ఆత్రేయపురం : 'కోనసీమ తిరుపతి' గా..'ఏడు వారాల వెంకన్న' గా ఖ్యాతిగాంచిన తూర్పుగోదావరి జిల్లా, వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి తీర్థ మహోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 30న స్వామివారికి ప్రత్యేక పూజలు, 31న కల్యాణ మహోత్సవం, తీర్థం, జరగనున్నాయి.
ఏప్రిల్ 5న జరిగే పుష్పోత్సవం కార్యక్రమంతో వాడపల్లి తీర్థ మహోత్సవాలు ముగుస్తాయి. గౌతమీ నదీ తీరాన వెలసిన స్వామిని భక్తులు తమ పాలిట కొంగు బంగారంలా విశ్వసిస్తారు. స్వామివారిని ఏడు వారాల మొక్కుతో మనసారా స్మరిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతందని భక్తుల నమ్మకం అందుకే ఆయన్ను ఏడువారాల వెంకన్న పేరుతోనూ పిలుస్తారు.
(వాడపల్లి )