వైభవంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు
వైభవంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు
Published Thu, Oct 13 2016 10:02 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
వాడపల్లి (ఆత్రేయపురం) :
కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం రెండోరోజు బ్రహ్మోత్సావాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తు లు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని ఉదయం తీర్థ బిందెతో గోదావరి జలాలను తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం, ఉదయం ఆ రు గంటలకు సుప్రభాతసేవ, సభ్యుల గో త్రనామాలతో పూజలు నిత్యహోమాలు జరిగాయి. అనంతరం నివేదన, బలిహర ణ, నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి తీర్థప్రసాద వినియోగం చేశారు. బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను వేదపండితులు వైఖానస యువబ్రహ్మ ఆగమ భాస్కర శ్రీ ఖండవల్లి రాజేశ్వర వర ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు జరిపించారు. స్వామి వారి ఆలయంలో భక్తులకు ఆర్జిత సేవలు, అనంతరం అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ఉదయం 9:30 గం టలకు స్వస్తివాచనం, విష్వక్సేనపూజ, పు ణ్యాహవచనం, సప్తకలశారాధన, ఉత్సవాంత స్నపనం, నిత్యహోమం, మహాసుదర్శన హోమం, విశేష అర్చన, బలిహరణ నీ రాణం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలాగే స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించిన హంస, సింహవాహనంపై గ్రామంలో ఊరేగించారు. సా యంత్రం 5–30 గంటలకు స్వస్తివాచనము లు, నిత్యహోమాలు నిర్వహించి సాయంత్రం 7 గంటలకు స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించగా ఏ ర్పాట్లును ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణ మూర్తి ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షుకులు రాధకృష్ణా, సాయిరామ్ పర్యవేక్షించారు.
నేటి కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామికి ప్రత్యేక పూజలతో పాటు విశేష నదీ జలంతో పూర్ణాభిషేకం, గరుడవాహన సేవ, స్వస్తి వాచనం, నిత్యహోమం, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్రపుష్పం, పంచామృతమంటపారాధన, వసంతోత్సవం, నిత్యహోమం, పుష్పయాగం, నీరాజనం, బలిహరణ, హనుమద్వాహన సేవ తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందకు ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో రమణమూర్తి తెలిపారు.
Advertisement