దేవరకద్ర (మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామంలో ఓ మహిళపై దొంగతనం నేరం మోపడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ. వినయ్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వెంకటాయపల్లి గ్రామానికి చెందిన దంపతులు బురాన్, రజియా బేగం(23)లు రాయి కొట్టుకుని జీవించేవారు. కాగా సోమవారం సాయంత్రం గ్రామానికి చెందిన బీవీబీ అనే మహిళ తన బంగారు పూసలదండ పోయిందని ఆరోపిస్తూ మరో ముగ్గురు మహిళలతో కలసి వచ్చి రజియాబేగంను విపరీతంగా కొట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయిన రజియా బేగం రాత్రి తన ఇంట్ల్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనకు సంబంధించి రజియాబేగం భర్త బురాన్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రజియా ఆత్మహత్యకు కారణమైన నలుగురు మహిళలపై కేసు నమోదు చేశారు.