Niharika Konidela Planning To Make Re Entry In Movies As Heroine After Divorce - Sakshi
Sakshi News home page

Niharika Konidela Tollywood Re-Entry: యంగ్‌ డైరెక్టర్‌తో డేర్‌ చేస్తున్న నిహారిక .. నో చెబుతున్న ఫ్యామిలీ

Published Sat, Jul 29 2023 12:47 PM | Last Updated on Mon, Jul 31 2023 2:56 PM

Niharika Konidela Again Movie Entry As Heroine - Sakshi

టాలీవుడ్‌ హీరోయిన్‌, నిర్మాత నిహారిక కొణిదెల .. చైతన్య జొన్నలగడ్డతో తన వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ విషయం నుంచి ఇప్పుడిప్పుడే ఆమె బయటపడుతుంది. నటనకు కొంతకాలం బ్రేక్‌ ఇచ్చిన నిహారిక డెడ్‌ పిక్సెల్స్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. టాలీవుడ్‌లో నిర్మాతగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా నిహారిక మళ్లీ సినిమాలపై ఫోకస్‌ చేస్తుంది. అందుకోసం పలు వెబ్‌ సీరిస్‌లతో పాటు సినిమాలను ప్లాన్‌ చేస్తుంది. చైతన్యతో దూరం అవుతున్న సమయంలోనే ఆమె డెడ్‌ పిక్సెల్స్‌ సిరీస్‌ను తీసినా అది అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు.

(ఇదీ చదవండి: సౌత్‌ ఇండియాలో రిచ్చెస్ట్‌ హీరో ఆయనే.. ఆస్తులు ఎన్ని వేల కోట్లంటే)

దీంతో తాజాగ ఆమె మళ్లీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందని తెలిసింది. ఈ విషయంపై ఇప్పుడు ఇండస్ట్రీలో భారీగానే ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఆమె మొదట సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గానే ఎంట్రీ ఇచ్చింది. కానీ అనుకున్నంత స్థాయిలో ఆమె సక్సెస్‌ కాలేకపోయింది. మళ్లీ ఇప్పుడు తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నం చేస్తుందట నిహారిక.

(ఇదీ చదవండి: నయనతార ఇంతే.. ఆమెను ఏం చేయలేం: విశాల్‌)

అందులో భాగంగానే ఒక యంగ్‌ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తుందట నిహారిక. అందుకు సంబధించి కథను కూడా రెడీ చేసినట్లు సమాచారం. కానీ నిహారిక తీసుకున్న నిర్ణయానికి మెగా ఫ్యామిలీ ఒప్పుకోలేదట. హీరోయిన్‌గా ఆమె మళ్లీ సినిమాల్లోకి రావడం వారికి ఇష్టం లేదని ప్రచారం జరుగుతుంది. కానీ నిహారిక మాత్రం కుటుంబం సభ్యులకు ఇష్టం లేకున్నా తన కాళ్లపై తాను నిలబడాలని, అందుకోసం మళ్లీ సినిమాల్లో నటించాలని గట్టిగానే నిర్ణయం తీసుకుందట. త్వరలో తన సినిమాకు సంబంధించిన వివరాలన్నీ ఆమె ప్రకటించనున్నారని టాక్‌. అన్నీ అనుకూలిస్తే మళ్లీ సిల్వర్‌స్క్రీన్‌పై నిహారిక మెరవడం ఖాయం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement