Mahesh Reddy
-
షర్మిలకు కాసు మహేష్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్
-
‘అథర్వ’లో ప్రతి 10 నిమిషాలకు ఓ ట్విస్ట్..ఊహించలేరు: దర్శకుడు
‘‘క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘అథర్వ’ చిత్రం రూపొందింది. హత్య, దోపిడీ సన్నివేశాలతో ఈ కథను అల్లుకున్నాను. వాస్తవ ఘటనలకు కొంచెం ఫిక్షన్ జోడించాను’’ అని దర్శకుడు మహేశ్ రెడ్డి అన్నారు. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు మహేశ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నేనొకసారి క్లూస్ టీమ్ హెడ్ వెంకన్నగారి ఇంటర్వ్యూ చూశాను. క్రైమ్ కేసుని 70 శాతం వరకు క్లూస్ టీమ్ పరిష్కరిస్తుంటుంది. అంత ప్రాధాన్యం ఉన్న క్లూస్ టీమ్ గురించి చెప్పాలని ‘అథర్వ’ కథ రాశాను. కార్తీక్ రాజు క్లూస్ టీమ్‌లో పని చేస్తుంటాడు. హీరోయిన్ క్రైమ్ రిపోర్టర్. ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో ప్రతి పది నిమిషాలకు ఓ ట్విస్ట్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ను ఎవరూ ఊహించలేరు’’ అన్నారు. -
మా వాళ్లని హీరోల్లా చూపించారు
‘‘పోలీస్ విభాగంలో క్లూస్ టీమ్ ఎంత ప్రముఖమైనదో ‘అథర్వ’లో చూపించారు. మా వాళ్లని హీరోల్లా చూపించారు. ఈ సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ అడిషనల్ డైరెక్టర్ డా. అనితా ఎవాంజెలిన్. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా మహేశ్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. క్లూస్, ఫోరెన్సిక్ విభాగంలోని వారికి ‘అథర్వ’ ప్రత్యేక ప్రదర్శన వేశారు. ‘‘మేం నిజంగానే క్రైమ్ సీన్లను చూస్తుంటాం కాబట్టి ఆ జానర్ సినిమాలు చూడం. కానీ ‘అథర్వ’ అద్భుతంగా అనిపించింది’’ అన్నారు హైదరాబాద్ సిటీ పోలీస్, క్లూస్ జాయింట్ డైరెక్టర్ డా. వెంకన్న. -
పరిగి నియోజకవర్గానికి పరిపాలించే పాలకుడు ఎవరు?
పరిగి నియోజకవర్గం పరిగి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన కొప్పుల మహేష్ రెడ్డి విజయం సాదించారు. ఆయన సీనియర్ నేత కొప్పుల హరీశ్వర్ రెడ్డి కుమారుడు. హరీశ్వర్ రెడ్డి గతంలో ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన వారసుడుగా రంగంలోకి వచ్చిన మహేష్‌రెడ్డి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డిపై 16400 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మహేశ్వర్‌రెడ్డికి 82941 ఓట్లు రాగా, రామ్మోహన్ రెడ్డికి 66541 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ నుంచి పోటీచేసిన ఎఫ్ ఎస్ బి అభ్యర్ది కె.మల్లేశంకు దాదాపు తొమ్మిది వేల ఓట్లు వచ్చాయి. పరిగి నియోజకవర్గంలో ఐదుసార్లు గెలుపొందిన సీనియర్ నేత హరీశ్వర్ రెడ్డి 2014లో టిఆర్ఎస్ తరపున పోటీచేసి ఓడిపోవడం విశేషం. 2009 ఎన్నికల వరకు టిడిపి తరపున గెలుస్తూ వచ్చిన హరీశ్వర్ రెడ్డి తెలంగాణ సాధనలో భాగంగా ఆయన టిడిపికి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్లో చేరారు. అయినా2014లో పరిగిలో ఓడిపోయారు. కాంగ్రెస్ ఐ తరపున పోటీచేసి టి.రామ్మోహన్ రెడ్డి చేతిలో హరీశ్వర్ రెడ్డి 5163 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉండి, బిజెపిలో చేరి టిడిపి, బిజెపి కూటమి తరపున పోటీచేసిన కమతం రామిరెడ్డి కూడా ఓటమిపాలయ్యారు. రామిరెడ్డికి 13355 ఓట్లు మాత్రమే వచ్చాయి. పరిగిలో పన్నెండు సార్లు రెడ్డి సామాజికవర్గ నేతలు, మూడుసార్లు ముస్లింలు గెలుపొందారు. హరీశ్వరరెడ్డి తొలిసారి 1985లో గెలుపొందారు. ఆ తరువాత 1994 నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. ఈయన కొంతకాలం డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. కాంగ్రెస్ నాయకుడు కమతం రామిరెడ్డి 1967లో ఇండ పిెండెంటుగాను, 72,89లలో కాంగ్రెస్ పక్షాన గెలిచారు. ఈయన కొంతకాలం జలగం క్యాబినెట్‌లోను, నేదురుమల్లి, కోట్ల మంత్రివర్గాలలో సభ్యునిగా ఉన్నారు. ఇక్కడ రెండుసార్లు గెలిచిన ఎ.షరీఫ్ 1978 తరువాత చెన్నారెడ్డి, అంజయ్య క్యాబినెట్లో పనిచేసారు. 1952లో ఇక్కడ నుంచి ఎస్.జె.బేగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పరిగి నియోజకవర్గానికి 15సార్లు ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఏడుసార్లు, టిడిపి ఐదుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి, ఇండిపెండెంట్లు రెండుసార్లు గెలిచారు. 2009లో పరిగి ఇండిపెండెంటుగా పోటీచేసిన టి.రామ్మోహన్‌రెడ్డి 38వేలకు పైగా ఓట్లు తెచ్చుకుని రెండోస్థానంలో ఉంటే, కాంగ్రెస్ అభ్యర్ధి కమతం రామిరెడ్డి మూడో స్థానంలో నిలిచారు. 2014లో రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా విజయం సాధించడం విశేషం. పరిగి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
పరిగి ఎమ్మేల్యే అనుచరుల దౌర్జన్యం
-
ఆకట్టుకుంటున్న ‘అధర్వ’ ఫస్ట్ లుక్.. ఆ ఒక్క డైలాగ్ చాలు..!
సినిమాపై బజ్ క్రియేట్ చేయడం, ఆడియన్స్‌కు ఇంట్రెస్ట్ కలిగించేలా ప్రమోషన్స్ చేయడం మామూలు విషయం కాదు. కానీ యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త సినిమా 'అధర్వ' మీద ముందు నుంచీ ఇంట్రెస్ట్ కలిగించేలా ప్రమోషన్స్ చేస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా విడుదల చేయించిన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది.‘నేను నమ్మిన సత్యం, వెతికే లక్ష్యం, దొరకాల్సిన సాక్ష్యం చేధించే వరకు ఈ కేసును వదిలిపెట్టను సార్..’అంటూ డైలాగ్ అందరిలోనూ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ నుంచి హీరోకి సంబంధించిన యాక్షన్ లుక్‌ని రిలీజ్ చేశారు మేకర్లు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో హీరో యాక్షన్‌లోకి దిగినట్టు కనిపిస్తోంది. ఇందులో హీరో కార్తీక్ రాజు పవర్ఫుల్ రోల్‌ను పోషించినట్టు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది. ది సీకర్ ఆఫ్ ది ట్రూత్ అనే ట్యాగ్ లైన్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పోల్చితే ఈ సినిమా ప్రత్యేక అనుభూతి కలిగిస్తుందని తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. -
పరిగి టీఆర్ఎస్ లో గ్రూపులాట
-
రోడ్డు ప్రమాదంలో పరిగి ఎమ్మెల్యేకు గాయాలు
చేవెళ్ల : వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం షాబాద్ చౌరస్తా సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదంలో మహేశ్‌రెడ్డికి గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను నగరంలోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. మహేశ్‌రెడ్డి తన ఇన్నోవా కారులో డ్రైవర్ శ్రీకాంత్, గన్‌మెన్ పాషాతో కలిసి పరిగి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నారు. చేవెళ్లకు చెందిన టేకులపల్లి మల్లేశ్ కారులో చేవెళ్లనుంచి తన దాబాకు వెళ్తున్నాడు. 2 కార్లు హైదరాబాద్ వెళ్తుండగా ముందు వెళ్తున్న మల్లేశ్ కారును ఎమ్మెల్యే వాహ నం వెనకనుంచి ఢీకొట్టంతో 2 కార్లు పల్టీ కొట్టాయి. -
‘హవా’ చూపిస్తోంది : హీరో చైతన్య
క్రైమ్ కామెడీ సినిమాలకు డిమాండ్ తగ్గలేదు, ప్రేక్షకుల నుండి ఆదరణ తగ్గలేదు అని నిరూపిస్తున్న సినిమా ‘హవా’ కొత్త కాన్సెప్ట్ తో ఎప్పుడూ చూడని లొకేషన్స్‌లో నిర్మాణం జరుపుకున్న హవా ఈ రోజు రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకుంటుంది. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్‌తో చిత్ర యూనిట్ ఆనందంగా ఉంది. శుక్రవారం రిలీజ్ అయిన ‘హవా’ సినిమా ప్రేక్షకుల మద్య చూసిన చిత్ర యూనిట్ తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరో చైతన్య మాట్లాడుతూ... ‘మా నమ్మకాన్ని ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన నిలబెట్టింది. థియేటర్లో ఈ సినిమా చూస్తున్నప్పుడు పడ్డ కష్టం, టెన్షన్ అంతా పోయింది. మేము పెద్దగా ఎక్స్పెక్ట్ చేయని సన్నివేశాలకు కూడా ప్రేక్షకులు కనెక్ట్ అయి నవ్వుతున్నారు. ఈ సినిమా చాలా మంది కల. ఆస్ట్రేలియాలో షూటింగ్ అప్పుడు మేము ఏదైతే నమ్మి అడుగు ముందకు వేసామో ఆ నమ్మకం ఈ రోజు నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. డైరెక్టర్ మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన మాకు ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ చాలా ధైర్యాన్నిచ్చింది. ఈ సినిమా మా టీం మొత్తానికి చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా కోసం మేము చాలా ట్రావెల్ చేసాము. మేము నమ్మిన కథకు తెరమీద ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధానం చాలా పాజిటివ్‌గా ఉంది. థియేటర్లో ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో నటించిన చైతన్య, దివి పాత్రలకు చాలా మంచి రెస్సాన్స్ వస్తుంది. ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్’అన్నారు. -
టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలవడం ఖాయం
సాక్షి, పరిగి: టీఆర్ఎస్ 16 లోక్‌సభ స్థానాలు గెలవటం ఖాయమని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పరిగి నియోజకవర్గం గండేడ్ మండల పరిధిలోని సంగాయిపల్లి, కంచన్‌పల్లి, వెంకట్‌రెడ్డిపల్లి, చిన్నాయిపల్లి, షేక్‌పల్లి, బొమ్మికుంటతండా, మంగంపేట్, ధర్మాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్లకుర్మల అవసరాలను గుర్తించి వారి ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత కేసీఆర్ సారథ్యంలోని మా టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. కేసీఆర్ హయాంలో గ్రామీణ వృత్తులకు పెద్దపీట వేశారని ఆయన పేర్కొన్నారు. పేదలకు ఎంతో సేవ చేసిన మా టీఆర్ఎస్ ప్రభుత్వానికే ఓటు అడిగే హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తూ వస్తుందని తెలిపారు. వంచించిన పార్టీలను ప్రజలు నమ్మరని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు. ఇదే టీఆర్ఎస్ గెలుపుకు బాటలు వేస్తుందని తెలిపారు. ప్రజలకు ఏది అవసరమో గుర్తించింది కేవలం మా ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిన ఘనత కేవలం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
జమ్మలమడుగులో ఉద్రిక్తత : మహేషేరెడ్డి వాహనం ద్వంసం
-
ఇదిగో బొట్టు.. సాధించాలి పట్టు
సాక్షి, దోమ (వికారాబాద్): పరిగి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహేశ్‌రెడ్డి సతీమణి ప్రతిమారెడ్డి శనివారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. మహిళల సంక్షేమం కోసం కేసీఆర్ పెద్దపీట వేశారని అంటూ ఓటర్లకు వివరించారు. -
ప్రాజెక్ట్ మిస్టరీ ఏంటి?
ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అసలు ఆ ప్రాజెక్ట్ లక్ష్యం ఏంటి? ప్రాజెక్ట్ వెనుక దాగున్న మిస్టరీ ఏంటి? అన్న ప్రశ్నలకు సమాధానాలను త్వరలోనే స్క్రీన్‌పై చూపిస్తామంటున్నారు దర్శకుడు మహేశ్‌రెడ్డి. చైతన్య, దివీ ప్రసన్న జంటగా ఆయన దర్శకత్వంలో ఫిల్మ్ ఎన్ రీల్స్ బ్యానర్‌పై ‘ప్రాజెక్ట్ సి 420’ వర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రం రూపొందుతోంది. రాబిన్ కె మార్క్స్ స్వరకర్త. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ‘‘ఎనభై శాతం షూటింగ్ పూరై్తంది. ఈ నెల ఎండింగ్‌కి షూటింగ్ కంప్లీట్ చేస్తాం. ఆస్ట్రేలియా, చైనాకి చెందిన నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. 80 శాతం మంది ఆస్ట్రేలియన్ టెక్నిషియన్స్ వర్క్ చేస్తున్నారు’’ అన్నారు మహేశ్ రెడ్డి. ఈ చిత్రానికి ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్. -
ఎంతపని చేశావు దేవుడా..!
దసరా సెలవులకు ఇంటికొచ్చిన చిన్నారులు.. తమ ఇంటి దగ్గర అందరూ ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాక బిత్తరచూపులు చూడటం చూపరులను కలచివేశాయి. రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు తన తండ్రిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లిందని తెలియని పిల్లలను చూసి ప్రతి ఒక్కరూ చలించిపోయారు. ఎంత పనిచేశావయ్యా.. ఇక నా బిడ్డలకు దిక్కెవరు దేవుడా.. అంటూ మృతుని భార్య రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. అమడగూరు: అమడగూరు మండలం పూలకుంటకు చెందిన సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు మహేష్‌రెడ్డి (38) సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. రాజారెడ్డి, చిన్నరెడ్డెమ్మ దంపతుల కుమారుడు మహేష్‌రెడ్డికి తనకల్లు మండలం ఈతోడు గ్రామానికి చెందిన నాగమణితో పదమూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 11 ఏళ్ల కూతురు అఖిల, 9 ఏళ్ల కుమారుడు యశ్వంత్‌రెడ్డి ఉన్నారు. వీరు అనంతపురంలో చదువుకుంటున్నారు. దసరా సెలవులు రావడంతో స్వగ్రామానికి వచ్చారు. మహేష్ సోమవారం ఉదయం సొంతపనిమీద ద్విచక్రవాహనంలో కొక్కంటిక్రాస్‌కు వెళ్లాడు. పని ముగించుకుని రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి బయల్దేరాడు. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన ఆయన తనకల్లు మెయిన్‌రోడ్డులోని గోపాల్‌నాయక్ తండా బస్‌స్టాప్ వద్ద అదుపుతప్పి కిందపడ్డాడు. తల వెనుక బలమైన గాయమైంది. చెవులు, ముక్కులో రక్తం వచ్చి అపస్మారకస్థితిలో పడిపోయాడు. అదే సమయంలో అటువచ్చిన పూలకుంటపల్లికి చెందిన వ్యక్తులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, ఆయన్ని తనకల్లు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మహేష్‌రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మంగళవారం కదిరి ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్ఐ చలపతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. మహేష్‌రెడ్డి మృతితో పూలకుంటపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు నాయకుల పరామర్శ మహేష్‌రెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్సార్సీపీ పుట్టపర్తి సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఫోన్లో పరామర్శించారు. మాజీ ఎమ్యెల్యే, సీఈసీ సభ్యుడు డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి కదిరి ప్రభుత్వాస్పత్రికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. మండలానికి చెందిన వివిధ పార్టీ నాయకులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
ఆయన గురువు... ఈయన కులదైవం
‘‘శిరిడీ సాయిబాబా మా గురువైతే, ఏడు కొండల వేంకటేశ్వరస్వామి మా కులదైవం. మా గురువుగారి కథతో ‘శిరిడిసాయి’ తీశా. ఇప్పుడు ఓ భక్తుడిగా మా వెంకన్నకి మాహాభక్తుడైన హథీరామ్ బాబా చరిత్ర ఆధారంగా ఈ చిత్రం నిర్మించా. నాకు ఈ అవకాశాలు కల్పించిన రాఘవేంద్రరావు, నాగార్జునలకు జీవితాంతం రుణపడి ఉంటా’’ అన్నారు నిర్మాత ఏ. మహేశ్‌రెడ్డి. ‘శిరిడిసాయి’ తర్వాత నాగార్జున,కె. రాఘవేంద్రరావు కలయికలో ఆయన నిర్మించిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’ ఈ నెల 10న రిలీజవుతోంది. మహేశ్‌రెడ్డి చెప్పిన విశేషాలు.... ► తిరుపతి కొండపై హాథీరామ్ బాబా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? ఆయనకి ఆ పేరు ఎలా వచ్చింది? స్వామివారికి చేసే తోమాల సేవ, వెన్న సేవ తదితర అంశాల గురించి చిత్రంలో చూపించాం. స్వామివారికీ, హాథీరామ్ బాబాకీ మధ్య జరిగిన సంభాషణలు, ఆయన చరిత్రే ఈ సినిమా. స్వామివారిపై సినిమా తీయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. ఈ చిత్రంతో ఆ కోరిక తీరింది. ► ఇప్పుడున్న యువతకి స్వామివారి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. స్వామికి జరిగే పూజలు, విశిష్ఠత గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో తీసిన చిత్రమిది. ‘ఓం నమో వేంకటేశాయ’ అనేది ఎన్నిసార్లు పలికితే అంత మంచి జరుగుతుంది. అందుకే, హాథీరామ్ బాబా చరిత్రకి ఆ పేరు పెట్టడం జరిగింది. ► ఓవైపు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే, మరోవైపు ఈ ఆధ్యాత్మిక చిత్రం చేయడం నాగార్జున గొప్పతనం, మా అదృష్టం. వేరే చిత్రాలు అంగీకరించకుండా గడ్డం పెంచి, భక్తి శ్రద్ధలతో నాగార్జున ఈ చిత్రం చేశారు. తెరపై ఆయన్ని చూడగానే భక్తి భావంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. చరిత్రలో నిలిచిపోయే విధంగా నటించారాయన. థియేటర్లో చూసిన ప్రేక్షకులకూ అదే భావన కలుగుతుంది. ► 500 ఏళ్ల క్రితం తిరుమల తిరుపతి ఏ విధంగా ఉండేదో... తెరపై ఆ వాతావరణం ప్రతిబింబించేలా చాలా జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరించాం. డీఓపీ ఎస్. గోపాల్‌రెడ్డి చిక్ మంగుళూరు, మహాబలేశ్వరంలలో లొకేషన్లు ఫైనలైజ్ చేశారు. కీరవాణి అద్భుతమైన స్వరాలందించారు. నాగార్జున–రాఘవేంద్రరావు కలయికలో భక్తి చిత్రమనగానే ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడం సహజం. వాటిని అందుకునే విధంగా దర్శకేంద్రులు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్రం విడుదల తర్వాత తిరుపతి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతుంది. ► వ్యాపార దృక్పథంతో కాకుండా ఓ భక్తుడిగా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రం నిర్మించా. సాధారణంగా భక్తి చిత్రాలపై ఎవరూ ఇంత ఖర్చుపెట్టరు. మా ఎ.ఎం.ఆర్. గ్రూప్ సంస్థల్లో 4,000 మంది పనిచేస్తున్నారు. ఓ వ్యాపారవేత్తగా నేను కొందరికి తెలుసు. ‘శిరిడిసాయి’ విడుదల తర్వాత నా పేరు అందరికీ తెలిసింది. టీవీలో ఆ చిత్రం ప్రసారమైన ప్రతిసారీ 50, 60 ఫోనులు వస్తాయి. ఈ ‘ఓం నమో వేంకటేశాయ’కి ఇంకా మంచి పేరొస్తుంది. మా సంస్థ నిర్మించిన రెండూ భక్తి చిత్రాలే. మంచి కథలు లభిస్తే కమర్షియల్ చిత్రాలు కూడా నిర్మించాలనుంది. -
డెంగ్యూతో చిన్నారి మృతి
డెంగ్యూ వ్యాధితో ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన గుడిమల్కాపూర్ మందులగూడలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... చిత్తూరు జిల్లాకు చెందిన మహేష్‌రెడ్డి తన భార్య పిల్లలతో మందులగూడలో ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. కాగా ఇతని కుమార్తె అయిన పి.పాయస్యా(7) గుడిమల్కాపూర్‌లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో 2వ తరగతి చదువుతుంది. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో పాయస్యా మృతి చెందింది.