కృష్ణా తీరంలో పురాతన విగ్రహాలు లభ్యం | ancient statues found at krishna river in nalgonda district | Sakshi
Sakshi News home page

కృష్ణా తీరంలో పురాతన విగ్రహాలు లభ్యం

Published Sat, Jul 2 2016 11:14 AM | Last Updated on Sat, Jun 2 2018 7:27 PM

ancient statues found at krishna river in nalgonda district

దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం ఇర్కిగూడెం వద్ద కృష్ణాతీరంలో పార్వతీదేవి ఆలయ నిర్మాణానికి గాను తవ్వకాలు నిర్వహిస్తుండగా పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. కృష్ణానదీ తీరంలో పార్వతీదేవి ఆలయ నిర్మాణానికి తెలంగాణ సర్కార్ రూ. 5లక్షలు మంజూరు చేసింది. దాంతో ఈ రోజు ఉదయం నిర్మాణ పనులు ప్రారంభించారు.

ప్రొక్లైన్‌తో తవ్వకాలు జరుపుతుండగా శివపార్వతులు, వీరభద్రస్వామి విగ్రహాలు మూడు బయటపడ్డాయి. విగ్రహాలు మూడు అడుగుల పొడవు ఉండి చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇవి 200 సంవత్సరాల నాటివని స్థానికులు చెబుతున్నారు. ఆలయ నిర్మాణానికి తవ్వుతుండగా విగ్రహాలు బయటపడడం శుభశూచకమని వారు చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement