సినీఫక్కీలో విగ్రహ చోరీకి విఫలయత్నం | theaft attempt for Ancient Ganesh idol in Mahabubnagar | Sakshi
Sakshi News home page

సినీఫక్కీలో విగ్రహ చోరీకి విఫలయత్నం

Published Mon, Jun 22 2015 6:11 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

సినీఫక్కీలో విగ్రహ చోరీకి విఫలయత్నం - Sakshi

సినీఫక్కీలో విగ్రహ చోరీకి విఫలయత్నం

మహబూబ్‌నగర్ (తలకొండపల్లి): బురద..  భగవంతుడి విగ్రహ చోరీ ప్రయత్నాన్ని తిప్పికొట్టింది. మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలం వెంజాల గ్రామ ప్రాచీన ఆలయం వద్ద ఉన్న పురాతన గణేశుడి విగ్రహాన్ని ఎత్తుకెళ్లేందుకు ఆదివారం రాత్రి దొంగలు విఫలయత్నం చేశారు. క్రేన్ సహాయంతో విగ్రహాన్ని పెకిలించడానికి దొంగలు ప్రయత్నించారు. క్రేన్ బురదలో కూరుకుపోవడంతో దొంగల ప్లాన్ తారుమారైంది.

క్రేన్ బయటకు తీయడానికి విఫలయత్నం చేసి పొద్దుపొడుస్తుండటంతో దొరికిపోతామనే భయంతో దొంగలు పారిపోయారు. సోమవారం ఉదయం పరిస్థితిని గమనించిన గ్రామస్తులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్రేన్‌ను స్టేషన్‌కు తరలించారు. క్రేన్ ఎవరిది.. ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది.. ఎక్కడి నుంచి తీసుకువచ్చి ఉంటారనే వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement