ఏటీఎం దొంగ తల బద్దలుకొట్టుకున్నాడు | atm thief caught in mahaboobnagar | Sakshi
Sakshi News home page

ఏటీఎం దొంగ తల బద్దలుకొట్టుకున్నాడు

Published Tue, Dec 22 2015 11:27 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

ఏటీఎం దొంగ తల బద్దలుకొట్టుకున్నాడు - Sakshi

ఏటీఎం దొంగ తల బద్దలుకొట్టుకున్నాడు

మహబూబ్ నగర్: దొంగతనానికి పాల్పడేందుకు వచ్చిన ఓ దొంగ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఏం చేయాలో తెలియక తన తలను తానే బద్దలు కొట్టుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎస్ బీహెచ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవర కద్రలోని ఎస్ బీహెచ్ ఏటీఎం లోకి ఓ దొంగ ప్రవేశించి ఏటీఎంను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా అటువైపుగా వచ్చిన ఓ గస్తీ పోలీసు ఈ తతంగాన్ని చూశాడు.

దొంగ తన పనిలో మునిగిపోయి ఉండటం చూసి వెంటనే వెళ్లి ఆ ఏటీఎం షెటర్ మూసేసి అదనపు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా భయం గుప్పిట్లోకి జారుకున్న ఆ దొంగ ఏం చేయాలో పాలుపోకా తన చేతిలోని సుత్తితో తన తలను తాను బద్దలు కొట్టుకున్నాడు. పోలీసులు షెటర్ తీసే వరికి అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లగా ఆస్పత్రికి తరలించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement