vadapalli
-
ఆ లాంచీ ప్రమాద నిందితులు దొరికారు
పశ్చిమగోదావరి ,పోలవరం: పోలవరం మండలంలోని వాడపల్లి వద్ద గోదావరి నదిలో ఈ నెల 15న జరిగిన లాంచీ ప్రమాద ఘటనకు సబంధించి నిందితులను అరెస్ట్ చేసినట్టు దర్యాప్తు అధికారి, పోలవరం డీఎస్పీ ఏటీవీ రవికుమార్ తెలిపారు. పోలవరం పోలీస్ స్టేషన్లో గురువారం ఆయన విలేకరులకు ప్రమాదం జరగటానికి కారణాలను వెల్లడించారు. దేవిపట్నంలో ప్రయాణికులను ఎక్కించుకున్న లక్ష్మీవెంకటేశ్వర లాంచీ మంటూరు–వాడపల్లి గ్రామాల మధ్యకు వచ్చేసరికి ఈదురు గాలులు వీచాయన్నారు. దీంతో ప్రయాణికులు లాంచీని నిలిపివేయమని కోరినా, నిర్లక్ష్యంగా లాంచీ నడిపి ప్రమాదానికి కారణమైన లాంచీ యజమాని షేక్ ఖాజామొహిద్దీన్, సరంగు బండి మోహనరావును అరెస్ట్ చేశామని చెప్పారు. వీరికి సరంగు లైసెన్సులు కూడా లేవని తెలిపారు. వీరిని వైద్యపరీక్షల అనంతరం కోర్టుకు హాజరు పరుస్తామన్నారు. నిందితులు కోండ్రుకోట వీఆర్వో ఎదుట లొంగిపోయారని చెప్పారు. ప్రమాద సమయంలో లాంచీలో సిమెంట్ బస్తాలు, ఇతర సామగ్రి ఉన్నాయన్నారు. లాంచీ తలుపులు మూసివేయటంతో గాలిపోయే మార్గంలేక లాంచీపై ఒత్తిడి పెరిగిందన్నారు. లాంచీలో లైఫ్ జాకెట్లు ఉన్నా వాటిని ప్రయాణీకులకు ఇవ్వలేదన్నారు. 304 పార్ట్–2 సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు. ప్రయాణికులకు రక్షణ చర్యలు చేపట్టే వరకు, నిబంధనలు పూర్తిగా పాటించే వరకు లాంచీలకు, బోట్లకు అనుమతి ఇచ్చేది లేదన్నారు. అధికారులు లాంచీలు, బోట్లు తనిఖీ చేస్తున్నారని తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి కొత్త నిబందనలు అమలులోకి వస్తాయని, వాటిని తప్పనిసరిగా పాటించాలన్నారు. పోలవరం సీఐ ఎం.రమేష్‌బాబు, ఎస్సై కె.శ్రీహరిరావు పాల్గొన్నారు. -
జనసంద్రమైన వాడపల్లి
-మార్మోగిన గోవిందనామం -భక్తులకు ట్రాఫిక్ కష్టాలు -వీఐపీల రాకతో గంటల తరబడి క్యూలైన్లో.. -ఉత్తర ద్వార దర్శనానికి బ్రేక్ ఆత్రేయపురం (కొత్తపేట):కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. శనివారం శ్రావణమాసం త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివార్ని దర్శించుకున్నారు. ఆలయం గోవింద నామస్మరణతో మారుమోగింది. శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వార్ని ప్రత్యేకంగా పువ్వులతో అలంకరించారు. ఉదయం సుప్రభాత సేవ, విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, నీరాజన మంత్రపుష్పం తదితర పూజా కార్యాక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారికి మొక్కుబడులు చెల్లించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఆవరణలో భారీ అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కరుటూరి నరసింహరావు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో పర్యవేక్షకులు సాయిరామ్ , శ్రీదేవి ఆలయ సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు ట్రాఫిక్ స్తంభించడంతో అష్టకష్టాలు ఎదుర్కొన్నారు. లొల్ల వంతెన వద్ద గంట సేపు ట్రాఫిక్ నిలిచిపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు. కాగా ఆలయంలో ప్రముఖుల తాకిడి అధికంగా ఉండటంతో గంటల తరబడి క్యూలైన్లు నిలిపివేయడంతో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూలైన్లో భక్తులు సుమారు 3 గంటల పాటు పడిగాపులు పడ్డారు. ఆలయంలో ఉత్తర ద్వారం నిలుపుదల చేయడంతో పాటు మరో మార్గం ఏర్పాటు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని భక్తులు వాపోయారు. ప్రముఖులు, ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనం ప్రధాన మార్గం ద్వారా వెళ్లడంతో భక్తులు స్వామి వారి దర్శనం కోసం అష్టకష్టాలు పడ్డారు. స్వామి వారి సన్నిధిలో అమలాపురం డీఎస్పీ ఏవీఎల్ ప్రసస్నకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి, పండితుల సత్కారం అందుకున్నారు. ఆలయ చైర్మన్ నరసింహరావు, ఈవో సత్యనారాయణరాజు స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. -
కన్నుల పండువగా పుష్పోత్సవాలు
వాడపల్లి, ర్యాలిలో ముగిసిన కల్యాణోత్సవాలు వాడపల్లి(ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి, ర్యాలి జగన్మోహినీ కేశవ స్వామి వార్ల పుష్పోత్సవాలు బుధవారం కన్నులపండువగా నిర్వహించారు. వీటితో ఈ రెండు ఆలయాల్లో జరుగుతున్న కల్యాణోత్సవాలు బుధవారంతో ముగిశాయి. కల్యాణోత్సవాల ముగింపు సందర్భంగా వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం గోవిందనామస్మరణతో మార్మోగింది. ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, బాలభోగం, నివేదన, తదితర కార్యక్రమాలను అర్చక స్వాములు వైభవంగా నిర్వహించారు. వాడపల్లి ఆలయంలో ఉత్సవ మూర్తులను పల్లకిలో ఉంచి భక్తులు గోవింద నామస్మరణతో గ్రామోత్సవం చేశారు. వైఖానస పండితులు శ్రీమాన్ ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో అర్చక స్వాములు పుష్పోత్సవం కార్యక్రమం నేత్రపర్వంగా నిర్వహించారు. 11 రకాల పిండివంటలతో స్వామివారికి నైవేద్యం సమర్పించి 121 రకాల మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని అద్దాల మండపంలో వివిధ రకాల పూలతో అలంకరించిన ఊయలలో స్వామి వారిని జోలపాటలతో శయనింపజేశారు. వందలాది దంపతులకు దంపతి తాంబులాలు అందించారు. తీర్థ మహోత్సవాల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ చైర్మన్ కరుటూరి నరసింహరావు, ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణ మూర్తి, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. పురాణ ప్రసిద్ధి చెందిన ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి కల్యాణ మహోత్సవాలు బుధవారంతో ముగిశాయి. ఉదయం స్వామివారికి వేదపండితులు, అర్చకుల ఆధ్వర్యంలో మేలుకొలుపు, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి స్వామివారికి శ్రీ పుష్పోత్సవాన్ని అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఈవో వై. వెంకటేశ్వరరావు, ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. -
ఘనంగా చక్రస్నానం
వాడపల్లి, ర్యాలి ఆలయాలకు పోటెత్తిన భక్తులు వాడపల్లి (ఆత్రేయపురం) : వాడపల్లి వేంకటేశ్వరస్వామి, పురాణ ప్రసిద్ధి చెందిన ర్యాలి జగన్మోహినీ కేశవ స్వామి చక్రస్నాన మహోత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి విష్వక్సేనపూజ, పుణ్యహవచనం, పూర్ణాహుతి, బాలబోగం, ప్రసాదవినియోగం తదితర కార్యక్రమాలను వేదపండితులు, ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. వేదపండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో అర్చక స్వాములు చోళ సంవాదాన్ని జరిపించారు. చక్రస్నానం సందర్భంగా స్వామి వారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. స్వామి వారిని ఆలయం నుంచి పల్లకీపై ఊరేగింపుగా గ్రామ పుర వీధులో బాణసంచాకాల్పుల నడుమ బ్యాండ్ మేళాలతో గౌతమీ గోదావరి వద్దకు తీసుకుని వచ్చి అక్కడ గోదావరి సమీపంలో ఏర్పాటు చేసిన పూరి పాకలో స్వామివార్లను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు అనంతరం స్వామి వారిని గౌతమీ గోదావరి వద్ద వేదపండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కరుటూరి నరసింహరావు, ఆలయ ఈఓ బీహెచ్‌వీ రమణమూర్తి, ఆలయ సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ర్యాలి శ్రీ జగన్మోహినీ కేశవ స్వామి చక్రస్నానాన్ని స్థానిక అమలాపురం కాలువలో వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, పూర్ణాహుతి, బాలభోగం, ప్రసాదవినియోగం తదితర కార్యక్రమాలను వేదపండితులు, ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం స్వామి వారి చక్రస్నానం కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఏర్పాట్లను ఆలయ ఈవో వై. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. ఆయా ఆలయాల వద్ద జేమ్స్ రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ బందో బస్తు నిర్వహించారు. -
మార్మోగిన గోవింద నామం
పోటెత్తిన భక్తులు ఘనంగా పండిత సదస్యం వాడపల్లి (ఆత్రేయపురం) : ‘కోనసీమ తిరుపతి’ వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆల యం ప్రాంగణం ఆదివారం గోవింద నామస్మరణతో మారుమోగింది. పండిత సదస్యం సందర్భంగా అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ‘గోవిందా గోవింద’ అంటూ స్వామిని దర్శించుకున్నారు. స్వామికి వేకువ జామునే గ్రామోత్సవం నిర్వహించారు. వేదపండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు వేదపారాయణంతో స్వామికి వేదాశీర్వచనం అందజేశారు. సుప్రభాత సేవ, బాలభోగం, విష్వక్సేనపూజ, వేదపారాయణ, నివేదన, బలిహరణ, దివ్య ప్రబంధం వంటి కార్యక్రమాలను వేదపండితులు, అర్చక స్వాములు వేద మంత్రాల పఠనతో నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. స్వామిని ఆభరణాలతో అలంకరించి మిరుమిట్లు గొలిపే బాణసంచా కాల్పుల నడుమ అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం పవళింపు సేవ నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ చైర్మ¯ŒS కరుటూరి నరసింహరావు, సభ్యులు, ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి, ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
శోభాయమానంగా పొన్నవాహన మహోత్సవం
భక్తులతో పోటెత్తిన వాడపల్లి క్షేత్రం వాడపల్లి(ఆత్రేయపురం) : శ్రీవారి కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం పొన్నవాహ న మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి వారిని పల్లకీ, పొన్నవాహనంపై ఉంచి గ్రామోత్సవం జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో వాడపల్లి పోటెత్తింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ చైర్మ¯ŒS కరుటూరి నరసింహరావు, ఈవో బిహెచ్.వి.రమణ మూర్తి ఆధ్వర్యం లో ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల్ని అలరించాయి. ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఆది వారం సదస్యం కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఈఓ తెలిపారు. -
నయన మనోహరం వెంకన్న కల్యాణం
వాడపల్లి(ఆత్రేయపురం) : వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో కోనేటి రాయుడు కల్యాణ మహోత్సవాలు శుక్రవారం రాత్రి గంటలకు రమణీయంగా జరిగాయి. సుందరంగా అలంకరించిన కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో వేంకటేశ్వరస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దంపతులు, ఆర్డీఓ జి.గణేష్‌కుమార్ కుమార్ దంపతులు, డీఎల్పీవో జేవీవీఎస్ శర్మ దంపతులు, ఆలయ కమీటీ చైర్మన్ కరుటూరి నరసింహరావు , ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట ఎంపీపీలు వాకలపూడి వెంకట కృష్ణారావు, కోట చెల్లయ్య, రెడ్డి అనంతకుమారి, ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణ మూర్తి, ఈఓపీఆర్డీ డీవై నారాయణలు స్వామి వారికి ప్రభుత్వం తరఫున∙పట్టు వస్త్రాలను సమర్పించారు. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం చైత్ర శుద్ధ ఏకాదశి శుభముçహూర్తం రాత్రి ఏడు గంటలకు కల్యాణోత్సవాలను వేదపండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మండపంలో స్వామివారి కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవిల ఉత్సవ విగ్రహలను పట్టు వస్త్రాలు, బంగారు, వెండి, వజ్రాభరణాలతో సుందరంగా అలంకరించి కల్యాణ వేదికకు ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. వ్యాఖ్యాతగా ఎన్వీ సోమయాజులు, అయ్యంగారి పట్టాబిరామయ్య వ్యవహరించారు. మ«ధ్యాహ్నం మూడు గంటలకు స్వామి వారి ర«థోత్సవం పురమాడ వీధుల్లో కన్నుల పండువగా నిర్వహించారు. కల్యాణం అనంతరం గౌతమి గోదావరి లో ఏర్పాటు చేసిన హంస వాహనంపై తెప్పోత్సవ కార్యక్రమం రాత్రి 10 గంటలకు కన్నుల పండువగా జరిగింది. రావులపాలేనికి చెందిన వ్యాపారి మన్యం సుబ్రహ్మణ్యేశ్వరారావు దంపతులు ముత్యాల తలంబ్రాలను సమకూర్చగా, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామికి ముత్యాల తలంబ్రాల కార్యక్రమం వైభవంగా జరిగింది. కల్యాణ వేడుకల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమీటీ చైర్మన్ కరుటూరి నరసింహరావు, ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి ఆధ్వర్యలో ఆలయ కమీటీ సభ్యులు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
వెంకన్న కల్యాణానికి తరలండి..
వధువులుగా శ్రీ, భూదేవుల అలంకరణ ∙ పట్టు వస్రా్తలు సమర్పించనున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు కల్యాణ సంరంభానికి వేదికైన వాడపల్లి వాడపల్లి (ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు గురువారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. వేకువ జామున భరద్వాజ గోత్ర పాలకుడు వేంకటేశ్వరుని సుగంధ ద్రవ్యాలు పూల పరిమళాలతో నవ వరునిగా అలంకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నడిపూడి గ్రామానికి చెందిన వేద పండితుడు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రాలు, మేళతాళాలతో భార్గవ గోత్ర నామాలతో శ్రీదేవిని , కాశ్యప గోత్ర నామాలతో భూదేవిని వధువులుగా అలంకరించి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 7 గంటలకు స్వామి వారి ధ్వజారోహణ, అంకురార్పణ, నిత్య బలిహరణ అనంతరం దర్శనాలు కల్పించనున్నారు. ఈ కార్యక్రమాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణ మూర్తి మాట్లాడుతూ చైత్రశుద్ధ ఏకాదశి శుక్రవారం వాడపల్లి ఆలయ ప్రాంగణంలో వేదమంత్రాలు, గోవింద నామస్మరణల మధ్య శ్రీ, భూ, వేంకటేశ్వరలకు వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం సాయంత్రం 7 గంటలకు కల్యాణం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మధ్యాహ్నం 3గంటలకు రథోత్సవం, పది గంటలకు గౌతమి గోదావరిలో హంస వాహనంపై తెప్పోత్సవం నిర్వహిస్తామన్నారు. స్వామి కల్యాణానికి శాసన మండలి డిప్యూటీ చైర్మ¯ŒS , ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం దంపతులు, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దంపతులు, ఆలయ కమిటీ చైర్మ¯ŒS కరుటూరి నరసింహరావు దంపతులు, ఆర్డీవో గణేష్‌కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను స్వామికి బçహూకరిస్తారన్నారు. ఆలయ కమిటీ చైర్మ¯ŒS కరుటూరి నరసింహరావు, ఈవోలు ఏర్పాట్లు పూర్తిచేశారు. -
వాడపల్లికి పెళ్లికళ
నేటి నుంచి వెంకన్న కల్యాణోత్సవాలు రేపు రథోత్సవం, పరిణయపర్వం ఆత్రేయపురం (కొత్తపేట) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి పెళ్లికళను సంతరించుకుంది. శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కల్యాణోత్సవాలు ప్రారంభిస్తారు. ఆలయ కమిటీ చైర్మ¯ŒS కరుటూరి నరసింహరావు, ఈవో బీహెచ్‌వీ రమణమూర్తిల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎండ వేడి తగలకుండా చలువ పందిర్లు ఏర్పాటు చేసి, ఫ్యాన్లు అమర్చారు. స్వామి దర్శనానికి భక్తులు ఇబ్బంది పడకుండా భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. లొల్ల నుంచి వాడపల్లి వరకు అనేక స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఎస్సై జేమ్స్ రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. చిరు వ్యాపారులు పలు దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ వాడపల్లికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. స్వామివారి ప్రసాదం కొరత రాకుండా సుమారు 50 వేల లడ్డులు తయారుచేసి సిద్దంగా ఉంచారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మ¯ŒS, ఈవో తెలిపారు. కాగా బుధవారం శ్రీరామనవమిని పురస్కరించుకుని స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్ర పుష్పం, కల్యాణం, పుణ్యాహవచనం తదితర పూజా కార్యక్రమాలను అర్చక స్వాములు నిర్వహించారు. క్షేత్ర పాలకుడు శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఇదీ కల్యాణోత్సవాల క్రమం గురువారం ధ్వజారోహణ, అంకురార్పణ, నిత్య బలిహరణతో కల్యాణోత్సవాలు మొదలవుతాయి. 7న రథోత్సవం, రాత్రి స్వామి వారి కల్యాణమహోత్సవం జరుగుతాయి. ప్రభుత్వం తరఫున శాసనమండలి డిప్యూటీ చైర్మ¯ŒS రెడ్డి సుబ్రహ్మణ్యం దంపతులు, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దంపతులు, ఆర్డీవో జి.గణేష్‌కుమార్ స్వామి వారికి నూతన వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 7 గంటలకు భూదేవి శ్రీదేవి సమేత వేంకటేశ్వరస్వామికి అచారం ప్రకారం వంశ పారంపర్యంగా హైదరాబాదుకు చెందిన జఠవల్లభుల గోపాలకృష్ణ సోమయాజులు దంపతులు ఆగమ శాస్త్ర ప్రకారం కల్యాణఘట్టాన్ని వేదమంత్రోచ్ఛరణల మధ్య నిర్వహిస్తారు. రావులపాలెంకు చెందిన వ్యాపారి మన్యం సుబ్రహ్మణ్యేశ్వరరావు దంపతులు ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. గౌతమి గోదావరిలో రాత్రి 10 గంటలకు తెప్పోత్సవం విద్యుత్ వెలుగుల మధ్య జరుగుతుంది. 8న పొన్నవాహన మహోత్సవం, 9న సదస్యం, 10న ప్రత్యేక పూజలు, 11న గౌతమి గోదావరిలో స్వామి వారి చక్రతీర్థస్నానం జరుగుతాయి. 12న శ్రీపుష్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. -
కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
వాడపల్లి(ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం, పురాణ ప్రసిద్ధి చెందిన ర్యాలి జగన్మోహీనీ కేశవ స్వామి ఆలయాల్లో స్వామి వార్ల కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ ఈవోలు బీహెచ్‌వీ రమణ మూర్తి, వై వెంకటేశ్వరరావు తెలిపారు. వాడపల్లి వేంకటేశ్వర స్వామి, ర్యాలిలో వేంచేసిన జగన్మోహినీ కేశవస్వామి కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. జగన్మోమినీ కేశవ స్వామి కల్యాణోత్సవాలు ఏప్రిల్ ఐదో తేదీ నుంచి వారం రోజులు పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రీవేంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవాలు ఏప్రిల్ ఆరోతేదీ నుంచి వారం రోజులు పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 6న శ్రీ స్వామి వారి ధ్వజారోహణం, నిత్య బలిహరణ, దర్శనాలు, 7న శుక్రవారం తీర్థం, రథోత్సవం, కల్యాణం, తెప్పోత్సవం, 8న శ్రీ స్వామి వారి పొన్నహవాన మహోత్సవం, 9న సదస్యం, 10న నిత్యహోమం, నిత్య బలిహరణ, దర్శనాలు, 11న మంగళవారం చక్రతీర్థం, 12న స్వామి వారి శ్రీపుష్పోత్సవంతో స్వామివారి కల్యాణోత్సవాలు ముగుస్తాయి. కల్యాణోత్పవాలపై ఈనెల 24న ఆర్డీఓ జి.గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ కరుటూరి నరసింహరావు అ«ధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు ఈవో రమణ మూర్తి తెలిపారు. -
నాణ్యతకు తూట్లు
రూ.6 కోట్ల రోడ్ల పనుల్లో అవకతవకలు అధికారులపై టీడీపీ నేతల ఒత్తిళ్లు ఆత్రేయపురం (కొత్తపేట) : వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి, ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి పుణ్యక్షేత్రానికి వెళ్లే రహదారులను రూ.ఆరు కోట్లతో నిర్మిస్తుండగా తెలుగుదేశం నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. లొల్ల నుంచి వాడపల్లి ఆలయానికి వెళ్లే రోడ్డు అభివృద్ధికి రూ.4 కోట్లు మంజూరయ్యాయి. ఊబలంక నుంచి ర్యాలి వరకు రోడ్డుకు రూ.2 కోట్లు మంజూరు కాగా ఇటీవల పనులు ప్రారంభించారు. అందుకుగాను వాడపల్లి గొడ్డుకాలువ వంతెన నుంచి ఏటిగట్టు వరకు 10 మీటర్లు, లొల్ల వంతెన నుంచి గొడ్డుకాలువ వంతెన వరకు 7 మీటర్ల రోడ్డు నిర్మించాలి. కానీ లొల్ల చెరువు గట్టు సమీపంలో, పంచాయతీ సమీపంలో టర్నింగ్ వద్ద 3 మీటర్ల వెడల్పున నిర్మిస్తున్నారని స్థానికులు అంటున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడులతో రోడ్డు అలైన్మెంట్ పనులు ఇష్టానుసారంగా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆయా గ్రామాలకు చెందిన తెలుగుదేశం నేతలు సర్వే అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆక్రమణలు తొలగింపులో అవకతవకలకు పాల్పడుతుండటంతో రూ.6 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు అష్టవంకర్లతో నిర్మితమయ్యేలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డు నిర్మాణ పనుల్లో కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పనులు నాసిరకం సాగుతున్నాయని స్థానికులు అంటున్నారు. దీంతో సిమెంట్ రోడ్డు బీటలు వారే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తునారు. దీనిపై ఆర్అండ్బీ ఏఈ మణికుమార్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల అదేశాల మేరకు అవసరం మేరకే ఆక్రమణలు తొలగించి నాణ్యతా ప్రమాణాలతో రోడ్డు అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. -
వెంకన్న ఆలయ పనులకు ఈ-టెండర్లు ఖరారు
వాడపల్లి (ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో రూ.32.20 లక్షలతో చేపట్టనున్న ఫిల్లింగ్, సీసీ ఫ్లోరింగ్, పీఈబీ నిర్మాణం, గాల్వినైజ్డ్ మెస్ అభివృద్ధి పనులకు ఈ-టెండర్లు ఖారారైనట్లు ఈఓ బీహెచ్ఈ రమణమూర్తి మంగళవారం తెలిపారు. సుమారు 15 శాతం తక్కువకు పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు టెండర్లు వేశారన్నారు. అన్నదాన సత్రానికి, ప్రహరీకి రూ.10 లక్షలు కేటాయించగా 15.75 శాతం తక్కువకు, పీఈబీ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరుకాగా 15 శాతం తక్కువకు, ఫ్లోరింగ్ రూ.4.70 లక్షలు కేటాయించగా 10.01 శాతం తక్కువకు, గాల్వినైజెడ్ మెస్ ఏర్పాటుకు రూ.7.5 లక్షలు కేటాయించగా 14.1 శాతం తక్కువకు టెండర్లు ఖారారు చేశారు. ఫిబ్రవరి 16న అధికారులు బాక్సు టెండర్లు ఆహ్వానించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. రూ.10 లక్షలకు మించిన పనులకు ఈ-టెండర్లు పిలవాల్సి ఉండగా బాక్సు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కేవలం రూ.32ల తక్కువకు టెండర్లను అధికార్లు ఖరారు చేసినట్లు ఆలయ ఈఓ రమణ మూర్తి తెలిపారు. దీనిపై ‘అవకతవకలపై టెండరింగ్’ అంటూ ఫిబ్రవరం 17న సాక్షిలో కథనం రావడంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఖారారైన బాక్సు టెండర్లను రద్దు చేశారు. తిరిగి ఈ-టెండర్లు ఆహ్వానించడంతో సుమారు రూ.5.50 లక్షల తక్కువకు పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. అయితే గతంలో రూ.32.20 లక్షల పనులను బాక్సు టెండర్లలో రూ.32కే దక్కించుకున్న కాంట్రాక్టర్ మరికొందరితోపాటు ఈ-టెండర్లో రూ.5.50 లక్షల తక్కువకు పనులు చేపట్టేందుకు కోడ్ చేయడంతో తిరిగి అదే కాంట్రాక్టర్‌కు పనులు దక్కాయి. బాక్సు టెండర్ల ద్వారా పచ్చ చొక్కా కాంట్రాక్టరుకు లబ్ధి చేకూర్చుదామని తీవ్రంగా ప్రయత్నించిన ఆలయ అధికారులకు, ఆ పార్టీ నియోజకవర్గ నేతలకు చివరకు ఆశా భంగమే కలిగింది. -
వెంకన్న ఆలయంలో దొంగలు పడ్డారు
వాడపల్లి ఆలయంలో అడుగడుగునా అక్రమాలు దేవుడి సొమ్మును దోచుకుంటున్న స్వార్థపరులు అర్చకుల ఆదాయంలో వసూళ్లు ∙ఇష్టారాజ్యంగా ‘తమ్ముళ్ల’ ప్రైవేటు పార్కింగ్ అయినా కిమ్మనని అధికారులు ∙కొరవడుతున్న అజమాయిషీ కోనసీమ తిరుపతిగా పిలిచే వాడపల్లి వెంకన్న ఆలయంలో దొంగలు పడ్డారు. గుడినే కాదు గుడిలో దేవుడిని కూడా దోచుకుంటున్నారు. ఇటీవల కొన్నేళ్లుగా ఈ ఆలయానికి భక్తుల తాకిడి గణనీయం గా పెరిగింది. మన జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆదాయం కూడా దండిగానే వస్తోంది. దీనిపై అక్రమార్కుల కన్ను పడింది. దొరికిందే అవకాశంగా అందినంతా దోచుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : గోదావరి తీరాన ఆత్రేయపురం మండలం వాడపల్లిలో స్వయంభువుగా శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరాడు. గోదావరి ఇసుక తిన్నెల్లో కొయ్య విగ్రహం దొరకడంతో నారద మహర్షి వాడపల్లిలో ఆ విగ్రహాన్ని ప్రతిషి్ఠంచినట్టు చెబుతారు. పిఠాపురం మహారాజుల కాలంలో తిమ్మగజపతి అనే రాజు వెంకన్న ఆలయంలో ధూపదీప నైవేద్యాలు, నిర్వహణ కోసం 265 ఎకరాలు ఇచ్చారు. ఎ–గ్రేడ్ హోదా కలిగిన ఈ ఆలయానికి రెగ్యులర్ కార్యనిర్వహణాధికారి లేరు. కొత్తపేట మండలం వానపల్లి పల్లాలమ్మ ఆలయ ఈఓ బీహెచ్‌వీ రమణమూర్తే వాడపల్లి వెంకన్న ఆలయానికి ఇ¯ŒSచార్జిగా వ్యవహరిస్తున్నారు. రెండుచోట్లా బాధ్యతలు నిర్వర్తించాల్సి రావడంతో ఆలయ నిర్వహణపై పూర్తిస్థాయి పర్యవేక్షణ చేయలేని పరిస్థితి. ఇదే అవకాశంగా కొంతమంది అడుగడుగునా అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెరిగిన హుండీల ఆదాయం వెంకన్న ఆలయం బాగా ప్రాచుర్యం పొందడంతో 2010 నుంచి భక్తుల తాకిడి బాగా పెరిగింది. వెంకన్న ఆలయంలో ఏడు వారాల పాటు ఏడు ప్రదక్షిణల వంతున చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాçÜం. ఆ నమ్మకంతోనే ప్రతి శని, ఆదివారాల్లో 50 వేల నుంచి 60 వేల మంది భక్తులు తరలి వస్తున్నారు. మన జిల్లాతోపాటు పొరుగున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రతి శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఫలితంగా హుండీ ఆదాయం కూడా మునుపెన్నడూ లేని రీతిలో రెట్టింపైంది. ఆదాయం పెరిగిన నేపథ్యంలో ప్రతి నెలా లేదా 45 రోజులకు ఒకసారి హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్నారు. ఈ ఆదాయాన్ని అదే మండలం లొల్లలోని సిండికేట్ బ్యాంక్ బ్రాంచిలో జమ చేస్తున్నారు. ప్రతిసారీ హుండీ ఆదాయం రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ వస్తోంది. సంభావనల్లోనూ కక్కుర్తే పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగానే అర్చకులకు పళ్లెంలో వచ్చే సంభావనలు కూడా పెరిగాయి. ఆలయంపై అనధికారికంగా పెత్తనం చెలాయిస్తున్న నలుగురి కళ్లు వీటిమీద పడ్డాయి. ఆలయ నిర్వాహకులు కొందరు కూడా వారితో చేయి కలిపారు. దీంతో అర్చకుల సంభావన మొత్తంలో ప్రతి నెలా ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల చొప్పున ముక్కు పిండి మరీ వసూలు చేసుకుపోతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈవిధంగా ప్రతి నెలా రూ.35 వేల మేర ఆలయ నిర్వాహకులు, నలుగురు పెత్తందార్లు జేబులో వేసుకుంటున్నారని సమాచారం. రెండేళ్లుగా ఈ వ్యవహారం జరుగుతున్నా ప్రశ్నించే నాథుడే లేడు. అర్చకులకు పళ్లెంలో సంభావనను చాలా ఆలయాల్లో అధికారికంగానే నియంత్రించారు. కానీ దీనిని భక్తులు ఐచ్ఛికంగానే సమర్పిస్తూండడంతో చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. దీనినే అక్రమార్కులకు అవకాశంగా మలుచుకున్నారు. ప్రైవేటు సెక్యూరిటీ దేనికో..! భక్తుల రద్ధీ పెరిగిన నేపథ్యంలో రావులపాలెం సీఐ పర్యవేక్షణలో రావులపాలెం, ఆత్రేయపురం స్టేషన్లకు చెందిన పోలీసులు ప్రతి శనివారం బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ భక్తుల నియంత్రణ కోసమంటూ రాజమహేంద్రవరం నుంచి డజను మంది ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని తీసుకువస్తున్నారు. పోలీసులు ఉండగా, ప్రైవేటు సెక్యూరిటీ దేనికని పలువురు ప్రశ్నిస్తున్నారు. నెలలో వారు పని చేసేది నాలుగు రోజులు మాత్రమే. కానీ ఆ రూపేణా సుమారు రూ.60 వేలు వృథాగా వెచ్చిస్తున్నారు. గతంలో హుండీల లెక్కింపులో స్థానికంగా వెంకన్న సేవకులే ఎక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు మొక్కుబడిగా కొందరిని మాత్రమే అనుమతిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దర్జాగా ప్రైవేటు పార్కింగ్ వేలాదిగా భక్తులు వస్తున్న ఆలయంలో పార్కింగ్ సౌకర్యమే లేదు. ఇదే అదునుగా అధికార పార్టీలో స్థానిక సంస్థలకు చెందిన ఒక మాజీ ప్రతినిధి, ఆలయ కమిటీలో ఉన్న ముగ్గురు మాజీలు కలిసి సొంత స్థలాల్లో పార్కింగ్ ఏర్పాటు చేసి, భక్తుల నుంచి సొమ్ములు గుంజుతున్నారు. పార్కింగ్ రూపంలో వారానికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. కార్లకు రూ.30, సైకిల్‌కు రూ.5, మోటార్ సైకిల్‌కు రూ.10 వసూలు చేస్తున్నారు. ఆ మేరకు వెంకన్న ఆలయానికి రావాల్సిన ఆదాయం పెత్తందార్ల చేతిల్లోకి పోతోంది. తెలుగు తమ్ముళ్ల స్థలాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్‌ను దాటి భక్తుల వాహనాలను అనుమతించడం లేదు. అంటే పరోక్షంగా పోలీసులు కూడా వారికి వత్తాసు పలుకుతున్న విషయం స్పష్టమవుతోంది. పార్కింగ్ పేరుతో భక్తుల నుంచి అడ్డగోలుగా దోపిడీ చేయడంపై కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గతంలో రెండుమార్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా వారిలో స్పందన లేదు. ప్రైవేటు వ్యక్తులు ఇంత అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని భక్తులు ఆవేదన చెందుతున్నారు. పార్కింగ్ ఏర్పాటు చేస్తాం ఆలయానికి పార్కింగ్ లేకపోవడం వాస్తవమే. ఆలయానికి చెందిన సుమారు నాలుగు ఎకరాలను పార్కింగ్ కోసం కేటాయించనున్నాం. ఇ¯ŒSచార్జిగా బాధ్యతలు తీసుకున్నాక భక్తులకు సౌకర్యాలను మెరుగుపరిచాను. ఇందులో భాగంగానే ఆ స్థలాన్ని చదును చేసి పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం. సంభావన నుంచి కమీషన్లు వసూలు చేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. పెరిగిన భక్తుల సంఖ్యకు తగ్గట్టుగానే హుండీ ఆదాయం కూడా పెరిగింది. హుండీ లెక్కింపు నిబంధనల ప్రకారమే జరుగుతోంది. హుండీ లెక్కింపులో స్థానికులకు కూడా అవకాశం కల్పిస్తున్నాం. హుండీ లెక్కింపునకు బయటనుంచి ఎవ్వరినీ తీసుకురావడం లేదు. పెరిగిన భక్తుల సంఖ్యకు తగ్గట్టు క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నాం. – బీహెచ్‌వీ రమణమూర్తి, ఆలయ ఇ¯ŒSచార్జి ఈఓ, వాడపల్లి -
ముగిసిన వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు
వైభవంగా చక్రస్నాన మహోత్సవం వాడపల్లి(ఆత్రేయపురం): కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెం దిన శ్రీ వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆల యంలో ఐదురోజులు పాటు నిర్వహించి న బ్రహ్మోత్సావాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్బంగా స్వామి వారు కల్కి, అమ్మవారు గజలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ము గింపులో భాగంగా స్వామివారి చక్రతీర్థ స్నాన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేకువ జామునే విష్వక్షే్సనపూజ, పుణ్యహవచనం, పూర్ణహూతి, బాలబోగం, ప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలును వైఖానస యువబ్రహ్మ ఆగమ భాస్కర ఖండవల్లి రాజేశ్వర వర ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్బంగా స్వామి వార్ని ఆలయం నుంచి పల్లకి పై ఉంచి బాణాసంచా కాల్పుల నడుమ బ్యాండ్ మేళాలతో స్వామి వారిని గౌతమీ గోదావరి వద్దకు తీసుకుని వచ్చి అక్కడ స్వామి వా రికి ఏర్పాటు చేసిన ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని తీర్థ బిందెతో గోదావరి జలాలను తీసుకు వచ్చి సుప్రభాతసేవ అనంతరం స్వామివారికి అభిషేకించారు. స్వామి వారిని ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు, పూలతో అలంకరించారు. ఉదయం 10 గంటలకు స్వామి వార్ని కల్కి అవతారం, అమ్మవారిని గజలక్ష్మీ అ వతారంలో గజవాహన సేవ, సాయంత్రం చూరో్ణత్సవం, మహదాశీర్వచనం, సాయంత్రం 4 గంట లకు అశ్వవాహనంపై స్వామి వారిని ఘనంగా ఊరేగించారు. అనంతరం స్వామి వార్ని విశేష పుష్పములతో పుష్పాల రాయుడికి ఉయ్యాల సే వ, పవళింపు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. -
వెంకన్న వేడుక..కన్నులకు కానుక
భక్తజనం మురిసేలా బ్రహ్మోత్సవాలు మూడోరోజు రాముని అవతారంలో స్వామి హనుమత్, గరుడ వాహనాలపై ఊరేగింపు మహిమ గల దేవునికి సుమాభిషేకం వాడపల్లి(ఆత్రేయపురం): ‘కోనసీమ తిరుపతి’గా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం స్వామి వారికి పుష్పాభిషేకంతో పాటు హనుమద్వాహన, గరుడ వాహన సేవ తదితర కార్యక్రమాలు భక్తజనులకు కన్నులవిందుగా జరిగాయి. స్వామివారికి ఉదయం 6 గంటలకు సుప్రభాతసేవ అనంతరం తీర్థపు బిందెతో గోదావరి జలాలను తీసుకువచ్చి అభిషేకించారు. గోత్రనామాలతో పూజలు, నిత్యహోమాలు జరిగాయి. అనంతరం నివేదన, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి తీర్థప్రసాద వినియోగం చేశారు. బ్రహ్మోత్సవ కార్యక్రమాలను ఆగమ భాస్కర ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు, పువ్వులతో అలంకరించారు. వజ్ర వైఢూర్యాభరణాలతో అలంకృతుడైన వెంకన్నను చూసి భక్తులు పులకించారు. ఆలయంలో భక్తులు ఆర్జిత సేవలు నిర్వహించారు. ఉదయం వసంతోత్సవం, నిత్యహోమం, పుష్పయాగం, నీరాజన మంత్రపుష్పం, బలిహరణ అనంతరం 10 గంటలకు స్వామి వారికి శ్రీరాముని రూపంలో హనుమద్వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు గరుడవాహన సేవ, స్వస్తి వచనం, నిత్యహోమం, నవమూర్తి అర్చన, అష్టోత్తర కలశారాధన, శయ్యాధివాసం, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణ మూర్తి ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షకులు రాధాకృష్ణ, సాయిరామ్, శివ, నరీన్ చక్రవర్తి పర్యవేక్షించారు. కాగా శనివారం స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ తెలిపారు. ఏడువారాల నోము అచరించే భక్తులతోపాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారన్నారు. ఇవీ నేటి కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు విశేష నదీ జలంతో పూర్ణాభిషేకం, అష్టోత్తర శతకలశాభిషేకం, ఉదయం 10 గంటలకు సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం 4 గంటలకు చంద్రప్రభ వాహన సేవ, సహస్ర దీపాలంకరణ, విశేష పూజలు, సేవలు జరుగుతాయి. -
వైభవంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు
వాడపల్లి (ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం రెండోరోజు బ్రహ్మోత్సావాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తు లు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని ఉదయం తీర్థ బిందెతో గోదావరి జలాలను తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం, ఉదయం ఆ రు గంటలకు సుప్రభాతసేవ, సభ్యుల గో త్రనామాలతో పూజలు నిత్యహోమాలు జరిగాయి. అనంతరం నివేదన, బలిహర ణ, నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి తీర్థప్రసాద వినియోగం చేశారు. బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను వేదపండితులు వైఖానస యువబ్రహ్మ ఆగమ భాస్కర శ్రీ ఖండవల్లి రాజేశ్వర వర ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు జరిపించారు. స్వామి వారి ఆలయంలో భక్తులకు ఆర్జిత సేవలు, అనంతరం అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ఉదయం 9:30 గం టలకు స్వస్తివాచనం, విష్వక్సేనపూజ, పు ణ్యాహవచనం, సప్తకలశారాధన, ఉత్సవాంత స్నపనం, నిత్యహోమం, మహాసుదర్శన హోమం, విశేష అర్చన, బలిహరణ నీ రాణం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలాగే స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించిన హంస, సింహవాహనంపై గ్రామంలో ఊరేగించారు. సా యంత్రం 5–30 గంటలకు స్వస్తివాచనము లు, నిత్యహోమాలు నిర్వహించి సాయంత్రం 7 గంటలకు స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించగా ఏ ర్పాట్లును ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణ మూర్తి ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షుకులు రాధకృష్ణా, సాయిరామ్ పర్యవేక్షించారు. నేటి కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామికి ప్రత్యేక పూజలతో పాటు విశేష నదీ జలంతో పూర్ణాభిషేకం, గరుడవాహన సేవ, స్వస్తి వాచనం, నిత్యహోమం, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్రపుష్పం, పంచామృతమంటపారాధన, వసంతోత్సవం, నిత్యహోమం, పుష్పయాగం, నీరాజనం, బలిహరణ, హనుమద్వాహన సేవ తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందకు ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో రమణమూర్తి తెలిపారు. -
ఘనంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు
వాడపల్లి (ఆత్రేయపురం): కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలను బుధవారం ఆలయ ఈవో బీహెచ్ రమణమూర్తి వైభవంగా ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన యాగశాల వద్ద హోమంలో పాల్గొన్నారు. వైఖానస ఆగమోక్తంగా యువబ్రహ్మ ఆగమ భాస్కర ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు కార్యక్రమాలను నిర్వహించారు. ఐదు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఆలయాన్ని విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం 9.45 గంటలకు స్వస్తివచనం, విష్వక్సేన పూజ, పుణ్యావచనం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు శేషవాహన సేవ, అనంతరం శాలావిహరణ, అంకురార్పణ, వాస్తుపూజ, అగ్నిమధనం తదితర పూజలు నిర్వహించారు. ఈఓ ఆధ్వర్యంలో పర్యవేక్షకులు రా«ధాకృష్ణ, సాయిరామ్, శివ, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లును పర్యవేక్షించారు. గురువారం ఉదయం సుప్రభాత సేవ, విష్వక్సేనపూజ, పుణ్యహవచనం, సప్తకలశారాధన, సాయంత్రం నాలుగు గంటలకు హంస, సింహ వాహనసేవ, స్వస్తి వచనం, నిత్యహోమాలు, రాత్రి ఏడు గంటలకు స్వామి కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఈఓ వివరించారు. -
వాడపల్లి వంతెన వద్ద ఆందోళన
వాడపల్లి (దామరచర్ల) : ఆంధ్రా నుంచి ఇసుక రవాణా చేస్తున్న లారీలను ఏపీ పోలీసులు ఆపుతున్నారని, వెంటనే విడుదల చే యాలని డిమాండ్ చేస్తూ లారీ యజమానులు, కార్మికులు బుధవారం మండలంలోని వాడపల్లి వద్ద కృష్ణానది వంతెనపై రాస్తారోకో చేపట్టారు. గంట పాటు రాస్తారోకో చేయడంతో వందలాది వాహనాలు సుమారు 3కి.మీల మేర నిలిచి పోయాయి. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు నుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇసుక లారీలకు అన్ని రకాల వేబిల్స్ ఉన్నా మూడు రోజులుగా ఏపీలోని గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు కృష్ణానది ఆవలి ఒడ్డున ఆపారన్నారు. ఇసుకపై ఆధిపత్యం కోసం ఏపీలోని అధికార పార్టీకి చెందిన ఇరువురు ఎమ్మెల్యేలు గొడవలు పడి పోలీసులను పురమాయించి తమ లారీలను నిలిపివే శారన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఏపీ పోలీసులతో చర్చలు : రాస్తారోకో విషయం తెలుసుకున్న మిర్యాలగూడ రూరల్ సీఐ రవీందర్ సంఘటనా స్థలానికి చేరుకునిఆందోళన కారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఏపీ పోలీసులతో చర్చించారు. బిల్లులున్న లారీలను వెంటనే పంపివేయాలని కోరారు. దీనికి ఏపీ పోలీసులు సానుకూలంగా స్పందించినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాడపల్లి ట్రైనీ ఎస్ఐ రామన్‌గౌడ్, మండల లారీ అసోసియేషన్ అధ్యక్షుడు గుగులోత్ వీరబాబు, హైదరాబాద్ అసోసియేషన్ నాయకులు పెద్దయ్య, రాజేందర్‌రెడ్డి, రవీందర్ గౌడ్, జగన్ తదితరులు పాల్గొన్నారు. -
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
వాడపల్లి (కొవ్వూరు రూరల్): వాడపల్లిలోని గోదావరి నది విఘ్నేశ్వర స్నానఘట్టం వద్ద శనివారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కొవ్వూరు ఎస్సై గంగాభవాని తెలి పిన వివరాల ప్రకారం మృతురాలి వయసు 45 నుంచి 50 ఏళ్లు ఉండవచ్చని, గుర్తుపట్టలేని విధంగా మృతదేహం గోదావరి ఒడ్డున పడిఉం దన్నారు. శరీరంపై పసుపు రంగు చీర, జాకెట్, కుడి చేతి మణికట్టుపై ‘శ్రీ’ అనే పచ్చబొట్టు ఉందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు కొవ్వూరు పట్టణ పోలీస్ స్టేషన్ లేదా ఎస్సై సెల్: 73826 23702కు సమాచారం అందించాలని కోరారు. -
బ్రహ్మోత్సవ వేడుకకు వేళాయె...
వాడపల్లి (ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకన్న ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వచ్చేనెల 12 నుంచి 16 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా సిద్ధం చేసిన స్వామి వారి ఆహ్వాన పత్రిక, పోస్టర్లను ఆదివారం స్వామి వారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలువురు భక్తులకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ బీహెచ్‌వీ రమణమూర్తి మాట్లాడుతూ భక్తజనుల నీరాజనాలు అందుకుంటున్న వేంకటేశ్వరస్వామి కొలువైన వాడపల్లి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయన్నారు. వాడపల్లి ముస్తాబు.. ఐదురోజుల పాటు జరిగే వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు వాడపల్లి ముస్తాబవుతోంది. ఈ బ్రహ్మోత్సవాల్లో అష్టదళ పాదపద్మారాధన, ఐశ్వర్యలక్ష్మి హోమం, సహస్ర దీపాలంకరణసేవ, అషో్టత్తర కలశాభిషేకం తదితర అర్జిత సేవలు నిర్వహించనున్నట్లు ఈఓ వివరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో జరిగే అషో్టత్తర పూజలు, కల్యాణాలు, ఉప నయనాలు, వివాహలు రద్దు చేశామన్నారు. బ్రహ్మోత్సోవ ఆర్జిత సేవలకు రూ.1116 చెల్లించే భక్తులు నగదు, డీడీలు, మనియార్డర్లు ఈఓ, శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం, వాడపల్లి, ఆత్రేయపురం మండలం, ఫోన్: 08855–271888కు పంపి, రసీదు పొందాలన్నారు. -
మార్మోగిన వేదఘోష
ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు వాడపల్లి వెంకన్న ఆలయానికి తరలివచ్చిన భక్తులు వాడపల్లి (ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజులపాటు కన్నుల పండువగా జరిగిన పవిత్రోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వేదఘోషతో ప్రతిధ్వనించింది. శ్రీదేవీ భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి త్రయాహ్నిక దీక్షాపూర్వక పవిత్రోత్సవాలను పశ్చిమ గోదావరి జిల్లా నడిపూడి గ్రామానికి చెందిన వేదపండితుడు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాత సేవ, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మహాశాంతి హోమం, మహాపూర్ణాహుతి, పండిత సత్కారం, నీరాజనంతో ఉత్సవాలు ముగిశాయి. పవిత్రోత్సవాలకు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి ఆధ్వర్యాన రాధాకృష్ణ, సాయిరామ్, శివాలయ కమిటీ నిర్వాహకులు పర్యవేక్షించారు. -
ఘనంగా పవిత్రోత్సవాలు
భక్తులతో శోభిల్లిన వాడపల్లి దివ్యక్షేత్రం వాడపల్లి(ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు రెండోరోజు ఆదివారం ఘనంగా జరిగాయి. వేదపండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణ మూర్తి స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. పవిత్రోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తిలకించారు. ఉదయం స్వామివారిని ప్రత్యేక పువ్వులతో అలంకరించారు. ఆలయ ఆవరణలో భారీ అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ ఈఓ బీహెచ్‌వీ రమణ మూర్తి ఆధ్వర్యంలో రాధాకృష్ణా, సాయిరామ్, శివ, ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
వాడపల్లిలో పుష్కర స్నానానికి బారులు తీరిన భక్తులు
వాడపల్లి: కృష్ణా పుష్కరాల మూడో రోజుకే చేరుకున్నాయి. వరుస సెలవులు కావడంతో.. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు పోటెత్తారు. పుష్కర స్నానాలు ఆచరించడానికి ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో.. దక్షిణ కాశీగా పేరుగాంచిన వాడపల్లి జనసంద్రమైంది. కృష్ణా, మూసీ నదుల సంగమ ప్రాంతంగా వాడపల్లి విరాజిల్లుతుండటంతో.. ఇక్కడ పుష్కర స్నానం చేయడానికి భక్తులు ఆసక్తి చూపుతున్నారు. -
95శాతం పుష్కర పనులు పూర్తి
వాడపల్లి(దామరచర్ల): వాడపల్లి పుణ్యక్షేత్రంలో 95 శాతం మేర పుష్కర పనులు పూర్తయినట్లు పుష్కర ప్రత్యేక అధికారి ఏజేసీ వెంకట్రావ్ తెలిపారు. శనివారం వాడపల్లి శ్రీమీనాక్షి అగస్త్యేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మిగిలిన పనులన్నీ ఆదివారం పూర్తవుతాయన్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే 650 టాయ్లెట్లు పూర్తయ్యాయని,మరో 150 నిర్మాణంలో ఉన్నాయన్నారు. సురక్షిత తాగునీటి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. పుష్కరాలకు 450 మంది సివిల్ సిబ్బంది, 800 మంది పారిశుద్ధ్య కార్మికులు,150 మంది ఎలక్ట్రికల్ కార్మికులు,450 మంది వలంటీర్స్ మూడు షిప్టుల్లో పని చేస్తారన్నారు. ఏజేసీ మొదలుకొని స్వీపర్ వరకూ అక్షయ పాత్ర అందించే ఒకే రకమైన బోజనం తింటారన్నారు. వరదలు వచ్చినా సురక్షితంగా స్నానాలు చేసే విధంగా స్నానఘాట్ల వద్ద ఏర్పాట్లు చేస్తామన్నారు. 8 ఘాట్లవద్ద కంట్రోల్ రూమ్స్, ఒకచోట సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. సమావేశంలో అధికారులు బాలకృష్ణ, యుగేందర్, శ్రీధర్, తహసీల్దార్ గణేష్, ఎంపీడీఓ ఉమాదేవి పాల్గొన్నారు. -
పుష్కరాలకు 1100 బస్సులు
వాడపల్లి(దామరచర్ల) : కష్ణా పుష్కరాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 1100 ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమవరపు సత్యనారాయణ తెలిపారు. గురువరాం దామరచర్ల మండలం వాడపల్లిలో పుష్కర ప్రాంతాలను, హోల్డింగ్ పాయింట్లను పరిశీలించారు. శ్రీమీనాక్షి అగస్త్యేశ్వర స్వామి, శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భక్తులు ఇబ్బందులు పడకుండా హైదరాబాద్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు బస్సులు నడుపుతామన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన బీచుపల్లికి248, నాగార్జునసాగర్‌కు 160, శ్రీశైలంకు 150, వాడపల్లికి 60, విజయవాడకు 50 బస్సులు సర్వీస్ చేస్తాయన్నారు. వాడపల్లికి వచ్చే భక్తుల కోసం పార్కిగ్ స్థలాల నుంచి ఘాట్ల వరకు ప్రత్యేకంగా షటిల్ బస్సులు నడుపుతామని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ రూ.2275 కోట్ల నష్టాల్లో ఉందని, ఈ ఏడాది టర్నోవర్‌ను రూ.5వేల కోట్లకు పెంచేందుకు కషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం కొత్తగా 1157 బస్సులు, 236 మినీ బస్సులు కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంపై కేంద్రంతో సహా పలు రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ వేణు,ఆర్ఎం కృష్ణహరి, ఎంపీపీ కురాకుల మంగమ్మ, సింగిల్ విండో చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ చైర్మన్ వీరకోటిరెడ్డి, దేవాలయ చైర్మన్ కొందూటి సిద్దయ్య, మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.