Damaracharla
-
దామరచర్ల పవర్‌ప్లాంటు ఆపుతాం
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మించ తలపెట్టిన 4 వేల మెగావాట్ల అల్ట్రా పవర్ ప్లాంటును ఆపి తీరుతామని టీపీసీసీ పబ్లిసిటీ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.80 వేల కోట్ల భారం పడుతోందని, కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టి నల్లగొండ జిల్లా ప్రాణాల మీదకు తీసుకువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయ న విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ప్రాణా లను పణంగా పెట్టి ప్రాజెక్టులు కట్టి కోట్లాది రూపాయలను దోచుకుంటున్నారన్నారు. సిమెం టు, ఫార్మా పరిశ్రమలతో ఇప్పటికే నల్లగొండలో కాలుష్యం పెరిగిపోయిందని, తాగు, సాగునీటి లో ఫ్లోరైడ్ ఉందని, పంటల దిగుబడి కూడా తగ్గి పోతోందన్నారు. మళ్లీ ఇప్పుడు సల్ఫేట్లు, నైట్రేట్లు, మెర్క్యురీ, కోల్, ఫ్లైయాష్ కలిసే ప్లాంటు నిర్మించి నల్లగొండ జిల్లా ప్రజల ప్రాణా లకు ముప్పు తెస్తారా.. అని ప్రశ్నించారు. థర్మల్‌ప్లాంట్లు ఏర్పాటు చేయడం మంచిది కాదని, పర్యావరణానికి చేటు తెస్తుందని ప్యారిస్ సమ్మిట్, జాతీయ మీడియాలో చర్చ జరిగిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ప్లాంటు విషయంలో గుడ్డిగా ముందుకు పోతోందని విమర్శించారు. ప్లాంటు ఆపాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, ఇదే విషయాన్ని పార్టీలో చర్చించి ఒప్పిస్తానన్నారు. -
శిథిలావస్థలో వారధి
దామరచర్ల(మిర్యాలగూడ) : అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల అలసత్వం ప్రయాణికుల పాలిట శాపంగా మారుతోంది. నల్లగొండ– సూర్యాపేట జిల్లాల మధ్య గల మూసీ నదిపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. దామరచర్ల మండల కేంద్రం సమీపంలో మూసీ నదిపై 2001లో రూ.2కోట్లతో నిర్మించిన వంతెన కూలే దశకు చేరింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కలుపుతూ ఉన్న ఈ వంతెన ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడింది. దామరచర్ల నుంచి పారిశ్రామిక ప్రాంతాలైన మేళ్లచెర్వు, దక్కన్ సిమెంట్స్ కర్మాగారం,హుజూర్నగర్, ప్రముఖ పుణ్యక్షేత్రాలు మట్టపల్లి, జాన్‌పహాడ్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఈ వంతెన గుండానే రాకపోకలు సాగిస్తున్నారు.పారిశ్రామికీకరణ ప్రాంతం కావడంతో ఈ వంతెనపై నిత్యం వందలాది వాహనాలు సిమెంట్, ఇతర లోడ్లతో వెళ్తుంటాయి. పిల్లర్లు కూలి..చువ్వలు తేలి.. మూసీ నదిపై ఉన్న వంతెనపై పలుచోట్ల సైడ్ పిల్లర్లు కూలిపోవడంతో వాహనాలు నదిలో పడే ప్రమాదం నెలకొంది. దీంతో పాటు వంతెనపై పలు చోట్ల పగుళ్లు ఏర్పడి చువ్వలు తేలాయి. దీంతో ఎప్పుడు ఏప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి ఈ పరిస్థితి ఉన్నా అధికారులు ఎవరూ పట్టించు కోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
జిల్లాలో వైఎస్సార్సీపీకి ప్రజల మద్దతు
దామరచర్ల (మిర్యాలగూడ) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలనుంచి మద్దతు పెరుగుతోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి పేర్కొన్నారు. దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెంలో వివిధ పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలు విస్మరించి ప్రచారాలకే పరిమితమవుతున్నాయన్నారు. ప్రజలకు అవసరమైన ఒక్క పనీ చేయడం లేదని విమర్శించారు. డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు భూ పంపిణీ వాగ్దానాలకే పరిమితమయ్యాయన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు కాంట్రాక్టర్లకు కాసుల వర్షాన్ని కురిపించాయన్నారు. ఈ ప్రభుత్వాలకు ప్రత్యామ్నయంగా వైఎస్సార్ పార్టీని జిల్లాలో బలోపేతం చేస్తామన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీకి అధిక సీట్లు వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం, జిల్లా నాయకులు అన్నెం కరుణాకర్‌రెడ్డి, కందుల బాల కృష్ణారెడ్డి ,బాజాన్, ఆర్,శ్రీనివాస్, ఎస్.సతీష్, ఆర్.మాణికంఠ, ఎన్.సురేష్, ఎన్. శ్రీను, ఆర్.కోటయ్య, కె.గోపయ్య, టి.దేవిరెడ్డి, ఎస్.నాగరాజు, రామకృష్ణ, వెంకటే, శ్వర్లు, సైదయ్య తదితరులు పాల్గొన్నారు. -
పంచలోహ విగ్రహాలు చోరీ
దామరచర్ల: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామంలోని పురాతన శివాలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని పంచలోహ నిర్మిత శివపార్వతుల విగ్రహాలను బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అడవిదేవులపల్లి మండలం కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం
అడవిదేవులపల్లి (దామరచర్ల) : మండలంలోని అడవిదేవులపల్లిని మండల కేంద్రం చేయకపోవడాన్ని నిరసిస్తూ గ్రామానికి చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురువారం గ్రామంలో అఖిలపక్షాలు చేపట్టిన దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం మండల కేంద్రం చేయక పోవడంతో మనస్తాపానికి గురైన దేవతల సైదయ్య(25) అనే యువకుడు దీక్షవద్ద పురుగుల మందు తాగాడు. దీనిని గమనించిన గ్రామస్తులు వెంటనే చికిత్స కోసం గ్రామంలో ఉన్న ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడిని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పరామర్శించారు. అనంతరం దీక్ష సభా స్థలం వద్ద జూలకంటి మాట్లాడారు. అన్ని అర్హతలున్న అడవిదేవులపల్లిని మండల కేంద్రం చేయక పోవడం అన్యాయమన్నారు. మండల కేంద్రం కోసం చేస్తున్న ఉద్యమాలకు తమ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాటాల ద్వారానే మండల కేంద్రం సాధించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు మల్లేశ్, జగదీశ్వర్‌రెడ్డి,చంద్రశేఖర్‌యాదవ్,పాపానాయక్,వినోద్,సైదులు, మద్దెలశ్రవన్,బండి నాగేశ్వరావు,మున్నా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
అడవిదేవులపల్లి మండలం కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం
అడవిదేవులపల్లి (దామరచర్ల) : మండలంలోని అడవిదేవులపల్లిని మండల కేంద్రం చేయకపోవడాన్ని నిరసిస్తూ గ్రామానికి చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురువారం గ్రామంలో అఖిలపక్షాలు చేపట్టిన దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం మండల కేంద్రం చేయక పోవడంతో మనస్తాపానికి గురైన దేవతల సైదయ్య(25) అనే యువకుడు దీక్షవద్ద పురుగుల మందు తాగాడు. దీనిని గమనించిన గ్రామస్తులు వెంటనే చికిత్స కోసం గ్రామంలో ఉన్న ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడిని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పరామర్శించారు. అనంతరం దీక్ష సభా స్థలం వద్ద జూలకంటి మాట్లాడారు. అన్ని అర్హతలున్న అడవిదేవులపల్లిని మండల కేంద్రం చేయక పోవడం అన్యాయమన్నారు. మండల కేంద్రం కోసం చేస్తున్న ఉద్యమాలకు తమ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాటాల ద్వారానే మండల కేంద్రం సాధించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు మల్లేశ్, జగదీశ్వర్‌రెడ్డి,చంద్రశేఖర్‌యాదవ్,పాపానాయక్,వినోద్,సైదులు, మద్దెలశ్రవన్,బండి నాగేశ్వరావు,మున్నా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
వాడపల్లి వంతెన వద్ద ఆందోళన
వాడపల్లి (దామరచర్ల) : ఆంధ్రా నుంచి ఇసుక రవాణా చేస్తున్న లారీలను ఏపీ పోలీసులు ఆపుతున్నారని, వెంటనే విడుదల చే యాలని డిమాండ్ చేస్తూ లారీ యజమానులు, కార్మికులు బుధవారం మండలంలోని వాడపల్లి వద్ద కృష్ణానది వంతెనపై రాస్తారోకో చేపట్టారు. గంట పాటు రాస్తారోకో చేయడంతో వందలాది వాహనాలు సుమారు 3కి.మీల మేర నిలిచి పోయాయి. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు నుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇసుక లారీలకు అన్ని రకాల వేబిల్స్ ఉన్నా మూడు రోజులుగా ఏపీలోని గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు కృష్ణానది ఆవలి ఒడ్డున ఆపారన్నారు. ఇసుకపై ఆధిపత్యం కోసం ఏపీలోని అధికార పార్టీకి చెందిన ఇరువురు ఎమ్మెల్యేలు గొడవలు పడి పోలీసులను పురమాయించి తమ లారీలను నిలిపివే శారన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఏపీ పోలీసులతో చర్చలు : రాస్తారోకో విషయం తెలుసుకున్న మిర్యాలగూడ రూరల్ సీఐ రవీందర్ సంఘటనా స్థలానికి చేరుకునిఆందోళన కారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఏపీ పోలీసులతో చర్చించారు. బిల్లులున్న లారీలను వెంటనే పంపివేయాలని కోరారు. దీనికి ఏపీ పోలీసులు సానుకూలంగా స్పందించినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాడపల్లి ట్రైనీ ఎస్ఐ రామన్‌గౌడ్, మండల లారీ అసోసియేషన్ అధ్యక్షుడు గుగులోత్ వీరబాబు, హైదరాబాద్ అసోసియేషన్ నాయకులు పెద్దయ్య, రాజేందర్‌రెడ్డి, రవీందర్ గౌడ్, జగన్ తదితరులు పాల్గొన్నారు. -
నష్టంపై పూర్తి నివేదిక అందజేస్తాం
దామరచర్ల : పంట నష్టంపై పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని డీడీఏ మాదవి తెలిపారు. మంగళవారం దామరచర్ల, తాళ్లవీరప్పగూడెం, వాడపల్లి, అడవిదేవులపల్లి తదితర ప్రాంతాల్లో నష్టపోయిన పంటలను రాష్ట్ర బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా పత్తి, వరి తదితర పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం ఆదేశాల మేరకు తాము వచ్చినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ మండలంలో భారీగా పంట నష్టం జరిగిందన్నారు. పంట దెబ్బ తిన్న ప్రతి గ్రామాన్ని సందర్శించి నివేదికలు పంపితే రైతులకు పరిహారం అందేలా తాను కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో బృందం సభ్యులు శైలజ, వినోద్, బాలాజీ, శంకర్, ఎంపీపీ కురాకుల మంగమ్మ, ఏఓ నూతన్‌కుమార్, తహసీల్దార్ గణేష్, వీరకోటిరెడ్డి పాల్గొన్నారు. -
సామాజిక సేవలో ఎన్ఎస్ఎస్
దామరచర్ల సామాజిక సేవా కార్యక్రమాల్లో విద్యార్థులు, ఉపా«ధ్యాయులు, మేథావులు పాల్గొనేలా చేసి వారిలో దేశ భక్తిని, సేవాతత్పరతను పెంపొందించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిందే జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్). స్వాతంత్య్ర సంగ్రామంలో సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలు విద్యార్థుల పాత్రతో విజయవంతం అయ్యాయి. మహాత్ముని శత జయంతి సందర్భంగా1969 సెప్టెంబర్ 24న తొలిప్రధాని జవహర్లాల్ నెహ్రూ సూచనల మేరకు ఎన్ఎస్ఎస్ను ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలోని 47 యూనివర్సిటీల్లో ఎన్ఎస్ఎస్ శిబిరాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో సుమారు 2లక్షల మంది ఎన్.ఎస్.ఎస్ వలంటీర్లు సేవలు అందిస్తున్నారు. పథకం ఉద్దేశం.. సమాజ సేవద్వారా విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి సాధించాలన్నదే లక్ష్యం. స్వేచ్ఛ, సమానత్వం, జాతీయ సమైక్యత, లౌకిక సామ్యవాద, గౌరవ భావం ఏర్పర్చడం. అసమానతలు, క్రూరత్వాన్ని నిరోధించడం. దేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదను కాపాడడం. సమాజంపై అవగహన ఏర్పర్చుకోవడం. సమస్యలు కనుగొనడం, వాటి నివారణకు కృషి చేయడం. సామాజిక సృహ, సమాజ సేవ, పౌరబాధ్యతలు పెంచడం. పాఠశాలకు సమాజానికి సంబంధాన్ని పెంపొందించడం. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంచడం. ఎన్ఎస్ఎస్ విధులివే.. పచ్చదనం పరిశుభ్రత, ఆరోగ్య కార్యక్రమాలు, వ్యక్తి నిర్మాణ కార్యక్రమాలు, చట్టం, న్యాయం, వలంటీర్లకు శిక్షణ, భావ వ్యక్తీకరణ కార్యక్రమాలు. పల్స్‌పోలియో, వివిధ ప్రత్యేక దినోత్సవాలు, వారోత్సవాలు నిర్వహించడం. ప్రత్యేక శిబిరాలు ప్రతి ఎన్ఎస్ఎస్ యూనిట్ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేక ని«ధిని కేటాయించింది. గ్రామాల్లోని మురికివాడల్లో విద్యార్థులు ఏటా వారం రోజులు ఉండి శ్రమదానం చేయాలి. వీటి ద్వారా పారిశుద్ధ్యం, రహదారుల అభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం, మొక్కలు నాటడం, నీటి వినియోగంపై గ్రామస్తులకు వివరించడం, బాణామతి, చేతబడులు వంటి మూఢ నమ్మకాలపై కళాప్రదర్శనల ద్వారా ప్రజలను చైతన్య వంతులను చేయాలి. పౌష్టికాహారం ఆవశ్యకతను ప్రజలకు వివరించాలి.ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలి. శిబిరాల్లో 240 గంటలు పనిచేసిన విద్యార్థులకు ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. విద్యార్థులు ముందుండాలి – డాక్టర్ రాజేశ్వర్‌నాయక్ (ప్రోగ్రామ్ అధికారి) సమాజ సేవలో విద్యార్థులు ముందుండాలి. సేవల ద్వారా విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధి చెందుతారు. జాతీయ సేవకు ఈశిబిరాలు దోహదం చేస్తాయి. సేవాతత్పరత కలిగిన విద్యార్థులే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ తప్పనిసరి. చైతన్యవంతులను చేయొచ్చు – కె.ప్రశాంత్, వ్యవసాయ విద్యార్థి ఎన్ఎస్ఎస్ శిబిరాల çసందర్భంగా సామాజిక సమస్యలపై ప్రజలను చైతన్యవంతులను చేసే వీలు కలుగుతుంది. సామాజిక పరిస్థితులను ఆకలింపు చేసుకోవడం వలన మనలో భావ వ్యక్తీకరణకు దోహదపడుతుంది. సమాజంపై అవగాహన పెరుగుతుంది. -
నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలి
దామరచర్ల : మిర్యాలగూడ నియోజకవర్గాన్ని నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి పగిడి జీడయ్య యాదవ్ కోరారు. ఈ మేరకు ఆదివారం దామరచర్లలో సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పాత జిల్లాలో ఉండడం వలన సామాన్యులకు అందుబాటులో ఉంటుందన్నారు. వ్యాపార, రవాణా పరంగా అనుకూలంగా ఉంటాయన్నారు. కొందరు తమ స్వార్థం కోసమే సూర్యాపేటలో కలపాలంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో లూవూరి సైదానపాయక్ ,పోలేపల్లి గోపయ్య,గోపి, పరుశురాములు,అశోక్,నగేష్ తదితరులు పాల్గొన్నారు. -
నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలి
దామరచర్ల : మిర్యాలగూడ నియోజకవర్గాన్ని నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి పగిడి జీడయ్య యాదవ్ కోరారు. ఈ మేరకు ఆదివారం దామరచర్లలో సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పాత జిల్లాలో ఉండడం వలన సామాన్యులకు అందుబాటులో ఉంటుందన్నారు. వ్యాపార, రవాణా పరంగా అనుకూలంగా ఉంటాయన్నారు. కొందరు తమ స్వార్థం కోసమే సూర్యాపేటలో కలపాలంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో లూవూరి సైదానపాయక్ ,పోలేపల్లి గోపయ్య,గోపి, పరుశురాములు,అశోక్,నగేష్ తదితరులు పాల్గొన్నారు. -
అడవిదేవులపల్లిని మండలం చేయాలని తీర్మానం
దామరచర్ల : మండలంలోని అడవిదేవులపల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని జెడ్పీటీసీ కేతావత్ శంకర్ నాయక్ చేసిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. శనివారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కురాకుల మంగమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జెడ్పీటీసీ తీర్మానం ప్రవేశ పెడుతూ అడవిదేవులపల్లిని మండల కేంద్రం చేస్తే 10 గ్రామ పంచాయతీలు, 35 గిరిజన తండాలకు అనుకూలంగా ఉంటుందన్నారు. దీన్ని సభ్యులందరూ బలపరిచారు. సమావేశానికి పలువురు అధికారులు రాకపోవడంపై సర్పంచ్‌లు లింగానాయక్, ముత్తయ్య, శ్రీనివాస్‌నాయక్, ఎంపీటీసీ కన్నెలాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు ఎవరికి విన్నవించాలని.. సమావేశానికి రానివారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్వాకం వల్లే కార్పొరేషన్ల రుణాల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని జెడ్పీటీసీ శంకర్‌నాయక్, ఎంపీటీసీలు బాలునాయక్, ఖాసీం, సింగిల్‌విండో చైర్మన్ నారాయణరెడ్డి ఆరోపించారు. అర్హులైన వారికి న్యాయం చేయాలన్నారు. వేసవిలో నీటి సరఫరాచేసిన బిల్లులు వెంటనే ఇప్పించాలని సర్పంచ్ బాలునాయక్, ఎంపీటీసీ కిషన్ నాయక్ కోరారు. సమావేశంలో వైస్ ఎంపీపీ కొందూటి మాధవి సిద్ధయ్య, తహసీల్దార్ గణేష్, ఎంపీడీఓ ఉమాదేవి, ఏఈ ఆదినారాయణ, ఎంఈఓ మంగ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అడవిదేవులపల్లిని మండలం చేయాలని తీర్మానం
దామరచర్ల : మండలంలోని అడవిదేవులపల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని జెడ్పీటీసీ కేతావత్ శంకర్ నాయక్ చేసిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. శనివారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కురాకుల మంగమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జెడ్పీటీసీ తీర్మానం ప్రవేశ పెడుతూ అడవిదేవులపల్లిని మండల కేంద్రం చేస్తే 10 గ్రామ పంచాయతీలు, 35 గిరిజన తండాలకు అనుకూలంగా ఉంటుందన్నారు. దీన్ని సభ్యులందరూ బలపరిచారు. సమావేశానికి పలువురు అధికారులు రాకపోవడంపై సర్పంచ్‌లు లింగానాయక్, ముత్తయ్య, శ్రీనివాస్‌నాయక్, ఎంపీటీసీ కన్నెలాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు ఎవరికి విన్నవించాలని.. సమావేశానికి రానివారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్వాకం వల్లే కార్పొరేషన్ల రుణాల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని జెడ్పీటీసీ శంకర్‌నాయక్, ఎంపీటీసీలు బాలునాయక్, ఖాసీం, సింగిల్‌విండో చైర్మన్ నారాయణరెడ్డి ఆరోపించారు. అర్హులైన వారికి న్యాయం చేయాలన్నారు. వేసవిలో నీటి సరఫరాచేసిన బిల్లులు వెంటనే ఇప్పించాలని సర్పంచ్ బాలునాయక్, ఎంపీటీసీ కిషన్ నాయక్ కోరారు. సమావేశంలో వైస్ ఎంపీపీ కొందూటి మాధవి సిద్ధయ్య, తహసీల్దార్ గణేష్, ఎంపీడీఓ ఉమాదేవి, ఏఈ ఆదినారాయణ, ఎంఈఓ మంగ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు సేవాదృక్ఫథాన్ని అలవర్చుకోవాలి
కొండ్రపోల్(దామరచర్ల): విద్యార్థులు సేవాదృక్పథాన్ని అలవర్చుకోవాలని ఆర్డీఓ బి.కిషన్‌రావు కోరారు. శుక్రవారం దామరచర్ల మండలం కొండ్రపోల్‌లో వ్యవసాయ విద్యార్థుల ఎన్ఎస్ఎస్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ మానవాళికి మేలు చేసే సేవా కార్యక్రమన్నారు. వారం రోజులపాటు జరిగే ఈకార్యక్రమంలో గ్రామస్తులతో మమేకమై వారి జీవన శైలిని, స్థితితిగతులను గమనించాలని కోరారు. విద్యార్థులు చదువుల అనంతరం ఎప్పుడూ కూడా వ్యక్తిత్వాన్ని వదులుకోవద్దన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేటెడ్ డీన్ విష్ణువర్ధన్‌రెడ్డి, తహసీల్దార్ గణేష్, సర్పంచి అడావత్ అచ్చమ్మ ఆనంద్, హెచ్ఎం భీమ్లానాయక్, శాస్త్రవేత్తలు రవీంద్రానాయక్, రాజేశ్వర్‌నాయక్, బాలాజీనాయక్, ముర ళి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
దామరచర్ల: దామరచర్ల మండల కేంద్రంలో సోమవారం ద్విక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. గరిడేపల్లి మండలం కల్మల చెర్వుకు చెందిన సంబందాల భిక్షం(55) పెట్రోల్‌బంక్ సమీపంలో రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. బాదితుడిని వైద్యచికిత్సకై మిర్యాలగూడకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ముగ్గురు ఫీల్డ్‌అసిస్టెంట్ల సస్పెన్షన్
దామరచర్ల : దామరచర్ల మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఉపాధి హామీ ప్రజావేదికలో ముగ్గురు ఫీల్డ్ అససిస్టెంట్లు, ఒక టెక్నికల్ అసిస్టెంట్ సస్పెండ్ అయ్యారు. దామరచర్ల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం అర్ధరాత్రి దాటేవరకూ ప్రజావేదిక జరిగింది. 25 గ్రామాల్లో తొలుత సామాజిక తనిఖీలు చేశారు. తేదీ 1.4.2015 నుంచి 31.5.2016 వరకు రూ.3.93కోట్ల విలువైన 1818 పనులకు సంబంధించిన నివేదికలను సభలో ప్రవేశపెట్టారు. దీనిపై సమగ్ర చర్చలు జరిగిన అనంతరం వివిధ పనుల్లో తేడాలు గుర్తించారు. తనిఖీల్లో గుర్తించిన పనులకు సంబంధించి రూ.4.43లక్షల రికవరీకి ఆదేశాలు జారీచేశారు. దీనికి సంబంధించి బాల్నెపల్లి, ఇర్కిగూడెం, చాంప్లాతండాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లను, ఒక టెక్నికల్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాస్, ఎంపీడీవో ఉమాదేవి, ఏపీఓలు నాగేశ్వరావు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు ఫీల్డ్‌అసిస్టెంట్ల సస్పెన్షన్
దామరచర్ల : దామరచర్ల మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఉపాధి హామీ ప్రజావేదికలో ముగ్గురు ఫీల్డ్ అససిస్టెంట్లు, ఒక టెక్నికల్ అసిస్టెంట్ సస్పెండ్ అయ్యారు. దామరచర్ల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం అర్ధరాత్రి దాటేవరకూ ప్రజావేదిక జరిగింది. 25 గ్రామాల్లో తొలుత సామాజిక తనిఖీలు చేశారు. తేదీ 1.4.2015 నుంచి 31.5.2016 వరకు రూ.3.93కోట్ల విలువైన 1818 పనులకు సంబంధించిన నివేదికలను సభలో ప్రవేశపెట్టారు. దీనిపై సమగ్ర చర్చలు జరిగిన అనంతరం వివిధ పనుల్లో తేడాలు గుర్తించారు. తనిఖీల్లో గుర్తించిన పనులకు సంబంధించి రూ.4.43లక్షల రికవరీకి ఆదేశాలు జారీచేశారు. దీనికి సంబంధించి బాల్నెపల్లి, ఇర్కిగూడెం, చాంప్లాతండాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లను, ఒక టెక్నికల్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాస్, ఎంపీడీవో ఉమాదేవి, ఏపీఓలు నాగేశ్వరావు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరాలకు 1150 బస్సులు
దామరచర్ల: కృష్ణాపుష్కరాలకు రాష్ట్ర వ్యాప్తంగా 1150 ఆర్టీసీ బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఎండీ రమణారావు తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లిలో బస్సు పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. అనంతరం శ్రీమీనాక్షి అగస్త్యేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పుష్కరాలు జరిగే నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు 1150 బస్సులు నడుపుతామన్నారు. వీటిలో ఏసీ బస్సులు కూడా ఉంటాయన్నారు. భక్తుల డిమాండ్‌ను బట్టి అవసరమైతే బస్సుల సంఖ్యను పెంచుతామన్నారు. పార్కింగ్ ప్రాంతాలనుంచి ఉచితంగా షటిల్ బస్సులు నడిపేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం కృష్ణహరి, మధుసూదన్‌రెడ్డి, వీవీఎన్రెడ్డి, సుధాకర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు
దామరచర్ల : కృష్ణా పుష్కరాలకు వచ్చే వృద్ధులు, వికలాంగుల కోసం అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. నదిలో స్నానమాచరించడానికి ఘాట్ పక్కనే ఉన్న కొంత భాగాన్ని ప్రత్యేకంగా వృద్ధులు, వికలాంగుల కోసం కేటాయించారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పించనున్నారు. దీంతో పాటుగా పార్కింగ్ స్థలాల నుంచి ఘాట్ల వరకు వెళ్లేందుకు ప్రత్యేకంగా ఆటోలను గుర్తించి పాస్‌లు ఇస్తున్నారు. ఆయా ఆటోలు తక్కువ చార్జీకే వారిని ఘాట్లకు వరకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. -
పుష్కర పనుల నాణ్యత ప్రశ్నార్థకం
వాడపల్లి(దామరచర్ల) : ప్రభుత్వం పుష్కర పనులను ఆర్నెళ్ల క్రితం ప్రారంభిస్తే నాణ్యతగా పనులు జరిగేవని సీపీం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వాడపల్లి పాతపోలీస్ స్టేషన్ ఘాట్, పాత సిమెంట్ఘాట్, శివాలయం ఘాట్ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పుష్కరాలు దగ్గర పడుతుండడంతో హడావుడిగా పనులు చేయడం వలన నాణ్యత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వాడపల్లిలో ఉన్న చారిత్రక కట్టడాల భద్రతపై చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. ఇప్పుడు రంగులు, టైల్స్ వేస్తే పుష్కరాలు అయిపోయేంత వరకైనా ఉంటాయా అనేది అధికారులే చెప్పాలన్నారు. ఆయన వెంట డివిజన్ కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్ యాదవ్, పాపానాయక్, దయానంద్,వినోద తదితరులు పాల్గొన్నారు. -
95శాతం పుష్కర పనులు పూర్తి
వాడపల్లి(దామరచర్ల): వాడపల్లి పుణ్యక్షేత్రంలో 95 శాతం మేర పుష్కర పనులు పూర్తయినట్లు పుష్కర ప్రత్యేక అధికారి ఏజేసీ వెంకట్రావ్ తెలిపారు. శనివారం వాడపల్లి శ్రీమీనాక్షి అగస్త్యేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మిగిలిన పనులన్నీ ఆదివారం పూర్తవుతాయన్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే 650 టాయ్లెట్లు పూర్తయ్యాయని,మరో 150 నిర్మాణంలో ఉన్నాయన్నారు. సురక్షిత తాగునీటి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. పుష్కరాలకు 450 మంది సివిల్ సిబ్బంది, 800 మంది పారిశుద్ధ్య కార్మికులు,150 మంది ఎలక్ట్రికల్ కార్మికులు,450 మంది వలంటీర్స్ మూడు షిప్టుల్లో పని చేస్తారన్నారు. ఏజేసీ మొదలుకొని స్వీపర్ వరకూ అక్షయ పాత్ర అందించే ఒకే రకమైన బోజనం తింటారన్నారు. వరదలు వచ్చినా సురక్షితంగా స్నానాలు చేసే విధంగా స్నానఘాట్ల వద్ద ఏర్పాట్లు చేస్తామన్నారు. 8 ఘాట్లవద్ద కంట్రోల్ రూమ్స్, ఒకచోట సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. సమావేశంలో అధికారులు బాలకృష్ణ, యుగేందర్, శ్రీధర్, తహసీల్దార్ గణేష్, ఎంపీడీఓ ఉమాదేవి పాల్గొన్నారు. -
అన్ని గోదాంలను వినియోగంలోకి తెస్తాం
దామరచర్ల : జిల్లాలో ఉన్న అన్ని గోదాంలను వినియోగంలోకి తెస్తామని మార్కెటింగ్ శాఖ జేడీఏ లక్ష్మణుడు తెలిపారు. శుక్రవారం దామరచర్ల సబ్‌మార్కెట్ యార్డులో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో 1.55లక్షల మెట్రిక్‌టన్నుల సామర్థ్యమున్న 121 గోదాంలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత రెండేళ్లుగా 1.25లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 31 గోదాంల నిర్మాణాలను ప్రారంభించామన్నారు. వీటి నిర్మాణం 80 శాతం పూర్తయినట్టు తెలిపారు. ఈ గోదాంలను పీడీఎస్ బియ్యం, ఫెస్టిసైడ్స్ నిల్వలకు వినియోగిస్తామన్నారు. రైతులు రైతు బంధు పథకం కింద తమ పంట ఉత్పత్తులను దాచుకోవచ్చునన్నారు. తమ శాఖ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటాలనేది లక్ష్యమని, ఇప్పటి వరకూ 34 వేల మొక్కలు నాటినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ అలీం, కార్యదర్శి అనంతయ్య, శ్రీనివాస్, సైదులు, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరాలకు 1100 బస్సులు
వాడపల్లి(దామరచర్ల) : కష్ణా పుష్కరాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 1100 ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమవరపు సత్యనారాయణ తెలిపారు. గురువరాం దామరచర్ల మండలం వాడపల్లిలో పుష్కర ప్రాంతాలను, హోల్డింగ్ పాయింట్లను పరిశీలించారు. శ్రీమీనాక్షి అగస్త్యేశ్వర స్వామి, శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భక్తులు ఇబ్బందులు పడకుండా హైదరాబాద్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు బస్సులు నడుపుతామన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన బీచుపల్లికి248, నాగార్జునసాగర్‌కు 160, శ్రీశైలంకు 150, వాడపల్లికి 60, విజయవాడకు 50 బస్సులు సర్వీస్ చేస్తాయన్నారు. వాడపల్లికి వచ్చే భక్తుల కోసం పార్కిగ్ స్థలాల నుంచి ఘాట్ల వరకు ప్రత్యేకంగా షటిల్ బస్సులు నడుపుతామని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ రూ.2275 కోట్ల నష్టాల్లో ఉందని, ఈ ఏడాది టర్నోవర్‌ను రూ.5వేల కోట్లకు పెంచేందుకు కషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం కొత్తగా 1157 బస్సులు, 236 మినీ బస్సులు కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంపై కేంద్రంతో సహా పలు రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ వేణు,ఆర్ఎం కృష్ణహరి, ఎంపీపీ కురాకుల మంగమ్మ, సింగిల్ విండో చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ చైర్మన్ వీరకోటిరెడ్డి, దేవాలయ చైర్మన్ కొందూటి సిద్దయ్య, మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
750కిలోల పీడీఎస్ బియ్యం పట్టివేత
దామరచర్ల దామరచర్ల మండలం వాడపల్లి లారీ యార్డు దగ్గర పోలీస్‌లు శనివారం 750 కిలోల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. దామరచర్ల మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన ఈ బియాన్ని ఆంధ్రాప్రాంతం వైపు ఆటోల్లో తరలిస్తుండగా పట్టుకున్నట్లు వాడపల్లి ఎస్.ఐ చరమందరాజు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నిర్వాసితులందరికీ పరిహారం ఇవ్వాలి
అడవిదేవులపల్లి (దామరచర్ల) : నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులందరికీ పరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. మండలంలో సీపీఎం ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న పాదయాత్ర గురువారం ముగిసింది. ఈ సందర్భంగా నడిగడ్డ, టెయిల్ పాండ్ల వద్ద జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. భూముల రకాలతో నిమిత్తం లేకుండా 2013 చట్టం ప్రకారం నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. రైతులకు అన్యాయం జరిగితే పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల పక్షాన సప్రీం కోర్టుకు సైతం వెళ్తామన్నారు. భూములు కోల్పోయిన కుటుంబాలన్నింటికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ టెయిల్ పాండ్ నిర్మాణంతో 8 ఎత్తిపోతల పథకాలు నీట మునగనున్నాయన్నారు. వీటి కింద ఉన్న 5 వేల ఎకరాలు ఎండి పోయే ప్రమాదముందన్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నయ చర్యలు చేపట్టాలని కోరారు. ముంపునకు గురయ్యే చిట్యాల, నడిగడ్డ, చింతలపాలెం, జమ్మికోట తండా వాసులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. టెయిల్ పాండ్ జెన్కో ఎస్ఈ కుమార్ మాట్లాడుతూ సమస్య తీవ్రతను గుర్తించామని, ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధీరావత్ రవినాయక్, జిల్లా అధ్యక్షుడు పాపానాయక్,ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొప్పని పద్మ, మల్లు లక్ష్మి, రైతు సంఘం నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్ యాదవ్, నాగిరెడ్డి, కత్తి లింగారెడ్డి, ఇంద్రారెడ్డి, ఎర్రానాయక్, మాజీ సర్పంచ్ కురాకుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.