పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో ఓ వృద్ధదంపతులకు మత్తు మందు ఇచ్చి దోచేశారు.
పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో ఓ వృద్ధదంపతులకు మత్తు మందు ఇచ్చి దోచేశారు. దంపతులు మత్తులోకి జారుకున్న తర్వాత ఒంటిపై ఉన్న 15 తులాల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.