కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
వాడపల్లి(ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం, పురాణ ప్రసిద్ధి చెందిన ర్యాలి జగన్మోహీనీ కేశవ స్వామి ఆలయాల్లో స్వామి వార్ల కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ ఈవోలు బీహెచ్‌వీ రమణ మూర్తి, వై వెంకటేశ్వరరావు తెలిపారు. వాడపల్లి వేంకటేశ్వర స్వామి, ర్యాలిలో వేంచేసిన జగన్మోహినీ కేశవస్వామి కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. జగన్మోమినీ కేశవ స్వామి కల్యాణోత్సవాలు ఏప్రిల్ ఐదో తేదీ నుంచి వారం రోజులు పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రీవేంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవాలు ఏప్రిల్ ఆరోతేదీ నుంచి వారం రోజులు పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 6న శ్రీ స్వామి వారి ధ్వజారోహణం, నిత్య బలిహరణ, దర్శనాలు, 7న శుక్రవారం తీర్థం, రథోత్సవం, కల్యాణం, తెప్పోత్సవం, 8న శ్రీ స్వామి వారి పొన్నహవాన మహోత్సవం, 9న సదస్యం, 10న నిత్యహోమం, నిత్య బలిహరణ, దర్శనాలు, 11న మంగళవారం చక్రతీర్థం, 12న స్వామి వారి శ్రీపుష్పోత్సవంతో స్వామివారి కల్యాణోత్సవాలు ముగుస్తాయి. కల్యాణోత్పవాలపై ఈనెల 24న ఆర్డీఓ జి.గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ కరుటూరి నరసింహరావు అ«ధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు ఈవో రమణ మూర్తి తెలిపారు.