నిహారిక కొణిదెల- చైతన్య జొన్నలగడ్డ అంగరంగా వైభవంగా పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లైన కొన్ని ఏళ్లకే విడాకులు తీసుకోవడంతో వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత నెట్టింట నిహారికను తప్పుబట్టినవారే ఎక్కువగా ఉన్నారు. ఆ సమయంలో అటువంటి వాటికి ఆమె ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో తన విడాకుల విషయం గురించి నిహారిక తొలిసారి మాట్లాడింది. ఒక యూట్యబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికరమైన కామెంట్లు ఆమె చేసింది. ఆ వీడియోను సదరు యూట్యూబర్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఈ విషయంలో నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ ఘాటుగానే స్పందించారు.
నిహారిక ఇంటర్వ్యూపై చైతన్య రియాక్షన్
నిహారికపై ఇటీవల జరుగుతున్న అన్యాయమైన నెగటివిటీని దూరం చేయడానికి మీరు చేసిన ప్రయత్నాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. వ్యక్తిగతంగా వ్యవహరించేటప్పుడు ఇలాంటి నెగటివిటీని ఎదుర్కోవడం అంత సులభం కాదని నాకు తెలుసు. అయితే వివాహానికి సంబంధించి బాధితురాలి పక్షాన్నే మాట్లాడటం, వారి వెర్షన్ మాత్రమే బయటి ప్రపంచానికి వినిపించడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా విడాకుల విషయం గురించి ఒకరి వైపు నుంచే మాట్లాడకూడదు. వారి గురించి జోక్యం చేసుకోకూడదు. బాధ నుంచి ఎలా కోలుకున్నామన్నదాని గురించి మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడుతుంది.
ఇటువంటి వన్‌సైడ్ వెర్షన్‌లను ఇతరులకు అటాచ్ చేయడం దాంతో మరింత రీచ్ పొందేందుకు ఇలాంటి ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడం మానేయాలి.ఇలా జరగడం ఇది రెండోసారి. వివాహ బంధం బద్దలయ్యాక దాని వల్ల కలిగే నొప్పి ఇద్దరికీ ఉంటుంది. ఇలాంటి సమయంలో కష్టం ఇద్దరికీ సమానంగానే ఉంటుంది. దాని నుంచి బయటపడడం అనేది కూడా రెండువైపులా ఒకేవిధంగా ఉంటుంది.' అని చైతన్య తీవ్రంగానే రియాక్ట్ అయ్యాడు.
'ఇద్దరి మధ్య జరిగిన విడాకుల తంతు ముగిసిన తర్వాత దాని గురించి అస్సలు చర్చించకూడదు. అలాంటిది ఇలాంటి వేదికలపై ఒకరివైపు నుంచే మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ పెళ్లిబంధం విఫలమైన తర్వాత కలిగే బాధ గురించి, దాని నుంచి బయటకురావడం గురించి మాట్లాడవచ్చు. ఆయా సంఘటనలతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించవచ్చు. జరిగిందేంటో పూర్తిగా తెలుసుకోకుండా ఇలా జడ్జ్ చేయడం ఎంత తప్పో.. ఇలాంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రజలకు ఓ కోణంలోనే చెప్పడం అంతే తప్పు. ఇలా అయితేనే ఇంటర్వ్యూలు చేయండి.
విషయాలను పూర్తిగా తెలుసుకోకుండా ప్రజలకు అసత్యాలను ప్రచారం చేయడం అనేది అన్యాయం. నాణేనికి ఒకవైపు మాత్రమే చూపించి నిజం అంటే ఎలా.. అదే నిజం అంటూ ప్రజల్లోకి అసత్యాలను ప్రచారం చేస్తే ఎలా..? అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేసిన వీడియోకు కింద చైతన్య రాసుకొచ్చారు.
నిహారిక ఏం చెప్పింది
'నాది పెద్దలు కుదిర్చిన సంబంధం. విడాకులు తీసుకున్నప్పుడు నన్ను చాలామాటలన్నారు. ఎంతో బాధేసింది, చాలా ఏడ్చాను. దాన్ని భరించడం అంత ఈజీ కాదు. ఎవరైనా జీవితాంతం కలిసుండాలనే పెళ్లి చేసుకుంటారు. ఏడాదిలో విడిపోతామని తెలిసి ఎవరూ అంత ఖర్చుపెట్టి ఘనంగా జరుపుకోరు. రిలేషన్‌షిప్ కొనసాగాలనే అందరూ కోరుకుంటారు. నేను కూడా అదే కోరుకున్నాను. అయితే నేను అనుకున్న విధంగా మాత్రం పరిస్థితులు లేవు. ఈ సందర్భంలో మనుషులను అంత ఈజీగా నమ్మకూడదనే విషయాన్ని అర్థం చేసుకున్నా. ఈ క్రమంలో నేనొక జీవిత పాఠం నేర్చుకున్నా. అన్నీ అనుకున్నట్లు జరగవు కదా.. ఇదీ అంతే! నా గురించి ఏం రాసినా పట్టించుకునేదాన్నే కాదు.' అని చెప్పుకొచ్చింది
Comments
Please login to add a commentAdd a comment