నష్టంపై పూర్తి నివేదిక అందజేస్తాం | To provied full report on damage | Sakshi
Sakshi News home page

నష్టంపై పూర్తి నివేదిక అందజేస్తాం

Published Tue, Sep 27 2016 10:33 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

నష్టంపై పూర్తి నివేదిక అందజేస్తాం

నష్టంపై పూర్తి నివేదిక అందజేస్తాం

దామరచర్ల :  పంట నష్టంపై పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని డీడీఏ మాదవి తెలిపారు. మంగళవారం దామరచర్ల, తాళ్లవీరప్పగూడెం, వాడపల్లి, అడవిదేవులపల్లి తదితర ప్రాంతాల్లో నష్టపోయిన పంటలను రాష్ట్ర బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా పత్తి, వరి తదితర పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం ఆదేశాల మేరకు తాము వచ్చినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ మండలంలో భారీగా పంట నష్టం జరిగిందన్నారు. పంట దెబ్బ తిన్న ప్రతి గ్రామాన్ని సందర్శించి నివేదికలు పంపితే రైతులకు పరిహారం అందేలా తాను కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో బృందం సభ్యులు శైలజ, వినోద్, బాలాజీ, శంకర్, ఎంపీపీ కురాకుల మంగమ్మ, ఏఓ నూతన్‌కుమార్, తహసీల్దార్‌ గణేష్, వీరకోటిరెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement