పరిగి నియోజకవర్గం
పరిగి నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ పక్షాన పోటీచేసిన కొప్పుల మహేష్ రెడ్డి విజయం సాదించారు. ఆయన సీనియర్ నేత కొప్పుల హరీశ్వర్ రెడ్డి కుమారుడు. హరీశ్వర్ రెడ్డి గతంలో ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన వారసుడుగా రంగంలోకి వచ్చిన మహేష్‌రెడ్డి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డిపై 16400 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మహేశ్వర్‌రెడ్డికి 82941 ఓట్లు రాగా, రామ్మోహన్ రెడ్డికి 66541 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ నుంచి పోటీచేసిన ఎఫ్ ఎస్ బి అభ్యర్ది కె.మల్లేశంకు దాదాపు తొమ్మిది వేల ఓట్లు వచ్చాయి.
పరిగి నియోజకవర్గంలో ఐదుసార్లు గెలుపొందిన సీనియర్ నేత హరీశ్వర్ రెడ్డి 2014లో టిఆర్‌ఎస్ తరపున పోటీచేసి ఓడిపోవడం విశేషం. 2009 ఎన్నికల వరకు టిడిపి తరపున గెలుస్తూ వచ్చిన హరీశ్వర్ రెడ్డి తెలంగాణ సాధనలో భాగంగా ఆయన టిడిపికి గుడ్ బై చెప్పి టిఆర్‌ఎస్‌లో చేరారు. అయినా2014లో పరిగిలో ఓడిపోయారు. కాంగ్రెస్ ఐ తరపున పోటీచేసి టి.రామ్మోహన్ రెడ్డి చేతిలో హరీశ్వర్ రెడ్డి 5163 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉండి, బిజెపిలో చేరి టిడిపి, బిజెపి కూటమి తరపున పోటీచేసిన కమతం రామిరెడ్డి కూడా ఓటమిపాలయ్యారు.
రామిరెడ్డికి 13355 ఓట్లు మాత్రమే వచ్చాయి. పరిగిలో పన్నెండు సార్లు రెడ్డి సామాజికవర్గ నేతలు, మూడుసార్లు ముస్లింలు గెలుపొందారు. హరీశ్వరరెడ్డి తొలిసారి 1985లో గెలుపొందారు. ఆ తరువాత 1994 నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. ఈయన కొంతకాలం డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. కాంగ్రెస్ నాయకుడు కమతం రామిరెడ్డి 1967లో ఇండ పిెండెంటుగాను, 72,89లలో కాంగ్రెస్ పక్షాన గెలిచారు. ఈయన కొంతకాలం జలగం క్యాబినెట్‌లోను, నేదురుమల్లి, కోట్ల మంత్రివర్గాలలో సభ్యునిగా ఉన్నారు. ఇక్కడ రెండుసార్లు గెలిచిన ఎ.షరీఫ్ 1978 తరువాత చెన్నారెడ్డి, అంజయ్య క్యాబినెట్‌లో పనిచేసారు.
1952లో ఇక్కడ నుంచి ఎస్.జె.బేగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పరిగి నియోజకవర్గానికి 15సార్లు ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ కలిసి ఏడుసార్లు, టిడిపి ఐదుసార్లు, టిఆర్‌ఎస్ ఒకసారి, ఇండిపెండెంట్లు రెండుసార్లు గెలిచారు. 2009లో పరిగి ఇండిపెండెంటుగా పోటీచేసిన టి.రామ్మోహన్‌రెడ్డి 38వేలకు పైగా ఓట్లు తెచ్చుకుని రెండోస్థానంలో ఉంటే, కాంగ్రెస్ అభ్యర్ధి కమతం రామిరెడ్డి మూడో స్థానంలో నిలిచారు. 2014లో రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా విజయం సాధించడం విశేషం.
పరిగి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment