నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలి
నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలి
Published Sun, Sep 18 2016 7:19 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
దామరచర్ల : మిర్యాలగూడ నియోజకవర్గాన్ని నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి పగిడి జీడయ్య యాదవ్ కోరారు. ఈ మేరకు ఆదివారం దామరచర్లలో సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పాత జిల్లాలో ఉండడం వలన సామాన్యులకు అందుబాటులో ఉంటుందన్నారు. వ్యాపార, రవాణా పరంగా అనుకూలంగా ఉంటాయన్నారు. కొందరు తమ స్వార్థం కోసమే సూర్యాపేటలో కలపాలంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో లూవూరి సైదానపాయక్ ,పోలేపల్లి గోపయ్య,గోపి, పరుశురాములు,అశోక్,నగేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement