సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మించ తలపెట్టిన 4 వేల మెగావాట్ల అల్ట్రా పవర్ ప్లాంటును ఆపి తీరుతామని టీపీసీసీ పబ్లిసిటీ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.80 వేల కోట్ల భారం పడుతోందని, కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టి నల్లగొండ జిల్లా ప్రాణాల మీదకు తీసుకువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయ న విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ప్రాణా లను పణంగా పెట్టి ప్రాజెక్టులు కట్టి కోట్లాది రూపాయలను దోచుకుంటున్నారన్నారు.
సిమెం టు, ఫార్మా పరిశ్రమలతో ఇప్పటికే నల్లగొండలో కాలుష్యం పెరిగిపోయిందని, తాగు, సాగునీటి లో ఫ్లోరైడ్ ఉందని, పంటల దిగుబడి కూడా తగ్గి పోతోందన్నారు. మళ్లీ ఇప్పుడు సల్ఫేట్లు, నైట్రేట్లు, మెర్క్యురీ, కోల్, ఫ్లైయాష్ కలిసే ప్లాంటు నిర్మించి నల్లగొండ జిల్లా ప్రజల ప్రాణా లకు ముప్పు తెస్తారా.. అని ప్రశ్నించారు. థర్మల్‌ప్లాంట్లు ఏర్పాటు చేయడం మంచిది కాదని, పర్యావరణానికి చేటు తెస్తుందని ప్యారిస్ సమ్మిట్, జాతీయ మీడియాలో చర్చ జరిగిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ప్లాంటు విషయంలో గుడ్డిగా ముందుకు పోతోందని విమర్శించారు. ప్లాంటు ఆపాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, ఇదే విషయాన్ని పార్టీలో చర్చించి ఒప్పిస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment