
సాక్షి, నల్గొండ జిల్లా: ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విధులు నిర్వహించాల్సిన వారు పట్టపగలే కార్యాలయంలో కుర్చీలో కునుకు తీస్తున్నారు.
తాజాగా, పని వేళల్లో దర్జాగా ఆఫీసులో నిద్రపోతున్న మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ యూసఫ్ అలీ తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. టేబుల్‌పై కాళ్లేసి మరీ కమిషనర్ గాఢ నిద్రలోకి జారుకున్నారు. నిద్రపోతున్న కమిషనర్ ఫొటో వైరల్‌గా మారింది. కమిషనర్ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. పనులను పక్కన పెట్టి కార్యాలయంలోనే కునుకు తీయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment