
సాక్షి నల్గొండ జిల్లా: రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీరు సంచలనంగా మారింది. బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేకుండా ఆఫీస్‌ను నిర్మించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మున్సిపల్ కేంద్రంలో అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రి.. తాను గతంలోనే అధికారులకు ఈ విషయంపై ఆదేశాలిచ్చాను కదా వ్యాఖ్యానించారు.
‘‘నేను అమెరికాకు వెళ్తున్నా.. ఆగస్టు 11న తిరిగి వస్తాను.. వచ్చేలోపు అనుమతి లేని ఆ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలి.. లేకపోతే అధికారులపై యాక్షన్ తీసుకుంటా అంటూ హుకుం జారీ చేశారు. మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు నల్గొండ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment