై చర్చ - పురాతన భారత కళాఖండాలను తిరిగి అప్పగించిన అమెరికా - కల్పనాచావ్లాకు మోదీ నివాళులు.. వాషింగ్టన్: మూడు రోజుల అమెరికా పర్యటన కోసం సోమవారం వాషింగ్టన్ చేరుకున్న మోదీ ఆ దేశానికి చెందిన పలు ప్రముఖ మేధో సంస్థల(థింక్ ట్యాంక్స్)తో భేటీ అయ్యారు. ప్రపంచ పరిణామాలను, సవాళ్లను ఆయా సంస్థలు ఎలా చూస్తున్నాయి.. ప్రపంచానికి భారత్, అమెరికాలు కలసి ఏం చేయగలవని భావిస్తున్నాయి అనేది తెలుసుకునేందుకు మోదీ ఈ భేటీలో పాల్గొన్నారు. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్, కౌన్సిల్ ఫర్ ఫారిన్ రిలేషన్స్, సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్, అట్లాంటిక్ కౌన్సిల్, సెంటర్ ఫర్ నేషనల్ ఇంటరెస్ట్, కార్నెగీ ఎండోమెంట్, ది యూఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ‘అగ్రగామి మేధో సంస్థలతో అద్భుతమైన సమావేశం జరిగింది’ అని మోదీ భేటీ తర్వాత ట్వీట్ చేశారు. ప్రపంచ అంశాలకు సంబంధించి స్వల్ప, దీర్ఘకాలికకసరత్తుపై చర్చించినట్లు తెలిపారు. అంతకుముందు..ఆర్లింగ్టన్ నేషనల్ సిమెటరీలో.. టోంబ్ ఆఫ్ ది అన్నోన్ సోల్జర్స్ (గుర్తుతెలియని సైనికుల సమాధి) వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. భారతీయ అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా సమాధి వద్దా మోదీ నివాళులర్పించారు. స్పేస్ షటిల్ కొలంబియా మెమోరియల్ వద్ద (స్మారక కేంద్రం) కల్పన భర్త, కుటుంబ సభ్యులతో పాటు.. నాసా అధికారులు, భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె తండ్రి తదితరులను కలసి ముచ్చటించారు. మోదీతో పాటు అమెరికా రక్షణ మంత్రి ఆష్టన్ కార్టర్ కూడా ఉన్నారు. పురాతన కళాఖండాలు భారత్‌కు అప్పగింత భారత్ నుంచి దొంగిలించిన 200 పురాతన కళాఖండాలను అమెరికా భారత్‌కు తిరిగి అప్పగించింది. వీటి విలులవ పది కోట్ల డాలర్లు బ్లెయిర్ హౌస్‌లో కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ఈ సాంస్కృతిక సంపద భారత్ - అమెరికాల ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేసే శక్తి అని అభివర్ణించారు. వీటిని తిరిగి అప్పగించినందుకు.. ఒబామాకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కళాఖండాల్లో చాలా వరకూ ‘అమెరికాలో ఆపరేషన్ హిడెన్ ఐడల్’ పేరుతో చేపట్టిన సోదాల్లో స్వాధీనం చేసుకున్నవని ఆ దేశ అధికారులు తెలిపారు. వీటిని స్మగుల్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూయార్క్ ‘ఆర్ట్ ఆఫ్ ది పాస్ట్ గ్యాలరీ’ యజమాని సుభాష్‌కపూర్ భారత్‌లో విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్నాడు. ముస్లింలకు మోదీ రంజాన్ శుభాకాంక్షలు రంజాన్ ఆరంభాన్ని పురస్కరించుకుని ముస్లింలకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్రమైన నెల సోదర బంధాన్ని, సమాజంలో సామరస్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చెన్నైలో ప్రాచీన విగ్రహాలు స్వాధీనం
విలువ రూ. 50 కోట్లకు పైనే సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రాచీన విగ్రహాలను విదేశాలకు అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టును తమిళనాడు పోలీసులు రట్టు చేశారు. చెన్నై, ఆళ్వార్‌పేటలోని ముఠా నాయకుడి ఇంటిపై మంగళవారం దాడులు నిర్వహించి రూ. 50 కోట్ల విలువైన 54 ప్రాచీన విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దీనదయాళన్ 2005లో విగ్రహాల తరలింపు కేసులో అరెస్టయినట్లు గుర్తించారు. ఇతని ముఠాలోని సభ్యులైన మాన్సింగ్, కుమార్, రాజామణిని పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ విగ్రహం.. మోదీకి కానుక: పంజాబ్‌కు చెందిన సుభాష్‌కపూర్ తమిళనాడులో దొంగిలించిన నటరాజ, అర్ధనారీశ్వర విగ్రహాలనుఆస్ట్రేలియాలో అమ్మినట్లు, ఇటీవల ఆస్ట్రేలియాకు వెళ్లిన ప్రధాని మోదీకి ఈ రెండు విగ్రహాలను అక్కడి ప్రభుత్వం బహుమతిగా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
అంతు చిక్కని భూగర్భ అద్భుతాలు
మానవులు తలచుకుంటే సాధించలేనిదే లేదంటారు. అయితే భూగర్భంలో మనకు తెలియని రహస్యాలెన్నో నిక్షిప్తమై ఉన్నా వాటిని కనుగొనేందుకు పురాతత్వవేత్తలు, శాస్త్రనిపుణులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నా కనిపెట్టలేకపోతున్నారు. ఎన్నో ప్రయోగాలు చేసినా ఇంకా తెలియని రహస్యాలెన్నో భూగర్భంలోనే మిగిలిపోతున్నాయి. మనకు తెలియని అద్భుత ప్రపంచాన్ని కనిపెట్టేందుకు పురాతత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు అహర్నిశలూ కృషి చేస్తున్నారు. భూగర్భ ప్రపంచాన్ని సందర్శించేందుకు, ప్రజలకు ప్రాచీన చరరిత్రను పరిచయం చేసేందుకు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ప్రాచీన పురాణాలు, ఇతిహాసాలు, రహస్య స్థావరాలు, ఆలయాలు, కట్టడాలు, సమాధులు వంటి ఎన్నో అద్భుతాలను కనుగొన్న శాస్త్రవేత్తలు, పురాతత్వవేత్తలు ప్రాచీన చరిత్రను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. భూగర్భ ప్రపంచంలో అనేక పొరంగాలు, గుహలు, నగరాలు కూడ ఉన్నాయని, వాటి వెనుక ఎంతో చరిత్ర దాగి ఉందని, అయితే వాటిని ఎటువంటి ప్రయోజనాలకోసం, ఏ సందర్భంలో నిర్మించారో పూర్తిగా తెలుసుకోలేకపోతున్నామని చెప్తున్నారు. మనకు లభించిన ఆధారాలను బట్టి కొంత చరిత్ర తెలిసినా, ఇంకా భూగర్భంలో గుర్తించలేని ప్రపంచం ఎంతో ఉందని అంటున్నారు. అయితే చరిత్ర చెప్తున్న 11 అత్యంత రహస్య భూగర్భ ప్రాంతాల్లోని విశేషాలను, వివరాలను శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్టులు ఇప్పటివరకూ ఇంకా గుర్తించలేకపోయారని, అసలు అవి ఉన్నాయా లేవా అన్న అనుమానాలు కూడ వ్యక్తమౌతున్నాయని ఓ ప్రైవేట్ వెబ్ సైట్ వివరించింది. తమకు తెలిసిన ఆధారాలను బట్టి ఆయా భూగర్భ అద్భుతాలకు సంబంధించిన చిత్రాలను వెలువరించింది. ముఖ్యంగా ఈజిప్టు లోని 'లాబ్రినాథ్' భూగర్భ అద్భుతాల్లో ఒకటి. పిరమిడ్లకు ప్రఖ్యాతి చెందిన ఈజిప్టులో లాబ్రినాథ్ గోడలపై చెక్కిన పురాతన లిపి కూడ ఎంతో ప్రాముఖ్యతను పొందింది. అయితే ఆ లిపి ఏమిటి అన్నది మాత్రం నేటికీ శాస్త్రవేత్తలకు అంతుబట్టడం లేదు. కానీ లాబ్రినాథ్ పై పరిశోధనలు చేపట్టేందుకు ఈజిప్ట్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక అమెరికాలోని కాలిఫోర్నియాలో 'డెత్ వ్యాలీ'గా పిలిచే ప్రాంతం 5 వేల ఏళ్ళనాటి అండర్ గ్రౌండ్ పట్టణం. అక్కడ మమ్మీలు, కళాఖండాలు ఉన్నట్లుగా గుర్తించినా... శాస్త్రవేత్తలు వాటిని అక్కడ ఎవరు ఎందుకు ఉంచారో చెప్పలేకపోయారు. అలాగే 'ది గ్రాండ్ కెన్యాన్' లో పురాతన నాగరికతకు చెందిన ప్రజలు నివసిస్తారని పరిశోధనల్లో తేలినా... అది నిజమా కాదా అన్న విషయం తేల్చలేకపోయారు. మరో అద్భుత భూగర్భ నగరం టర్కీలోని డేరిన్ కియు. ఈ అత్యంత ఆధునిక నగరాన్నిఎవరు ఎప్పుడు నిర్మించారో ఇప్పటికీ శాస్త్రవేత్తలు చెప్పలేకపోగా... మిస్సోరి భూగర్భంలోని పట్టణంలోమనుషుల భారీ అస్తికలను కనుగొన్న నిపుణులు... అవి రాక్షసులవి అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇక జపాన్ లోని మౌంట్ త్సురుగి డీపెన్స్ ప్రాంతాన్ని కనిపెట్టి, అది అత్యంత ప్రాచీన నగరమని గుర్తించి, అక్కడే మూడేళ్ళపాటు ప్రయోగాలు చేసినా దానికి సంబంధించిన మరే వివరాలను తెలుసుకోలేకపోయారు. రహస్య భూగర్భ స్థావరం 'తకలమకన్ డెజర్ట్' ఎడారి పరిస్థితీ అదే. అక్కడి ఎడారిలో వెళ్ళినవారికి తిరిగి వచ్చేందుకు దారి కనిపించదని, ఇసుకతో నిర్మించిన ఎన్నో దేవాలయాలు అక్కడ ఉన్నాయని నిపుణులు కనుగొన్నారు. అయితే వాటిని ఇసుకతో ఎలా నిర్మించారో మాత్రం ఇంకా తెలుసుకోలేకపోయారు. రష్యాలోని హైపర్ బోరియా సరస్సును అక్కడివారు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారని తెలుసుకున్నా... దీన్ని ఎవరు నిర్మించారన్న వివరాలు చెప్పలేకపోతున్నారు. అయితే సియాక్స్ ఇండియన్స్ వైట్ హార్స్ భూగర్భ ప్రాంతంలోని, ఓ భూగర్భ గుహ కథనం మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఓ గిరిజన వ్యక్తికి చెందినదిగా వినిపిస్తుంది. ఇటలీలోని భూగర్భ పిరమిడ్ తో పాటు.... త్రీ ఐడ్ లామా వంటి అద్భుతాలెన్నో మనకు తెలియని రహస్యాలుగానే మిగిలిపోయాయి. -
సైజులో పెద్దన్న
తిండిగోల తెలుగువారికి ఇష్టమైనది, కూరగాయలన్నింటిలోకీ అతి పెద్ద పరిమాణం కలిగినదీ గుమ్మడి. పులుసులో గుమ్మడి ముక్కలు వేస్తే ఆ రుచే అదుర్స్. హిందువులు గృహప్రవేశం, దిష్టితీయడం వంటి కార్యాలలో గుమ్మడి పెద్ద పాత్రే పోషిస్తుంది. తమిళంలో పూషిణి అని, కన్నడంలో కుంబల అని, హిందీలో ఖద్దూ అని, సంస్కృతంలో కూష్మాండమనీ, ఆంగ్లంలో పంప్కిన్ అనీ పిలుచుకునే గుమ్మడి ఇంచుమించు ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ పండుతుంది. భారతదేశ సంప్రదాయక వంటకాలలో గుమ్మడికి మంచి స్థానమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అతి ప్రాచీన కాలం నుంచి ఉన్న గుమ్మడిలోని వివిధ పదార్థాలు వివిధ రోగాలను నివారించే గుణం కలిగి ఉండటం వల్ల ఆయుర్వేదమందుల తయారీలో విరివిగావాడతారు. ఎన్నో రకాల విటమిన్లు, మినరల్సు కలిగి ఉన్న గుమ్మడి గింజలను తినడం చాలా మంచిదని అల్లోపతి వైద్యులు కూడా చెబుతారు. గుమ్మడిపండునే కాదు, వాటి లేత ఆకులు, కాండం, పూలు కూడా కూరకు వాడుకుంటారు. అయితే కొంచెం పైత్యం కలిగించే గుణం కలిగినందువల్ల దీనిని మితంగానే తీసుకోవడం మంచిదని ఆయుర్వేద వైద్యులు హెచ్చరిస్తారు. గొబ్బెమ్మలకు అలంకరించే పూలలో గుమ్మడి పువ్వుదే అగ్రస్థానం. అన్నట్టు గుమ్మడి డొల్లతో వీణ, తంబూరా వాంటి వాద్యపరికరాలు కూడా తయారు చేస్తారు. బూడిద గుమ్మడి, మంచి గుమ్మడి అని రెండు రకాలున్న గుమ్మడిలో రెండింటిలోనూ ఇంచుమించు సమానమైన ఔషధ విలువలున్నాయి. కూరలు, పులుసుల్లో, స్వీట్ల తయారీలో రెండింటినీ వాడతారు. కానీ మంచిగుమ్మడికి మరింత మంచిస్థానం ఉంది. -
అక్కడ ఎవ్వరికీ తెలియని కొత్త ప్రపంచం!
సముద్ర గర్భంలో ఎన్నో వింతలు విశేషాలు ఒక్కొక్కటే వెలుగు చూస్తున్నాయి. ఆధునిక పరిజ్ఞానం సహాయంతో పరిశోధకులు సాగర గర్భంలోని రహస్యాలను ఛేదించడం ప్రారంభించారు. లక్షల ఏళ్ళ క్రితమే చివరి మంచు యుగం ప్రకారం సముద్ర మట్టానికి అడుగున ఎన్నో రహస్యాలు నిక్షిప్తమై ఉన్నట్లు సైంటిస్టులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్విరామంగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అందులో భాగంగా ఫ్లోరిడా ఆసిల్లా నదీ గర్భంలో జరిపిన పరిశోధనల్లో అమెరికా ప్రజల ఉనికిని తెలిపే మరిన్ని సాక్ష్యాలు ఆవిష్కరించాయి. ప్రాచీన చరితకు ఆనవాళ్ళు లభించాయి. ఆరు దశాబ్దాల ముందే ఎవ్వరికీ తెలియని కొత్త ప్రపంచం ఉందన్నపరిశోధకుల అనుమానాలను నిజం చేస్తూ ఫ్లోరిడా ఆసిల్లా నది ఆడుగు భాగంలో ఆధారాలు దొరికాయి. మంచుయుగానికి ముగింపు సమయంలోనే అమెరికా ప్రజల ఉనికిని తెలిపే అనేక రాతి పనిముట్లు సహా పురాతన రుజువులను.. సైంటిస్టులు కనుగొన్నారు. సుమారు పదివేల ఏళ్ళ క్రితం హిమఖండాలు కరగటం ప్రారంభించి సముద్రంలో ఆపారమైన జలరాసి కలిసిపోయింది. తీర ప్రాంతాలు సహా అనేక నాగరికతలూ సమాధి అయిపోయాయి. అయితే సముద్రగర్భంలోని చరిత్రను వెలికి తీసేందుకు ఇటీవల ఆర్కియాలజిస్టులు అనేక పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అవశేషాలను బయటకు తీయడంలో ప్రత్యేక శ్రద్ధ వహింస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఫ్లోరిడాలోని ఆసిల్లా నది గర్భంలో నిర్వహించిన నిర్వహించిన పరిశోధనల్లో అనేక రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. నదిలోని గోధుమరంగు ముర్కీ జాలాల్లో మానవుల ఉనికిని గుర్తించే వేటగాళ్ళు వినియోగించిన ప్రాచీన రాతియుగంనాటి పనిముట్లు, అతి పెద్ద ఏనుగును తలపించే జంతువు మాస్టోడాన్ సహా ఒంటెలు, అడవిదున్నలు, గుర్రాలు, అతి పెద్ద క్షీరదాల ఎముకలు సాక్షాత్కరించాయి. సముద్ర గర్భానికి అడుగున రాతి పనిముట్టతోపాటు, జంతువుల ఎముకలు, మాస్టోడాన్ దంతాలను కనుగొన్నామని, వీటిని బట్టి ఆగ్నేయ అమెరికాలో 14,550 సంవత్సరాలకు పూర్వమే అంటే... ఇంత క్రితం తెలుసుకున్నదానికి 1500 సంవత్సరాలకు ముందే మానవ చరిత్ర ఉన్నట్లు తెలుస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. క్లోవిస్ ప్రజల విలక్షణ నాయకత్వానికి గుర్తుగా సుమారు 13000 సంత్సరాల పురాతత్వ ఆధారాలు దొరికినట్లు వెల్లడించారు. ఫ్లోరిడా రాజధాని తల్లహశ్సీ సమీపంలోని పేజ్ లాడ్సన్ సైట్లో 2012 నుంచి 2014 మధ్య కాలంలో సుమారు 890 సార్లు నీటిలో మునిగి, నదీ గర్భంలో పరిశోధనలు నిర్వహించిన సైంటిస్టులు.. 35 అడుగుల లోతులోని భూభాగంలో ఉన్న సున్నపురాయిని 11 మీటర్లమేర తవ్వకాలు జరిపామని, ఈ నేపథ్యంలో అనేక చారిత్రక ఆధారాలు దొరికినట్లు తెలిపారు. ఇప్పటికీ క్లోవిస్ ముందు అక్కడ అద్భుత మానవ చరిత్ర ఉన్నట్లు నమ్ముతున్న పురాతత్వ వేత్తలు తమ పరిశోధనలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ లో నివేదించారు. -
ప్రాచీన మమ్మీ నుంచి డీఎన్ఏ సేకరణ
పరిశోధకులు మొదటిసారి 300 ఏళ్ళనాటి ప్రాచీన డీఎన్ఏ అవశేషాలను కనుగొన్నారు. దక్షిణాఫ్రికాలోని ఓ మమ్మీనుంచి విజయవంతంగా ప్రాచీన డీఎన్ఏ ను వెలికి తీశారు. ముందుగా మమ్మీకి కంప్యూటరరైజ్జ్ టోమోగ్రఫీ (సీటీ స్కాన్) నిర్వహించి డీఎన్ఏ అవశేషాలను గుర్తించారు. అనాటమికల్ సైన్సెస్ స్కూల్ ప్రొఫెసర్ మెరీనా స్టెయిన్... స్విట్జర్లాండ్ లోని జురిచ్, ప్రెటోరియా, బోట్స్వానా విశ్వవిద్యాలయాలనుంచి వచ్చిన ఇతర అధ్యయనకారుల బృందంతో కలసి ఈ తాజా అధ్యయనాలు నిర్వహించారు. తులిబ్లాక్ కు చెందిన ఇనుప యుగంనాటి మమ్మీపై జరిపిన జన్యు విశ్లేషణ పరిశోధనా ఫలితాలను సౌతాఫ్రికాలోని బోట్స్వానా సైన్స్ జర్నల్ లో ప్రచురించారు. తాజాగా కనుగొన్న ప్రాచీనకాలంనాటి మమ్మీ అవశేషాలు.. అప్పటి జనాభాకు సంబంధించిన విలువైన సమాచారాన్ని తెలిపేందుకు మంచి వనరుగా ఉపయోగిస్తాయని పరిశోధకులు అంటున్నారు. అయితే పరిశోధనలు జరిపిన మమ్మీ.. తులి ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా మొదట్లో భావించిన పరిశోధకులు... అనంతరం మమ్మీ అవశేషాలను బట్టి ఆఫ్రికన్ మాలాలు కలిగిన పురుషుడికి చెందినదిగా గుర్తించారు. అతడి మమ్మీ కదలసి స్థితిలో ఉండి, జంతు చర్మంతో చుట్టి, తాళ్ళతో గట్టిగా కట్టి ఉన్నట్లు పరిశోధనా ఫలితాల్లో ప్రచురించారు. మమ్మీలోని అంతర్గత అవయవాలు ఏవీ సురక్షితంగా లేవని సీటీ స్కాన్ ద్వారా తెలుసుకున్న పరిశోధక బృదం... అనేక పోస్టు మార్టం లను కూడ నిర్వహించి వెన్నెముక కింది భాగంలో కొన్నిప్రమాదకర మార్పులు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. అస్థిపంజరం మాత్రం చెక్కు చెదరకుండా ఉందని తెలుసుకున్నారు. అయితే వెన్నెముకలో కనిపించిన మార్పులను బట్టి చూస్తే వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిలా కనిపించిందని, అతడి మరణం ఎప్పుడు జరిగింది, ఏ కారణంగా జరిగింది అన్న వివరాలు ధృవీకరించడం సాధ్యం కాలేదని వెల్లడించారు. శరీరంలో ఎలాంటి గాయాలు ఉన్నట్లు కూడ కనిపించలేదని చెప్పారు. అయితే విజయవంతంగా తాము కనుగొన్న డీఎన్ ఏ విశ్లేషణను బట్టి ఆ వ్యక్తి సోతో సెటస్వానా లేదా ఖోయెసాన్ ప్రాంతానికి చెందిన వాడిగా నిర్థారించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. -
భారతీయ కళాఖండాలు స్వాధీనం
న్యూయార్క్: అమెరికాలో క్రిస్టీస్ హౌస్ వేలం వేయాలనుకున్న వెయ్యేళ్ల క్రితం నాటి రెండు భారతీయ కళాఖండాలను విచారణాధికారులు స్వాధీనం చేసుకున్నారు. ‘లహరి కలెక్షన్: ప్రాచీన, మధ్యయుగపు భారతీయ, హిమాలయ కళ’ పేరిట ప్రాచీన కళాఖండాలను వచ్చే వారం వేలం వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు కళాఖండాలను అక్రమంగా న్యూయార్క్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. 10వ శతాబ్దానికి చెందిన తొలి జైన తీర్థంకరుడి విగ్రహం విలువ సుమారు లక్షా 50 వేల డాలర్లు (సుమారు రూ. కోటి) ఉంటుంది. ఎనిమిదో శతాబ్దానికి చెందిన రేవంత విగ్రహం విలువ సుమారు మూడు లక్షల డాలర్లు (సుమారు రూ. రెండు కోట్లు) ఉంటుంది. భారత్‌లో స్మగ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి నుంచి ఈ పురాతన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. చోరీకి గురైన వస్తువులను వేలం వేయబోమని క్రిస్టీస్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. -
బైటపడిన పురాతన రాతి విగ్రహాలు
వందల ఏళ్ల నాటి రాతి విగ్రహాలు కర్నూలు జిల్లా ఇనగండ్ల గ్రామంలో ఆదివారం సాయంత్రం బయటపడ్డాయి. గ్రామ శివారులో రాతి విగ్రహాం ఒకటి ఉండటంతో దానికి సమీపంలో ఉన్న పుట్టలో కూడా రాతి విగ్రహాలు ఉండొచ్చనే అనుమానంతో స్థానిక పుజారుల చొరవతో గ్రామస్తులు రంగంలోకి దిగారు. పలుగులు, పారలు వంటి పనిముట్లను వాడకుండా కేవలం నీటితోనే పుట్టను కరిగించారు. ఈ పుట్టలో రాతి విగ్రహాలు బయటపడటంతో గ్రామస్తులు తమ గ్రామ చరిత్ర గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. -
పురాతన శివలింగాన్ని రాయి అనుకుని..
నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని ఓ ఇంట్లో పురాతన శివలింగం లభ్యమైంది. అయితే, పదిహేనేళ్ల క్రితమే వెలుగు చూసినా అది శివలింగమని వారికి తెలియకపోవడంతో ఇన్నాళ్లూ మరుగునపడి ఉంది. ఎలుగూరి వెంకటేశ్వర్లు పాత ఇంటిని తొలగించే క్రమంలో 15 ఏళ్ల క్రితం ఓ రాయి బయటపడింది. కొబ్బరికాయలు కొట్టేందుకు పనికి వస్తుందని దాన్ని దాచిపెట్టారు. సోమవారం ఇంట్లో పూజల సమయంలో కొబ్బరికాయ కొట్టేందుకు ఆ రాయిని తీసుకురాగా, అది శివలింగమని పురోహితులు చెప్పడంతో వారు అవాక్కయ్యారు. అసలు విషయం తెలియడంతో ప్రత్యేక పూజలు చేశారు. ఆ శివలింగాన్ని ఏదో ఒక శివాలయానికి తరలించాలని నిర్ణయించారు. -
కుక్కంత ఎలుక!
మెల్బోర్న్: ప్రస్తుత ఎలుకలకు దాదాపు పది రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉన్న ఏడు భారీ ఎలుక శిలజాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి ఏకంగా శునకం పరిమాణంలో ఉన్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ జూలియన్ లూయిస్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం తూర్పు తైమూర్‌లో ఈ శిలాజాలను గుర్తించింది. ఇప్పటివరకూ గుర్తించిన ఎలుక జాతుల్లో ఇవే అతిపెద్దవని లూయిస్ తెలిపారు. ఇవి ఐదు కిలోలకు పైగా ఉన్నట్లు చెప్పారు.సాధారణంగా ఎలుకలు అరకిలో ఉంటాయని తెలిపారు. తాజాగా గుర్తించిన ఎలుక జాతులు అంతరించిపోవడానికి గల కారణాలపై ప్రస్తుతం దృష్టిసారించినట్లు చెప్పారు. ఖనిజ పనిముట్లు వాడకం ప్రారంభమైన తరువాత పెద్ద సంఖ్యలో అడవులు నరికివేత కారణంగా ఈ ఎలుక జాతులు కనుమరుగై ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఈశాన్య ఆసియాలో తొలి మానవ సంచారం గురించి తెలుసుకునే ప్రాజెక్టులో భాగంగా లూయిస్ బృందం పనిచేస్తోంది. -
అతి పురాతన పంచలోహ విగ్రహం స్వాధీనం
చేవెళ్ల రూరల్ (రంగారెడ్డి జిల్లా) : సుమారు రూ.25 లక్షల విలువ చేసే పురాతన దేవతా పంచలోహ విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు పంపారు. చేవెళ్ల సీఐ జె.ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామానికి చెందిన శివ తాపీ మేస్త్రీ కాగా, కేఎన్ మూర్తి ఓ కెమికల్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఈ ఏడాది గోదావరి పుష్కరాలకు భద్రాచలం వెళ్లగా సాగర్ అనే వ్యక్తి వారికి పరిచయం అయ్యాడు. అతడు తన వద్ద ఉన్న పంచలోహ విగ్రహాన్ని రూ.50 వేలకు విక్రయించాడు. వారు దానిని తీసుకువచ్చి నగల వ్యాపారులకు చూపించగా రూ.20 లక్షలకు పైగా విలువ ఉంటుందని చెప్పారు. దీంతో శివ, కేఎన్‌మూర్తి పంచలోహ విగ్రహం తమ వద్ద అమ్మకానికి ఉందంటూ సన్నిహితుల వద్ద చెప్పడమే కాకుండా తెలిసిన వారికి వాట్సప్‌లో కూడా సమాచారం ఇస్తున్నారు. ఓ వ్యక్తి దానిని రూ.15 లక్షలకు కొనేందుకు బేరం కుదుర్చుకున్నాడు. ఈలోగా విషయం పోలీసులకు తెలియడంతో శుక్రవారం రాత్రి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, శివ ఇంట్లో ఉన్న రెండు కిలోల బరువుగల భవానీమాత పంచలోహ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భవానీమాత విగ్రహం అతి పురాతనమైందిగా పోలీసుల విచారణలో తేలింది. విగ్రహం పైభాగంలో నాగుపాము పడగ ఉందని, సాధారణంగా ఇటువంటి విగ్రహాలను దేవాలయాలలోనే ఉపయోగిస్తారని పేర్కొన్నారు. ఈ విగ్రహాన్ని ఎక్కడైనా ఆలయం నుంచి దొంగతనం చేసుకొచ్చి తీసుకొచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విగ్రహాన్ని విక్రయించిన సాగర్ అనే వ్యక్తి కోసం గాలిస్తున్నారు. -
రాణీ కీ ‘వావ్’..!
సాక్షి: పురాతన చరిత్ర, అత్యద్భుత కట్టడాలు కలిగిన అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటి. అద్భుతమైన శిల్పకళా చాతుర్యాన్ని మేళవించి నిర్మించిన అపూర్వ కట్టడాల్లో ‘రాణీ కీ వావ్’ ప్రసిద్ధి చెందింది. యూనెస్కో దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తించింది. ఇలాంటి చారిత్రక కట్టడాలన్నింటిని మనం ప్రత్యక్షంగా వీక్షించలేక పోవచ్చు.. కానీ వాటి గురించి తెలుసుకోవలసిన బాధ్యత మనపై ఉంది. ఎందుకంటే అదంతా మన దేశ చారిత్రక సంపద. ఆ సంపద గురించి, దాన్ని కాపాడుకోవడంలో మనపై ఉన్న బాధ్యత గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ఈ రోజు ‘రాణీ కీ వావ్’ గురించి తెలుసుకుందాం. ఏమిటీ కట్టడం? ఉత్తర గుజరాత్లో ఉన్న ‘రాణీ కీ వావ్’. దీనినే క్వీన్స్ స్టెప్ వెల్ అని రాస్తారు. దీన్ని 11వ శతాబ్ధంలో ‘సోలంకి’ వంశీయులు నిర్మించారు. దీనిని డొవాగర్ రాణి ఆమె భర్త భీమ్దేవ్ 1 జ్ఞాపకంగా నిర్మించారు. దీనికి ఎలా చేరుకోవాలి?.. గుజరాత్ నుంచి 130 కి.మీ ప్రయాణం చేస్తే పఠాన్ అనే చారిత్రక గ్రామానికి చేరుకోవచ్చు. ఈ గ్రామం అంతా ఒక పచ్చటి అడవిని తలపిస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద లోయలు, గుహలతో నిండి ఉంటుంది. పాములు కూడా మధ్యలో ప్రయాణానికి అడ్డుపడుతూ ఉంటాయి. ఈ గ్రామానికి రెండు కి.మీ దూరంలోనే ఈ రాణికీవావ్ కట్టడం ఉంటుంది. దీని ప్రత్యేకతలు... ఇది భారతదేశంలోనే అత్యంత పెద్దదైన, పురాతన చారిత్రక కట్టడం. దీని చుట్టూ నాలుగు ప్రత్యేక విశాల మండపాలు.. దీనిని ఆనుకుని ఒక భూగర్భలోయ కట్టడం ఉంది. దాని లోతు వంద అడుగులు. ఈ రాణీకివావ్ కట్టడాన్ని త్రిముఖీయంగా నిర్మించారు. అక్కడ ఉన్న ప్రతి చిన్న కట్టడం నగిషీలతో చెక్కబడింది. అరుదుగా దొరికే అనేక రకాల రాళ్లతో దీనికి మలిచారు. కేవలం చూడటానికి కంటికి ఇంపుగా ఉండటమే కాక ఈ ప్రదేశంలో గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు. పూర్వం సోలంకి వంశీయ రాజలు ఇక్కడకు సేదతీరడం కోసం వచ్చే వారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మరో విశేషమేమిటంటే... ఈ కట్టడాన్ని 11 వ శతాబ్ధంలో నిర్మించినా దీన్ని గుర్తించింది మాత్రం కేవలం కొన్ని దశాబ్ధాల కిందట మాత్రమే.దీనిని 1987లో గుర్తించారు. దీనికి కారణం ఈ కట్టడం సరస్వతి నదీ సమీపంలో ఉండటం వల్ల.. ఆ నది అంతరించి పోయేసరికి ఈ కట్టడం భూమిలో కూరుకుపోయింది. ఎవరి గుర్తుగా అయితే రాణి ఈ కట్టడాన్ని నిర్మించారో ఆయన అస్తిపంజరం ఇప్పటికీ ఈ కట్టడం ప్రాంగణంలో ఉంది. -
అమరావతిలో అలనాటి శాసనం
గుంటూరు జిల్లా అమరావతిలో పురాతన శాసనం, శివలింగం, శిల్పాలు బయటపడ్డాయి. వాటిని స్థానిక మ్యూజియానికి తరలించారు. 250 ఏళ్లనాటి అమరేశ్వరాలయ గోపురాన్ని నెలరోజులుగా కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆరు బౌద్ధశిల్పాలు వెలుగు చూశాయని హిందూ ధర్మరక్షణ సమితి ప్రతినిధి రామనాథ్ పురావస్తుశాఖాధికారులకు తెలిపారు. తవ్వకాలలో బయటపడిన శిల్పాలను స్థానిక పురావస్తుశాఖ మ్యూజియం ఇన్చార్జి ఎన్.వెంకటేశ్వరరావు పరిశీలించి అవి బౌద్ధశిల్పాలని గుర్తించారు. నల్లరాయిపై శాసనం రాసిన శాసనం, మూడో శతాబ్దానికి చెందిన చలువరాతి లింగం, మాలవాహకుల శిల్పం లభించినట్లు వెంకటేశ్వరరావు చెప్పారు. మిగిలిన శిల్పాలను పరిశీలించాల్సి ఉందన్నారు. -అమరావతి -
సినీఫక్కీలో విగ్రహ చోరీకి విఫలయత్నం
-
సినీఫక్కీలో విగ్రహ చోరీకి విఫలయత్నం
మహబూబ్‌నగర్ (తలకొండపల్లి): బురద.. భగవంతుడి విగ్రహ చోరీ ప్రయత్నాన్ని తిప్పికొట్టింది. మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలం వెంజాల గ్రామ ప్రాచీన ఆలయం వద్ద ఉన్న పురాతన గణేశుడి విగ్రహాన్ని ఎత్తుకెళ్లేందుకు ఆదివారం రాత్రి దొంగలు విఫలయత్నం చేశారు. క్రేన్ సహాయంతో విగ్రహాన్ని పెకిలించడానికి దొంగలు ప్రయత్నించారు. క్రేన్ బురదలో కూరుకుపోవడంతో దొంగల ప్లాన్ తారుమారైంది. క్రేన్ బయటకు తీయడానికి విఫలయత్నం చేసి పొద్దుపొడుస్తుండటంతో దొరికిపోతామనే భయంతో దొంగలు పారిపోయారు. సోమవారం ఉదయం పరిస్థితిని గమనించిన గ్రామస్తులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్రేన్‌ను స్టేషన్‌కు తరలించారు. క్రేన్ ఎవరిది.. ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది.. ఎక్కడి నుంచి తీసుకువచ్చి ఉంటారనే వివరాలు సేకరిస్తున్నారు. -
పురాతన విగ్రహాలు విక్రయ కేసులో నలుగురు అరెస్టు
బెంగళూరు : హోయసాలుల కాలం నాటి ప్రాచీన విగ్రహాలను విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పశ్చిమవిభాగం కామాక్షిపాళ్య పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. రూ.1 కోటి 50 లక్షల విలువచేసే విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం పై అదనపుపోలీస్ కమిషనర్ అలోక్‌కుమార్ మాట్లాడుతూ పంచలోహ విగ్రహాలను విక్రయిస్తున్న నలుగురు దుండగులు బెంగళూరుకు వచ్చారనే పక్కా సమాచారం అందుకున్న కామాక్షీపాళ్య పోలీసులు మారువేషంలో వెళ్లి కొనుగోలు చేసే వారిగా నటించి నలుగురిని అరెస్ట్ చేశారు. దీనిలో బాగస్వామ్యులైన ఇద్దరు వ్యక్తులు పారిపోయారని వారి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నామని తెలిపారు. కామాక్షిపాళ్య పరిదిలోని సుమనహళ్లి రింగ్‌రోడ్డులో ప్రాచీన కాలం విగ్రహాలు విక్రయిస్తున్న మైసూరు కు చెందిన సుదీర్, యోగేశ్, సురేశ్‌బాబు, మండ్య జిల్లా నాగమంగల కు చెందిన దత్తమూర్తి, అరెస్టు చేసి వారి వద్ద ఉన్న రూ.1 కోటి 50 లక్షల విలువచేసే పంచలోహవిగ్రహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న విగ్రహాల్లో 8 కిలోల 400 గ్రాముల బరువుగల 45 సెంటీమీటర్లు ఎత్తుగల పార్వతివిగ్రహం, 2 కిలోల 800 గ్రాముల బరువు గల 23 సెంటీమీర్లు ఎత్తుగల దత్తాత్రేయ విగ్రహం 1 కిలో 5 గ్రాముల బరువు గల సీతరామలక్ష్మణ విగ్రహాలును 9 కిలోల 200 గ్రాముల బరువుగల 20 సెంటీమీటర్లు ఎత్తు గల శంకరాచార్య విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. నిందితుడు సుదీర్ సైబర్‌సెంటర్‌లో పనిచేస్తున్నాడని యోగీశ్‌ట్రేడింగ్ వ్యాపారం, సురేవ్‌బాబు ట్రేడింగ్ బిజనెస్ నిర్వహిస్తున్నారని దత్తమూర్తి వ్యవసాయ చేసేవాడని తెలిపారు. విజయనగర ఉపవిభాగ సహయక పోలీస్ కమిషనర్ ఉమేశ్ నేతృత్వంలో ఇన్స్‌స్పెక్టర్ బాళేగౌడ విగ్రహాలు విక్రయించే దుండగులను అరెస్ట్ చేశారు. (బనశంకరి) -
మన మూలికలతో మెరుగ్గా జీవిద్దాం!
ప్రకృతికి దూరంగా బిజీబిజీగా పరుగులు తీస్తున్న ఆధునికత ఆరోగ్యాన్ని బలి తీసుకుంటోంది. అందచందాల కోసం కృత్రిమ మెరుగులతో సరిపుచ్చుకుంటూ సంతృప్తి పడుతోంది. ఈ క్రమంలో బిజీబిజీ గజిబిజి బతుకుల ఆధునిక తరానికి మన నేల సహజసిద్ధంగా ప్రసాదించిన ‘మన’మూలికలను చేరువ చేసే ప్రయత్నం పరిశ్రమగా రూపుదిద్దుకుని, పలువురికి ఉపాధినిస్తోంది. హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక ప్రదేశంలో ఉంది శ్రీనివాస ఇండస్ట్రియల్, ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. పదివేల చదరపు గజాల వైశాల్యంలో యాభై లక్షల పెట్టుబడితో నిర్మించిన దీనిలో అనేక యూనిట్లు పనిచేస్తున్నాయి. వాటర్ కూలింగ్ ప్లాంట్, కోల్డ్ స్టోరేజ్, డీ మినరల్ ప్లాంట్, మిక్సింగ్ ట్యాంక్, ప్లానెటరీ మిక్సర్, హోమోజినైజర్... వంటి యంత్రాలు పనిచేస్తున్నాయి. పెదవులకు రాసే లిప్‌బామ్ నుంచి సబ్బులు, షాంపూలు, మసాజ్ ఆయిల్, గదిని పరిమళాలతో నింపేసే క్యాండిల్ వేపరైజర్, ఎసెన్షియల్ ఆయిల్, ఫేస్‌ప్యాక్‌ల లాంటి 50, 60 రకాల ఉత్పత్తులు తయారవుతున్నాయి. ‘ఏన్షియెంట్ లివింగ్’ పేరుతో పారిశ్రామికవేత్త కల్యాణి నడుపుతున్న పరిశ్రమ ఇది. జీతం అందుకోవడం నుంచి... కల్యాణి పుట్టింది హైదరాబాద్. చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. చదువయ్యాక ఉద్యోగం చేశారామె. పెళ్లి తర్వాత బెంగళూరులో కాపురం. సంతృప్తిగా సాగుతున్న జీవితంలో ఏదో అసంతృప్తి. ‘నాకు ప్రకృతి సహజమైన జీవనం ఇష్టం. మన సంస్కృతి మీద గౌరవం. ప్రాచీన జీవన విధానంలో ఆరోగ్యకరమైన సౌందర్యం ఉండేది. అన్వాంటెడ్ హెయిర్ పోవడానికి కస్తూరి పసుపు, మేని లావణ్యానికి దోహదం చేసే సాధనాల వంటివెన్నో ఉన్నాయి. ఎటువంటి దుష్ర్పభావాలూ లేని మన మూలికలను, వాటిలోని ఔషధగుణాలను వదిలేసి కృత్రిమ సౌందర్య సాధనాల మాయలో పడిపోతున్నాం. ఇదే మా నాన్నతో చెప్పినప్పుడు చాలా ప్రోత్సహించారు. అలా 2011లో నాతోపాటు నలుగురు ఉద్యోగులతో మొదలైన నా పరిశ్రమలో ఇప్పుడు 30 మంది ఉద్యోగులున్నారు’ అంటారు కల్యాణి. మార్కెట్ తెలిస్తే... కృత్రిమ సౌందర్యసాధనాలు స్వైర విహారం చేస్తున్న తరుణంలో హానికారక రసాయనాలు లేని ఉత్పత్తులను తయారు చేయాలనుకోవడం సాహసమే. ‘నా ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లడం అంత సులభం కాదని నాకు తెలుసు. అందుకే పరిమితంగానే తయారు చేస్తున్నాను. వినియోగదారుల్లో అవగాహన కల్పించడానికి ఆర్గానిక్ ఉత్పత్తుల గురించి వివరణాత్మకమైన కరపత్రాన్ని కూడా ముద్రించాను. అందులో భృంగరాజ్, మెంతులు, ఆమ్ల, మందార వంటి వాటిలో ఉండే సుగుణాలను వివరిస్తున్నాను. అంతకంటే ఎక్కువగా దైనందిన జీవితంలో ఆర్గానిక్ ఉత్పత్తులను ఎందుకు వాడాలనే విషయాన్ని వివరిస్తున్నాను. కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ కోరుతూ మా ఫోన్ నంబర్లు ఇస్తున్నాం. ఇదే నా ప్రచారాస్త్రం’ అంటారామె. ఉత్పత్తి మొదలై నాలుగేళ్లు నిండినా ప్రకటనలు కనిపించకపోవడం గురించి మాట్లాడుతూ ‘ప్రకటనల హోర్డింగులకు డబ్బు వృథా చేయను. ప్రస్తుతం ఆర్గానిక్ స్టోర్స్‌కు సప్లయ్ చేస్తున్నాను. ఆన్‌లైన్‌లోనూ మార్కెట్ చేస్తున్నాను. స్పాలు, విమానాశ్రయాలు మా ఉత్పత్తులను ఉపయోగిస్తున్నాయి’ అన్నారామె. వన మూలికలను సమృద్ధిగా అందించిన నేల మనది. ఆ నేలలో జీవిస్తూ ఆరోగ్యంగా బతికే అవకాశాన్ని కోల్పోవద్దు- అనేది కల్యాణి సందేశం. రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి ఫొటో: రాజేశ్ రెడ్డి ‘తైల పాక్ విధి’ ప్రక్రియతో ఆయిల్స్ చేస్తున్నాం. సల్ఫేట్స్, పారాబెన్స్, సింథటిక్ ఫ్రాగ్నన్స్ లేకుండా షాంపూలు తయారు చేస్తున్నాం. తమిళనాడు, కేరళ, రాజస్థాన్, కశ్మీర్ వంటి అనేక చోట్ల నుంచి ముడిసరుకు సేకరిస్తున్నాం. దేశం బయటి నుంచి ఒక్కటి కూడా తీసుకోలేదు. - బొప్పన కల్యాణి ,‘ఏన్షియెంట్ లివింగ్’ ఉత్పత్తుల తయారీదారు. ఫోన్: 9550753535 -
పురాతన విగ్రహం కోసం తవ్వకాలు
దండేపల్లి: ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లిలో గల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూరాతన విగ్రహం కోసం సోమవారం ఉదయం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఈ తాత్కాలిక ఆలయ భూగర్భంలో ఓ పురాతన విగ్రహం ఉండేదని గ్రామస్తుల నమ్మకం. దీంతో అక్కడ తవ్వకాలు జరిపి విగ్రహం బయటపడితే శాశ్వత ఆలయం నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం తాత్కాలిక ఆలయంలోని స్వామి విగ్రహాన్ని తీసి ఆలయం పక్కనే మరోచోట ప్రతిష్టాపన చేశారు. అనంతరం రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో తవ్వకాలు మొదలయ్యాయి. రాతి విగ్రహానికి సంబంధించిన ఓ భాగం బయటపడింది. తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి.