మెగా డాటర్ నిహారిక,జొన్నలగడ్డ చైతన్య దంపతులు తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. 2020 డిసెంబర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట.. కనీసం రెండేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొన్నాళ్ల పాటు వేరు వేరుగా జీవించి.. ఈ మధ్యే అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
డైవర్స్ తర్వాత నిహారిక కెరీర్ పరంగా బిజీ అయింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ.. నిర్మాణం రంగంలో కూడా అడుగుపెట్టింది. అంతేకాదు విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయింది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.
ఇక చైతన్య కూడా విడాకులను మ్యాటర్‌ని మర్చిపోవడానికి కొన్నాళ్ల పాటు విహార యాత్రకు వెళ్లి వచ్చాడు. తిరిగి వచ్చాక తన కెరీర్‌పై దృష్టి పెట్టాడు. అయితే ఇద్దరూ కూడా మళ్లీ పెళ్లిపై ఆలోచనలు చేయలేదు. కొన్నాళ్ల పాటు ఇలాగే ఒంటరి జీవితాన్ని ఆస్వాదించి, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారట. అయితే చైతన్య కంటే ముందే నిహారిక పెళ్లి అవుతుందని అంతా భావించారు. కానీ నిహారిక మాత్రం ఇప్పట్లో పెళ్లి చేసుకోనని ఇంట్లో తెగేసి చెప్పిందట. వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత నిహారిక పెళ్లి ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. త్వరలోనే చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఎవరా అమ్మాయి?
ఇష్టపడి పెళ్లి చేసుకున్న నిహారిక దూరమవ్వడంతో ఆ బాధ నుంచి బయటపడేందుకు చైతన్య కొన్నాళ్ల పాటు విహారయాత్రలకు వెళ్లాడు. నిహారిక మాదిరే తాను కూడా ఇప్పట్లో పెళ్లి చేసుకోవద్దని భావించాడట. కానీ ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేయడంతో రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరతోనే చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
తన ఫ్యామిలీ అత్యంత సన్నిహితంగా ఉన్న ఓ ఐపీఎస్ అధికారి కూతురితో చైతన్య రెండో పెళ్లి జరుగబోతుందట. ఇప్పటికే ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నారని, మంచి ముహుర్తం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో వాస్తమెంత అనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: సత్యరాజ్ రెమ్యునరేషన్, ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే.. పెద్ద ఫ్యాక్టరీతో పాటు ఇవన్నీ కూడా..)
Comments
Please login to add a commentAdd a comment