
కార్తీక్ రాజు, మహేశ్ రెడ్డి, డా. వెంకన్న, డా. అనిత
‘‘పోలీస్ విభాగంలో క్లూస్ టీమ్ ఎంత ప్రముఖమైనదో ‘అథర్వ’లో చూపించారు. మా వాళ్లని హీరోల్లా చూపించారు. ఈ సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ అడిషనల్ డైరెక్టర్ డా. అనితా ఎవాంజెలిన్. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా మహేశ్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘అథర్వ’.
నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. క్లూస్, ఫోరెన్సిక్ విభాగంలోని వారికి ‘అథర్వ’ ప్రత్యేక ప్రదర్శన వేశారు. ‘‘మేం నిజంగానే క్రైమ్ సీన్లను చూస్తుంటాం కాబట్టి ఆ జానర్ సినిమాలు చూడం. కానీ ‘అథర్వ’ అద్భుతంగా అనిపించింది’’ అన్నారు హైదరాబాద్ సిటీ పోలీస్, క్లూస్ జాయింట్ డైరెక్టర్ డా. వెంకన్న.
Comments
Please login to add a commentAdd a comment