పుష్కరాలకు 1100 బస్సులు | 1100 buses for pushkar | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు 1100 బస్సులు

Published Thu, Aug 4 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

పుష్కరాలకు 1100 బస్సులు

పుష్కరాలకు 1100 బస్సులు

వాడపల్లి(దామరచర్ల) : కష్ణా పుష్కరాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 1100 ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌ సోమవరపు సత్యనారాయణ తెలిపారు. గురువరాం దామరచర్ల మండలం వాడపల్లిలో పుష్కర ప్రాంతాలను, హోల్డింగ్‌ పాయింట్లను పరిశీలించారు.  శ్రీమీనాక్షి అగస్త్యేశ్వర స్వామి, శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భక్తులు ఇబ్బందులు పడకుండా హైదరాబాద్‌ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు  బస్సులు నడుపుతామన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన బీచుపల్లికి248, నాగార్జునసాగర్‌కు 160, శ్రీశైలంకు 150, వాడపల్లికి 60, విజయవాడకు 50 బస్సులు సర్వీస్‌ చేస్తాయన్నారు. వాడపల్లికి వచ్చే భక్తుల కోసం పార్కిగ్‌ స్థలాల నుంచి ఘాట్ల వరకు ప్రత్యేకంగా షటిల్‌ బస్సులు నడుపుతామని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ రూ.2275 కోట్ల నష్టాల్లో ఉందని, ఈ ఏడాది టర్నోవర్‌ను రూ.5వేల కోట్లకు పెంచేందుకు కషి చేస్తున్నామని పేర్కొన్నారు.  ఈ సంవత్సరం కొత్తగా 1157 బస్సులు, 236 మినీ బస్సులు కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకంపై కేంద్రంతో సహా పలు రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు.  ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ వేణు,ఆర్‌ఎం కృష్ణహరి, ఎంపీపీ కురాకుల మంగమ్మ, సింగిల్‌ విండో చైర్మన్‌ నారాయణరెడ్డి, మాజీ చైర్మన్‌ వీరకోటిరెడ్డి, దేవాలయ చైర్మన్‌ కొందూటి సిద్దయ్య, మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement