
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నల్గొండ: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతోంది. ఈ క్రమంలో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది.
ఈదులగూడ చౌరస్తా వద్ద తనిఖీల్లో హైదరాబాద్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో రూ.5.73 కోట్లు విలువైన 13 కిలోల బంగారం పట్టుకున్నారు పోలీసులు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గోల్డ్ డిస్టిబూటర్లకు సరాఫరా చేసే ఓ ఏజెన్సీకి చెందిన వాహనంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
చదవండి: ED: కవిత అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రెస్‌నోట్ విడుదల
-
Comments
Please login to add a commentAdd a comment