‘హవా’ చూపిస్తోంది : హీరో చైతన్య | Hawa Movie Success Meet | Sakshi
Sakshi News home page

‘హవా’ చూపిస్తోంది : హీరో చైతన్య

Published Sat, Aug 24 2019 10:14 AM | Last Updated on Sat, Aug 24 2019 10:14 AM

Hawa Movie Success Meet - Sakshi

క్రైమ్ కామెడీ సినిమాలకు డిమాండ్ తగ్గలేదు, ప్రేక్షకుల నుండి ఆదరణ తగ్గలేదు అని నిరూపిస్తున్న సినిమా ‘హవా’ కొత్త కాన్సెప్ట్ తో ఎప్పుడూ చూడని లొకేషన్స్‌లో నిర్మాణం జరుపుకున్న హవా ఈ రోజు రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకుంటుంది. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్‌తో చిత్ర యూనిట్ ఆనందంగా ఉంది. శుక్రవారం రిలీజ్ అయిన ‘హవా’ సినిమా ప్రేక్షకుల మద్య చూసిన చిత్ర యూనిట్ తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా హీరో చైతన్య మాట్లాడుతూ... ‘మా నమ్మకాన్ని ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన నిలబెట్టింది. థియేటర్‌లో ఈ సినిమా చూస్తున్నప్పుడు పడ్డ కష్టం, టెన్షన్ అంతా పోయింది. మేము పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయని సన్నివేశాలకు కూడా ప్రేక్షకులు కనెక్ట్ అయి నవ్వుతున్నారు. ఈ సినిమా చాలా మంది కల. ఆస్ట్రేలియాలో షూటింగ్ అప్పుడు మేము ఏదైతే నమ్మి అడుగు ముందకు వేసామో ఆ నమ్మకం ఈ రోజు నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది’ అన్నారు.

డైరెక్టర్ మహేష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన మాకు ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ చాలా ధైర్యాన్నిచ్చింది. ఈ సినిమా మా టీం మొత్తానికి చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా కోసం మేము చాలా ట్రావెల్ చేసాము. మేము నమ్మిన కథకు తెరమీద ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధానం చాలా పాజిటివ్‌గా ఉంది. థియేటర్‌లో ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో నటించిన చైతన్య, దివి పాత్రలకు చాలా మంచి రెస్సాన్స్ వస్తుంది. ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్’అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement