- భక్తులతో పోటెత్తిన వాడపల్లి క్షేత్రం
శోభాయమానంగా పొన్నవాహన మహోత్సవం
Published Sun, Apr 9 2017 12:22 AM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM
వాడపల్లి(ఆత్రేయపురం) :
శ్రీవారి కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం పొన్నవాహ న మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి వారిని పల్లకీ, పొన్నవాహనంపై ఉంచి గ్రామోత్సవం జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో వాడపల్లి పోటెత్తింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ చైర్మ¯ŒS కరుటూరి నరసింహరావు, ఈవో బిహెచ్.వి.రమణ మూర్తి ఆధ్వర్యం లో ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల్ని అలరించాయి. ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఆది వారం సదస్యం కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఈఓ తెలిపారు.
Advertisement
Advertisement